రన్నరప్ సెంథిల్
చెన్నై: పార్క్‌వ్యూ ఓపెన్ స్క్వాష్ టోర్నీలో భారత ప్లేయర్ వెలవన్ సెంథిల్ కుమార్ రన్నరప్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఫైనల్లో సెంథిల్ 8–11, 7–11, 12–10, 8–11తో ఎల్‌షెర్బిని (ఈజిప్టు) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్ చేరే క్రమంలో టాప్ సీడ్, మూడో సీడ్ క్రీడాకారులపై సంచలన విజయాలు సాధించిన సెంథిల్ తుది పోరులో తడబడ్డాడు.