pension list
-
పింఛన్ బెంగతో నలుగురు మృతి
సాక్షి నెట్వర్క్: పింఛన్ మంజూరు కాలేదన్న బెంగతో నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో వేర్వేరుగా నలుగురు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన వికలాంగుడు ఉప్పరి మురళి(40)కి తాజా జాబితాలో పింఛన్ రాలేదు. దీంతో మనోవేదనకు గురై ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పి అంటూ కుప్పుకూలాడు. ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. ఇదే జిల్లా బీర్కూర్‌కు చెందిన సాయవ్వ(70)కు గతంలో పింఛన్ వచ్చేది. తాజా పింఛన్ జాబితాలో పేరు లేకపోవడంతో దిగులు చెంది సోమవారం మృతి చెందింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన లక్ష్మమ్మ(60) కొత్త పింఛన్ కోసం మూడు నెలలుగా మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో అనారోగ్యానికి గురై సోమవారం చనిపోయింది. కరీంనగర్ జిల్లా వెల్గటూర్‌కు చెందిన వికలాంగుడు మూగల ఆశాలు(65)కు కళ్లు కనిపించవు. అయితే, సదరం సర్టిఫికెట్ లేదన్న కారణంగా పింఛన్ మంజూరు కాలేదు. దీంతో మనోవేదనకు గురై సోమవారం గుండెపోటుతో మరణించాడు. -
పింఛను కోసం పండుటాకుల పాట్లు
కర్నూలు(జిల్లా పరిషత్): పెరిగిన పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు పడరాని పాట్లు పడుతున్నారు. ఐదురెట్లు పింఛన్ పెరిగినా కష్టాలు పదిరెట్లు పెరిగాయని లబ్ధిదారులు వాపోతున్నారు. నిబంధనలు పేరుతో చాలామందిని పెన్షన్ జాబితా నుంచి తొలగించారు. పింఛన్ మంజూరైన వారు పోస్టాఫీసు వద్దకు వెళ్లే సరికి డబ్బులు రాలేదని చెప్పడంతో లబ్ధిదారులు ఆవేదనకు గురవుతున్నారు. వేలిముద్రలు సరిగ్గా పడడం లేదని, ఆధార్ నెంబర్ తప్పుగా పడిందని, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదని, వీఆర్వో నంబర్ పడలేదని చెబుతూ లబ్ధిదారుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. గందరగోళంగా మారిన హెల్ప్‌డెస్క్ పింఛన్ రాని, వచ్చినా పలు రకాల కారణాల చేత నగదు అందని వారి కోసం కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయంలో వారం రోజులుగా హెల్ప్‌డెస్క్ నిర్వహిస్తున్నారు. నగర నలుమూలల నుంచి పలు పోస్టాఫీసుల్లో పింఛన్ అందని వారు మున్సిపల్ కార్యాలయం వస్తున్నారు. వీరిలో రెండు, మూడు, నాలుగు, 8 నెలలుగా పింఛన్ అందని వారు అనేక మంది ఉన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ వద్ద ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు ముగ్గురు మున్సిపల్ సిబ్బంది ఉండి లబ్ధిదారుల అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. మొదట్లో 20 నుంచి 30 మంది వరకు హెల్ప్‌డెస్క్‌కు వచ్చేవారు. క్రమేణా వీరి సంఖ్య వందల్లోకి చేరుకుంది. ఒక్కసారిగా వందల కొద్దీ పింఛన్‌దారులు కార్యాలయూనికి చేరుకుని పింఛన్‌పై సిబ్బందికి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సరైన సమాధానం చెప్పేవారే కరువు మున్సిపల్ కార్యాలయానికి వస్తున్న వారికి సరైన సమాధానం చెప్పేవారే కరువయ్యారు. లబ్ధిదారులు తెచ్చిన పత్రాలపై ఇంగ్లీషులో అక్కడి సిబ్బంది రాసిస్తున్నారు. తెలుగేరాని లబ్ధిదారులకు ఇంగ్లీషులో ఏమిరాశారో తెలియక లబ్ధిదారులు బిక్కమొహం వేస్తున్నారు. -
పింఛన్ రాలేదని.. మతిస్థిమితం కోల్పోయాడు
జోగిపేట: పింఛన్ రాలేదన్న బెంగతో మెదక్ జిల్లా ఆందోలు మండలం చింతకుంటలో ఓ వ్యక్తి మతిస్థిమితం కోల్పోయాడు. గ్రామానికి చెందిన నీరుడి దుర్గయ్య వికలాంగుడు. 2 నెలల కిందటి వరకు ప్రభుత్వమిచ్చే వికలాంగ పింఛన్ రూ.500 పొందేవాడు. తాజా పింఛన్ జాబితాలో దుర్గయ్య పేరు లేకపోవడంతో కలత చెంది మతిస్థిమితం కోల్పో యాడు. స్వారూప్స్ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు బుధవారం దుర్గయ్యను హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానకసిక వికలాంగుల ఆస్పత్రిలో చేర్పించారు. పింఛన్ రాదేమోనన్న బెంగతో ముగ్గురి మృతి పింఛన్ రాదేమోనన్న బెంగతో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు వృద్ధులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం ఏన్కతలకు చెందిన కౌడి కిష్టమ్మ(70), మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలం ఆర్కపల్లికి చెందిన దూదేకుల లాల్‌బీ(71), కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెరందిన పొన్నాల గాలవ్వ (80) పింఛన్ రాలేదని మనస్తాపం చెంది మరణించారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య దౌల్తాబాద్: మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం లింగాయపల్లితండాకు చెందిన బానోతు రవి (28) అప్పుల బాధతో మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఎకర పొలంతో పాటు మరో 4 ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. వర్షాభావంతో పంట దెబ్బతినింది. దీంతో బోర్ల కోసం చేసిన రూ.2 లక్షల అప్పు తీర్చే మార్గం కనిపించక తీవ్ర ఆందోళన చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
పింఛన్ బెంగతో ఆగిన గుండెలు
వస్తుందో, రాదోనని ఇద్దరు హఠాన్మరణం నెట్వర్క్: కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో పింఛన్ల జాబితాలో పేరులేదనే బెంగతో ఇద్దరు వృద్ధులు హఠాన్మరణం చెందారు. అయితే, ఈ ఇద్దరి పేర్లు జాబితాలో ఉన్నాయి. కరీంనగర్జిల్లా కమలాపూర్ మండలంలో గూనిపర్తికి చెందిన ముత్యాల ఆగయ్య (76) శనివారం తన ఇంటి సమీపంలో తెలిసినవారితో మాట్లాడుతుండగా.. అక్కడికి అర్హుల జాబితాతో వీఆర్వో వచ్చారు. అందులో తన పేరు లేదని తెలిసి మనోవేదనతో ఇంట్లోకి వెళ్లారు. మరుక్షణమే కుప్పకూలి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతర్‌పల్లికి చెందిన కె. బాలయ్య (80)కు పింఛనే జీవనాధారం. ఆయన భార్య అనసూర్య పక్షవాతంతో మంచంపట్టింది. శుక్రవారం పింఛన్ అర్హుల జాబితాలో పేరులేదని చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు. అర్ధరాత్రి గుండెపోటుతో మరణించాడు. కాగా, పింఛన్ల జాబితాలో పేరు ఉందని తహశీల్దార్ సోమ్లానాయక్ తెలిపారు. -
పెన్షన్ రాలేదని గుండెపోటుతో వృద్ధుడి మృతి
పెన్షన్ల లిస్టులో తన పేరులేదని మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఓ విషాద ఘటన యాదగిరిగుట్ట మండలం దాసరపల్లిలో శనివారం చోటుచేసుకుంది. బాలయ్య అనే 80ఏళ్ల వృద్ధుడు పెన్షన్ రాలేదని మనస్తాపానికి గురయ్యాడు. గ్రామ పంచాయతీ వద్ద అంటించిన లిస్టులో తన పేరులేదని తెలిసి ఆవేదన చెందడంతో ఒక్కసారిగా గుండెనొప్పివచ్చింది. దాంతో ఆ వృద్ధుడు అక్కడే కుప్పకూలిపోయాడు. -
పింఛన్ జాబితాలో పేరు లేదని గుండెపోటుతో మృతి
-
పించను జాబితా నుంచి దూబగుంట రోశమ్మ పేరు తొలగింపు!
నెల్లూరు: నాటి సారా వ్యతిరేకోద్యమం సారధి దూబగుంట రోశమ్మ పేరుని పించను జాబితా నుంచి ఏపి రాష్ట్రప్రభుత్వం తొలగించింది. పించనుకు అర్హురాలు అయినప్పటికీ తమ తల్లి పేరుని తొలగించారని ఆమె కుమారుడు చెప్పారు. తన తల్లి పేరు ఎందుకు తొలగించారని ఆమె కుమారుడు అధికారులను నిలదీశారు. తాము ఏమీ చేయలేమని, కమిటీ నివేదిక ప్రకారం తొలగించినట్లు వారు చెప్పారు. ఫిర్యాదు చేసుకోమని కూడా చెప్పారు. దూబగుంట రోశమ్మ పేరు వింటేనే ఉద్యమకారులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 1993 ప్రాంతంలో రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున సాగిన సారా వ్యతిరేకోద్యమానికి నెల్లూరు జిల్లా కలికిరి మండలం దూబగుంట అనే కుగ్రామంలో శ్రీకారం చుట్టిన ధీరవనిత ఆమె. అప్పట్లో ఏ గ్రామంలోనైనా సరే సారా అమ్ముతున్నట్లు కనపడితే చాలు, మహిళలు అపర కాళికలుగా మారి దుకాణాలను ధ్వంసం చేసేవారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆమెను సన్మానించారు. గిన్నీస్ బుక్ రికార్డు కూడా దక్కింది. ఆమె ఉద్యమ ఫలితంగానే అప్పట్లో ఎన్టీఆర్ తాను గెలిచిన తర్వాత రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధాన్ని విధించారు. అప్పట్లో ఆమెకు ఎంతో సాయం చేస్తామని పాలకులు హామీలిచ్చారు. కాలక్రమంలో వాటిని మరిచిపోయారు. కాలచక్రం గిర్రున తిరిగింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే మద్య నిషేధం కాస్తా ఎత్తివేశారు. సారాపై ప్రజల్లో చైతన్యం నింపి, ఊరు పేరును ఇంటి పేరుగా మార్చుకున్న ఆమె వయసు 86 ఏళ్లు. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో, ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి రోశమ్మకు పించను నిలిపివేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ** -
సారాపై ఉద్యమించిన వ్యక్తికి.. పెన్షన్ కట్!