pedarayudu
-
‘పెదరాయుడు’ స్పెషల్ వీడియో
ప్రముఖ నటుడు మోహన్‌బాబు నటించిన సూపర్ హిట్ చిత్రం పెదరాయుడు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1955 జూన్ 15న విడుదలైన ఈ సినిమా మోహన్‌బాబుకు నటుడిగా మంచి గుర్తింపు తీసుకురావడంతో పాటు బాక్సాఫీసు దగ్గర రికార్డులను బద్దలు కొట్టింది. కోలీవుడ్‌లో తెరకెక్కిన నాట్టమై సినిమా రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించారు. పెదరాయుడు సినిమా విడుదలై సోమవారం నాటికి 25 ఏళ్లు అయిన సందర్భంగా చిత్ర బృందానికి మోహన్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ షూటింగ్ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. పెదరాయుడు సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. ‘నటీనటులందరూ బాగా సహకరించారు. ఈ సినిమా విడుదలై అప్పుడే 25 సంవత్సరాలు అయ్యిందా అనిపిస్తుంది. నేను, రజనీకాంత్, భానుప్రియ, బ్రహ్మనందం, బాబూ మోహన్, రవిరాజా,కోటి కలిసి ఘనంగా ఓ వేడుక చేద్దామనిపించింది. దురదృష్టం ఏంటంటే..తొలి క్లాప్ కొట్టిన ఎన్టీఆర్ లేరు. సౌందర్య, కెమెరామెన్ లేరు. కరోనా నేపథ్యంలో గెట్ టు గెదర్ లాంటివి ఉండొద్దు కాబట్టి వేడుక చేయడం లేదు. లేకుంటే చేసేవాణ్ణి’ అన్నారు. ఇక పెదరాయుడి సినిమాకి ముందు రెండు, మూడు పరాజయాలు ఎదుర్కొన్నానని ఆ విషయం రజనీకాంత్‌కి తెలిసి తనకు రూ. 45 లక్షల ఆర్థిక సహాయం అందించారని పేర్కొన్నారు. నిజంగా రజనీ గొప్ప మనిషి అంటూ కొనియాడారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై విడుదలైన ఈ సినిమా మోహన్‌బాబుకు మంచి విజయాన్ని తెచ్చి పెట్టింది. ఈ సినిమాలోని ఆయన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు సైతం పొందారు. (రజనీ.. నాకు దండ వేసి కాళ్లకు దండం పెట్టాడు: మోహన్‌బాబు) -
పెద్ద మనిషి
‘పెదరాయుడు’ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోహన్‌బాబుతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ... ‘పెదరాయుడు’ మూడు విషయాలు చెప్పింది... అన్నదమ్ములు ఎలా ఉండాలి? భార్యాభర్తలు ఎలా మెలగాలి? సమన్యాయం ఎలా పాటించాలి?... ఈ సూత్రాలనే ఈ పెద్దమనిషి పాటిస్తున్నాడు.. నష్టం వస్తే డబ్బు పోతుంది... అప్పుడు జీవితం మొదలుపెట్టిన పూరి గుడిసెకే మళ్లీ వెళ్లొచ్చు.. కానీ, డబ్బు దాచిపెట్టుకుని, మోసం చేస్తే మన గుండెల్లో మనమే ఉండలేం అంటారు ఈ పెద్దమనిషి. ‘పెదరాయుడు’ ప్రారంభమైన వైనం? ‘తమిళంలో ‘నాట్టామై’ అనే చిత్రం విడుదలైంది. చూడరా...’ అని రజనీకాంత్ అంటే. ‘ఎందుకురా’ అన్నా. ‘నువ్వు ముందు చూడరా’ అన్నాడు. చూసి, ‘బాగుంది’ అన్నాను. ‘ఆ చిత్రాన్ని తెలుగులో చేస్తే బాగుంటుంది. తమిళ నిర్మాతతో నువ్వు మాట్లాడుకో. డబ్బు సంగతి నాకు సంబంధం లేదు. కానీ, తెలుగులో తీస్తే మాత్రం గొప్పగా ఆడుతుంది’ అన్నాడు. సరే.. రీమేక్ రైట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత రజనీ, ‘ఈ సినిమాలో ఉన్న పాపారాయుడు పాత్ర నేను వేస్తాను రా’ అన్నాడు. ‘అది చిన్న పాత్ర కదరా..’ అంటే.. ‘కాదురా.. నేను చేస్తా’నంటూ గెటప్ వేసుకొచ్చి మరీ చూపించాడు. మంచి స్నేహానికి ఇంతకన్నా నిదర్శనం ఏం ఉంటుంది? ఈ చిత్రానికి సంబంధించి మర్చిపోలేని విషయం ఏదైనా? ప్రతిరోజూ గుర్తుంచుకోదగ్గదే. షూటింగ్ మొదలుపెట్టిన రోజునే నేను గుర్రం మీద నుంచి పడిపోయాను. నడుముకి దెబ్బలు తగులుతాయని భయపడ్డాను కానీ, మెడకి దెబ్బ తగిలింది. ఇలా షూటింగ్ సమయంలో చాలా గాయాలయ్యాయి. ఎంతో కష్టపడి చేశాం. ఈ చిత్రవిజయానికి కారణాలు? అద్భుతమైన కథ, దానికి తగ్గ నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదరడంవల్లే మంచి విజయం సాధించగలిగాం. చిత్రదర్శకుడు పినిశెట్టి రవిరాజా నాకు బాగా నచ్చిన వ్యక్తి. కెమెరామ్యాన్ పీఎస్ ప్రకాశ్ ఇప్పుడు లేరు. ఆయన వండర్ఫుల్. కోటిగారు మంచి పాటలిచ్చారు. ‘కదిలే కాలమా..’ నేను ఇష్టపడి పెట్టిన పాట. బాగుంటుందో లేదోనని రవిరాజా అంటే, లేదు బాగుంటుందన్నాను. ‘పెదరాయుడు’ సమయంలో మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, సినిమా రిజల్ట్ తేడా అయితే సమస్యలపాలయ్యేవారని కొంతమంది అంటుంటారు? ఈ సినిమా అప్పుడు ఆర్థిక ఇబ్బందులేవీ లేవు. ‘మేజర్ చంద్రకాంత్’ అప్పుడు మాత్రం ఇబ్బందుల్లో ఉన్నాను. దాంతో, ‘ఇప్పుడు నాతో సినిమా ఎందుకు? వద్దు?’ అని అన్నగారు తారక రామారావుగారు అన్నారు. ఆయనతో సినిమా తీయాలనేది నా పట్టుదల. అందుకని, ఆయన చెప్పినా కూడా వినకుండా మొండిగా, పట్టుదలగా ఆ సినిమా తీశాను. ఏ స్థాయిలో ఆడిందో తెలిసిందే. ఆర్థిక లాభాలను కూడా తెచ్చిపెట్టింది. మీ కెరీర్లో ఆర్థికపరమైన రిస్కులు చాలానే తీసుకున్నారు.. నటుడిగా కష్టపడి సంపాదించిన డబ్బుని నిర్మాతగా పోగొట్టుకోవాల్సి వచ్చినప్పుడు భయం అనిపించలేదా? నా కెరీర్ ఆరంభించినప్పట్నుంచీ ఇప్పటివరకూ వెనకడుగు వేసిన సందర్భాలు లేనే లేవు. ‘పూరి గుడిసె నుంచి బంగ్లా స్థాయికి వచ్చాం.. ఒకవేళ అనుకోనిది ఏమైనా జరిగితే మళ్లీ పూరి గుడిసెకే వెళతాం.. అయితే ఏంటి?’ అనుకునేవాణ్ణి. మహా అయితే సంపాదించిన డబ్బు పోతుంది? డబ్బు లేదు అంటారు కానీ.. మోసగాడు అని ఎవరూ అనరు కదా. మీ ముగ్గురు పిల్లలు లక్ష్మీప్రసన్న, విష్ణు, మనోజ్‌లో మీ పట్టుదల, మొండితనం ఎవరికి బాగా వచ్చాయి? విష్ణు ఆచి తూచి అడుగులేస్తాడు. బాగా చదువుకున్నాడు. ఇంటలెక్చువల్. మనోజ్ చాలా సెన్సిటివ్. లక్ష్మీప్రసన్న అచ్చంగా నాలానే. చాలా ముక్కుసూటిగా వ్యవహరిస్తుంది. ఇలాంటివాళ్లు సమాజంలో నెగ్గుకు రావడం కష్టం. ‘పొగరు’ అంటారు. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే, ‘ఫలానావాళ్లని మోసం చేశారు’ అనే నింద మా మీద ఉండదు. మనసులో ఏది అనిపిస్తే, అది మాట్లాడటంవల్ల వివాదాలు వస్తాయి కదా? ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే కాంట్రవర్సీ. ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా మిన్నకుండా ఉండిపోయేవాళ్లు మన్ను తిన్న పాములతో సమానం. అలా ఉండటం మా వల్ల కాదు. బతికినంత కాలం ముక్కుసూటిగా ఉన్నామా? లేదా అన్నదే ముఖ్యం. నాగేశ్వరరావుగారు, రామానాయుడుగారు చనిపోయాక పరిశ్రమ పెద్ద దిక్కు కోల్పోయినట్లుగా అనిపిస్తోంది... పెద్ద దిక్కు కోల్పోయాం... నిజమే. ఇప్పుడు పరిశ్రమ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంది. అందరూ కలిసి కట్టుగా ఉంటే బాగుంటుంది. త్వరలో అది జరుగుతుందని ఆశిస్తున్నా. ఏదైనా సమస్య వస్తే, ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదని చాలామంది అంటున్నారు? నేను చాలా సమస్యలు పరిష్కరిస్తుంటాను. ముఖ్యంగా చిన్న చిత్రాల నిర్మాతలంటే నాకు చాలా అభిమానం. వాళ్ల సమస్యలను పరిష్కరిస్తుంటాను. అలాగే, ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి, పరిష్కారం కోసం వస్తే, నేను సహాయం చేస్తుంటాను. జయాపజయాల విషయంలో మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? దేనికీ స్పందించను. భారతదేశంలో వరుసగా ఎనిమిది విజయాలు సాధించిన హీరో నాకు తెలిసి లేడు. అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, మేజర్ చంద్రకాంత్, పెదరాయుడు, రౌడీగారి పెళ్లాం, కలెక్టర్‌గారు, అడవిలో అన్న, బ్రహ్మ.. ఇలా వరుసగా ఎనిమిది హిట్ సినిమాల్లో నటించి, నిర్మించాను. వరుస ఫ్లాప్స్ కూడా చూశాను. ఇప్పుడు ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. ‘ముఖ్యమంత్రి’ అయిపోయాం అనుకుంటున్నారు. ఏదైనా ఫంక్షన్‌కి భారీగా జనాలు వస్తే, ముఖ్యమంత్రి అయిపోయాం అని భ్రమపడుతున్నారు. కానీ, సినిమా విజయం సాధిస్తే ముఖ్యమంత్రి అయిపోయినట్లా? హిందీ రంగంలో అమితాబ్ బచ్చన్‌కి ఉన్నంత స్టామినా తెలుగులో మీకు ఉంది. మరి... ఆయన చేసినట్లుగా ‘పీకు’లాంటి సినిమాలు మీరు చేయరేం? ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా మెప్పించాను. ‘రాయలసీమ కాబట్టి నాకు భాష తెలియదు.. సంభాషణలు పలకడం తెలియదు’ అన్నారు. కానీ, తెలుగు భాషను ఎంత బ్రహ్మాండంగా పలుకుతానో, సంభాషణలు ఎలా చెపుతానో తెలిసిందే. మనకు మంచి దర్శకులున్నారు. కానీ, కథారచయితలు తక్కువగా ఉన్నారు. అందుకే ‘పీకు’లాంటి సినిమాలు ఇక్కడ రావడంలేదు. వస్తే, తప్పకుండా చేస్తా. రాజకీయాల విషయానికొస్తే.. ఎమ్మెల్యేలను కొనడం అనే ప్రక్రియ ఎలా అనిపిస్తోంది? మీ ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాలోని చాలా విషయాలు ఇప్పుడు నిజంగానే జరుగుతున్నాయి కదా? అవును.. ఓటు వేయొద్దని భయపెడితే తిరగబడి ఓటేస్తున్నారు. ‘అసెంబ్లీ రౌడీ’లో అది చూపించాం. ఇక, ఎమ్మెల్యేలను కొనడం గురించి అంటారా? ప్రస్తుత రాజకీయాల గురించి నేనేం మాట్లాడను. అసలేం జరిగిందో తెలియకుండా మాట్లాడటం సరికాదు. ప్రస్తుతం మీరేదైనా సినిమా చేయాలనుకుంటున్నారా? ఓ మరాఠీ చిత్రం రీమేక్ హక్కులు తీసుకున్నా. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తారు. - డి.జి. భవాని -
‘పెదరాయుడు’ అంత హిట్ కొడుతుంది
షిరిడీ నాథుడి ఆశీస్సులతో విజయాలు సినీ నటుడు మోహన్‌బాబు తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై శుక్రవారం విడుదలైన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా ‘పెదరాయుడు’ అంతటి విజయం సాధిస్తుందని సినీనటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మంచు మోహన్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. తొలి రోజు తిరుపతిలోని బిగ్‌సీ థియేటర్లో పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాన్ని తిలకించారు. అనంతరం బిగ్‌సీ థియేటర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన కుమారులు మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్‌తో కలసి నటించిన పాండవులు పాండవులు తుమ్మెద సినిమాకు మొదటి రోజు ఇంతగా ఆదరణ లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గతంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తో నటించిన పెదరాయుడు సినిమా ఎంతో గొప్ప విజయాన్ని సాధించిందని గుర్తు చేశారు. ఈ సినిమా కూడా పెదరాయుడు సిని మా అంత విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిని మా విజయం సాధించినా, ఓటమి పాలైనా కష్టం మాత్రం ఒక్కటేనని తెలిపారు. నాటి పాండవ వనవాసం సినిమాను గుర్తు చేస్తూ, హాస్యా న్ని పండిస్తూ కుటుంబసమేతంగా చూడగలిగే విధంగా పాండవులు పాండవులు తుమ్మెద చిత్రీకరించినట్టు చెప్పారు. షిరిడీ సాయినాథు ని ఆశీస్సులు, గురువు దాసరి నారాయణరావు దీవెనలతో సొంత బ్యానర్‌పై విడుదల చేసిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఈ సమావేశంలో బిగ్‌సీ థియేటర్ మేనేజర్ సురేష్, విష్ణు, మనోజ్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి, కుమార్, గోపిసాయి, శశి, హేమంత్, ప్రవీణ్ పాల్గొన్నారు. -
‘పెదరాయుడు’ విషయంలోనూ ఇలాగే జరిగింది...
40 ఏళ్ల సినీ ప్రస్థానం.. 500 పైచిలుకు సినిమాలు.. భిన్నమైన పాత్రలు.. నిర్మాతగా 50కి పైన సినిమాలు. ఇంకా రాజకీయవేత్తగా, విద్యా సంస్థల అధినేతగా పలు రంగాల్లో బహుముఖ ప్రజ్ఞ. నిజంగా మోహన్‌బాబు ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన రూటే సెపరేట్ అనిపిస్తుంది. క్రమశిక్షణ, పట్టుదల, కార్యదీక్ష... ఈ మూడింటి వల్లే ఇంత సాధించగలిగానంటారు మోహన్‌బాబు. చాలా విరామం తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రం ‘పాండవులు పాండవులు తుమ్మెద’. శ్రీవాస్ దర్శకత్వంలో మంచు విష్ణు, మనోజ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సంద ర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు మోహన్‌బాబు. ఏ ఒక్కరి వంశమూ తక్కువ కాదు: హీరోగా నటించి చాలాకాలం అయ్యింది. అందుకే ‘రావణ’ సినిమా చేయాలనుకున్నా. అయితే... అది వంద కోట్ల ప్రాజెక్ట్. కాస్త టైమ్ పడుతుంది. అందుకే... ఈ లోపు ఏదైనా మంచి పాత్ర దొరికితే చేద్దాం అనుకుంటున్న టైమ్‌లో... ఈ కథ విన్నాను. బాగా నచ్చింది. నా నుంచి ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. ఈ సినిమాలో నాతో పాటు నలుగురు హీరోలుంటారు. ఆ నలుగురిలో నా కుమారులు విష్ణు, మనోజ్‌లు ఉండటంతో చాలామంది ‘మంచు వంశం’ అని మాట్లాడుతున్నారు. వంశం, వంశపారంపర్యం లాంటి మాటలు నాకస్సలు ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరి వంశం గొప్పదే. ఏ ఒక్కరి వంశం తక్కువది కాదు. ఇక్కడ గొప్పవాళ్లు ఎవరూ ఉండరు. దేవుడొక్కడే గొప్పవాడు. ‘కులం’ అనే రెండక్షరాలను వినడానికి కూడా ఇష్టపడను. ‘మనుషులంతా ఒక్కటే’ అని చెప్పిన అన్న ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తా. టూరిస్ట్ గైడ్ నాయుడిగా: ‘ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో స్ట్రాంగ్.. వెనక్కి తీసుకోవడంలో వీక్’ అనేది ఇందులో నా డైలాగ్. నా పాత్ర స్వభావానికి అద్దం పట్టే డైలాగ్ ఇది. ఈ సినిమాలో నా పాత్ర పేరు ‘టూరిస్ట్‌గైడ్ నాయుడు’. రెండు రకాల షేడ్స్ ఉన్న ఈ తరహా పాత్రను నేనెప్పుడూ చేయలేదు. చాలా రోజుల తర్వాత మంచి డైలాగులు చెప్పే ఛాన్స్ ఈ పాత్రతో నాకు దక్కింది. ప్రేక్షకుల్ని చప్పట్లు కొట్టించేలా నా డైలాగులుంటాయి. ‘జీవితం ఓ పుస్తకం లాంటిది. మొదటి పేజీలో పుట్టుకని, చివరి పేజీలో మరణాన్ని రాసిపెట్టాడు దేవుడు. మధ్యలో పేజీలన్నీ ఖాళీ. అందులో నువ్వు ఏది రాసుకుంటే అదే జీవితం’ అని ఓ సందర్భంలో అంటా. నాకు బాగా నచ్చిన డైలాగ్ ఇది. భార్యాభర్తల అనుబంధంపై ‘పెదరాయుడు’లో ఓ డైలాగ్ చెప్పాను. అంతటి గొప్ప డైలాగ్ ఇందులోనూ ఉంది. కొన్ని డైలాగుల్లో వినిపించే తాత్వికత ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తుంది. ఎన్టీఆర్ అంత పేరు తెచ్చుకుంటాడు మనోజ్: ‘పాండవులు పాండవులు తుమ్మెద’ అనే టైటిల్ ఈ సినిమాకు ఎందుకు పెట్టామో ఇప్పుడే రివీల్ చేయలేను. ఇందులో మనోజ్ ఆడవేషం వేసిన సంగతి తెలిసిందే. ‘నర్తనశాల’లో అన్నగారు చేసిన బృహన్నల పాత్ర ఆయనకు ఎంత పేరు తెచ్చిందో.. ఇందులోని ఆడ వేషం మనోజ్‌కి అంత పేరు తెస్తుంది. మనోజ్ నా బిడ్డ అని ఈ మాట చెప్పడంలేదు. సినిమా చూస్తే మీరూ ఏకీభవిస్తారు. ద్వితీయార్ధమంతా తన భుజస్కందాలపై మోసాడు మనోజ్. ఇది ‘గోల్మాల్-3’ కాదు: రవి అనే వ్యక్తి దగ్గర ఈ కథ కొన్నాం. తర్వాతే తెలిసింది.. ఈ కథకు బాలీవుడ్ ‘గోల్మాల్-3’కి సంబంధం ఉందని. అతణ్ణి అడిగితే.. ‘వాళ్లే నా కథను కాపీ కొట్టారు’ అన్నాడు. అందుకే... కోన వెంకట్, గోపీమోహన్, బి.వి.ఎస్.రవి కలిసి కథలో కొన్ని మార్పులు చేశారు. ఈ విషయంలో నేను చెప్పేదొక్కటే.. ‘గోల్మాల్-3’ చిత్రానికీ మా సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. మళ్లీ చరిత్ర పునరావృతం అవుతుంది: 30 కోట్లు వెచ్చించి ఈ సినిమా తీశాం. కానీ బయ్యర్లు పాతిక కోట్లకే సినిమాను అడిగారు. అందుకే సొంతంగా విడుదల చేస్తున్నాను. ‘పెదరాయుడు’ విషయంలోనూ ఇలాగే జరిగింది. అప్పుడు కూడా సాహసం చేసి సొంతంగా విడుదల చేశాను. ఆ సినిమా చరిత్ర సృష్టించింది. మళ్లీ ఆ చరిత్ర ఈ సినిమా విషయంలో పునరావృతం అవుతుందని నా నమ్మకం. దేనికైనా రెడీ, దూసుకెళ్తా చిత్రాల కంటే అత్యధిక థియేటర్లలో సినిమాను విడుదల చేస్తాం. ప్రభాస్ అంటే ఇష్టం: నేటి హీరోల్లో ఎవరి స్టైల్ వారిది. అందరిలో ప్రభాస్ అంటే ఇష్టం. మేమిద్దరం ‘బావ.. బావ’ అని పిలుచు కుంటాం.