PCC Kisan Cell President kodandareddy
-
రైతుల జీవితాలతో కేసీఆర్ ఆటలు
పీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాల మాఫీకి మూడోవిడత నిధులను విడుదల చేయకుండా రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోందని పీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరువు నుంచి ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 1,000 కోట్లు ఇచ్చినట్లు ఒకసారి, 791 కోట్లు విడుదల చేసినట్టు మరోసారి ప్రకటన చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 1,791 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దేనికోసం ఖర్చు చేసిందని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీని ఆగం చేసిన కేసీఆర్: మల్లు రవి పేదలకు వైద్యంకోసం ఎంతో భరోసాగా ఉన్న ఆరోగ్యశ్రీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగం చేశారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. పుష్కరాలకు, పండుగలకు, పబ్బాలకు, గుళ్లకు, వ్యక్తిగత అవసరాలకు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం పేదల వైద్యానికి 300 కోట్లు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నదని విమర్శించారు. ఆరోగ్యశ్రీని నీరుగారిస్తే పెద్ద ఎత్తున పోరాడుతామన్నారు. -
ముఖ్యమంత్రికే మద్దతు ధర లేదు: కోదండరెడ్డి
సంగారెడ్డి మున్సిపాలిటీ (మెదక్): స్వయంగా తాను సాగుచేసిన పంటకు మద్దతు ధర లేదని సీఎం కేసీఆర్ దిగాలు చెందితే సామాన్య రైతుల పరిస్థితి ఏమిటని పీసీసీ కిసాన్‌సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాల గడువు దగ్గర పడుతున్నందున రైతు రుణమాఫీకి ఈ బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి మెదక్ జిల్లా సంగారెడ్డిలో డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కోదండరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ర్టంలో 23 వేల కోట్ల వ్యవసాయ రుణాలుంటే ప్రభుత్వం మాత్రం రూ.17 వేల కోట్లు మాత్రమే ఉన్నట్టు చెప్పడం సరికాదన్నారు. ఇవేకాకుండా మరో 3.50 లక్షల మంది మహిళా రైతుల పుస్తెల తాళ్లు బ్యాంకుల్లో తాకట్టు పెట్టారన్నారు. బ్యాంకర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగానే తాము ఈ వివరాలను వెల్లడిస్తున్నామన్నారు. అనేక ప్రాజెక్టులకు నిధులిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రైతులకు మొండిచేయి చూపిస్తున్నాయని ఆరోపించారు.