పిల్లల కోసం పీర్లెస్ అసెట్ ఫండ్
మూడు రకాల ఇన్వెస్ట్మెంట్ పథకాల్లో పెట్టుబడి పెడుతూ రిస్క్ తగ్గించే అసెట్ అలకేషన్ ఫండ్‌ను పీర్లెస్ మ్యూచువల్ ఫండ్ ప్రవేశపెట్టింది. పిల్లల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే విధంగా గోల్డ్ ఈటీఎఫ్, డెట్ పథకాలు, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే విధంగా చైల్డ్ ప్లాన్‌ను తిరిగి ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సేకరించిన మొత్తంలో 20% బంగారంలో, 20% ఈక్విటీల్లో, మిగిలిన 60% రుణ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది హైబ్రిడ్ విభాగంలోకి వచ్చే ఓపెన్ ఎండెడ్ పథకం. దీంతో ఈ పథకంలో ఎప్పుడైనా చేరడానికి, ఎప్పుడైనా వైదొలగడానికి అవకాశం ఉంది.