ప్రత్తికోళ్లలంకలో తీవ్ర ఉద్రిక్తత
ఏలూరు రూరల్ మండలంలోని ప్రత్తికొళ్లలంక గ్రామంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో గ్రామంలో పోలీసులు పికిటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
ఇరు వర్గీయులపై ఇప్పటివరకు 11 కేసులు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. గ్రామంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.