ఆడపిల్ల అని..
అమ్మా.! నవమాసాలు మోసి జన్మనిచ్చినందుకు సంతోషం.. నీ గర్భంలో ఉండి తంతున్నప్పుడు నీవు పడే ఉలికిపాటును చూసి నా రాక కోసం ఆతృత పడుతున్నావని ఆనందపడేదానిని.. నా బంగారు తల్లి అని ముద్దులతో ముంచెత్తుతావని భావించాను.. ఎందుకమ్మా నన్ను పుట్టిన రెండు రోజులకే వదిలించుకున్నావు.. ఆడపిల్లను అనా?
మందమర్రి రూరల్, న్యూస్‌లైన్ : ‘‘అమ్మా నవమాసాలు నన్ను నీ పొత్తిళ్లలో మోశావు. కడుపారా కన్నావు. కానీ నేను పుట్టీ పుట్టగానే ఎందుకమ్మా వదిలివెళ్లావు. జీవితాంతం నన్ను మోయలేనని అనుకున్నావా.. అమ్మ ప్రేమకు దూరం చేశావు. ఆడబిడ్డనై పుట్టడమే నా తప్పా..’’ రెండు రోజుల ఆ చిన్నారికి మాటలొచ్చి ఉంటే ఇలాగే బాధపడేదేమో. కానీ.. ఆలోచించే జ్ఞానం కూడా రాని ఆ పసికందు.. అమ్మకు దూరమై ఇప్పుడు ఏడ్వడం తప్ప ఏమీ చేయలేదు. ఈ హృదయ విదారకర ఘటన సోమవారం మందమర్రి మండలంలో వెలుగుచూసింది.
ఇదీ సంగతి..
మందమర్రిలోని కేకే2 గని సమీపంలోని గఫూర్ దర్గా ద్వారం వద్ద రెండు రోజుల పసికందును ఓ తల్లి వ దిలి వెళ్లింది. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దర్గా పక్కన పత్తి చేనుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న యువకుడు పిండి రమేశ్‌కు ఏడుపు వినిపించడంతో వెళ్లి చూడగా ఆడ శిశువు కనిపించింది. అప్పటికి ఇంకా కళు ్లకూడా తెరవని ఆ పసిపాప శరీరానికి చీమలు పట్టి ఉండడంతో రమేశ్ పాపను చేతుల్లోకి తీసుకొని చీమలను దులిపివేశాడు. విషయూన్ని పోలీసులకు తెలిపాడు. వెంటనే సీఐ రఘనందన్ 108ను పిలిపించి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు. అరుుతే ఈ పాప ఎవరి బిడ్డ అరుు ఉంటుందనే వివరాలు వెలుగుచూడలేదు.
ఎన్ని పథకాలుండి ఏం లాభం
ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇందుకు ఓ కారణం.. ఆయూ పథకాలు ఆచరణకు నోచుకోవడం లేదు. ఆడ పిల్లల్ని పోషించని స్థితిలో చిన్నారులను కడుపులోనే చంపివేయడం, లేదా కన్న తర్వాత చె ట్ల కింద, ముళ్ల పొదల్లో వదలివేయడం జరుగుతోంది. ఆడ పిల్లల్ని అదుకుంటామని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారుతల్లి లాంటి పథకాలను మాతృమూర్తులు విశ్వసించడం లేదో ఏమో గానీ సభ్య సమాజం తలదించుకునేలా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.