Papaya cultivation
-
బొప్పాయిలో మంచి దిగుబడిని ఇస్తున్న తైవాన్ రెడ్ లేడీ రకం
-
బొప్పాయిలో మంచి దిగుబడిని ఇస్తున్న తైవాన్ రెడ్ లేడీ రకం
-
ఆర్గానిక్ పద్ధతిలో సాగుచేస్తే చీడపీడల బెడద కూడా తక్కువే
-
విభిన్న యాజమాన్య పద్ధతుల్లో రకరకాల పంటల సాగు
-
బొప్పాయిలో వైరస్ తెగుళ్లు.. నివారణ లేకపోతే నష్టమే
బొప్పాయి పంటను వైరస్ తెగుళ్లు ఆశించి రైతులు నష్టపోతున్నారు. ఆ తెగుళ్ల బారినపడి పంట దెబ్బతినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి సీనియర్ ఉద్యాన శాస్త్రవేత్త శ్రీకృష్ణ రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. వెర్రి తెగుళ్లు మొజాయిక్, రింగ్‌స్పాట్(ఉంగరాల) తెగులు, ఆకుముడత(క్రింకిల్) అనే మూడు రకాల వెర్రి తెగుళ్లు బొప్పాయి పంటను నాశనం చేసి దిగుబడులను గణనీయంగా తగ్గించడమే కాక పండు నాణ్యతను బాగా దెబ్బతీసి విపరీత నష్టాన్ని కలిగించడంతో పాటు కొన్ని సందర్భాల్లో చెట్లు కాపునకు రాకుండా గొడ్డు చెట్టుగా మారడం జరుగుతుంది. ఈ మహమ్మారి వెర్రి తెగుళ్లను తొలి దశ నుంచే యాజమాన్య పద్ధతులతో అరికట్టాలి. వెర్రి తెగులు తాలుకు వైరస్ కణాలు ఒకమారు మొక్కలో ప్రవేశిస్తే మొక్క క్షీణించే వరకు దాని జీవకణాలలోనే ఉండి రకరకాలుగా లక్షణాలు కలిగించి అనర్ధాలకు దారితీస్తుంది. మొజాయిక్ తెగులు మొజాయిక్ తెగులు ఆశిస్తే ఆకు సైజు తగ్గుతుంది. ఆకులపై అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు ఈనెలు లేకుండా ఏర్పడతాయి. దూరం నుంచి ఆకులు పసుపు రంగుకు మారినట్లు కన్పిస్తాయి. అందుకే దీనిని పల్లాకు తెగులని కూడా అంటారు. తెగులు సోకిన ఆకులు పెళుసుగా మారతాయి. చెట్ల పెరుగుదల తగ్గి ఎదుగుదల ఉండదు. పంట దిగుబడి నాణ్యత గణనీయంగా తగ్గుతుంది. కాయలు గిడసబారి నాసిగా ఉంటాయి. విత్తనం మరియు పేనుబంక ద్వారా తెగులు వ్యాపిస్తుంది. ఉంగరాల(రింగ్‌స్పాట్) తెగులు ఈ తెగులు లక్షణాలు ఆకులు, కాడ, కాండం, పూత, పిందె, కాయ, పండ్లపై ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. లేత ఆకులు పచ్చదనం కోల్పోయి పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు వంగి ముడుచుకుపోతాయి. దీంతో ఆకుల పరిమాణం తగ్గి సరైన మోతాదులో ఆహారాన్ని తయారు చేసుకోలేవు. కాండం పైభాగాన ఆకు తొడిమలపై ముదురాకు పచ్చని మచ్చలు, చారలు నూనె రాసినట్లు కన్పిస్తాయి. తెగులు తీవ్ర దశలో ఒక దానితో ఒకటి కలిసి మొక్క ఎదుగుదల తగ్గుతుంది. పూత, పిందె, కాయ, పండుపై గోధుమ రంగుతో ఉంగరాల్లాంటి రింగులు ఏర్పడతాయి. వీటి మధ్యభాగం ఆకుపచ్చగా ఉంటుంది. ఒక్కో పండుపై వీటి సంఖ్య వందల్లో ఉంటాయి. తెగులు సోకిన చెట్టు పూలు అంతగా పిందె కట్టవు. పిందెలు ఎదగవు. రింగులున్న కాయలు తొందరగా పండి మెత్తబడి నీరుకారుతాయి. నాణ్యత లోపిస్తుంది. దూరప్రాంతాల రవాణాకు పనికిరావు. విత్తనం మరియు పేనుబంక ద్వారా తెగులు వ్యాప్తి చెందుతుంది. ఆకుముడత(లీఫ్ క్రింకిల్ లేదా కర్ల్) తెగులు ఈ తెగులు సోకిన చెట్లలో ఎదుగుదల తగ్గుతుంది. ముడతలు పడి ఆకులు ముడుచుకుని బంతిలా మారతాయి. ఆకు తొడిమ వంకర టింకరగా తిరుగుతుంది. వికృతాకారంగా ఉంటుంది. చెట్టు తల ఆకారం మారుతుంది. పూత రాక గొడ్డు చెట్టుగా మారవచ్చు. తెల్లదోమ ద్వారా తెగులు వ్యాప్తి చెందుతుంది. తెగుళ్ల నివారణకు.. ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలు వాడాలి. విత్తన శుద్ధి తప్పనిసరి. నారు మొక్కలు ప్రధాన పొలంలో నాటేటప్పు డు వెర్రి తెగుళ్ల లక్షణాలుంటే తీసేయాలి. అంతర పంటగా మిరప, టమాటా, దోస పుచ్చ, గుమ్మడి లాంటివి సాగుచేయొద్దు. తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే తీసి నాశనం చేయాలి. సమతుల సమగ్రమైన ఎరువులను సకాలంలో అందించాలి. సూక్షధాతు మిశ్రమాన్ని 3, 4 నెలల వయస్సులో ఒకమారు చెట్లపై పిచికారి చేయాలి. కలుపు మొక్కలు పొలంలోను, పొలం గట్లపైన లేకుండా పరిశుభ్రతను పాటించాలి. తోటలో నీరు నిల్వకుండా జాగ్రత్త పడాలి. అంతర సేద్యం చేసేటప్పుడు చెట్ల వేర్లకు గాయాలు తగలకుండా చూడాలి. రసం పీల్చే పురుగులతోనే వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెందుతాయి. పేనుబంక, తెల్లదోమ పురుగులను సకాలంలో నివారించాలి. వాటి ఉధృతిని నివారించాలంటే థైయోమిథాక్సిన్ 0.3 గ్రా, లేదా డైఫెన్త్యూరియాన్ 1 గ్రా, లేదా స్పినోస్యాడ్ 0.3 మి.లీ లేదా ఎసిఫెట్ 1.5 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాటితో పాటు 5 మి.లీ వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 15 రోజుల వ్యవధిలో పై మందులను మార్చుతూ రెండు, మూడు సార్లు పిచికారి చేసుకుంటే పురుగు వృద్ధి తగ్గుతుంది. బొప్పాయిలో వైరస్ తెగుళ్ల లక్షణాలు కన్పించిన మొక్కలను మొదట్లోనే పీకేయాలి. సరైన నీరు, పోషకాల యాజమాన్యం ద్వారా వైరస్ తెగుళ్లను అరికట్టవచ్చు. నీటి పోషకాల యాజమాన్యం సక్రమంగా లేకపోవడంతోనే తెగుళ్లు అధికంగా వస్తాయి. -
కొద్దిపాటి దిగుబడి తగ్గినా లాభాలు ఎక్కువే
-
లాభసాటిగా బొప్పాయి సాగు
-
బొప్పాయి పాలు.. రైతుకు లాభాలు
సాధారణంగా బొప్పాయి తోటలు అనగానే బొప్పాయి కాయలే గుర్తుకు వస్తాయి. అయితే అందులో మరో కోణం దాగి ఉంది. బొప్పాయి కాయలు తినడానికే కాకుండా బొప్పాయి పాలు, ఆకులు మందుల తయారీలో వినియోగిస్తున్నారు. ఇందుకోసం నైపుణ్యం కలిగిన కూలీలు తోటల వద్దనే మకాం వేసి మరీ పాలసేకరణ చేస్తున్నారు. కాంట్రాక్టర్లు నేరుగా తోటల వద్దకే వచ్చి వాటిని కొనుగోలు చేస్తున్నారు. బొప్పాయి పాల కోసం ఎకరం తోటకు రూ. 20వేలు, బొప్పాయి ఆకు కోసం ఎకరం తోటకు రూ.15వేలు కాంట్రాక్టర్లు చెల్లిస్తున్నారు. ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు పాలసేకరణ బొప్పాయి తోటల్లో చెట్ల నుంచి పాలసేకరణ ఉదయం 6 గంటల నుంచి పదిగంటల వరకు మాత్రమే చేస్తారు. ఆ తరువాత కూలీలకు ఎలాంటి పని ఉండదు. జిల్లాలోని రైల్వేకోడూరు నుంచి ఇందుకోసం ప్రత్యేకంగా కూలీలను తీసుకొస్తున్నారు. కూలీలు బొప్పాయి తోటల్లోనే గుడిసెలు వేసుకొని పాలసేకరణ పూర్తి అయ్యేంత వరకు అక్కడే ఉంటారు. కూలీలందరూ ఉదయం ఆరు గంటల నుంచి పదిగంటల వరకు పాలసేకరణ చేస్తారు. ఎకరానికి ఎనిమిది క్యాన్ల పాలసేకరణ ఎకరం బొప్పాయి తోటలో కూలీలు ఎనిమిది క్యాన్ల వరకు పాలసేకరణ చేస్తారు. ఒక్కో కూలీ కనీసం రోజుకు ఒక క్యాన్ పాలు సేకరిస్తారు. ఒక క్యాన్ పాలు సేకరిస్తే కూలీలకు కాంట్రాక్టర్ రూ. 1500 చెల్లిస్తారు. కనీసం పది మంది కూలీలు గుంపులు, గుంపులుగా బొప్పాయి తోటల్లో మకాం వేసి పాలు సేకరిస్తుంటారు. ప్రత్యేక పద్ధతుల్లో పాలసేకరణ బొప్పాయి పాలసేకరణ ప్రత్యేక పద్ధతుల్లో సేకరిస్తుంటారు. ముళ్ల కంప లాంటి వస్తువుతో ముందుగా బొప్పాయి కాయలపై గాట్లు వేస్తారు. అనంతరం బొప్పాయిచెట్టు కింద చెట్టు చుట్టూ ప్లాస్టిక్ కవర్‌తో తయారు చేసిన ఓ జల్లెడలాంటి అట్టను కింద ఉంచుతారు. బొప్పాయి కాయల్లో నుంచి కారే పాలన్నీ కింద ఉన్న ప్లాస్టిక్ సంచుల్లో పడతాయి. పాలు కింద పడిన కొద్దిసేపటికే అవి గడ్డగా మారిపోతాయి. పా«లధార నిలిచిపోయిన తరువాత గడ్డగా మారిన పాలను ప్లాస్టిక్ క్యాన్లలో నింపుతారు. సాధారణ, ఆయుర్వేద మందుల తయారీలో వినియోగం ఇక్కడి బొప్పాయి తోటల్లో సేకరించిన పాలను క్యాన్ల ద్వారా కాంట్రాక్టర్లు రైల్వే కోడూరులోని ఫ్యాక్టరీలకు చేరుస్తారు. అక్కడి నుంచి ఈ బొప్పాయి పాలను ట్యాంకర్ల ద్వారా కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తారు. సాధారణ అల్లోపతి మందులతో పాటు ఆయుర్వేద మందుల తయారీలో ఈపాలను వినియోగిస్తుండడంతో వీటికి మంచి డిమాండ్ ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఎకరం తోట రూ.20వేలు పాలసేకరణ కోసం కాంట్రాక్టర్లు ఎకరం బొప్పాయి తోటలకు రూ. 20 వేలు వరకు చెల్లిస్తుంటారు. పాలసేకరణ పూర్తి అయిన తరువాత బొప్పాయి ఆకు ను కూడా కత్తిరించి టన్ను రూ. 15 వేలు చొప్పున విక్రయిస్తుంటారు. బొప్పాయి పాలతో పాటు ఆకు కూడా మందుల తయారీలో వినియోగిస్తుంటా రు. దీంతో పాలతో పాటు ఆకుకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఆకు, పాలసేకరణ ముగిసిన తరువాత తోటల్లో మిగిలిన కాయల్ని ఫ్యాక్టరీలకు తరలిస్తుంటారు. బొప్పాయి పచ్చికాయల నుంచి స్వీట్లు, బ్రెడ్లు, కేక్‌ల తయారీలో వినియోగించే స్వీట్ చిప్స్‌ను తయారు చేస్తారు. మందుల తయారీలో పాలను వాడతారు బొప్పాయి పాలను మందులు తయారు చేసే ప్రక్రియలో భాగంగా వాడతారు. బొప్పాయి పాలు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు తీసుకెళుతుంటారు. మేము బొప్పాయి తోటలను కాంట్రాక్ట్ తీసుకొని పాలను సేకరిస్తాము. బొప్పాయి పాలతో పాటు ఆకు కుడా మందుల తయారీలో వినియోగిస్తారు. చివరగా మిగిలిన కాయలు స్వీట్ చిప్స్ తయారీకి వాడతారు. సిద్ధార్థ, కాంట్రాక్టర్, రైల్వేకోడూరు రోజుకు ఒక క్యాన్ పాలు సేకరిస్తాం బొప్పాయి తోటల్లో రోజుకు ఒక క్యాన్ పాలు సేకరిస్తాము. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు మాత్రమే పాలసేకరణకు అనుకూల సమయం. ఒక క్యాన్‌కు కాంట్రాక్టర్ రూ. 1500 ఇస్తాడు. పదిమంది ఒక బృందంగా ఏర్పడి బొప్పాయి తోటల్లోనే గుడిసెలు వేసుకొని ఇక్కడే ఉండిపోతాం. 15 రోజుల వరకు ఒక తోటలో పాలసేకరణ చేస్తాము. శీను, రైల్వేకోడూరు -
బొప్పాయి పంట.. లాభాలే లాభాలు.. టన్ను ధర ఎంతంటే?
పెద్దపప్పూరు(అనంతపురం జిల్లా): రైతులు ఏటా వేరుశనగ సాగు చేసి, దిగుబడి రాక, పెట్టుబడి కూడా దక్కక నష్టాలు చవిచూస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రత్యామ్నాయంగా బొప్పాయి పంట సాగు చేసి, లాభాలు పండిస్తున్నారు. తెగుళ్ల ప్రభావంతో పంట దిగుబడి తగ్గినా, మార్కెట్లో ఆశించిన ధర పలుకుతుండడంతో రాబడి పెరిగిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని పెద్దపప్పూరు, యాడికి, పెద్దవడుగూరు, తాడిపత్రి మండలాల్లోని పలు గ్రామాల్లో దాదాపు 181 ఎకరాల్లో బొప్పాయి పంట సాగు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. చదవండి: సీజన్ వచ్చేసింది.. వణికించే వ్యాధుల జాబితా! లక్షణాలు, ముందు జాగ్రత్తలు నేల స్వభావాన్ని బట్టి దిగుబడి రైతులు ఎక్కువగా తైవాన్ 786 రకం బొప్పాయి మొక్కలను సాగు చేస్తున్నారు. ఎకరాకు 1000 మొక్కల చొప్పున సాగు చేస్తున్నారు. ఏటా జూన్ నెలలో సాగు చేస్తే ఏడు నెలలకు తొలి పంట కోత ప్రారంభమవుతుంది. ఎకరానికి రైతులు రూ.1.50 లక్ష పెట్టుబడి పెట్టారు. పంట కాలం పూర్తయ్యేలోపు నేల స్వభావాన్ని బట్టి ఎకరానికి 25 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుందని రైతులు చెప్తున్నారు. రైతుల చెంతకే వ్యాపారులు : ఇక్కడి రైతులు పండించిన పంటను ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల మార్కెట్లకు ఎక్కువగా తరలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అక్కడి మార్కెట్లలో డిమాండ్‌ను బట్టి అనంతపురం, నెల్లూరు, తాడిపత్రి పట్టణాలకు చెందిన వ్యాపారులే స్వయంగా రైతుల చెంతకు వచ్చి టన్ను రూ.8 వేల నుంచి రూ. 10 వేలకు కొనుగోలు చేస్తున్నారు. లాభదాయక పంట ఏటా జూన్ నెలలో పంట సాగు చేయాలి. అక్టోబర్‌లో సాగు చేయడంతో పంట దెబ్బతిన్నా.. తిరిగి కోలుకుంది. మూడెకరాల్లో పంట సాగు చేసినా. ఎకరానికి రూ.1.50 చొప్పున పెట్టుబడి వచ్చింది. పెట్టుబడి పోనూ రూ.లక్ష ఆదాయం వచ్చింది. మరో రెండు నెలల పాటు పంట దిగుబడి వస్తుంది. మార్కెట్లో కాయ నాణ్యతను బట్టి టన్ను రూ.8 నుంచి రూ.10 వేల వరకు ధర పలుకుతోంది. వ్వాపారులు కొందరు మావద్దకే వచ్చి పంట కొనుగోలు చేస్తున్నారు. – రైతు బాసూ సాహెబ్, చింతరపల్లి, పెద్దపప్పూరు మండలం జాగ్రత్తలు పాటిస్తే లాభాలు బొప్పాయి పంటకు ఎక్కువగా తెగుళ్లు ఆశించడంతో ఆకులు రాలిపోతాయి. పూత, పిందెలు నేలరాలతాయి. తెగుళ్లు ప్రారంభ దశలోనే గుర్తించి నివారణకు మందులు పిచికారీ చేయాలి. నేల స్వభావాన్ని బట్టి పంట దిగుబడి వస్తుంది. కాయలు నాణ్యతను బట్టి ధర పలుకుతుంది. రైతులకు పంట సాగులో ఎలాంటి సందేహాలున్నా, తెగుళ్లు వ్యాపించినా వెంటనే సమాచారం అందించాలి. క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఏ మందులు పిచికారీ చేయాలో స్వయంగా తెలియజేస్తాం. – ఉమాదేవి, ఉద్యాన అధికారిణి, తాడిపత్రి -
Natural Farming: ఐదంతస్తులతో ఆదాయ మస్తు!
కర్నూలు(అగ్రికల్చర్): ఏ రంగంలోనైనా రాణించాలంటే అధునాతన పద్ధతులు, వినూత్న ఆలోచనలే కీలకం. ఇది వ్యవసాయ రంగానికీ వర్తిస్తుంది. సంప్రదాయ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దగా గిట్టుబాటు అయ్యే అవకాశం లేదు. వినూత్న ప్రయోగాలు చేస్తున్న రైతులు మాత్రం క్లిష్ట పరిస్థితుల్లోనూ తగిన ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. ఈ క్రమంలో రూపుదిద్దుకున్నదే ఐదంతస్తుల పంటల సాగు నమూనా. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ విధానాన్ని కర్నూలు జిల్లాలో ప్రోత్సహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. రైతులకు తోడ్పాటు ఐదంతస్తుల విధానంలో పంటలు సాగు చేసే రైతులకు తగిన తోడ్పాటు అందించాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇందుకోసం అధికారులు 2020–21 ఆర్థిక సంవత్సరంలోనే ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే.. వివిధ కారణాల వల్ల అమలు కాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్యాచరణకు దిగారు. ఈ ఏడాది జిల్లాలో దాదాపు 1,500 మంది రైతులతో ఐదంతస్తుల విధానంలో పంటలు వేయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటి వరకు 754 ఎకరాల్లో సాగుకు రంగం సిద్ధమైంది. ఒక్కొక్క రైతుతో గరిష్టంగా ఎకరా వరకు సాగు చేయిస్తున్నారు. ఇందుకు గాను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రైతుకు ఎకరాపై మూడేళ్లకు గాను రూ.1.64 లక్షల ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఈ విధానంలో వేసిన పంటలను జియో ట్యాగింగ్ సైతం చేస్తున్నారు. స్వచ్ఛందంగా సాగు రెండేళ్ల క్రితమే జిల్లాలో పలువురు రైతులు స్వచ్ఛందంగా ఐదంతస్తుల విధానంలో పంటల సాగు చేపట్టారు. గూడూరు, ఓర్వకల్లు, మిడుతూరు, ప్యాపిలి, కల్లూరు, కర్నూలు తదితర మండలాల్లో దాదాపు 200 ఎకరాల్లో ఈ విధానంలో పంటలు సాగులో ఉన్నాయి. ఇది సత్ఫలితాలు ఇస్తోంది. పలువురు నిపుణులు సైతం ఈ విధానాన్ని పరిశీలించి రైతులకు లాభదాయకమని తేల్చారు. భూమి, నీరు, సూర్యరశ్మిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ పంటలు సాగుచేసే ఈ పద్ధతి ద్వారా కరువును ఎదుర్కోవచ్చునని ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ప్రోత్సహించాలని నిర్ణయించింది. 30 సెంట్లలో సాగు చేశా ఐదంతస్తుల విధానంలో 30 సెంట్లలో పంటలు సాగు చేశా. ఇప్పటికి రెండేళ్లు పూర్తయ్యింది. పూర్తిగా ప్రకృతి వ్యవసాయమే. అన్ని ఖర్చులు పోను రూ.40 వేల వరకు నికరాదాయం వస్తోంది. కుటుంబానికి అవసరమైన కూరగాయలు లభిస్తున్నాయి. పలువురు ఉన్నతాధికారులు, విదేశీ ప్రతినిధులు కూడా పరిశీలించి వెళ్లారు. ఇప్పుడు ‘ఉపాధి’ నిధులతో ప్రోత్సాహకాలు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో మరికొంత విస్తీర్ణంలో సాగు చేయాలనుకుంటున్నా. – యు. మాదన్న నాగలాపురం, గూడూరు మండలం ఉపయోగాలివీ.. ► ఐదంతస్తుల విధానంలో పంటలు వేయడం వల్ల రైతులకు ఏడాది పొడవునా ఆదాయం వస్తుంది. ► పండ్లతోటలు, ఇతర వృక్షాలను పెంచడం ద్వారా వర్షాలను ఆకర్షించే అవకాశం ఉంటుంది. ► తక్కువ నీటి వినియోగంతోనే ఎక్కువ పంటలు పండించవచ్చు. ఐదంతస్తుల నమూనా ఇలా.. ► 1వ అంతస్తు కింద 36 అడుగుల విస్తీర్ణంలో మామిడి చెట్లు నాటాలి. ఇవి ఐదారేళ్లలో కాపునకు వస్తాయి. ► 2వ అంతస్తు 18 అడుగులు.. ఇందులో మోసంబి, అంజూర వేసుకోవచ్చు. మోసంబి 4–5 ఏళ్లలో, అంజూర ఐదో ఏడాది నుంచి కాపునకు వస్తాయి. ► 3వ అంతస్తు 9 అడుగులు ఉంటుంది. ఇందులో జామ, మునగ, కంది, బొప్పాయి, అరటి వేసుకోవచ్చు. జామ, మునగ, కంది ఆరు నెలలకు కాపునకు వస్తాయి. బొప్పాయి 9 –10 నెలలకు, అరటి ఏడాదిలోపు కాపునిస్తాయి. ► 4వ అంతస్తు 4–5 అడుగులు. కూరగాయలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, దుంపజాతి కూరగాయలు సాగు చేయవచ్చు. ► 5 అంతస్తు 2.5 అడుగులు. తీగజాతి, దుంపజాతి కూరగాయలు వేసుకోవచ్చు. ఇవి 3–4 నెలల్లో కాపునకు వస్తాయి. అంటే ఐదంచెల ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏడాది పొడవునా పంటలు ఉంటాయి. -
సేంద్రియం సైసై.. వైరస్ బైబై..!
బొప్పాయి.. బొప్పాయి పంట అనగానే వైరస్ తెగులు గుర్తొస్తుంది. వైరస్ ఒక్కసారి తోటలో కనిపించిందంటే ఇక ఆ తోటపై ఆశలు వదులుకోవల్సిందే అన్న బెంగతో రైతులు వణకిపోతూ ఉంటారు. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడే బొప్పాయి తోటల్లోనే వైరస్ పంటకు మరణశాసనంగా మారుతోందని, పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాటిస్తే వైరస్ అసలు సమస్యే కాదని డా. జి. శ్యామసుందర్ రెడ్డి అనుభవపూర్వకంగా చెబుతున్నారు. మెదక్ జిల్లా తునికిలోని ‘డా. రామానాయుడు – ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)’ లో ఆయన సేంద్రియ బొప్పాయి తోటను ప్రయోగాత్మకంగా సాగు చేసి ఎకరానికి 50 టన్నుల దిగుబడి తీశారు. ఆ విశేషాలు... ‘రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడే తోటలో నేల సారాన్ని కోల్పోయి బలహీనమవుతుంది. అప్పుడే పంటకు వైరస్ సోకుతుంది. విజృంభించి దిగుబడిని దారుణంగా దెబ్బతీస్తుంది. మట్టిని ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో బలోపేతం చేస్తే, వైరస్ తెగులును తట్టుకునే శక్తి పంటకు ప్రకృతిసిద్ధంగానే మట్టి ద్వారా వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మట్టి ఆరోగ్యమే మొక్క ఆరోగ్యం, మొక్క ఆరోగ్యమే మనిషి ఆరోగ్యం..’ అంటున్నారు డాక్టర్ గున్నంరెడ్డి శ్యాంసుందరరెడ్డి. మెదక్ జిల్లా తునికిలోని ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రం అధిపతిగా ఉన్న ఆయన సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించి రెడ్‌లేడీ బొప్పాయిని 9 నెలలుగా సాగు చేస్తున్నారు. రింగ్ స్పాట్ వైరస్ నాటిన 6 నెలల తర్వాత ఒక మొక్కకు వచ్చింది. నెలలు గడిచినా మరో 3 మొక్కలకు మాత్రమే సోకింది తప్ప తోట మొత్తానికీ పాకలేదు. పిండినల్లి సోకితే కషాయాలు, పుల్లమజ్జిగ పిచికారీ చేస్తే పోయిందన్నారు. సేంద్రియ పద్ధతులను పూర్తిగా పాటిస్తే తోటకు ఒకవేళ వైరస్, పిండినల్లి సోకినా తీవ్రత అంతగా ఉండదని, పంట ఎదుగుదలకు, అధిక దిగుబడులకు ఆటంకం కాబోవని రూఢిగా చెబుతున్నారు. ఈ తోటలో చెట్టుకు 60 కాయల వరకు వచ్చాయి. ఒక్కోటి కిలో నుంచి 3 కిలోలు ఉన్నాయి. కోత ప్రారంభమైంది. కనీసం 50 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. కిలో రూ. 40 చొప్పున విక్రయిస్తున్నామని డా. శ్యాంసుందరరెడ్డి తెలిపారు. రింగ్ స్పాట్ వైరసే ఎక్కువ బొప్పాయి మొక్కల్ని ఆశించే వైరస్ తెగుళ్లు మూడు రకాలు: 1. రింగ్ స్పాట్ వైరస్: ఇది చాలా ఎక్కువ తోటల్లో కనిపిస్తుంది. మొక్కలు నాటిన రెండు నెలల నుంచి తర్వాత ఎప్పుడైనా ఈ వైరస్ సోకవచ్చు. ఆకు తొడిమె మీద నూనె లాంటి మరకలు ఉంటాయి. కాయలు, పిందెలపై వలయాకారపు నూనెలాంటి మచ్చలు వస్తాయి. 2. లీఫ్ కర్ల్ వైరస్: ఆకులు ముడుచుకుపోతాయి. 3. మొజాయిక్ వైరస్: ఆకుపచ్చగా ఉండాల్సిన ఆకులపై పసుపు, పచ్చ, తెలుపు మచ్చలు చుక్కలు చుక్కలుగా కనిపిస్తాయి. ఆకు ముడుచుకుపోదు కానీ సైజు తగ్గుతుంది. సేంద్రియ సాగులో 6 సూత్రాలు సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో బొప్పాయి సాగు చేసే క్రమంలో తాము 6 సూత్రాలు పాటించామని డా. శ్యాంసుందరరెడ్డి అన్నారు. రైతులు వీటిని తూ.చ. తప్పకుండా పాటిస్తే వైరస్, తదితర చీడపీడల బెడద లేకుండా నిస్సందేహంగా అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. ఆరు సూత్రాలు : 1. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు పూర్తిగా ఆపెయ్యాలి. 2. చివికిన పశువుల ఎరువు వాడాలి. 3. మొక్కల చుట్టూ మట్టి ఎగదోయాలి. 4. సేంద్రియ వ్యర్థాలతో ఆచ్ఛాదన చేయాలి. 5. డ్రిప్‌నకు బదులు మైక్రోస్ప్రింక్లర్లతో నీటి తడులివ్వాలి. జీవామృతం, పంచగవ్య, పుల్ల మజ్జిగ వాడాలి. 6. చీడపీడల యాజమాన్య మెలకువలు పాటించాలి. మొక్కల చుట్టూ మట్టి ఎగదోయడం బొప్పాయి మొక్కలు నాటిన తర్వాత 7వ నెలలో మొక్కలకు ఇరువైపులా 2 అడుగుల దూరం వరకు 2 అంగుళాల మందాన పశువుల ఎరువు వేశారు. 2 అడుగుల అవతల అడుగు–అడుగున్నర వెడల్పుతో అడుగు లోతున గాడి తీశారు. తీసిన మట్టిని మొక్కల వరుసలో బెడ్‌లా వేశారు. ద్రవజీవామృతంతోపాటు డబ్లు్య.డి.సి. బొప్పాయి మొక్కలకు ద్రవజీవామృతం ఇచ్చిన పది రోజులకు వేస్ట్ డీ కంపోజర్ (డబ్లు్య.డి.సి.) ద్రావణాన్ని మార్చి మార్చి ఇదొకసారి అదొకసారి ఇస్తున్నారు. తొలి దశలో పాదుల్లో పోశారు. మొక్కలు పెరిగిన తర్వాత మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా భూమికి ఇస్తున్నారు. పూత దశలో 15 రోజలకోసారి పంచగవ్య పిచికారీ చేశారు. పిండినల్లి పరారీ వైరస్ తర్వాత బొప్పాయి మొక్కల్ని పీడించే మరో సమస్య పిండినల్లి. మొక్కలు నాటిన రెండో వారం నుంచే పిండినల్లి సోకింది. పంచగవ్య పిచికారీతో తొలిదశలో అదుపులోకి వచ్చింది. మొక్కలు నాటిన తర్వాత 6వ నెలలో ఎడతెరపి లేకుండా 2 నెలల పాటు వర్షాలు కురిశాయి. పంచగవ్య పిచికారీ చేసినా వర్షం వల్ల ప్రభావం చూపలేకపోయింది. అప్పుడు లొట్టపీసు కషాయం, గంజిద్రావణం, పుల్లటి మజ్జిగ 5 రోజుల వ్యవధిలో ఒక్కోసారి పిచికారీ చేస్తే పిండినల్లి పత్తాలేకుండా పోయిందని డా. శ్యాంసుందరరెడ్డి తెలిపారు. 10 లీటర్ల నీటిలో ఒక కిలో చొప్పున లొట్టపీసు (తూటి) మొక్క ఆకులు వేసి పొయ్యిమీద పెట్టి 3 పొంగులు వచ్చే వరకు మరిగించి, దించి, చల్లారిన తర్వాత (నీరు కలపకుండా) పిచికారీ చేశారు. మొక్కలు, కాయలు, పందెలు పూర్తిగా తడిసి ముద్దయ్యేలా పిచికారీ చేశారు. 5 రోజుల తర్వాత లీటరు నీటికి 100 గ్రాముల చొప్పున వేసి గంజి ద్రావణం కాచి, చల్లారిన తర్వాత పిచికారీ చేశారు. మరో 5 రోజులకు బాగా పుల్లటి మజ్జిగ పిచికారీ చేశారు. లీటరు పెరుగుకు 9 లీటర్ల నీటిని కలిపి మజ్జిగ చేసి 5 రోజులు పులియబెట్టి పిచికారీ చేశారు. ఈ మూడు పిచికారీలతో పిండినల్లి పత్తాలేకుండా పోయింది. 3 నెలలు గడచినా మళ్లీ కనిపించలేదు. బూడిద తెగులు కూడా రాలేదు. పిండినల్లి నేలను సుసంపన్నం చేయాలి నేలను సుసంపన్నం చేసినప్పుడే బొప్పాయి మొక్కలు వైరస్ సహా చీడపీడలను సమర్థవంతంగా తట్టుకోగలుగుతాయి. మొక్కకు కావలసిన శక్తిని, బలాన్ని ఇచ్చేలా మట్టిని బలోపేతం చేయడం సహజ పద్ధతుల ద్వారానే సాధ్యమవుతుందని గ్రహించాలి. రసాయనాలు వేస్తే నేలలో స్వతహాగా ఉండే శక్తి సన్నగిల్లిపోతుంది. కాబట్టి, అసలు రసాయనిక ఎరువులు వేయనే వేయకూడదు. రసాయనిక ఎరువులు వేయపోతే మంచి దిగుబడులు రావని, కాయల సైజు రాదని రైతులు అనుకుంటూ ఉంటారు. అది అపోహ మాత్రమే. సేంద్రియసాగులో పశువుల ఎరువుతో కూడా మంచి దిగుబడులు రావడమే కాదు మంచి రుచి కూడా వస్తుంది. నిల్వసామర్థ్యం కూడా పెరుగుతుంది. ∙కట్టెలకు నిప్పు పెట్టి గుంతల్లోనే బయోచార్ తయారుచేస్తున్న దృశ్యం కోనేరు గుంతలు.. పశువుల ఎరువు.. డా. శ్యాంసుందర రెడ్డి అనుసరించిన సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వివరాలు.. కోనేరు గుంతలు తవ్వి మొక్కలు నాటారు. కోనేరు గుంత అంటే.. పైన ఎక్కువ వెడల్పుతో, కిందికి వెళ్లే కొద్దీ తక్కువ వెడల్పుతో మెట్లు మెట్లుగా గుంత తీయడం అన్నమాట. గుంత 3 అడుగుల వెడల్పున తీయాలి. వెడల్పు 3 అడుగులతో ప్రారంభమై.. అడుగుకు వెళ్లే టప్పటికి అడుగు వెడల్పు, అడుగు లోతు ఉండేలా తీశారు. ప్రతి గుంతలో కట్టెలను తగులబెట్టి బొగ్గు(బయోచార్)ను తయారు చేశారు. గుంతలో మూడో వంతు వరకు కట్టెలు వేసి మంటపెట్టారు. కట్టెలు బాగా ఎర్రగా కాలుతున్నప్పుడు (కట్టెలను పూర్తిగా కాలిపోకముందే చెయ్యాలి. మొత్తం కాలిపోతే బూడద మిగులుతుంది) మట్టితో గుంతను కప్పేశారు. మంటలు ఆరిపోయి బొగ్గు మిగిలింది. ప్రతి గుంతలో కనీసం 5 కిలోల బొగ్గు ఉంటే సరిపోతుంది. కట్టెలు కాల్చి మట్టితో పూడ్చిన వారం తర్వాత ప్రతి గుంతలోనూ 10 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు వేసి మొక్కలు నాటారు. మొక్కలు నాటిన 3వ నెలలో చుట్టూ గాడి తీసి ఎరువు వేశారు. మొక్కకు 2 అడుగుల దూరంలో గుండ్రంగా.. అడుగు వెడల్పు, అడుగు లోతులో గాడి తీశారు. ఆ గాడిలో 4–6 అంగుళాల మందాన పశువుల ఎరువు వేశారు. అంతే. ఈ ఎరువుతోనే చక్కటి కాపు వచ్చింది. చెట్టుకు 40–50 కాయలు వచ్చాయి. మొక్కలు నాటిన 3 నెలల తర్వాత చెట్టుకు 50 కిలోల పశువుల ఎరువు వేశారు. 7 నెలల తర్వాత 20 కిలోల పశువుల ఎరువు వేశారు. కొబ్బరి వ్యర్థాలతో ఆచ్ఛాదన మొక్కల వరుసలో మట్టిని బెడ్‌లా పోసిన తర్వాత దానిపైన కొబ్బరిపీచు వ్యర్థాలతో ఆచ్ఛాదన చేశారు. కొబ్బరి బొండాలను ష్రెడ్డర్‌లో వేసి పీచును తయారు చేస్తారు. పీచుతోపాటు కొంత వృథాపొట్టు వంటి పదార్థం పోగుపడుతుంది. పీచు ధర ఎక్కువ ఉంటుంది. పొట్టు వంటి వ్యర్థ పదార్థాన్ని కిలో రూపాయికి కొని మల్చింగ్ చేశారు. ∙కొబ్బరి వ్యర్థాలతో బొప్పాయి చెట్ల చుట్టూ ఆచ్ఛాదన మైక్రో స్ప్రింక్లర్ల వాడకం మంచిది బొప్పాయి మొక్కల వేర్లు పైపైనే అనేక మీటర్ల దూరం పాకుతాయి. 80% వేర్లు 4–6 అంగుళాల లోతు మట్టిలోనే ఉంటాయి. ఎంత విస్తారంగా ఆచ్ఛాదన, తేమ గల నేల దొరికితే అంత దూరం వేరు వ్యవస్థ విస్తరిస్తుంది. ఎంత ఎక్కువగా వేరు వ్యవస్థ విస్తరిస్తే అంత ఎక్కువ పోషకాలను మొక్క తీసుకోగలుగుతుంది. డ్రిప్‌తో నీరిస్తే డ్రిప్పర్లున్న చోటే 10–20 అడుగుల లోతు వరకు నీటి తేమ దిగుతుంది. కానీ, అడుగు లోతుకన్నా తేమ బొప్పాయి వేర్లకు అవసరం లేదు. అందువల్ల నీరు వృథా అవుతుంది. ప్రయోజనమూ అంతగా ఉండదు. అందువల్ల మైక్రో స్ప్రింక్లర్లు వాడటమే బొప్పాయి తోటలో నీటియాజమాన్యంలో ముఖ్యంగా పాటించాల్సిన జాగ్రత్త అని డా. శ్యాంసుందరరెడ్డి తెలిపారు. మల్చింగ్ చేయకుండా కొందరు రైతులు రసాయనిక కలుపు మందులు వాడుతున్నారు. ఈ కారణంగా ఆ తోటల్లో బొప్పాయి చెట్లకు వైరస్‌ను తట్టుకునే శక్తి సన్నగిల్లుతుంది. సేంద్రియ పదార్థాలతోనే మల్చింగ్ చెయ్యాలి. ప్లాస్టిక్ షీట్‌తో మల్చింగ్ చేయడం కూడా మంచిది కాదు. ఆ షీట్ వేసినంత ప్రాంతంలో కలుపు రాకుండా, తేమ ఆరకుండా ఉంటుందే గాని, జీవామృతం, పంచగవ్య వంటి పోషక ద్రావణాలను నేల మొత్తంలో అందించడం వీలు కాదు. సేంద్రియ వ్యర్థాలతో మల్చింగ్ చేసి, జీవామృతం, పంచగవ్య వంటి వాటిని మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా నీటితోపాటు ఇచ్చినప్పుడు నేల అన్ని చెరగులా పరచుకొని ఉండే వేర్లకు పోషకాలు పుష్కలంగా అందుతాయి. చెట్లు బలంగా పెరుగుతాయి. ఎకరానికి 50 టన్నుల సేంద్రియ బొప్పాయిల దిగుబడి బొప్పాయి తోట రెండేళ్లు కాపునివ్వాలి. అయితే, వైరస్ బెడద వల్ల ఏడాదికే అంతా అయిపోతోంది. కనీసం మొదటి 8 నెలలు వైరస్ రాకుండా చూసుకోగలిగితే, ఆ తర్వాత వైరస్ వచ్చినా 50% కాపునకు ఢోకా ఉండదు. మొక్క చుట్టూ గాడి తీసి పశువుల ఎరువు వేసి, మట్టిని ఎగదోస్తే మొక్కలకు వైరస్ రానే రాదు. ఇది మా అనుభవం. రెండో కాపు కూడా బలంగా వస్తున్నది. కింది కాయల సైజులోనే పై కాయలు కూడా పెరుగుతుండటం గమనించాం. సేంద్రియ బొప్పాయిసాగులో 6 మెలకువలు తు.చ. తప్పకుండా పాటిస్తే వైరస్, పిండినల్లి వంటి చీడపీడలను విజయవంతంగా అధిగమించడమే కాకుండా ఎకరానికి కనీసం 50 టన్నుల దిగుబడి సాధించవచ్చు. కిలోకు రూ. 5 ఖర్చవుతుంది. రైతులే నేరుగా వినియోగదారులకు అమ్ముకోవడం ఉత్తమం. మార్కెటింగ్ ఖర్చులు కిలోకు మరో రూ.5 పోయినా మిగతాదంతా నికరాదాయమే. నేరుగా వినియోగదారులకు కిలో రూ. 20కి అమ్మవచ్చు. దీని వల్ల సేంద్రియ రైతుకు, వినియోగదారులకు కూడా మేలు జరుగుతుంది. – డా. గున్నంరెడ్డి శ్యాం సుందర రెడ్డి (99082 24649), అధిపతి, డా. రామానాయుడు ఏకలవ్య కె.వి.కె., తునికి, మెదక్ జిల్లా 2020వ దశకానికి ప్రేమ పూర్వక స్వాగతం.. విషపూరితమైన రసాయనిక, విధ్వంసక సేద్య యుగం నుంచి విముక్తి పొందుదాం.. పంటల జీవవైవిధ్య సేద్యం దిశగా పరివర్తనకు దోవ చూపే దశాబ్దంలోకి అడుగిడదాం.. శిలాజ ఇంధనాలపై ఆధారపడే దుర్గతి ఇక వద్దు.. మన పశు సంపదపై ఆధారపడదాం. మన మట్టి మీద ఆధారపడదాం. జీవవైవిధ్యంతో నిండిన ప్రకృతిపై ఆధార పడదాం. మన ఆరోగ్యం మట్టిలోనే ఉంది మన ఆరోగ్యం ఆహారంలోనే ఉంది మన ఆరోగ్యం జీవ వైవిధ్యంలోనే ఉంది మట్టి ఆరోగ్యానికి మనం ఇవ్వాల్సిందేమీ లేదు.. వైవిధ్యభరితమైన గుప్పెడు బాక్టీరియాని తప్ప రండి.. చెలకల్లో మట్టితో కలిసి పని చేద్దాం..! రండి.. ప్రేమ నిండిన పంటలను విత్తుదాం..!! – డా. వందనా శివ, జీవవైవిధ్య సేంద్రియ సేద్య ఉద్యమకారిణి – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
వైరస్‌ను తట్టుకునే బొప్పాయి!
బొప్పాయి సాగు చేస్తూ పపయా రింగ్‌స్పాట్ వైరస్(పీఆర్‌ఎస్‌వీ)తో సతమతమవుతున్న రైతులకు శుభవార్త. ఈ వైరస్‌ను చాలా వరకు తట్టుకునే రెండు వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. పుణే (మహారాష్ట్ర)లోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐఏఆర్ఐ) శాస్త్రవేత్తలు పుణే సెలక్షన్-1, పుణే సెలక్షన్-3 అనే రెండు రకాల బొప్పాయి వంగడాలను రూపొందించారు. ఈ వంగడాలకు వైరస్ త్వరగా సోకదని, ఒకవేళ సోకినా నష్టం చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల రైతులకు ఈ విత్తనాలను పరీక్షల నిమిత్తం పుణేలోని ఐఏఆర్ఐ ఉచితంగా అందిస్తోంది. ప్రయోగాత్మకంగా సాగు చేయదలచిన రైతులు సంప్రదించాల్సిన చిరునామా: డా. ఎస్.కె.శర్మ, అధిపతి, ఐఏఆర్ఐ, ఫోన్: 020-25889968, ఫాక్స్: 020-25889969. జ్ఛ్చిఛీచిఞఠ్ఛఃజ్చీటజీ.ట్ఛట.జీ పుణే ఐఏఆర్ఐ నుంచి సికింద్రాబాద్‌లోని ‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఈ విత్తనాలు కొన్నిటిని తెప్పించి ఇస్తోంది. ఆసక్తి గల వారు 040-27017735 నంబరులో సంప్రదించవచ్చు. -
బాగు బాగు బొప్పాయి సాగు
ఖమ్మం వ్యవసాయం: గత ఏడాది వరకు జిల్లాలో 300 ఎకరాల మేరకు బొప్పాయి సాగు విస్తీర్ణం ఉండగా ఈ ఏడాది వెయ్యి ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. ఈ సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ఉద్యాన మిషన్ ఈ పంట సాగుకు ఉత్పాదకాల రూపంలో రాయితీ కల్పించి ఆర్థికంగా, సాంకేతికంగా తోడ్పాటునిస్తోంది. ఈ పంట సాగు పద్ధతులు, మెళకువలు, తెగుళ్ల నివారణ గురించి కొత్తగూడెం, మధిర ఉద్యానశాఖ అధికారి బి. శ్రావణ్ వివరించారు. వాతావరణం: బొప్పాయి ఉష్ణ మండలపు పంట. వేసవిలో 38 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటుంది. నేలలు: సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు, అనుకూలం. వీటితో పాటు తేలికగా నీరు ఇంకిపోయే రేగడి నేలల్లో కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. రకాలు: బొప్పాయిలో రెండు రకాల మొక్కలు ఉంటాయి. డైయోషియస్కు చెందిన వాషింగ్టన్, కో-1, కో-2, కో-4, కో-5, కో-6, పూసా డార్ఫా, పూసా జెయింట్, పూసానన్హా, హనిడ్యూ రకాల్లో ఆడ, మగ చెట్లు విడివిడిగా ఉంటాయి. గైనోడయోసియస్కు చెందిన కూర్గు హనీడ్యూ, సోలో, సన్‌రైజ్ సోలో, కో-3, కో-7, పూసాడెలీసియస్, పూసా మెజస్టీ, తైవాన్ రెడ్ లేడీ రకాల్లో ఆడ, ద్విలింగ మొక్కలు ఉంటాయి. వీటిలో మన జిల్లా రైతులు అధికంగా తైవాన్ రెడ లేడీ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రవర్దనం: విత్తనం ద్వారా ప్రవర్దనం చేస్తారు. పండ్ల నుంచి తీసిన విత్తనాలను 40 రోజుల్లో విత్తకోవాలి. ఎకరాకు గైనోడయోసియస్ రకాలు 20 గ్రాములు సరిపోతాయి. అంతర పంటలు, అంతర కృషి బొప్పాయి నాటిన తరువాత 6-7 మాసాలకు కాపు వస్తుంది. అంత వరకు మొక్కల మధ్య కలుపు రాకుండా స్వల్పకాలిక అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. జీలుగు, జనుము, అలసంద వంటి పచ్చిరొట్ట పంటలు వేసి పూ మొగ్గదశలో కలియదున్నాలి. దీనివల్ల భూసారం పెరుగుతుంది . మేలు చేసే సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది తెగుళ్ల తాకిడి తగ్గుతుంది. వేరుశనగ, శనగ, పెసర, మినుము, అలసంద, సోయాచిక్కుడు, నేల చిక్కుడు వంటి పంటలు వేసుకోవచ్చు. మిరప, వంగ, టమాట వంటి పంటలను కూడా సాగు చేసుకోవచ్చు. బొప్పాయిని అంతరపంటగా మామిడి, సపోట, కొబ్బరి వంటి తోటల్లో కూడా వేసుకోవచ్చు. ఎరువులు: చె ట్టు వయసును బట్టి ఎరువులను వినియోగించాలి. ఒక్కో చెట్టుకు నాటే గుంతలో ఐదు కిలోల పశుల ఎరువు, 200 గ్రాముల సూపర్ పాస్ఫేట్ వేయాలి. మొక్క 2, 4, 6, 8, 10, 12 నెలల్లో 90 గ్రాముల చొప్పున యూరియా, 200 గ్రాముల సూపర్, 140 గ్రాముల చొప్పున పొటాష్ వేయాలి. 6, 12 నెలల్లో ఐదు కిలోల చొప్పున పశువుల ఎరువు వేయాలి. తెగుళ్ల నివారణ కాండం మొదలు కుళ్లు: వేర్ల మొదలు మెత్తగా మారి కుళ్లిపోతాయి. కాయలున్న చెట్లకు ఈ తెగులు ఆశిస్తే నష్టం అధికంగా ఉంటుంది. దీని నివారణకు మొక్క మొదలు దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూడాలి. బోర్డో మిశ్రమం ఒక శాతం మందుతో కాండంపైన, లేదా, మెటాలాక్సిన్ లేదా క్లోరోథలానిల్ లేదా అలియేట్ రెండు గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొదలు తడపాలి. ఇలా వారంలో రెండుసార్లు తడపాలి. ఆంత్రక్నోన్ ఆకుపచ్చ తెగులు: ఈ తెగులు సోకితే నల్లటి ఉబ్బెత్తుగా ఉన్న మచ్చలు ఏర్పడుతాయి. కాయలు పక్వానికి రావు. నివారణకు లీటర్ నీటిలో మంకోజెట్ 2.5 గ్రాములు లేదా క్లోరోథలామిన్ రెండు గ్రాముల మందును కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. కాండం కుళ్లు: కాండం మొదలు కుళ్లిపోయి మొక్కలు వాలిపోతాయి. దీని నివారణ కు ఒక కిలో ట్రైకోడెర్మా విరిడీ+90 కిలోల పశువుల ఎరువు+ 10 కిలోల వేపపిండి+ కిలో బెల్లం నీటిని 10 రోజులు నిల్వ ఉంచి చెట్ల పాదుల్లో పోయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటర్ నీటిలో రెండు గ్రాముల రెడోమిల్ ఎంజెడ్ కలిపి చెట్ల మొదలు, కాండం తడిసేలా పోయాలి. ఆకుముడత: ఇది వైరస్ వల్ల ఆశిస్తుంది. ఈ వైరస్ ఆశించిన మొక్కల్లో ఆకులు ముడుచుకుపోతాయి. తె గులు సోకితే దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. కీటక నాశినులను ఉపయోగించి ఈ వైరస్‌ను అరికట్టాలి. పండు ఈగ: కాయ పక్వానికి వచ్చినప్పుడు ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ఈగ లార్వాలు కాయలోని గుజ్జును తింటాయి. నివారణకు తోటను శుభ్రంగా ఉంచుకోవాలి. రాలిన పండ్లను ఎప్పటికప్డుపు ఏరివేయాలి. మి.లీ మిథైల్ యూజినాల్, రెండు గ్రాముల కార్బోఫ్యూరాన్, ఒక లీటర్ నీటిలో కలిపి పొలంలో అక్కడక్కడ ఉంచాలి.