క్రికెట్ దేవుడే దిగి వస్తే...
కశ్మీర్‌కు చెందిన పారా క్రికెటర్ అమిర్ హుసేన్ జీవితం వెలిగింది. రెండు చేతులూ లేకపోయినా మెడతో బ్యాట్ పట్టి ఆడే అమిర్ తనను ఇన్‌స్పయిర్ చేసిన క్రికెట్ దేవుడు సచిన్‌ని జీవితంలో కలుస్తాననుకోలేదు. కలిశాడు. అంతేనా? సచిన్ నుంచి ఊహించని బహుమతి అందుకున్నాడు. ఈ వివరం ఏమిటంటే...
సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కుమార్తె సారాతో కశ్మీర్ పర్యటనలో ఉన్నాడు. ఇది అతని తొలి కశ్మీర్ పర్యటన అని భోగట్టా. అక్కడి ‘చార్సో’ అనే ఊళ్లో ఉండే బ్యాట్ల తయారీ కేంద్రాన్ని సచిన్ సందర్శించాడు. అంతే కాదు... అక్కడి ‘బిజ్బెహరా’ ్రపాంతానికి చెందిన పారా క్రికెటర్ అమిర్ హుసేన్‌ను తన హోటల్‌కు పిలిపించుకుని ప్రత్యేకంగా కలిశాడు. అమిర్ హుసేన్ ప్రస్తుతం కశ్మీర్ పారా క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా ఉన్నాడు.
పుట్టుకతో చేతులు లేని అమిర్ తన జీవితంలో పేర్కొన్న నిరాశను సచిన్‌ను చూసి ఇన్‌స్పయిర్ అయి క్రికెటర్ కావడంతో పోగొట్టుకున్నాడు. బ్యాట్‌ను మెడ, భుజాల మధ్య పట్టి అతను క్రికెట్ ఆడతాడు. ఈ స్ఫూర్తిమంతమైన గాధను విన్న సచిన్ తన పర్యటన సందర్భంగా అమిర్ హుసేన్‌ను కలిశాడు. ‘నిన్ను కలవడం సంతోషం’ అని ‘ఎక్స్’లో తానే పోస్ట్ పెట్టాడు. సచిన్‌ని చూడగానే ఇలాంటిది తన జీవితంలో జరిగిందా అన్నట్టుగా భావోద్వేగంతో కదిలిపోయాడు అమిర్. ‘ఇలాగే నువ్వు మమ్మల్ని ఇన్‌స్పయిర్ చేయి’ అని అమిర్‌తో సచిన్ చె΄్పాడు. అంతేనా? తను సంతకం చేసిన బ్యాట్ ఇచ్చి అమిర్‌ని తబ్బిబ్బు చేశాడు.