Pandit Nehru bus stand
-
టిక్కెట్ కొని శ్రీమంతుడు చూసిన చంద్రబాబు
విజయవాడ : ఆంధ్రప్రదేవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినిమా చూశారు. నిజమే.. కొద్దిసేపు థియేటర్లో కూర్చుని శ్రీమంతుడు సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇందుకోసం ఆయన రూ.1,200 పెట్టి టికెట్ కూడా కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా విజయవాడ పండిట్ నెహ్రూ ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్మించిన వైస్క్రీన్ థియేటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. రూ.1,200తో టికెట్ కొన్న ఆయన థియేటర్లో కూర్చుని సేదతీరారు. పలువురు ఆర్టీసీ సిబ్బందితో కలిసి సినిమా చూశారు. అనంతరం ఫుడ్‌కోర్టు ప్రారంభించారు. వైస్క్రీన్ యజమాని వైవీ రత్నం థియేటర్ విశేషాలను ఆయనకు వివరించారు. త్వరలో రాష్ట్రంలోని ప్రతి మండలంలో వైఎస్టీడీ (వైస్క్రీన్ ట్రేడ్ డెవలప్మెంట్) సెంటర్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అందులో మిని థియేటర్‌తో పాటు పుడ్‌కోర్టు, మీసేవా, ఏటీఎం, సైబర్ కేఫ్, రిటైల్ మార్కెట్, అన్ని రకాల సమాచారం కోసం ఫ్రంట్ ఆఫీస్ ఏర్పాటుచేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి సాంకేతిక పరిజ్ఞానం అందించిన సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజి డీన్ డాక్టర్ బి.పాండురంగారావును సీఎం సన్మానించారు. అలాగే గుడివాడ డిపో ఆర్టీసీ కానిస్టేబుల్ కె.శ్రీనివాసరావు ఇటీవల మృతిచెందడంతో ఆయన భార్య నాగపుష్పవతికి రూ.10లక్షల బీమా చెక్కును అందించారు. -
ఆటో.. ఇటో.. ఎటో..!!
విజయవాడ నగరంలో ఆటోవాలాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే పండిట్ నెహ్రూ బస్‌స్టాండ్ సిటీ టెర్మినల్ వద్ద ఆటోల తాకిడి పెరగడంతో ఈ ప్రాంతం ప్రమాదకరంగా మారింది. ప్రయాణికులు ఎప్పుడు ఏ ప్రమాదానికి గురవుతామోనని ఆందోళనకు గురవుతున్నారు. దీనికితోడు కొందరు ఆటోవాలాలు ఎక్కడపడితే అక్కడ ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో ప్రతిపది నిమిషాలకు ట్రాఫిక్ స్తంభిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఉన్నా ఆటోవాలాలు పట్టించుకోవడంలేదని పలువురు పేర్కొంటున్నారు. ఫొటోలు : ఆకుల శ్రీనివాస్, విజయవాడ -
బస్టాండ్ టూ నిడమానూరు 20 నిమిషాల్లోనే..!
మెట్రో రైలు వస్తే ఈజీ జర్నీ బందరురోడ్డు, ఏలూరురోడ్డు కారిడార్లు24 మెట్రో స్టేషన్లు, ఐదు నిమిషాలకొక రైలు డీపీఆర్ సిద్ధంచేసిన డీఎంఆర్సీ విజయవాడ బ్యూరో : మెట్రో రైలు అందుబాటులోకి వస్తే పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి నిడమానూరుకు కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. బస్టాండ్ నుంచి పెనమలూరు వెళ్లేందుకూ అంతే సమయం పడుతుంది. 40 కిలోమీటర్ల సగటు, 75 కిలోమీటర్ల అత్యధిక వేగంతో నగరంలో మెట్రో రైళ్లు నడిచేలా డిజైన్లు తయారుచేశారు. డీఎంఆర్సీ (ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్న డీపీఆర్ (సవివర నివేదిక)లో ఈ వివరాలను పొందుపరిచారు. ఏలూరు, బందరురోడ్డు కారిడార్లలో కిలోమీటరుకు ఒకటి చొప్పున ఏర్పాటుచేయనున్న 24 మెట్రో స్టేషన్లలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక రైలు వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. రోడ్డుకు 14 నుంచి 17 మీటర్ల ఎత్తులో ఉండే కారిడార్ స్టేషన్లకు చేరుకునేందుకు లిఫ్టు, ఎస్కలేటర్, స్టెయిర్‌కేస్‌లను ఏర్పాటుచేస్తారు. బోగీల్లో అత్యాధునిక సదుపాయాలు మెట్రో రైలు బోగీల్లో అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. ఏసీ, సౌకర్యవంతమైన సీట్లు ఏర్పాటు చేస్తారు. స్టేషన్ రాగానే తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. రాబోయే స్టేషన్ ఎంత దూరంలో ఉంది, దగ్గరకు వచ్చిందా, లేదా అనే విషయాలను నిరంతరం ఆడియో ద్వారా ప్రయాణికులు వినే సౌకర్యం ఉంటుంది. స్టేషన్ రాగానే బోగి లోపల ఏర్పాటుచేసిన వీడియోలో ఆవరణ అంతా కనిపిస్తుంది. డ్రైవర్ లేకుండా నడిచే ఈ రైళ్లు కమ్యూనికేషన్ వ్యవస్థ ఆధారంగా వాటంతట అవే పనిచేస్తాయి. కారిడార్ మధ్యలో ఎవరైనా వచ్చినా రైలు ఆగిపోతోంది. అడ్డు తొలగగానే మళ్లీ రైలు ముందుకెళుతుంది. బస్టాండ్‌లో ఆపరేషన్ యూనిట్ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో పండిట్ నెహ్రూ బస్టేషన్ అత్యంత కీలకం కానుంది. ఇక్కడ మెట్రో కారిడార్‌లో భాగంగానే ఐదంతస్తుల అత్యాధునిక భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. బస్టాండ్ సమీపంలోనే తాత్కాలికంగా బహుళ అంతస్తుల పార్కింగ్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తారు. రైల్వేస్టేషన్ వద్ద రెండు మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. అక్కడి నుంచి బీసెంట్‌రోడ్డు వయా అలంకార్ సెంటర్ మీదుగా ఏలూరురోడ్డు వరకు కారిడార్ సాగుతుంది. డీఎంఆర్సీ సెప్టెంబర్‌లో డీపీఆర్ రూపకల్పన ప్రారంభించింది. విజయవాడలో 25 మంది డీపీఆర్ కోసం నిరంతరం పనిచేశారు. టోపోగ్రఫీ, ట్రాఫిక్, పర్యావరణ, జియోగ్రాఫిక్ సర్వేల ద్వారా మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన సమస్త సమాచారాన్ని తెలుసుకున్నారు. అనుకున్న గడువులోపే డీపీఆర్‌ను ప్రభుత్వానికి సమర్పించేందుకు డీఎంఆర్సీ సిద్ధమైంది. -
బస్సులు ఖాళీ
హైదరాబాద్‌కు తగ్గిన రాకపోకలు ఆరుశాతం తగ్గిన ఆక్యుపెన్సీ ప్రైవేట్ బస్సుల్లోనూ ఇదే పరిస్థితి ఆదివారమూ అంతే సంగతులు రాష్ట్రం విడిపోయాక హైదరాబాద్‌కు అంతరం పెరిగింది. విజయవాడ నుంచి భాగ్యనగరికి రాకపోకలు తగ్గిపోతున్నాయి. గతంలో నిత్యం వేలాదిమంది వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. తుళ్లూరును రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రయాణాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నారుు. హైదరాబాద్ బస్సులు ఖాళీగా తిరుగుతుండటంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ శాతం తగ్గడమే కాదు..ఆదాయానికీ భారీగానే గండి పడుతోంది. విజయవాడ : నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి హైదరాబాద్‌కు రోజూ 240 ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నారుు. రాత్రివేళల్లో సుమారు 150 వరకు ప్రైవేట్ బస్సులు వెళ్తున్నారుు. వీటిద్వారా సుమారు 12వేల నుంచి 14వేల మంది నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఇక వారాంతాల్లో మరో 20 శాతం ప్రయాణికులు అదనంగా ఉంటారు. ఇవికాకుండా వివిధ రైళ్లలో నిత్యం మరో రెండువేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో.. ఇటీవలి కాలంలో నగరం నుంచి హైదరాబాద్‌కు రోజుకు సగటున వెళ్లే వారి సంఖ్య మూడువేలకు తగ్గింది. ప్రజల్లో పొరుగు రాష్ట్రం అనే భావన రావడం, హైదరాబాద్‌కు వెళ్లకుండానే ఇక్కడే సాధ్యమైనంత వరకు పనులు పూర్తిచేసుకునే యత్నాలు చేస్తున్నారు. దీంతో రాకపోకలు గణనీయంగా తగ్గాయి. ఇటు ఆర్టీసీకి, అటు ప్రైవేట్ ట్రావెల్స్ ఆదాయానికీ గండిపడింది. ఆరు శాతం తగ్గిన ఆక్యుపెన్సీ విజయవాడ బస్టాండ్ నుంచి రోజూ రాష్ట్రంలోని 13 జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు సుమారు 2,500 వరకు సర్వీసులు నడుస్తారుు. ఇవికాక జిల్లాలోని 14 డిపోల నుంచి నుంచి పల్లెవెలుగు బస్సులతో కలిపి 1,200 వరకు సర్వీసులు ఉన్నాయి. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఎక్స్‌ప్రెస్, ఏసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో కచ్చితంగా 65 శాతంపైన, పల్లెవెలుగు బస్సులకైతే 50 శాతంపైన ఉండాలి. హైదరాబాద్ బస్సులకు రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఆక్యుపెన్సీ ఉంటున్నప్పటికీ గతం కంటే కొంత తగ్గిందనే చెప్పొచ్చు. గడిచిన రెండు నెలల్లో 80 నుంచి 77 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ ఈ నెలలో 72 శాతానికి పడిపోయింది. ఆదివారాలు అయితే గతంలో నూరుశాతం ఆక్యుపెన్సీ ఉండేది. ఇప్పుడు ఆదివారాల్లో కూడా 80 నుంచి 85 శాతానికి మించి ఉండట్లేదు. నవంబర్ నుంచి ఆక్యుపెన్సీ సగటున నాలుగు శాతం నుంచి తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఆరు శాతంగా ఉంది. దీనివల్ల ఆర్టీసీకి ప్రత్యక్షంగా సుమారు మూడు లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. విజయవాడ నుంచి నిత్యం హైదరాబాద్‌కు వెళ్లే 240 బస్సుల్లో జిల్లా, నగరంలోని డిపోల నుంచే అత్యధికంగా 175 వరకు వెళుతున్నాయి. ప్రత్యామ్నాయం దిశగా ఆర్టీసీ ఆర్టీసీ అధికారులు తగ్గిన ఆక్యుపెన్సీని భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పండుగ రోజుల్లో స్పెషల్ బస్సులు ఏర్పాటుచేసి ఒకటిన్నర రెట్లు చార్జీ వసూలు చేస్తున్నారు. ఆక్యుపెన్సీ తగ్గడంతో రాకపోకలు తగ్గాయనేది సుస్పష్టం. మరోవైపు ప్రైవేట్ బస్సులదీ ఇదే పరిస్థితి. హైదరాబాద్‌కు రద్దీ తగ్గిపోవడంతో ప్రైవేట్ బస్సులను బెంగళూరు, చెన్నైకు రూట్ మార్చి తిప్పుతున్నారు. గతంలో అయితే సుమారు 150 వరకు ప్రైవేట్ బస్సులు హైదరాబాద్ వెళ్లేవి. ఇప్పుడు వాటిలో 10 నుంచి 20 బస్సులు తగ్గాయి.