పాణ్యం రైల్వే స్టేషన్లో ఇద్దరి దారుణ హత్య
పాణ్యం: కర్నూలు జిల్లా పాణ్యం రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు దార లక్ష్మయ్య(26), దార ఓబులేసు(28) అనే ఇద్దరు యువకులను వేటకొడవళ్లతో దారుణంగా హతమార్చారు. మృతులిద్దరూ అన్నదమ్ములు. బోయ ఉప్పలూరు గ్రామంలో జరిగిన రామకృష్ణ అనే వ్యక్తి హత్య కేసులో వీరు ప్రధాన నిందితులు. రామకృష్ణ బంధువులే ఈ హత్య చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. పాణ్యం డీఎస్పీ హరినాథరెడ్డి, సీఐ పార్ధసారధిరెడ్డిలు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.