Peddpalli
-
పెద్దపల్లి: గెలుపు, ఓటములు శాసించేది వారే.. మరి టికెట్ దక్కెనా?
ఈ నియోజకవుర్గంలో పెద్దపల్లి అతిపెద్ద మండలంగా నిలుస్తుంది. పెద్దపల్లి గెలుపోవటములను శాసించేది కూడా ఇదే మండలం. ఈ మండల కేంద్రంలో అత్యధికంగా ముస్లిం మైనారిటీల ఓట్లు ఉంటాయి. ముస్లిం మైనారిటీలు ఏ పార్టీకైతే ఓటు వేస్తారో ఆ పార్టీ విజయం సులభం అవుతుంది. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పెద్దపల్లి నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలను ఏర్పడ్డాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 సార్లు సాధారణ ఎన్నికలు, ఒక ఉప ఎన్నిక జరిగాయి. కాంగ్రెస్ 6, టిడిపి 4, బీఆర్ఎస్ 2, బీజెపి 1, పీడీఎఫ్ 1, స్వతంత్య్ర అభ్యర్థి ఒకసారి గెలుపొందారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గెలుపు ఓటములను శాసించేది బీసీ ఓటర్లు. కానీ చాలా కాలం నుండి ఈ నియోజకవర్గ టికెట్‌ను బీసీలకు కేటాయించాలని అన్ని పార్టీల ఆశావాహుల నుండి ఒత్తిడి వస్తుంది. ఈసారి ఎన్నికల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి బీసీలకు టికెట్ కేటాయించాలని ఆయా పార్టీల అధిష్టానాలకు ఒత్తిళ్లు వస్తున్నాయి. ► బీసీలు : 70% ► ఎస్సీలు: 14% ► ఇతరులు: 16% ఇక్కడ ఎప్పుడు హోరాహోరీ పోటే..! 1983 ఎన్నికలు: ఈ ఎన్నికలలో సంజయ్ విచార్ మంచ్ తరపున పోటీచేసిన గోనె ప్రకాష్ రావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డిపై విజయం సాధించారు. 1984లో గోనె ప్రకాష్ రావు రాజీనామా చేయుటతో 1984లో ఉప ఎన్నికలు జరిగాయి. 1984 ఉప ఎన్నికలు: 1983లో విజయం సాధించిన గోనె ప్రకాష్ రావు (సంజయ్ విచార్ మంచ్) రాజీనామా చేయుటంతో 1984లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేముల రమణయ్యపై విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 2009 ఎన్నికలు: 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయ రమణారావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జి.ముకుందరెడ్డిపై 23,483 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరఫున గీట్ల ముకుందరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుండి వేముల పద్మావతి, లోక్‌సత్తా పార్టి తరఫున శ్రీనివాసరావు పోటీచేశారు. 2014 ఎన్నికలు: 2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన భానుప్రసాదరావుపై 62677 ఓట్ల మెజారిటితో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 2018 ఎన్నికలు: 2018 ఎన్నికలలో తెరాస తరఫున దాసరి మనోహర్ రెడ్డి, భాజపా తరఫున గుజ్జుల రామకృష్ణారెడ్డి, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతకుంట విజయరమణారావు చేశారు. తెరాసకు చెందిన దాసరి మనోహర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతకుంట విజయరమణారావు పై 8,466 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉపాధ్యాయుడి నుంచి ఎమ్మెల్యేగా.. దాసరి మనోహర్ రెడ్డి కరీంనగర్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కూడా. రాజకీయ నాయకుడ. ఈయన ట్రినిటీ విద్యాసంస్థల అధినేతగానూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా కాసులపల్లి గ్రామానికి చెందిన మనోహర్ రెడ్డి ఎంఏ, బీఈడి వరకు అభ్యసించి ప్రారంభంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తర్వాత పలు విద్యాసంస్థలు స్థాపించి నిర్వహిస్తున్నారు. అతని తండ్రి పేరు రామ్ రెడ్డి. దాసరి ఒక వ్యవసాయ నేపథ్య కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చారు. మనోహర్ రెడ్డి ఎమ్.ఎ, బి.ఎడ్ డిగ్రీని కలిగి ఉన్నారు. వ్యవసాయ వృత్తిలో ఉన్నప్పటికీ,సామాజిక సేవలో అతని ఆసక్తి రాజకీయాల్లోకి తన ప్రవేశానికి దారితీసింది. తెలంగాణ తరపున శాసనసభకు పోటీ చేసి గెలిచిన మొదటి వ్యక్తి దాసరి మనోహర్ రెడ్డి. 2009-11 కాలంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2010లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించారు. 2014 శాసనసభ ఎన్నికలలో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెరాస తరపున పోటీచేసి విజయం సాధించారు. దాసరి మనోహర్‌రెడ్డికి ఉన్న ప్రతికూల అంశాల కలగా మిగిలిన పెద్దపల్లి బస్సు డిపో ఎస్సారెస్పి ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందకపోవడం. పెద్దపల్లి, సుల్తానాబాద్ రాజీవ్ రహదారి నుండి పల్లెలకు వెళ్లే ప్రధాన రహదారుల సమస్య. పేదలకు అందని ద్రాక్షల డబల్ బెడ్ రూమ్ ఇండ్లు. మానేరు వాగు పై ఏర్పడ్డ ఇసుక రీచుల నుండి భారీగా ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు. నియోజకవర్గం లో జరిగే ప్రతి అభివృద్ధి పనిలో అన్ని తానై వ్యవహారిస్తారని, సర్పంచులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్ల నిరుత్సాహం. చెరువుల పూడికతీత పేరిట స్థానిక ఇటుక బట్టీలకు మట్టి అమ్ముకుంటున్నారని ఆరోపణలు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులను పక్కన పెట్టి వలస నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారని సీనియర్ నాయకుల అసంతృప్తి. పెద్దపల్లి నియోజకవర్గం లోని రైస్ మిల్లుల నుండి విలువడే కాలుష్య నివారణ కు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ల నిర్మాణంలో అవినీతి ఆరోపణలు. రైస్ మిల్లు వద్ద ముడుపులు తీసుకుని తరుగు పేయుట కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టిన పట్టించుకోలేదని అపవాదు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సానుకూల అంశాలు: పెద్దపల్లి పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడం పెద్దపల్లి పట్టణ సుందరీకరణ లో భాగంగా రోడ్ల విస్తరణ. పెద్దపాలి పట్టణ ప్రజలకు త్రాగు నీటి సమస్య తీర్చడం. సుల్తానాబాద్ పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటు. ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధి కి కృషి. పెద్దపల్లి లో మాతా శిశు ఆసుపత్రి ఏర్పాటు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అభివృద్ధి కి కృషి. పెద్దపల్లి నియోజకవర్గంలో పోటీపడే ప్రధాన పార్టీల నాయకులు. బీఆర్ఎస్ పార్టీ... అధికార బిఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న దాసరి మనోహర్ రెడ్డికే మరోసారి అధిష్టానం టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ.... తెలుగుదేశం పార్టీ నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి బీసీలకు టికెట్ ఇవ్వాలంటూ నియోజకవర్గం లో విస్తృతంగా పర్యటిస్తున్న ఓదెల జడ్పిటిసి సభ్యుడు గంట రాములు, పెద్దపల్లి మాజీ జెడ్పిటిసి గతంలో డిసిసి అధ్యక్షులుగా ఉన్న ఈర్ల కొమురయ్య, తెలుగుదేశం పార్టీలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు సైతం కాంగ్రెస్ లో చేరి పార్టీ నుండి పోటీలో నిలిచే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ.... బిజెపి పార్టీ నుండి తెలుగుదేశం అలయన్స్‌లో గెలిచిన మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, జాతీయ స్థాయి నాయకులతో మంచి సంబంధాలు కలిగిన దుగ్యాల ప్రదీప్ రావు, కాంగ్రెస్ పార్టీ నుండి ఇటీవలే బిజెపిలో చేరిన గొట్టముక్కుల సురేష్ రెడ్డి లు బిజెపి నుండి టికెట్ రేసులో ఉన్నారు. బహుజన సమాజ్ పార్టీ... ఇటీవల బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఎస్పీలో చేరిన దాసరి ఉష ఇప్పటికే గ్రామస్థాయిలో పర్యటిస్తూ బూతు స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భౌగోళిక పరిస్థితులు: ► పెద్దపల్లి నియోజకవర్గం సరిహద్దుల నుండి మానేరు నది ప్రవహిస్తూ పంటలను సస్యశ్యామలం చేస్తుంది. ఇటీవల కాలంలో మానేరు నదిలో ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడంతో స్థానిక రైతులు అధికార పార్టీపై వ్యతిరేక భావనతో ఉన్నారు. ► పెద్దపల్లి నియోజకవర్గానికి మరో వైపు రామగిరి పర్వతాలు మంచి పర్యాటక కేంద్రాలుగా గుర్తింపు కలిగి ఉన్నాయి. ► సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ భ్రమరాంబ సమేత ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తోంది. ► నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచిన సబితం జలపాతం (వాటర్ ఫాల్స్) పర్యాటకులను ఆకర్షిస్తుంది. -
ఇదేం మర్యాద, సీఎం సభకు ఆహ్వానించి.. అడ్డుకుంటారా?
మంథని: పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమీకృత భవన సము దాయం ప్రారంభోత్సవానికి జిల్లా ఎమ్మెల్యేగా ఒకవైపు ప్రభుత్వం నుంచి తనకు ఆహ్వానం పంపి, మరోవైపు కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమని మంథని శాసనసభ్యుడు డి.శ్రీధర్‌బాబు మండిపడ్డారు. సోమవారం పెద్దపల్లిలో సీఎం సభకు వెళ్లకుండా శ్రీధర్‌బాబును మంథనిలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయనను ఇంట్లో నుంచి బయటకు రానీయలేదు. సాయంత్రం తన అనుచరులతో కలసి ఇంటి నుంచి సీఎం సభ కోసం బయలుదేరగా పోలీసులు గేట్లు వేశారు. దీంతో పోలీసుల తీరుపై శ్రీధర్‌బాబు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త మండలాల ఏర్పాటుతోపాటు పలు అంశాలపై ముఖ్యమంత్రికి వినతిపత్రాలు ఇవ్వడానికి సిద్ధం చేసుకున్నానని తెలిపారు. ఇప్పుడు వాటిని సీఎం కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపిస్తానని చెప్పారు. -
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో దారుణం
-
మహిళా రైతుపై వీఆర్వో దాడి
మంథని: పట్టా చేసేందుకు తీసుకున్న డబ్బు తిరిగి అడిగినందుకు ఓ మహిళా రైతులపై వీఆర్వో దాడి చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో గురువారం జరిగింది. నాగెపల్లికి చెందిన తన తండ్రి కొయ్యల దుర్గయ్య పేరిట పట్టా చేస్తానంటే మంథని మండలం అడవిసోమన్‌పల్లి వీఆర్వో సహీరాభానుకు రూ.30 వేలు ఇచ్చినట్లు దుర్గయ్య కూతురు సమ్మక్క తెలిపింది. తన తండ్రి చనిపోయాక తల్లి పేరిట పట్టా చేస్తానని చెప్పడంతో ఏడాదిగా తిరుగుతున్నానని తెలిపింది. దీనిపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తే.. ఆన్లైన్లో దరఖాస్తు చేయమని చెప్పినట్లు వివరించింది. వీఆర్వో ఇంటికి వెళ్లి డబ్బులు అడగ్గానే దాడి చేసిందని చెప్పింది. తాను డబ్బులు తీసుకున్నానన్న ఆరోపణల్లో నిజం లేదని వీఆర్వో తెలిపారు. కాగా, వీరిద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
వామ్మో... దోమలు...
సాక్షి, కోల్‌సిటీ: రామగుండం నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో దోమలు విజృంభిస్తున్నాయి. నగర ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీజన్‌తో సంబంధం లేకుండా దోమలు వ్యాపిస్తున్న తీరుపై నగర ప్రజానికం ఆందోళన చెందుతోంది. దోమల దాడికి వందలాది మంది విషజ్వరాల భారిన పడ్డారు. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతోనే దోమల బెడద ఎక్కువవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. కాలువల్లో పూడికలు తీయకపోడంతో దోమలకు ఆవాస కేంద్రాలుగా మారాయి. దోమల ధాటికి బల్దియా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దోమల నివాస ప్రాంతాలు డ్రెయినేజీల్లో పూడికలు తీయకపోడంతో పారిశుధ్యం పేరుకుపోతోంది. ఎక్కడపడితే అక్కడ మురుగునీరు నిలిచిపోతోంది. ఖాళీ స్థలాలలో పిచ్చిమొక్కలు, చెత్తకుప్పల తొలగింపుపై పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా దోమలకు నివాస ప్రాంతాలుగా మారుతున్నాయి. పట్ట పగలు కూడా ఇళ్ళల్లో ఉండాలంటే దోమల నివారణకు ‘ఆల్ఔట్’ పెట్టుకోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. రాత్రిళ్లు మాత్రమే కుట్టే దోమలు ఇప్పుడు రాత్రి, పగలు తేడా లేకుండా దాడి చేస్తూ కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. పెరుగుతున్న అదనపు ఖర్చు దోమల నివారణ కోసం కూడా ప్రతీ కుటుంబం ఇంటి బడ్జెట్లో అదనంగా కొంత మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. దోమల నివారణకు మస్కిటో కాయల్స్, కెమికెల్స్తోపాటు బ్యాటింగ్ తదితర వాటి కోసం కొంత డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇంటి సరుకులతోపాటు దోమల నివారణకు కూడా అదనపు వ్యయం చేయాల్సి రావడంపై నగర ప్రజలు మండిపడుతున్నారు. కానరాని నివారణ చర్యలు రోజురోజుకు పెరుగుతున్న దోమలను నివారించడంలో అధికారులు మొక్కుబడి చర్యలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిల్వ ఉన్న మురుగు నీటి గుంటల్లో గంభూషియా చేపలను వెయ్యడం లేదు. డ్రెయినేజీల్లో ఆయిల్ బాల్స్, మలాథియిన్ స్ప్రె తదితర నివారణ చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువల్లో మొక్కుబడిగా పూడిక తీయించి చేతులు దుల్పుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పారిశుధ్యం మెరుగుపర్చేందుకు ప్రత్యేక దృష్టిసారించాను. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటు న్నాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు వ్యాపించవు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. – చిట్టూరి రాజమణి, నగర మేయర్ చర్యలు తీసుకుంటున్నాం దోమల నివారణకు నగరంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీ శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మలాథియిన్ స్ప్రె చేయిస్తున్నాం. నీరు నిల్వ ఉన్న గుంటల్లో గంభూషియా చేపలను వేస్తున్నాం. డ్రెయినేజీల్లో ఆయిల్ బాల్స్ వేస్తున్నాం. చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం. – కిషోర్‌కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ -
నిరుద్యోగుల చూపు..ఆ వైపు..
సాక్షి, పెద్దపల్లికమాన్ : పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగుల చూపంతా జిల్లా కేంద్రంలో గల గ్రంథాలయం పై పడింది. ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటివద్దే కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధం కావడం సాధ్యం కాని పరిస్థితి. ఇలా అయితే తమ లక్ష్యం నీరుగారి పోతోందని భావించిన యువత గ్రంథాలయాలకు వచ్చి రోజంతా ఇక్కడే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు మెయిన్స్ పరీక్షలు, దక్షిణ మధ్య రైల్వేలో పోలీసు, బీఎస్ఎన్లో టీటీఎ, ఎల్ఐసీలో పలు ఉద్యోగాలకు పరీక్షలుండడంతో పటు గ్రామాల నుంచి జిల్లా కేంద్ర గ్రంథాలయానికి నిరుద్యోగులు తరలివస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచే.. పెద్దపల్లితో పాటు అప్పన్నపేట బంధంపల్లి, రాఘవపూర్, రంగంపల్లి, హన్మంతునిపేట లాంటి గ్రామాల నుంచి విద్యార్థులు ఉదయం 8గంటల నుండి పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయానికి వస్తున్నారు. ఉద్యోగ సాధనే లక్ష్యంగా నిర్ధేశించుకున్న వీరు రాత్రి 8గంటల వరకు గ్రంథాలయంలోనే పఠనం చేస్తున్నారు. సొంతగా తెచ్చుకున్న పుస్తకాలతో గంటల తరబడి చదువుతున్నారు. అరకొర సౌకర్యాలే.... పట్టణం జిల్లాగా మారిన గ్రంథాలయ అభివృద్ధి జరుగడం లేదు. గత సంవత్సరం కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దాతలు ఇచ్చిన కొన్ని పుస్తకాలు తప్ప కాంపిటిషన్‌కు ఉపయోగపడే పుస్తకాలు లేవని పాఠకులు విమర్శిస్తున్నారు. తెలంగాణ సాహిత్య, ఉద్యమ చరిత్రలతో పాటు అన్ని పోటీ పరీక్షలకు సరిపడ పుస్తకాలను తెప్పించాలని గ్రంథాలయ అధికారికి పలుమార్లు పుస్తకాల లిస్టు ఇచ్చామని నిరుద్యోగ యువత తెలిపారు. ఉన్న అడపాతడపా పుస్తకాలను గ్రంథాలయంలోని వెనుక రూంలో ఉంచి తాళం వేసి ముందుగా ఉండే హాల్‌ను మాత్రమే తెరిచి ఉంచి సిబ్బంది మాత్రం అందుబాటులో ఉంచారని పాఠకులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ డిస్కర్షన్ సాధ్యం.. కానిస్టేబుల్, ఎస్ఐ, రైల్వే ఉద్యోగాలకు సాధన కోసం గత సంవత్సరం నుంచి పెద్దపల్లి గ్రంథాలయానికి వస్తున్నాను. ఇంట్లో చదివేటప్పుడు అనేక సందేహాలు వస్తాయి. కానీ ఇక్కడ ఫ్రెండ్స్‌తో గ్రూప్ డిస్కర్షన్ చేయడం వల్ల అనుమానాలు సులభంగా నివృత్తి చేసుకోవచ్చు. – ఇ.సతీష్, సాగర్‌రోడ్ ఏకాగ్రతకు అనువైన ప్రదేశం డిగ్రీ పూర్తి చేశాను. కానిస్టేబుల్, ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని అర్హత సాధిస్తా. గ్రంథాలయంలో ఎక్కువ మంది చదువటం వల్ల వారిని చూసి చదువాలనే కసితో పాటు ఏకాగ్రత పెరుగుతుంది. అందుకనే ప్రతిరోజు గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటున్న. – రాజుకర్, శాంతినగర్ ప్రశాంతంగా ఉంటుందని.. రైల్వేరిక్రూట్‌మెంట్ బోర్డ్, టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాను. ఇంట్లో చదవాలంటే టీవీ శబ్దాలు, మోటార్ వాహనాల శబ్దాలతో చదువుపై ఏకాగ్రత చేయలేకపోతున్న. ఏకాగ్రతతో చదవాలంటే గ్రంథాలయం ఒక్కటే అనువైన స్థలమని ఇక్కడమిత్రులతో కలిసి చదువుతున్నాను. – ఎ.రమేష్, పెద్దపల్లి పుస్తకాలు అన్నీ తెస్తాం గ్రంథాలయంలో ఇద్దరే ఉద్యోగులు ఉండడం వలన సిబ్బంది కొరత ఉంది. వీరు సమయాన్ని విభజించి షిప్టుల వారిగా పనిచేస్తారు. గ్రంథాలయంలో సిబ్బంది లేనట్లు పాఠకులు నా దృష్టికి తీసుకరాలేదు. అలా జరిగితే మెమోలు జారీ చేసి కఠిన చర్య తీసుకుంటాం. రెండు రోజుల్లో కాంపిటీషన్ పుస్తకాలను తెప్పించి పాఠకులకు అందుబాటులో ఉంచుతాం. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. – గ్రంథాలయ అధికారి, గఫూర్ -
పాత ప్రత్యర్థుల..కొత్త పోరు..
సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో పాత ప్రత్యర్థులే మరోసారి కొత్తగా బరిలోకి దిగుతున్నారు. మూడు నియోజకవర్గాల్లోనూ ప్రధాన పార్టీల అభ్యర్థిత్వాలు ఖరారు కావడంతో ఎన్నికల పోరుపై స్పష్టత వచ్చింది. గత ఎన్నికల్లో పోటీపడిన అభ్యర్థులే మళ్లీ ఈసారీ తలపడుతుండడం విశేషం. ఇందులో కొంతమంది ఇతర పార్టీల నుంచి బరిలోకి దిగుతుంటే, మరికొందరు అదే పార్టీ నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. పాత ప్రత్యర్థుల తాజా పోరు జిల్లాలో ఆసక్తికరంగా మారింది. ‘దుద్దిళ్ల’.. ‘పుట్ట’ల హ్యాట్రిక్ పోటీ... రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంతరించుకున్న మంథనిలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పుట్ట మధులు ముచ్చటగా మూడోసారి తలపడుతున్నారు. 2009 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఎన్నికల గోదాలోకి దిగిన శ్రీధర్‌బాబు, మధులు వరుసగా మూడోసారి పోటీకి సిద్ధమయ్యారు. గత రెండు ఎన్నికల్లోనూ చెరోసారి విజయం సాధించడం గమనార్హం. 2009లో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాంగ్రెస్ నుంచి, పుట్ట మధు ప్రజారాజ్యం నుంచి పోటీపడగా, మధుపై శ్రీధర్‌బాబు విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో శ్రీధర్‌బాబు కాంగ్రెస్ నుంచే పోటీ చేయగా, మధు టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో శ్రీధర్‌బాబుపై పుట్ట మధు గెలుపొందారు. కాగా.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి పుట్ట మధు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు ముచ్చటగా మూడోసారి తలపడుతున్నారు. రామగుండంలో త్రిమూర్తులు.. రామగుండం నియోజకవర్గంలోనూ పాత ప్రత్యర్థులే మరోసారి పోటీకి సై అంటున్నారు. 2014 ఎన్నికల్లో పోటీపడిన సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్, మక్కాన్సింగ్రాజ్ఠాకూర్లు మరోసారి ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. 2014 ఎన్నికల్లో సోమారపు టీఆర్ఎస్ నుంచి, కోరుకంటి ఫార్వర్డ్‌బ్లాక్ నుంచి, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ స్వతంత్రుడిగా పోటీ చేశారు. చందర్‌పై సత్యనారాయణ విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణ, టీఆర్ఎస్ అభ్యర్థిగా కోరుకంటి చందర్ తొలిసారి తలపడ్డారు. ఆ ఎన్నికల్లో సోమారపు సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి, పీఆర్పీ అభ్యర్థి కౌశిక హరిపై గెలుపొందారు. ఈఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణ, కాంగ్రెస్ అభ్యర్థిగా మక్కాన్‌సింగ్‌రాజ్‌ఠాకూర్ పోటీపడుతుండగా, టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థిగా మరోసారి కోరుకంటి చందర్ బరిలో ఉండనున్నారు. ఇందులో సోమారపు, చందర్‌లు మూడోసారి, సోమారపు, చందర్, మక్కాన్‌సింగ్‌లు వరుసగా రెండోసారి పోటీపడుతున్నారు. పెద్దపల్లిలో మాజీల ఫైట్... పెద్దపల్లిలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి మాజీ ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. ఇప్పటికే మూడు పార్టీలు తమ అభ్యర్థిత్వాలు ప్రకటించాయి. టీఆర్ఎస్ నుంచి దాసరి మనోహర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి చింతకుంట విజయరమణారావు, బీజేపీ నుంచి గుజ్జుల రామకృష్ణారెడ్డి పోటీకి దిగుతున్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి దాసరి మనోహర్‌రెడ్డి, టీడీపీ నుంచి చింతకుంట విజయరమణారావు పోటీచేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి టి.భానుప్రసాద్‌రావుపై మనోహర్‌రెడ్డి విజయం సాధించారు. ఈఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి దాసరి మరోసారి బరిలోకి దిగుతుండగా, విజయరమణారావు కాంగ్రెస్ నుంచి పోటీపడుతున్నారు. వరుసగా వీరిరువురు రెండోసారి తలపడుతుండడం విశేషం. మూడు నియోజకవర్గాల్లోనూ ప్రధాన పార్టీల తరపున పాత ప్రత్యర్థులే మరోసారి పోటీపడుతుండడంతో జిల్లాలో రాజకీయం ఆసక్తిగా మారింది. -
మద్యం పట్టివేత
పెద్దపల్లి, న్యూస్‌లైన్ :అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం పెద్దపల్లిలో ఎస్సై కిశోర్ వాహనాలు తనిఖీ చేస్తుండగా 526 క్వాటర్ బాటిళ్ల మధ్యం పట్టుబడింది.ఎలిగేడుకు చెందిన డీ.కొండాల్‌రావు ఈ మద్యాన్ని పెద్దపల్లి నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు. ఎన్నికల నేపథ్యంలో మద్యాన్ని ఇంట్లో నిల్వ చేసి అధిక ధరలకు అమ్ముకునేందుకు తరలిస్తున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పట్టుకున్న టీఆర్ఎస్ నాయకులు కమాన్‌పూర్/మహాముత్తారం : కమాన్‌పూర్, మహాముత్తారం మండలాల్లో ఆదివారం అక్రమంగా సరఫరా చేస్తున్న మద్యాన్ని టీఆర్ఎస్ నాయకులు పట్టుకున్నారు. కమాన్‌పూర్ ఎక్స్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న రూ.10 వేల విలువగల మద్యాన్ని టీఆర్ఎస్ నాయకులు పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్సై అన్వర్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహాముత్తారం మండలం కోనంపేటలో మడప సమ్మయ్య ఇంటివద్ద అక్రమంగా నిల్వ చేసిన 30 బీరు సీసాలను టీఆర్ఎస్ నాయకులు పట్టుకున్నారు. సమ్మయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.4.26లక్షలు పట్టివేత గంభీరావుపేట, న్యూస్‌లైన్: అధికారుల తనిఖీలో రూ. 4.26లక్షలు పట్టుబడ్డాయి. ఆదివారం మండలంలోని కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దులో ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు నాగభూషణం, కుమార్ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ డబ్బు పట్టుబడింది. నిజామాబాద్ జిల్లా బైంసా నుంచి వస్తున్న డీసీఎంలో ఈడబ్బును తరలిస్తుండగా పట్టుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సదరు డబ్బును సీజ్ చేసి ఎస్సై రవీందర్‌కు అప్పగించినట్లు డెప్యూటీ తహశీల్దార్ నాగభూషణం తెలిపారు. రూ.1.10 లక్షలు పట్టివేత కమలాపూర్ : మండలంలోని వంగపల్లిలో ఆదివారం కారులో తరలిస్తున్న రూ.1.10 లక్షల నగదును ఎస్ఎస్టీ-1 టీం అధికారులు పట్టుకున్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన ఈద రంజిత్‌రెడ్డి హన్మకొండ నుంచి కారులో వస్తుండగా, అధికారులు కారు ఆపి తనిఖీ చేయగా రూ.1.10 లక్షలు లభ్యమయ్యాయి. ఆ డబ్బులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో డబ్బులు సీజ్ చేసి ఐటీ శాఖకు అప్పగించారు. రూ. 2.90 లక్షలు పట్టివేత బెజ్జంకి : మండలంలోని గునుకుల కొండాపూర్‌లో ఆదివారం రాత్రి అధికారులు రూ.2.90లక్షలు పట్టుకున్నారు. మాదాపూర్ గ్రామానికి చెందిన భూపెల్లి దిలీప్ కారులో డబ్బులు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. అయితే తాను గుండ్లపల్లిలో పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నానని, ఈడబ్బు పెట్రోల్ విక్రయించగా వచ్చిందేనని అధికారులకు తెలిపాడు. అయితే ఇందుకు ఆధారాలు లేకపోవడంతో డబ్బు సీజ్ చేసి, ఎస్సై ఉపేందర్రావుకు అప్పగించారు