Parliament security breach video
-
పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సెక్యూరిటీ విధులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు అప్పగించింది. పార్లమెంట్ భద్రతలో ఢిల్లీ పోలీసుల స్థానంలో సీఐఎస్ఎఫ్ను కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై కొత్త, పాత పార్లమెంట్ భవనాల భద్రత సీఐఎస్ఎఫ్ పరిధిలోకి వస్తుంది. సీఐఎస్ఎఫ్ అనేది కేంద్ర సాయుధ పోలీసు దళంలో భాగంగా ఉంటుంది. ఇది ప్రస్తుతం ఢిల్లీలోని అనేక కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ భవనాలకు కాపలాగా ఉంటుంది. అణు, ఏరోస్పేస్ డొమైన్, విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రో ఇన్స్టాలేషన్లను కూడా కాపాడుతోంది. పార్లమెంటు భవన సముదాయాన్ని సర్వే చేయాలని అధికారులు ఇప్పటికే ఆదేశించారు. తద్వారా సీఐఎస్ఎఫ్ భద్రత, అగ్నిమాపక విభాగాన్ని సమగ్ర నమూనాలో మోహరించడం సాధ్యమవుతుందని వెల్లడించారు. డిసెంబర్ 13న పార్లమెంట్లో అలజడి జరిగిన విషయం తెలిసిందే. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా నలుగురు దుండగులు లోక్‌సభలోకి ప్రవేశించి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. దీనిపై ప్రతిపక్షాలు కొన్ని రోజులుగా నిరసన చేపడుతున్నాయి. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాలని పట్టబట్టాయి. ఈ క్రమంలో దాదాపు 150 మంది ఎంపీలు ఉభయ సభల నుంచి సస్పెండ్ అయ్యారు. ఇదీ చదవండి: Winter Parliament Session 2023: మరో ఇద్దరు ఎంపీల సస్పెన్షన్ -
పార్లమెంట్ ఘటన.. మాజీ డీఎస్పీ కొడుకు అరెస్ట్?
బెంగళూరు/ఢిల్లీ: పార్లమెంట్‌లోకి చొరబాటు.. లోక్‌సభ దాడి ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన ఓ మాజీ పోలీసు అధికారి కొడుకును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి భాగల్‌కోట్‌లో నివాసంలో అతన్ని ప్రశ్నించిన పోలీసులు.. ఆపై అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. అతని ల్యాప్‌ట్యాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్నవ్యక్తి పేరు సాయికృష్ణ జగలి. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడని పోలీసులు ప్రకటించారు. పార్లమెంట్లో అలజడి సృష్టించిన మనోరంజన్.. సాయికృష్ణ ఇద్దరూ ఇంజినీరింగ్‌లో బ్యాచ్‌మేట్స్.. రూమ్మేట్స్ కూడా. సాయికృష్ణ తండ్రి డీఎస్పీగా రిటైర్ అయిన అధికారిగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సాయికృష్ణ అరెస్ట్‌పై ఆమె సోదరి స్పందన స్పందించారు. తన సోదరుడు ఎలాంటి తప్పు చేయలేదని ఆమె అంటున్నారు. ‘‘ఢిల్లీ పోలీసులు మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమే. వాళ్లు సాయిని ప్రశ్నించారు. ఎంక్వయిరీకి పూర్తిగా మేం సహకరించాం. సాయికృష్ణ ఎలాంటి తప్పు చేయలేదు. మనోరంజన్, సాయి రూమ్మేట్స్ అనే మాట వాస్తవం. ప్రస్తుతం నా సోదరుడు వర్క్‌ఫ్రమ్ హోంలో ఉన్నాడు’’ అని తెలిపారామె. మరోవైపు ఈ కేసుకు సంబంధించి యూపీకి చెందిన ఓ వ్యక్తిని కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. #WATCH | Police have detained a man from Karnataka's Bagalkote, who was accused D. Manoranjan's roommate during their engineering college days, in connection with the Parliament security breach case pic.twitter.com/ZSZj02C9vK — ANI (@ANI) December 21, 2023 పార్లమెంట్ ఘటనలో బుధవారం వరకు.. ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మణిపూర్ ఘటన, దేశంలో నిరుద్యోగం, రైతు సమస్యలు.. వీటన్నింటిపై కేంద్రానికి నిరసన తెలిపేందుకు తాము ఈ పని చేశామని నిందితులు అంటున్నారు. అయితే.. అన్నీ కోణాల్లోనూ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఢిల్లీ పోఈసులు అంటున్నారు. లోక్‌సభలో వెల్‌లోకి దూసుకెళ్లే యత్నం చేయడంతో పాటు కలర్ స్మోక్ షెల్స్ తెరిచి అలజడి రేపినందుకుగానూ మనోరంజన్‌తో పాటు సాగర్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో పార్లమెంట్ బయట నినాదాలు చేస్తూ నిరసన చేసిన అమోల్ షిండే, నీలం ఆజాద్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలపై కేసులు నమోదు అయ్యాక దర్యాప్తులో లలిత్ ఝా అనే వ్యక్తిని(ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు), అతనికి సహకరించిన రాజస్థాన్‌వాసి మహేష్ కునావత్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు
జైపూర్: పార్లమెంట్లో అలజడి సృష్టించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల ఫోన్లను దహనం చేసిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ కాలిపోయి శిథిలావస్థలో ఉన్న సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బట్టలు కాల్చి వేసిన ప్రదేశాన్ని కూడా పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా నిందితులను తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. Parliament security breach: Police recover burnt phone parts of accused in Rajasthan Read @ANI Story | https://t.co/Jpwc9HIqR6#ParliamentSecurityBreach #Parliament #LokSabha #RajyaSabha pic.twitter.com/OkVJKYfMM7 — ANI Digital (@ani_digital) December 17, 2023 పార్లమెంట్లో మొత్తం ఏడుగురు నిందితులు గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. లోక్‌సభ లోపల, పార్లమెంట్ ఆవరణలో పొగ బాంబులతో నిందితులు అరాచకం సృష్టించే పనిచేశారు. ఒంటికి మండే లేపనాలు పూసుకుని ఆత్మాహుతికి పాల్పడటానికి ప్రయత్నించారు. కానీ చివరికి స్మోక్ క్యానిస్టర్లను ప్రయోగించాలని నిర్ణయానికి వచ్చారు. సాగర్ శర్మ, డి.మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి, ప్రధాన నిందితుడు లలిత్ ఝాలను పోలీసు ప్రత్యేక విభాగం తాలూకు కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం విచారిస్తోంది. నిందితులకు ఏడు రోజుల కస్టడీ విధించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వారు ఆశ్రయం పొందిన, కుట్ర పన్నిన ప్రాంతాలకు శుక్రవారం రాత్రి వారిని తీసుకెళ్లారు. అలాగే నిందితులకు లోక్‌సభ పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా స్టేట్మెంట్ను కూడా నమోదు చేయాలని భావిస్తున్నారు. లోక్‌సభలో కలకలం జరిగిన తీరుపై పార్లమెంటు అనుమతితో సీన్ రీ కన్స్ట్రక్ట్ చేసే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. లలిత్‌కు సహకరించిన మహేశ్ కుమావత్, కైలాశ్‌లకు క్లీన్చిట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. లలిత్‌ను బుధవారం పార్లమెంటు ప్రాంగణం నుంచి పారిపోయి అతను రాజస్థాన్‌లో తలదాచుకున్న నగౌర్‌కు కూడా తీసుకెళ్లారు. అక్కడ తనతోపాటు సన్నిహితుల సెల్ ఫోన్లను ధ్వంసం చేశానని లలిత్ చెప్పిన ప్రదేశంలో ఆధారాలు సేకరించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేందుకు దేశంలో అరాచకం సృష్టించాలని భావించినట్లు కీలక సూత్రధారి లలిత్ ఝా కస్టడీ విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులకు తెలిపాడు. లలిత్ ఝా తన ఫోన్‌ను ఢిల్లీ-జైపూర్ సరిహద్దులో విసిరివేసినట్లు అంగీకరించాడు. ఈ కుట్ర ప్రణాళికను అమలు చేయడానికి ముందు ఢిల్లీలో అనేకమార్లు కలిసినట్లు లలిత్ ఝా చెప్పాడు. ఇతర నిందితుల ఫోన్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించాడు. ఇదీ చదవండి: రాజస్థాన్ బీజేపీ కొత్త చీఫ్‌గా కైలాష్ చౌదరి -
లోక్‌సభ అలజడి ఘటన.. మరో అరెస్ట్
ఢిల్లీ: లోక్‌సభ అలజడి ఘటన కేసులో మరో వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన మహేష్ కుమావత్ అనే వ్యక్తిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. గంట సేపు ప్రశ్నించిన అనంతరం.. ఢిల్లీ పోలీసులు అరెస్ట్ ప్రకటన చేశారు. ఈ కుట్రలో మహేష్ కూడా భాగం అయ్యాడని పేర్కొంటూ.. కేసులో ఆరో నిందితుడిగా అతని పేరును చేర్చారు. రాజస్థాన్ నాగౌర్ జిల్లాకు చెందిన మహేష్.. ఘటన జరిగిన తేదీన ఢిల్లీకి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నలుగురిని తొలుత అరెస్ట్ చేశారు. అయితే వాళ్లకు సహకరించడం, వాళ్ల ఫోన్లను ధ్వంసం చేయడం లాంటి అభియోగాల మీద లలిత్ ఝా అనే వ్యక్తిని ఇది వరకే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుట్ర కేసులో లలిత్‌నే కీలక నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరూ లొంగుబాటు గురువారం లలిత్‌తో పాటు మహేష్ కూడా లొంగిపోయినట్లు తెలుస్తోంది. లలిత్ అరెస్ట్‌ను శుక్రవారం పోలీసులు నిర్ధారించగా.. మహేష్‌ను, అతని బంధువు కైలాష్‌ను సైతం ప్రశ్నించిన పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేశారు. అయితే శనివారం మరోసారి మహేష్‌ను ప్రశ్నించిన పోలీసులు ఆ తర్వాతే అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. పార్లమెంటులో ఘటనల అనంతరం లలిత్ ఝా ఢిల్లీ నుంచి రాజస్థాన్‌కు పారిపోయాడు. అక్కడ మహేష్ అతనికి ఆశ్రయం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. నలుగురు నిందితుల ఫోన్లను ధ్వంసం చేసేందుకు లలిత్‌కు మహేష్ సహకరించాడని పోలీసులు నిర్ధారించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో.. లలిత్‌తో పాటు మహేష్‌ను కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఢిల్లీ నుంచి రాజస్థాన్‌లో వాళ్లు తిరిగిన ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు. అలాగే.. పార్లమెంట్‌లోనూ ‘సీన్ రీక్రియేషన్’ చేయనున్నట్లు తెలుస్తోంది. మరో ప్లాన్‌తో.. పార్లమెంట్ శీతాకాల సమాశాల్లో భాగంగా.. డిసెంబర్ 13వ తేదీన లోక్‌సభలో జీరో అవర్ కొనసాగుతుండగా ఒక్కసారిగా అలజడి రేగింది. ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ గ్యాలరీ నుంచి వెల్ వైపుగా దూసుకెళ్లే యత్నం చేశారు. అయితే నిలువరించిన ఎంపీలు.. వాళ్లను చితకబాది భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈలోపు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కలర్ స్మోక్ షెల్స్‌ను ప్రయోగించారు. అదే సమయంలో బయట కూడా ఇద్దరు నిరసన వ్యక్తం చేస్తూ కనిపించారు. వాళ్లనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా నిందితులు విస్తూపోయే వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. లోక్‌సభలో అలజడి ఘటనలో నిందితులు తొలుత తమకు తాము నిప్పంటించుకోవడం వంటి ప్రణాళికలూ రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. చివరకు ఆ ప్రయత్నాలను విరమించి, బుధవారం అమలు చేసిన ప్లాన్‌తో ముందుకెళ్లినట్లు తెలిపారు. మరోవైపు.. ఈ కేసులో ఇద్దరు నిందితులకు విజిటర్ పాసులు జారీ చేసిన భాజపా ఎంపీ ప్రతాప్ సింహా వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేయాలని యోచిస్తోన్నట్లు సమాచారం. -
లోక్‌సభలో అలజడి ఘటన: ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి ఫైర్
ఢిల్లీ: పార్లమెంట్ అలజడి ఘటనపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తప్పుబట్టారు. మహ్మద్ అలీ జిన్నా భావజాలంతో ఓవైసీ ప్రభావితమయ్యారని విమర్శించారు. జిన్నా ఆత్మ ఓవైసీలోకి చొరబడిందని వ్యగ్యాస్త్రాలు సంధించారు. అందుకే ఆయన ఓ వర్గం కోసమే పనిచేస్తారని అన్నారు. నేరస్థుల్లో కూడా మతకోణం చూడటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. లోక్‌సభలో భద్రతా వైఫల్యం కేసుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. ఉగ్రవాదుల మతం, కులం, విశ్వాసాలతో పట్టింపులేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మతపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే ఉగ్రవాదులను ఉగ్రవాదులుగానే గుర్తించామని తెలిపారు. పార్లమెంట్లో అలజడి కేసులో నిందితులు ముస్లింలు అయితే పరిస్థితి ఏంటని ప్రతిపక్షాలు అడగడంపై ఆయన ఆక్షేపించారు. ఉగ్రవాద అంశంలో ప్రతిపక్షాలు మత కోణాన్ని చూస్తున్నారు.. ఈ అంశంపై హోమంత్రి అమిత్ షా స్పందించాలని పట్టుబడుతున్నారు.. ఇలాంటి విషయాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పారిపోయేవారు కాదు అని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. దృఢ సంకల్పంతో ప్రతిస్పందించే వ్యక్తి అని తెలిపారు. పార్లమెంటు చొరబాటుదారులు ముస్లింలైతే పరిస్థితి మరోలా ఉండేదని జేడీయూ, ఏఐఎంఐఎం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఇదీ చదవండి: అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు -
ప్లాన్ A&B.. పార్లమెంట్‌పై దాడిలో సంచలన విషయాలు
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన సూత్రధారిగా పేరుగాంచిన లలిత్ ఝా కీలక విషయాలను పోలీసులకు తెలిపారు. ఈ వ్యవహారంలో వారు రెండు వ్యూహాలను పన్నినట్లు చెప్పాడు. ఒకవేళ ప్లాన్ ఏ విఫలమైతే ప్లాన్ బీని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పాడు. ప్లాన్ ఏ ప్రకారం నీలం, అమోల్ పార్లమెంట్‌లోకి ప్రవేశించకపోతే మరోవైపు నుంచి మహేశ్, కైలాష్ ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు లలిత్ చెప్పాడు. పొగ బాంబులను మండించి నినాదాలు చేయాలని సంకల్పించినట్లు పేర్కొన్నాడు. మహేష్, కైలాష్ గురుగ్రామ్‌లోని తాము నివాసం ఉన్న విశాల్ శర్మ(విక్కి) ఇంటికి చేరుకోవడంలో విఫలమైనందున అమోల్, నీలం ఎలాగైనా పని పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించాడు. పార్లమెంట్లో ఆరుగురు వ్యక్తులు బుధవారం గందరగోళం సృష్టించారు. పక్కా ప్రణాళికతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన నిందితులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు నిందితులు లోక్‌సభ లోపలికి ప్రవేశించి పసుపు రంగు గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు. నిందితులను ఎంపీలే పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ కేసులో నలుగురు నిందితులను ఉపా(దేశ వ్యతిరేక కార్యకాలాపాల చట్టం) చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి జరిగిన రోజే మళ్లీ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్, అమోల్ శిందె, విశాల్, లలిత్, మహేశ్ అనే ఏడుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో మనోరంజన్, సాగర్‌శర్మ లోక్‌సభలోకి చొరబడగా.. నీలమ్, అమోల్ శిందే పార్లమెంట్ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి బస ఏర్పాటు చేసిన విశాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేష్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ ఐదుగురి మొబైల్ ఫోన్స్‌తో పరారైన లలిత్ ఝా ప్రస్తుతం లొంగిపోయాడు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి ఘటన: ప్రతిపక్షాల తీరుపై అమిత్ షా ఫైర్ -
పార్లమెంట్ అలజడి ఘటన: ప్రతిపక్షాల తీరుపై అమిత్ షా ఫైర్
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనలో ప్రతిపక్షాల తీరును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని హితువు పలికారు. 'ఇది తీవ్రమైన సంఘటన. దీనిపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. సహజంగానే లోపం జరిగింది. పార్లమెంట్ భద్రత స్పీకర్ ఆధ్వర్యంలోనే ఉంటుందని అందరికీ తెలుసు. ఈ అంశంపై హోం మంత్రిత్వ శాఖకు స్పీకర్ లేఖ కూడా రాశారు. మేము విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ నివేదికను త్వరలో స్పీకర్‌కు పంపుతాం.' అని అమిత్ షా చెప్పారు. భద్రతా ఉల్లంఘన ఘటనపై దర్యాప్తు చేయడంతోపాటు పార్లమెంట్ భద్రతను పెంచే బాధ్యతను కమిటీకి అప్పగించామని అమిత్ షా చెప్పారు. పార్లమెంట్ భద్రతలో లోపాలు ఉండకూడదని పేర్కొన్న అమిత్ షా.. ఆ ఖాళీలను పూడ్చడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. దీన్ని రాజకీయ అంశంగా మార్చవద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో ఆరుగురు వ్యక్తులు బుధవారం గందరగోళం సృష్టించారు. పక్కా ప్రణాళికతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన నిందితులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు నిందితులు లోక్‌సభ లోపలికి ప్రవేశించి పసుపు రంగు గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు. నిందితులను ఎంపీలే పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ కేసులో నలుగురు నిందితులను ఉపా(దేశ వ్యతిరేక కార్యకాలాపాల చట్టం) చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి జరిగిన రోజే మళ్లీ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: నిందితుల ఎంట్రీ పాస్‌లపై ఎంపీ ప్రతాప్ సింహ వివరణ -
'అప్పటివరకూ సభకు హాజరు కావొద్దు'
-
'అప్పటివరకూ సభకు హాజరు కావొద్దు'
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ సింగ్ మన్ లోక్‌సభకు హాజరుపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆంక్షలు విధించారు. పార్లమెంట్లో దృశ్యాలను లైవ స్ట్రీమింగ్ చేసిన భగవంత్ వ్యవహారంపై స్పీకర్ సోమవారం 9మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఆగస్టు 3లోగా నివేదిక ఇవ్వాలని స్పీకర్... ఆ కమిటీకి సూచించారు. కాగా, విచారణ కమిటీ నివేదిక వచ్చేంతవరకూ సభకు హాజరు కావద్దని స్పీకర్ ఈ సందర్భంగా భగవంత్ మన్ను ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని క్షమాపణతో సరిపెట్టడం కుదరదని స్పష్టం చేశారు. కాగా భగవంత్ మన్ పార్లమెంటు భద్రత వీడియోను చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయటంపై పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్రగందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. పార్లమెంటు భద్రతపై తీసిన వీడియో వివాదాన్ని సీరియస్‌గా తీసుకుని మన్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని పార్టీలన్నీ డిమాండ్ చేశాయి. మరోవైపు తను తీసిన వీడియో దుమారం రేపుతుండటంత మన్ బేషరతు క్షమాపణ కోరారు. అసలు వీడియోలో ఏముంది? 12 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో.. భగవంత్ మన్ పార్లమెంటు ఆవరణలోకి అడుగుపెడుతున్నప్పటి నుంచి వివిధ అంచెల భద్రతను దాటుతూ ఎలా లోపలిదాకా వెళ్లాలో ఆ వీడియోలో చూపించారు. ‘మీరు గతంలో ఎప్పుడూ చూడనిది ఇవాళ చూడబోతున్నారు’ అని స్వయంగా అన్నారు. పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయం ఎలా ఉంటుందో రికార్డు చేశారు. దీన్ని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. దీనిపై వివాదం రేగటంతో.. ఫేస్బుక్ వాల్నుంచీ ఆ వీడియోను తొలగించినట్లు మన్ తెలిపారు.