Pension card
-
MLA Gadari Kishor: మీటింగ్‌కు వచ్చినవారికే పింఛన్‌కార్డులు ఇవ్వాలి
శాలిగౌరారం: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ఆసరా పింఛన్ల కార్డులను మీటింగ్‌కు వచ్చినవారికి మాత్రమే పంపిణీ చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ అధికారులను ఆదేశించారు. శనివారం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో పర్యటించిన కిశోర్.. మొదట వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభ శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం నూతన ఆసరా పింఛన్ల మంజూరు కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలుచేస్తుంటే.. లబ్ధిదారులు కనీసం కార్డుల పంపిణీ రోజున కూడా సమావేశాలకు హాజరుకాకపోతే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక పంచాయతీ కార్యదర్శి వెంకన్నపై పరుషపదజాలంతో వ్యాఖ్యలు చేశారు. గ్రామానికి కొత్తగా 152 ఆసరా పింఛన్లు మంజూరైతే మీటింగ్‌కు లబ్ధిదారులందరూ రాలేదని, మీటింగ్‌కు రాని లబ్ధిదారులకు కొత్తపింఛన్ కార్డులను ఇవ్వవద్దని ఎమ్మెల్యే, పంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు. తాను చెప్పిన తర్వాత కూడా కార్డులు పంపిణీ చేస్తే ‘నీ లాగు పగులుద్ది’అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై అటు ప్రభుత్వ ఉద్యోగులు, ఇటు ప్రజలు పెదవివిరుస్తున్నారు. -
మరో విప్లవానికి ఏపీ సర్కార్ నాంది
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది కాలంలోనే సంచలన నిర్ణయాలతో, పలు సంక్షేమ పథకాలతో దేశం దృష్టిని ఆకర్షించారు. తాజాగా.. వైఎస్ జగన్ పాలనలో దేశంలోనే తొలిసారిగా నిర్ధిష్ట కాలపరిమితిలో ప్రభుత్వ సేవలను ప్రారంభించి మరో కొత్త విప్లవానికి ఏపీ ప్రభుత్వం నాంది పలికింది. అందులో భాగంగానే ఇకపై అర్హులైన వారికి నూతన పెన్షన్లను దరఖాస్తు చేసిన పది పనిదినాల్లోనే అందించనున్నారు. కాగా.. శనివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా కొత్త దరఖాస్తుదారులకు పెన్షన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో 96,568 మందిని అర్హులుగా తేల్చారు. పది పనిదినాల్లో ప్రభుత్వ సేవలు అందించాలన్న సీఎం ఆదేశాల మేరకు నేడు జిల్లాల వారీగా పెన్షన్ కార్డులను జారీ చేశారు. తిరస్కరించిన దరఖాస్తులకు కూడా నిర్దిష్టంగా కారణాలను వెల్లడించారు. దీంతో సీఎం వైఎస్ జగన్ సంకల్పించిన అర్హులైన ప్రతి ఒక్కరికీ నిర్ధిష్ట సమయంలో సంక్షేమ పథకాలు అందించాలన్న ఆశయం సాకారమైంది. చదవండి: కోవిడ్ టెస్టులు మరింత పెంచండి -
పెన్షన్ కార్డుల రీవెరిఫికేషన్పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
పింఛను కార్డులపై నా ఫొటో ఏదీ?
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల పింఛనుదారులకు అందజేస్తున్న గుర్తింపు కార్డుల మీద రాష్ర్ట ప్రభుత్వ రాజముద్ర, తన ఫొటో లేకపోవడంపై సీఎం చంద్రబాబునాయుడు అధికారుల మీద అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రాజముద్ర, తన ఫొటో ఉండేలా వెంటనే మార్పు చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు ఆ కార్డులు తీసుకువచ్చి ఈ విషయమై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు వెంటనే ఈ తప్పు సరిదిద్దాలని ఆదేశించారు. శనివారం ఉదయం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ అంశం చర్చకు రావడంతో ఇది వెలుగుచూసింది. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినా వాటిని సమర్థవంతంగా అమలు చేయలేకపోతే ప్రభుత్వానికి ఉపయోగం ఉండదని సమీక్షలో పేర్కొన్న సీఎం.. పింఛను కార్డులను ఉదహరించారని తెలిసింది. -
రంగుల్లో పింఛన్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేయనున్న వివిధ సామాజిక భద్రతా పింఛన్ కార్డులకు రంగులు ఖరారయ్యాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధికారులు నమూనా పింఛన్ కార్డులను 20 రకా ల రంగుల్లో రూపొందించగా వాటిలో మూడింటిని సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. వృద్ధాప్య పింఛన్ కార్డుకు గులాబీ రంగును ఖరారు చేయగా, వికలాంగ పింఛన్ కార్డుకు ఆకుపచ్చ రంగు, వితంతు పింఛన్లకు ఉదారంగు(వయోలెట్)ను ఎంపిక చేశారు. పింఛన్‌కార్డుల జారీకి గడువు సమీపిస్తున్నా, దరఖాస్తుల ప్రక్రియ మాత్రం నత్తనడకనే సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 39.95 లక్షల దరఖాస్తులు రాగా, శుక్రవారం నాటికి 24.30లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఆహారభదత్ర కార్డులకు సంబంధించి మొత్తం 92.22లక్షల దరఖాస్తులకు గాను 22.68 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. -
సమస్యల దర్బార్
సాక్షి, ఒంగోలు: ‘అయ్యా..నా స్థలం కబ్జా చేశారని ఎమ్మార్వోకు అర్జీఇస్తే, పట్టించుకోవడం లేదయ్యా.. రోజూ ఆఫీసుకు తిరుగుతూనే ఉన్నాను.’ ‘సారూ.. కాళ్లులేని అవిటివాడినని కూడా చూడకుండా.. పింఛన్‌కార్డు రాయడానికి పదేపదే అధికారులు తిప్పించుకుంటున్నారండీ..’ అంటూ కలెక్టర్ విజయ్‌కుమార్ వద్దకొచ్చి బాధితులు గోడువెళ్లబోసుకుంటున్నారు. ఒంగోలులో ప్రతీ సోమవారం జరిగే ‘ప్రజాదర్బార్’కు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి తమ సమస్యలను జిల్లా అధికారులకు ఏకరువు పెడుతున్నారు. అధిక శాతం అర్జీల్లో వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ప్రతీ సోమవారం ఆయా తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజాదర్బార్ కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ, బాధితులు అక్కడకు వెళ్లకుండా.. నేరుగా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు: ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలను అందించేందుకు జిల్లా కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్తున్నా ఫలితం ఉండటం లేదు. భూముల అన్యాక్రాంతం, సరిహద్దుల సర్వేకొలతల దరఖాస్తులు, పన్ను మదింపు, పట్టాదారు పాసుపుస్తకాలు తదితర సమస్యలపై అర్జీలు తహశీల్దార్ కార్యాలయాల్లో అధికసంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. కొన్నిచోట్ల సిబ్బంది లంచాల బాగోతంపైనా జిల్లా అధికారులకు ఫిర్యాదులొస్తున్నాయి. జిల్లా అధికారులు తమ దృష్టికి వచ్చిన అర్జీలపై సంతకాలు చేసి మరలా మండల స్థాయి అధికారులకే సిఫార్సులు పంపుతున్నారు. దీంతో బాధితులకు మరిన్ని కొత్తసమస్యలు ఎదురవుతున్నాయని.. తమను నమ్మకుండా నేరుగా జిల్లా అధికారుల దగ్గరకు వెళ్తారా..?అంటూ కక్షసాధింపు చర్యలెదురవుతున్నాయని బాధితులు చెబుతున్నారు. అర్జీలు కొండంత.. పరిష్కారాలు గోరంత.. జిల్లాకేంద్రానికి ఈఏడాది ఆరంభం నుంచి జూన్ మూడోవారం వరకు అందిన అర్జీలను పరిశీలిస్తే.. మొత్తం 24,716 గ్రీవెన్స్‌కు గాను ఇప్పటికీ వాటిల్లో 8090 సమస్యలు మాత్రమే పరిష్కరించారు. 2361 అర్జీలు అధికారుల తిరస్కరణకు గురవగా, పరిష్కార దశలో 5734 దరఖాస్తులున్నాయి. ఇంకా 8492 అర్జీలు పరిష్కారానికి నోచుకోలేదు. ప్రధానంగా ఎస్సీ కార్పొరేషన్‌కు 5742 అర్జీలు రాగా, వాటిల్లో 74 మాత్రమే పరిష్కారమయ్యాయి. డీఆర్డీఏ పరిస్థితి అదేతీరుగా ఉంది. 1195 సమస్యలు అధికారుల దృష్టికిరాగా వాటిల్లో 250 సమస్యలనే పరిష్కరించారు.