pedda Vagu
-
కింద పెద్దవాగు.. పైన కాకతీయ కాలువ..
మోర్తాడ్(బాల్కొండ): ప్రకృతి అందించిన పెద్దవాగు ప్రవాహానికి బ్రేక్ పడకుండా కాకతీయ కాలువ ద్వారా నీటి తరలింపునకు ఆటంకం లేకుండా అక్విడెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఇంజినీర్ల శ్రమ ఎంతో గొప్పది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా విడుదల చేసే నీటి తరలింపు కోసం తొర్తి, వెంచిర్యాల్ మధ్యలో ఉన్న పెద్దవాగుపై అక్విడెక్ట్‌ను నిర్మించారు. కింద పెద్దవాగు, పైన కాకతీయ కాలువ చూడడానికి ఇదో అద్భుతంగా ఉంటుంది. ఇంజినీర్ల ప్రతిభకు అద్దంపట్టే అక్విడెక్ట్‌ను శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే పూర్తిచేశారు. వర్షాకాలంలో పెద్దవాగు, కాకతీయ కాల్వలు రెండు ప్రవహించే సమయంలో పర్యాటకులను ఈ అక్విడెక్ట్ ఎంతో ఆకర్షిస్తుంది. డంగు సున్నం, కంకర, ఇనుము తది తర సామగ్రిని వినియోగించి అక్విడెక్ట్‌ను పూర్తి చేశారు. కాకతీయ కాలువ ద్వారా విడుదల చేసే నీటి ప్రవాహానికి అక్విడెక్ట్ తట్టుకుని ఉండే విధంగా లీకేజీలను ఏర్పాటు చేశారు. లీకేజీల వల్ల పెద్దవాగులో జలకళ సంతరించుకుని సా గునీటి సమస్యను కొంత మేర తీరుస్తుంది. నీటి తరలింపునకే కాకుండా రవాణాకు ఉపయోగపడే విధంగా అక్విడెక్ట్‌ను నిర్మించారు. అక్విడెక్ట్ కు రెండువైపులా వాహనాలు వెళ్లే విధంగా మా ర్గం ఉంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించేవారికి అక్విడెక్ట్‌ను దాటడం సులభంగానే ఉంది. అక్విడెక్ట్‌కు చిన్న చిన్న మరమ్మతులు అవసరం ఉన్నాయి. అయితే అక్విడెక్ట్ నిర్మించి ఐదు దశాబ్దాలు దాటినా ఈ నిర్మాణం చెక్కు చెదరకుండా ఉండడంతో అప్పటి ఇంజినీర్ల ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుందని చెప్పవచ్చు. టెక్నాలజీ తోడవడంతో అద్భుత ఆవిష్కరణలు దేశ ప్రగతిలో ఇంజినీర్ల పాత్ర చాలాకీలకం. శాస్త్ర, సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, ఇంజినీరింగ్ రంగానికి తోడు కావడంతో సాగునీటి ప్రాజెక్టుల ఆవిష్కరణలో ఆద్భుత ఫలితాలు సాధించుకుంటున్నాం. గోదావరి నదిపై చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయడంలోనే తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. ఇంజినీరింగ్ రంగంలో అద్భుత ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. – మధుకర్ రెడ్డి, ఈఈ నీటిపారుల శాఖ ప్రాజెక్టు డివిజన్, బోధన్ -
పెద్దవాగుకు పోటెత్తిన వరద
అశ్వారావుపేట (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి గ్రామం వద్ద ఉన్న పెద్దవాగుకు వరద నీరు విపరీతంగా చేరుతోంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు పోటెత్తడంతో ఆదివారం ఉదయం పెద్దవాగుకు చెందిన ఒకటవ నంబరు గేటు ఎత్తివేసి 2,820 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ఇంజనీర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు ఎక్కువైతే మళ్లీ గేటు తెరిచి నీటిని కిందికి వదలాలని నిర్ణయించారు. -
జలం.. దక్కని ఫలం!
జహీరాబాద్: మండలంలోని జాడీమల్కాపూర్ గ్రామ శివారులోని పెద్దవాగు జలమంతా పక్క రాష్ట్రానికి పరుగులు పెడుతోంది. సాగునీరు కళ్లముందే కర్ణాటకకు వెళుతున్నా, ఏం చేయలేని దుస్థితి జిల్లా రైతన్నలది. పెద్దవాగుపై ఎత్తి పోతల ప్రాజెక్ట్ నిర్మిస్తే సుమారు రెండు వేల ఎకరాల మేర వ్యవసాయ భూములను సాగులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. అయినా ఈ విషయంలో పాలకులు పట్టించుకోకపోవడంతో సిరులు కురిపించాల్సిన భూములు బీళ్లుగా మారుతున్నాయి. జాడి మల్కాపూర్ గ్రామ శివారులోని తూర్పు దిశలో త మ్మలి గడ్డ ప్రాంతంలో ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు పూర్తిగా అనువుగా ఉన్నప్పటికీ పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. వాగుకు ఇరువైపులా కొండలు ఉండడంతో ప్రాజెక్ట్‌ను నిర్మించి, ఎత్తి పోతల పథకం ద్వారా పొలాలకు నీటిని అందించవచ్చని స్థానిక రైతులు చెబుతున్నారు. ఎత్తిపోతల నిర్మాణం ద్వారా జాడి మల్కాపూర్, సజ్జారావుపేట తండాకు నీరందించే అవకాశం ఉంది. జాడి మల్కాపూర్ గ్రామంలో 3 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, అందులో 1,600 ఎకరాలకు ఎత్తిపోతల పథకం ద్వారా నీరందించే వీలుంది. ఇదే గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చే సజ్జారావు పేట తండాలో 1,500 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, అందులో 700 ఎకరాలకు నీరందించే వీలుంటుంది. ప్రభుత్వం, అధికారులు ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ప్రత్యేక శ్ర ద్ధ తీసుకుని ఎత్తిపోతల ద్వారా పొలాలకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతోంది. జలమంతా వృథాయే కోహీర్ మండలంలోని గొటిగార్‌పల్లి గ్రామంలోనిపెద్దవాగు ప్రాజెక్టు ఒక్క భారీ వర్షానికే పూర్తిగా నిండి.పోతోంది. దీంతో అదనపు జలమంతా జహీరాబాద్ మండలంలోని మల్చల్మ, జాడీమల్కాపూర్ గ్రామాల మీదుగా కర్ణాటక రాష్ట్రంలోకి చేరుకుంటోంది. కర్ణాటకలోని చండ్రంపల్లి ప్రాజెక్ట్‌కు ఇదే వాగు ప్రధాన వనరుగా ఉంటోంది. కృష్ణా బెసిన్ కింద దీనిని గుర్తించారు. వేసవి కాలంలోనూ ఈ వాగు ప్రవహిస్తూ చండ్రంపల్లి ప్రాజెక్టుకు జీవ వనరుగా ఉంది. ఈ వాగుపై ఎత్తి పోతల ప్రాజెక్ట్ నిర్మిస్తే మన జిల్లా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. చుక్క నీటిని కూడా నిల్వచేయలేని పరిస్థితి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం మాట ఎలా ఉన్నా, కనీసం చుక్క నీటిని కూడా సద్వినియోగం చేసుకునే దిశలో అధికార యంత్రాంగం కృషి చేయడం లేదు. పెద్దవాగుపై ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా ఉన్నా, ప్రభుత్వం శ్రద్ధ చూపలేక పోతోంది. నీటిని కొంత మేరకైనా సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా వాగుపై మూడు ప్రాంతాల్లో చెక్‌డ్యాంల నిర్మాణం కోసం నీటి పారుదల శాఖ దశాబ్ద కాలం క్రితం ప్రతిపాదించినా, ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. పెద్ద వాగుపై అవసరం ఉన్న చోట కనీసం చెక్‌డ్యాంలను నిర్మించినా భూగర్భ జలాలు వృద్ధి చెందే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.