peddi reddy ramachandrareddy
-
ఏపీలో సత్ఫలితాలిస్తోన్న మైనింగ్ సంస్కరణలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనింగ్ రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు సత్ఫలితాలిస్తున్నాయి. గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో నూతన విధానాలకు రూపకల్పన చేశారు. పారదర్శకతతో అక్రమాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంతో ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఖనిజ ఆదాయంలో గనుల శాఖ సరికొత్త రికార్డు నెలకొల్పింది. చదవండి: ఏపీ: రిజిస్ట్రేషన్లలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రికార్డ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.3765 కోట్ల ఆదాయం వచ్చింది. 60 శాతం వృద్ధి రేటుతో గత ఏడాది కన్నా అదనంగా రూ.1425 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లీజు అనుమతులు మరింత సరళతరం చేస్తూ ప్రభుత్వం నూతన నిబంధనలను తీసుకొచ్చింది. తద్వారా లీజులు పొంది.. ఏళ్ల తరబడి క్వారింగ్ చేయకుండా నిర్లక్ష్యం చేసే విధానానికి స్వస్తి పలికారు. ముఖ్యంగా లీజుల కేటాయింపులో ప్రభుత్వం అత్యంత పారదర్శకత పాటిస్తుందని గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి చెప్పారు. -
బాబుపై పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
-
చంద్రబాబు ఏం చేసినా కుట్రపూరితంగానే ఉంటుంది
-
ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నాం
-
టీడీపీ, జనసేన, బీజేపీది లోపాయికారీ ఒప్పందం
-
రాష్ట్రం లో చంద్రబాబు, టీడీపీకి నూకలు చెల్లాయి : పెద్దిరెడ్డి
-
సీఎం జగన్ ప్రజల చంతకే పాలనన్ను తిసుకెళ్లారు : మంత్రి పెద్ది రెడ్డి
-
‘ఆ కర్మ మాకు పట్టలేదు..’
సాక్షి, అమరావతి: ఫ్రీ ఇసుక పేరుతో చంద్రబాబు దోచుకున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్వాక్రా మహిళల పేరుతో చంద్రబాబు ఇసుక రీచ్‌ల్లో దోచుకున్నారని మండిపడ్డారు. ‘‘చంద్రబాబులా దిక్కుమాలిన కర్మ మాకు పట్టలేదు. రెండెకరాల నుంచి వేల కోట్ల సంపాదనకు చంద్రబాబు ఎలాంటి అక్రమాలు చేశారో అందరికీ తెలుసు. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని కొడాలి నాని నిప్పులు చెరిగారు. (చదవండి: నిమ్మగడ్డ ఓ అజ్ఞాతవాసి: కొడాలి నాని) నిమ్మగడ్డ రమేష్.. చంద్రబాబు ఏజెంట్ అని మంత్రి దుయ్యబట్టారు. ఎస్ఈసీ.. చంద్రబాబు డైరెక్షన్లోనే నడుస్తున్నారని విమర్శించారు. ‘‘రాజ్యాంగ వ్యవస్థపై మాకు గౌరవం ఉంది. ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎవరిని సంప్రదించారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సిన బాధ్యత నిమ్మగడ్డపై లేదా?. చంద్రబాబు చెబితే ఎన్నికలు వాయిదా వేస్తారా?. చంద్రబాబు తన స్వార్థం కోసం నిమ్మగడ్డను ఎస్ఈసీగా నియమించారు. ఇప్పుడు చంద్రబాబు కోసం నిమ్మగడ్డ పనిచేస్తున్నారంటూ’’ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (చదవండి: ‘అప్పుడాయన ఎక్కడున్నారు..?’) బురద చల్లడం సరికాదు: మంత్రి పెద్దిరెడ్డి చంద్రబాబు ఇసుక దోపిడీపై ఎన్జీటీ భారీ జరిమానా విధించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీలో కొన్ని సవరించామని పేర్కొన్నారు. సబ్‌కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇసుక పాలసీని కేబినెట్ ఆమోదించిందని, ఎన్ఎండీసీ, ఎమ్‌ఎస్‌డీసీ కంపెనీలు ఇసుక సరఫరాకు ముందుకొచ్చాయని ఆయన పేర్కొన్నారు. ‘‘కేంద్ర సంస్థల ఆధ్వర్యంలోనే ఇసుక పంపిణీ జరుగుతుంది. చంద్రబాబు హైదరాబాద్‌లో జూమ్‌లో కూర్చుని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. చంద్రబాబు ఆరోపణలను ఖండిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం:నారాయణ స్వామి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిపై సీఎం వైఎస్ జగన్ అభిప్రాయాలు తీసుకున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లా నేతలతో సీఎం జగన్ సమావేశమయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉన్నామని నారాయణ స్వామిపేర్కొన్నారు. అంతా ఏకాభిప్రాయమే: కాకాని గోవర్థన్‌రెడ్డి తిరుపతి అభ్యర్థి ఎవరైనా మేము కట్టుబడి ఉంటామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థిపై గతంలో వచ్చిన మెజారిటీ కంటే అత్యధికంగా సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భిన్నాభిప్రాయాలు ఏమీ లేవని, అంతా ఏకాభిప్రాయం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. -
దమ్ముంటే నాతో తలపడండి
చౌడేపల్లె: దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో తనపై పోటీకి నిలబడాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. బుధవారం చిత్తూరు జిల్లా మండలంలోని బిల్లేరులో పుంగనూరు, చౌడేపల్లె మండలాలకు చెందిన బూత్‌కమిటీ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యఅతి థిగా హాజరయ్యారు. టీడీపీ నేత కిషోర్‌కుమార్‌రెడ్డి, మంత్రి అమరనాథరెడ్డి తనపై చేస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు. కిషోర్‌కుమార్‌రెడ్డి స్వలాభం కోసమే టీడీపీలో చేరారన్నారు. ఆయన్ను స్మగ్లర్ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో విమర్శించారని.. అలాంటి వ్యక్తిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. మంత్రి అమరనాథరెడ్డిని గెలిపించింది తానేనని తెలిపారు. దివంగత ఎంపీ రామకృష్ణారెడ్డి తనయుడిగా అనేక తప్పుడు పనులు చేసి ఆయన పేరును దిగజార్చుతున్నారని అన్నారు. విమర్శలు చేస్తున్న వారు తనతో పోటీకి సిద్ధమా? అని సవాల్ విసిరారు. బూత్‌కమిటీ సభ్యులు వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ కార్యదర్శులు పెద్దిరెడ్డి, ఎన్.రెడ్డెప్ప, పోకలఅశోక్‌కుమార్, ఎంపీపీలు అంజిబాబు, నరసింహులు, జెడ్పీటీసీలు రుక్మిణమ్మ, వెంకటరెడ్డియాదవ్, నాయకులు గాజుల రామ్మూర్తి, భాస్కర్‌రెడ్డి, మిద్దింటి శంకర్‌నారాయణ, సింగిల్‌విండో చైర్మన్ మునస్వామిరాజు పాల్గొన్నారు. -
స్పీకర్ ఫార్మెట్‌లోనే రాజీనామా చేశారు
రాజీనామా చేశాకే శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైదరాబాద్: ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకే శిల్పా చక్రపాణిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు వైఎస్ఆర్ సీపీ పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. శిల్పా చక్రపాణిరెడ్డి స్పీకర్ ఫార్మెట్‌లోనే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని వెల్లడించారు. సోమవారం ఆయన నంద్యాలలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీలో చేరిన 20మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదని సీఎం చంద్రబాబును పెద్దిరెడ్డి నిలదీశారు. ప్రజాస్వామ్య విలువలకు కట్టబడి పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరితే.. జంతువులను కొన్నట్టు కొన్నారని చంద్రబాబు అన్నారని, మరి ఇక్కడ ఏ జంతువులను కొన్నట్టు ఈ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద చంద్రబాబుకు నమ్మకం లేదని ఆయన దుయ్యబట్టారు. టీడీపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతూ.. ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఎన్నికలంటేనే టీడీపీ నేతలు భయపడుతున్నారని, ఎన్నికలు రాగానే ఆగమేఘాల మీద అభివృద్ధి పనులకు శిలా ఫలకాలు వేసి.. ప్రజలకు తామేదో చేసినట్టు మభ్యపెడుతున్నారని విమర్శించారు.