pendlimarri
-
వేధింపులు తాళలేక.. విష గుళికలు మింగి!
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ప్రేమ వేధింపులు తాళ్లలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాలోని పెండ్లిమర్రి మండలం మొయిళ్ళ కాల్వం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వరలక్ష్మి (19) ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ కోర్సు చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన సమరసింహారెడ్డి అనే యువకుడు ప్రేమ పేరిట వరలక్ష్మిని వేధిస్తున్నాడు. తాజాగా అతని వేధింపులు ఎక్కువ కావడంతో.. అతని వల్ల తన కుటుంబానికి ఏమైనా హాని జరుగుతుందని వరలక్ష్మి భయపడినట్టు తెలుస్తోంది. ఆ భయంతోనే విషగుళికలు తిని వరలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతురాలి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వరలక్ష్మి భౌతికకాయాన్ని కడపలోని రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
కొత్త ఏడాది పెనువిషాదం : కేక్ కట్ చేసిన కొద్దిసేపటికే..
సాక్షి, కడప : కొండంత సంతోషంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన కొద్దిసేపటికే పెనువిషాదం చోటుచేసుకుందా గ్రామంలో! కేక్ కటింగ్ అనంతరం రోడ్డు పక్కనే చలిమంటవేసుకున్నవారిపైకి మృత్యుశకటం దూసుకొచ్చింది. చిన్నాపెద్ద అంతాకలిపి ఐదుగురు దుర్మరణం చెందారు. వైఎస్సార్‌జిల్లా పెండ్లిమర్రి మండలం ఇందిరానగర్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిందీ సంఘటన. ఈ గ్రామం కడప-పులివెందుల ప్రధాన రహదారిపై ఉంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు : స్థానిక ఇందిరానగర్‌లో నివసిస్తోన్న యువకులు, బారులు.. ఆదివారం అర్ధరాత్రి తర్వాత కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొన్నారు. కడప-పులివెందుల ప్రధాన రహదారి పక్కనే చలిమంటవేసుకుని ముచ్చట్లలో మునిగిపోయారు. అంతలోనే ఓ కారు అదుపుతప్పి.. వారివైపునకు దూసుకొచ్చింది. ఈ ఘటనలో భాస్కర్ (28), గిరి (14), కార్థిక్ (12), లక్ష్మీ నరసింహ (10)లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కారును నడిపిన బ్రహ్మానందరెడ్డి (24) కూడా మృత్యువాత పడ్డారు. మద్యం సేవించి కారు నడపడం వల్లే?: మోతాదుకు మించి మద్యం సేవించి కారు నడపడం వల్లే కొత్త ఏడాది విషాదానికి కారణమని తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాలను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుల బంధువుల ఆర్తనాదాలతో ఆస్పత్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. వైఎస్సార్‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం -
పిడుగు పాటుకు గురై విద్యార్థి మృతి
పెండ్లిమర్రి: వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలంలోని నందిమండలం గ్రామానికి చెందిన చిలేకాంపల్లె ప్రదీప్‌కుమార్‌రెడ్డి(14) అనే విద్యార్థి గురువారం రాత్రి పిడుగుపాటుకు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. నందిమండలానికి చెందిన కొండారెడ్డి, సునీత దంపతుల కుమారుడైన ప్రదీప్ ఇక్కడి జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలతో పదోతరగతి చదువుతున్నాడు. మృతుడి బంధువు నాగేంద్రారెడ్డి(16)కి గాయాలయ్యాయి. ఇతను కడపలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ప్రదీప్‌కుమార్‌రెడ్డి మామ నవనీశ్వర్‌రెడ్డికి సంబంధించిన పొలంలో వేరుశనగ కాయలు అరబోశారు. వర్షం వస్తుడడంతో ముగ్గురు కలిసి పొలం వద్దకు వెళ్లి కాయలు కుప్పకట్టి తిరిగి నడుచుకుంటూ వస్తుడంగా ఒక్కసారిగా ఉరుములతో కూడిన పిడుగు పడింది. దీంతో ప్రదీప్ అక్కడిక్కడే మృతి చెందాడు. నాగేంద్రారెడ్డికి కాళ్లు, చేతులు చచ్చుబడ్డాయి. అతడిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం కోలుకున్నాడు. త్వరలో పబ్లిక్ పరీక్షలు రాయల్సిన సమయంలో ఒక్కగానొక్క కొడుకు మృత్యువాత డడంతో ప్రదీప్ తల్లిదండ్రులు బోరున విలపించారు. మృత దేహానికి కడప రిమ్స్ మార్చురీలో శుక్రవారం పొస్టుమాస్టరం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్ఐ రోషన్ తెలిపారు. -
వ్యక్తి ఆత్మహత్య
పెండ్లిమర్రి: పెండ్లిమర్రి మండలంలోని మమ్ముసిద్దుపల్లె గ్రామానికి చెందిన బండి చంద్రశేఖర్‌రెడ్డి (46) అనే వ్యక్తి శనివారం విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు చంద్రశేఖర్‌రెడ్డి అనారోగ్య సమస్య కారణంగా జీవితంపై విరక్తి చెంది విషపు గుళికలు మింగాడు. కుటుంబ సభ్యులు గమనించి కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వేలూరుకు తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, సింగల్ విండో అధ్యక్షుడు నాగేంద్రారెడ్డి తదితరులు మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రోషన్ తెలిపారు. -
పెళ్లి బృందంపైకి దూసుకెళ్లిన టిప్పర్
-
పెళ్లి బృందంపైకి దూసుకెళ్లిన టిప్పర్
పెండ్లిమర్రి(వైఎస్సార్‌జిల్లా): వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న పెళ్లి బృందంపైకి టిప్పర్ దూసుకెళ్లడంతో.. ఇద్దరు మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని పెండ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి పెళ్లి బృదం పైకి దూసుకెళ్లడంతో.. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఓ గర్భిణి ఉంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కువైట్‌లో పెండ్లిమర్రి మండల వాసి ఆత్మహత్య
పెండ్లిమర్రి: పెండ్లిమర్రి మండలం మమ్ముసిద్దుపల్లె గ్రామానికి చెందిన ఆర్.రామకృష్ణారెడ్డి(45) అనే వ్యక్తి కువైట్‌లో ఉరివేసుకొని అత్మహత్య చేసుకున్నాడు. దాదాపు ఐదు నెలల క్రితం అతను ఆత్మహత్య చేసుకోగా మృతదేహం గురువారం స్వగ్రామానికి చెరింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... రామకృష్ణారెడ్డి 7 నెలల క్రితం జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లాడు. డ్రైవర్‌గా పని ఇప్పిస్తానని నమ్మబలికి ఏజెంట్ పంపగా అక్కడ గొర్రెల కాపరిగా నియమించుకున్నారు. ఆ పని చేయలేక నరకయాతన అనుభవించాడు. ఇంటికి పంపేందుకు అక్కడివారు అంగీకరించలేదు. దీంతో త్రీవ మనస్తాపానికి గురై ఈ ఏడాది జూన్ నెలలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. న్యాయవాది ద్వారా కోర్టులో కేసు వేయడంతో గురువారం మృత దేహాన్ని స్వగ్రామానికి పంపించారు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఏజెంట్ చేసిన మోసానికి ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యులు విలపించారు. మృతదేహాన్ని కడప డీసీసీబీ ఛైర్మన్ అనిల్‌కుమార్‌రెడ్డి సందర్శించి మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
హోంగార్డు వీరంగం
పెండ్లిమర్రి, న్యూస్‌లైన్ : ఓ హోంగార్డు క్రమ శిక్షణ తప్పాడు. వీరంగం సృష్టించాడు. చివరకు భక్తులు తిరగబడటంతో తోక ముడిచాడు. ఈ సంఘటన పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నందిమండలం గ్రామ సమీపంలోని కొండ గంగమ్మ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. బండలాగుడు పోటీలు కూడా నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చిన ఉలవలపల్లెకు చెందిన విశ్వనాథ్‌రెడ్డి అనే భక్తుడు అల్లరి చేస్తుండగా అతన్ని మందలించాల్సిన హోంగార్డు శేఖర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. దురుసుగా మాట్లాడాడు. అంతటితో ఆగక ‘ఖాకీ అంటే ఏమనుకుంటున్నావ్.. నా తడాఖా చూపిస్తా.. అనే లెవల్లో రెచ్చిపోయాడు.దీంతో భయపడిన విశ్వనాథ్‌రెడ్డి తప్పించుకునేందుకు పరుగులు పెట్టాడు. హోంగార్డు కూడా వెంబడించాడు. అయితే అతను దొరకలేదన్న అక్కసుతో లాఠీని విసిరాడు. అది కాళ్లకు తగులుకొని విశ్వనాథరెడ్డి కిందపడిపోయాడు. సంఘటనలో అతని కాలుకు గాయమైంది. ఇదంతా గమనించిన భక్తుల్లో అగ్రహం కట్టలు తెంచుకుంది. హోంగార్డుపై తిరగబడ్డారు. రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో హోంగార్డు తలకు తీవ్ర గాయాలయ్యాయి. బందోబస్తులో ఉన్న పోలీసులు హోంగార్డును వేంపల్లె ప్రభుత్వాస్పత్రికి, విశ్వనాథరెడ్డిని కడప రిమ్స్‌కు తరలించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో హోంగార్డు చర్యలను నిరసిస్తూ బాధితుడు విశ్వనాథరెడ్డి బంధువులు కడప-పులివెందుల ప్రధాన ర హదారిపై బైఠాయించారు. దీంతో రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. కొందరు గ్రామస్తులు, పోలీసులు కల్పించుకుని వారికి సర్దిచెప్పారు. దీంతో వారు రాస్తారోకోను విరమించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థతిని అదుపులోకి తెచ్చారు.