
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఏడాది కాలంలోనే సంచలన నిర్ణయాలతో, పలు సంక్షేమ పథకాలతో దేశం దృష్టిని ఆకర్షించారు. తాజాగా.. వైఎస్ జగన్ పాలనలో దేశంలోనే తొలిసారిగా నిర్ధిష్ట కాలపరిమితిలో ప్రభుత్వ సేవలను ప్రారంభించి మరో కొత్త విప్లవానికి ఏపీ ప్రభుత్వం నాంది పలికింది. అందులో భాగంగానే ఇకపై అర్హులైన వారికి నూతన పెన్షన్‌లను దరఖాస్తు చేసిన పది పనిదినాల్లోనే అందించనున్నారు.
కాగా.. శనివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా కొత్త దరఖాస్తుదారులకు పెన్షన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో 96,568 మందిని అర్హులుగా తేల్చారు. పది పనిదినాల్లో ప్రభుత్వ సేవలు అందించాలన్న సీఎం ఆదేశాల మేరకు నేడు జిల్లాల వారీగా పెన్షన్ కార్డులను జారీ చేశారు. తిరస్కరించిన దరఖాస్తులకు కూడా నిర్దిష్టంగా కారణాలను వెల్లడించారు. దీంతో సీఎం వైఎస్ జగన్ సంకల్పించిన అర్హులైన ప్రతి ఒక్కరికీ నిర్ధిష్ట సమయంలో సంక్షేమ పథకాలు అందించాలన్న ఆశయం సాకారమైంది. చదవండి: కోవిడ్ టెస్టులు మరింత పెంచండి