parishath
-
రేపే పరిషత్ ఫలితాలు : మాక్ కౌంటింగ్ నిర్వహిస్తున్న అధికారులు
-
ఏపీ పరిషత్ ఎన్నికలు : సింగిల్ బెంచ్ ఆదేశాలపై హైకోర్ట్ స్టే
-
నైస్‌గా...వైస్‌కు ఎసరు
– టీడీపీ నేతలను శాసిస్తున్న జంప్ జిలానీలు – వైస్ చైర్మన్‌కు ఆపద్ధర్మ ఛాన్స్ దక్కకుండా కుతంత్రం – చైర్మన్‌తోపాటు రాజీనామా చేయాలని వైస్పై ఒత్తిడి – ఆపద్ధర్మ చైర్మన్‌గా ఏం చేస్తారోనని జ్యోతుల శిబిరంలో భయం – రాజీనామా చేస్తే పదవికి ఎసరొస్తుందేమోనని నళినీకాంత్‌కు దడ – ప్రాంతాల సమీకరణాలు తెరపైకొస్తే ఇబ్బందేనంటూ వైస్ శిబిరంలో ఆందోళన – టీడీపీలో కంటగింపుగా మారిన పెద్దల యత్నాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఫిరాయింపుదారులకు టీడీపీ దాసోహమైపోతోంది. వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చేందుకు జీ హుజూర్ అంటోంది. డబ్బులు ఖర్చు పెట్టుకుని, ఎన్నికల్లో కష్టపడి గెలిచిన వాళ్లను పక్కన పెట్టి జంప్ జిలానీలకు పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే జెడ్పీ చైర్మన్ నామనకు సెగ పెట్టింది. ఇప్పుడేమో వైస్ చైర్మన్‌పై కన్నేసింది. వ్యూహమేంటో తెలియదు గాని చైర్మన్‌తోపాటు వైస్ చైర్మన్ కూడా రాజీనామా చేయాలని పార్టీ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు. ఆపద్ధర్మ చైర్మన్ అవకాశాన్ని వైస్ చైర్మన్‌కు దక్కనివ్వకుండా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. వైస్ ఆపద్ధర్మ చైర్మనైతే అనుకోని పరిణామాలు చోటుచేసుకుని ఏమవుతుందోనన్న భయం జ్యోతుల శిబిరానికి పట్టుకుంది. పెద్దల ఒత్తిడి మేరకు చైర్మన్‌తోపాటు తాను కూడా రాజీనామా చేస్తే తన పోస్టుకు ఎక్కడ ఎసరు వస్తోందనన్న భయం వైస్ చైర్మన్ నళినీ కాంత్‌కు పట్టుకుంది. చైర్మన్‌తోపాటు వైస్ చైర్మన్‌కు సెగ టీడీపీ చేసుకున్న ముందస్తు ఒప్పందం ప్రకారం జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన కుమారుడు నవీన్‌కు జెడ్పీ చైర్మన్ పదవి కట్టబెట్టి సంతృప్తి పరచాలని నిర్ణయించింది. దీంతో నామనకు ఎసరు పెట్టారు. జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి చైర్మన్ పదవిని లాక్కుంటున్నారు. ఇష్టం లేకపోయినప్పటికీ అదిష్టానం ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకుంటున్నారు. దీంతో చైర్మన్ వివాదం సమసిపోయింది. తాజాగా వైస్ చైర్మన్ నళినీకాంత్ కూడా రాజీనామా చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. చైర్మన్ రాజీనామా చేశాక ఆటోమెటిక్‌గా మళ్లీ ఎన్నిక జరిగే వరకు ఆపద్ధర్మ చైర్మన్‌గా వైస్ చైర్మన్ వ్యవహరించాల్సి ఉంటోంది. సాధారణంగా చైర్మన్ రాజీనామా చేసిన వెంటనే ఎన్నిక జరిగే అవకాశం ఉండదు. ఎన్నికల సంఘం మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి. దీనికి కొంత సమయం పడుతుంది. ఈలోపు వైస్ చైర్మన్‌కి అధికారాలొస్తాయి. ఈ అవకాశం వైస్‌కు దక్క కూడదని నళినీ కాంత్‌ను కూడా రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆపద్ధర్మ చైర్మన్‌గా చక్రం తిప్పుతారేమోనన్న భయమా నామన రాజీనామా చేశాక పార్టీలో ఉన్న మిగతా పెద్దల సాయంతో ఆపద్ధర్మ చైర్మన్‌గా వైస్ చక్రం తిప్పి అనుకోని రాజకీయాలు చేస్తే ఎక్కడ ఇబ్బంది వస్తుందనే భయంతో జ్యోతుల శిబిరం వ్యూహాత్మక పావులు కదుపుతూ ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యేను రంగంలోకి దించి వైస్పై ఒత్తిడి చేయిస్తున్నట్టు తెలిసింది. చైర్మన్‌తోపాటు రాజీనామా చేసేస్తే ఆ తర్వాత మళ్లీ ఎన్నికల్లో వైస్ చైర్మన్ అవుతావని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో వైస్ చైర్మన్ ఆచితూచి స్పందించడంతో జిల్లాకు చెందిన ఒక మంత్రి వద్దకు తీసుకెళ్లారు. అంతటితో ఆగకుండా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు వద్దకు తీసుకెళ్లారు. ఆయన కూడా రాజీనామా చేయాలని పట్టుబట్టారు. దీనికి వైస్ చైర్మన్ మధ్యేమార్గంగా స్పందిస్తున్నారు. మళ్లీ వైస్ చైర్మన్ చేస్తానని అదిష్టానం చేత హామీ ఇప్పించాలని తనను ఒత్తిడి చేస్తున్న పెద్దల వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగానే వైస్ చైర్మన్ కూడా రాజీనామా చేసేందుకు అంగీకరించారని, ముహూర్తం పెట్టేసుకుందామని జ్యోతుల శిబిరం జిల్లాకు చెందిన మరో మంత్రి వద్దకు వెళ్లారు. అయితే వీరి ఆలోచనలకు భిన్నంగా సదరు మంత్రి స్పందించారు. చైర్మన్ ఎన్నికకు వైస్ చైర్మన్ రాజీనామా అవసరం లేదని చెప్పి షాకిచ్చినట్టు తెలిసింది. 9న రాజీనామా చేసేసి, 12 ఎన్నికవడం కుదరదని, ఎన్నికల సంఘంతో మాట్లాడి చెబుతానంటూ తనను కలిసిన నేతలకు హితబోధ చేశారు. వలసలకు అంత విలువెందుకు... దశాబ్దాలుగా జెండా మోసిన నేతల కన్న పార్టీలు మారిన నేతలకు దేశం పార్టీ అధిష్టానం అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తోందని మరో వర్గం మథనపడుతోంది. పరిస్థితి చివరికి ఎలా వచ్చిందంటే ఎవరు ఏ విధంగా వ్యవహరించాలన్నది కూడా ఫిరాయింపు నేతలే ఆదేశిస్తున్నారని వీరు వాపోతున్నారు. -
మన్యం మరణాలు పాలకుల వైఫల్యమే
అడవి బిడ్డలంటే అలుసా? చాపరాయి, కాళ్లవాపు మరణాలపై జెడ్పీ విపక్షనేత నిలదీత ఏటా ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోవట్లేదని సభ్యుల ఆవేదన వాడీవేడిగా జిల్లా పరిషత్ సమావేశం భానుగుడి (కాకినాడ) : ఏజెన్సీలో గిరిజనులు మృత్యువాత పడుతున్నారని, ఇటీవల చాపరాయి గ్రామంలో 16 మంది మరణానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని జెడ్పీ ప్రతిపక్షనేత శాఖా ప్రసన్నకుమార్ ఆరోపించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు అధ్యక్షతన బుధవారం జరిగింది. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, ఇన్చార్జి సీఈవోగా జాయింట్ కలెక్టర్ రాధాకృష్ణమూర్తి సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందు శాకా ప్రసన్నకుమార్ చొరవతో చాపరాయిలో ఇటీవల మృతి చెందిన 16 మంది గిరిజనుల ఆత్మశాంతి కోసం సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు. ఏజెన్సీలో ఏటా గిరిపుత్రులు మరణిస్తున్నా వైద్య సిబ్బందిని నియమించడంలో అలసత్వం వహిస్తూ అధికారులతో పనిచేయించుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. గతేడాది కాళ్లవాపు వ్యాధితో 14 మంది గిరిజనులు మరణించారన్నారు. తూతూమంత్ర చర్యలు కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుని గిరిజనుల ప్రాణాలను కాపాడాలని అన్నారు. కేశవరం తదితర గ్రామాల్లో గ్రావెల్ రూపంలో టీడీపీ నేతల జేబుల్లోకి తరలిపోతున్న వందలకోట్ల రూపాయల లెక్క తేల్చాలన్నారు. కూనవరం, రంపచోడవరం, మారేడుమిల్లి, ఎటపాక, రాజవొమ్మంగి మండలాల అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యులు తమ మండలాల్లో నెలకొన్న దుస్థితిని సభ ముందుంచే ప్రయత్నం చేశారు. సీజనల్ వ్యాధులకు గిరిజనులు మృత్యువాత పడుతుంటే పట్టించుకోవడం లేదని అంటుంటే.. ఉప ముఖ్యమంత్రి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. సమస్యల పరిష్కారానికి రూ.26 కోట్లు చాపరాయి సంఘటన నేపథ్యంలో ఏజెన్సీలో సమస్యల పరిష్కారానికి రూ.26 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతున్నామని ఉపముఖ్యమంత్రి రాజప్ప తెలిపారు. ఇందులో రూ.12 కోట్లు ఉపాధి హామీ పథకం కింద, మిగిలినవి సబ్‌ప్లాన్ కింద విడుదల చేస్తామన్నారు. వైద్యుల నియామకానికి కృషి చేస్తామన్నారు. తాగునీటి కోసం గ్రామాల్లో నెలకొన్న ఇబ్బందులు, అన్నఅమృత హస్తం పథకంలో లోపాలు, 3వ విడత రుణమాఫీకి విడుదల కాని సొమ్ము, కొత్త రేషన్ కార్డులు, ఏజెన్సీ మండలాల్లో ప్రజలకు రేషన్ సరుకులు అందకపోవడం, కిరోసిన్ ఇవ్వక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తదితర సమస్యలను జెడ్పీటీసీ సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మద్యం మత్తులో వాహనాన్ని నడుపడానికి వ్యతిరేఖంగా నిర్మించిన లఘు చిత్రాన్ని యూట్యూబ్‌లో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆవిష్కరించారు. ఈ సమావేశానికి శాసనమండలి ఉపా«ధ్యక్షుని హోదాలో తొలిసారిగా హాజరైన రెడ్డి సుబ్రహ్మణ్యంను నామన ఘనంగా సత్కరించారు. జెడ్పీ పాలకమండలి ఏర్పాటై మూడేళ్లు నిండిన నేపథ్యంలో సమర్థవంతంగా పాలన సాగించినందుకు సభ్యులంతా నామనకు అభినందనలు తెలిపారు. ఎంపీ తోటనరసింహం, పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అయితా బత్తుల ఆనందరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పులపర్తి నారాయణమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
హిందూ ధర్మప్రచారంతో మతమార్పిడులు నిరోధించాలి
హిందూ ధార్మిక పరిషత్ చైర్మన్ పీవీఆర్కే ప్రసాద్ అన్నవరం : దళిత వాడల్లో హిందూ ధర్మ ప్రచారం నిర్వహించి బలవంతపు మత మార్పిడులను నిరోధించాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, హిందూ ధార్మిక పరిషత్ చైర్మన్ పీవీఆర్కే ప్రసాద్ కోరారు. జాతీయ ఎస్సీ పరిరక్షణ సంస్థ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సోమవారం రత్నగిరిపై నిర్వహించిన హిందూ మత ప్రచారం సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వాలు నిధులను విడుదల చేసినంత మాత్రాన హిందూ మత ప్రచారం జరగదని ఆయన అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసినపుడే అది సాధ్యమవుతుందన్నారు. మరో ముఖ్య అతిథి శ్రీనివాసానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ దళితవాడలలో రామాలయం నిర్మాణానికి రూ.ఐదు లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని తెలిపారు. ఆ మొత్తంతో బాటు భజనసామగ్రి కూడా కేటాయిస్తారని, వీటితో హిందు ధర్మ ప్రచారం నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ ఐటీ అడ్వైజర్ హనుమాన్ చౌదరి, జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కన్వీనర్ కరణం శ్రీశైలం, హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ రాష్ట్ర చైర్మన్ చవులూరి గవరయ్య, హిందూ ధర్మ పరిరక్ష సమితి అధ్యక్షుడు కర్రి ధర్మారావు, పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన దళితులు పాల్గొన్నారు.