పింఛన్ మంజూరు కాలేదన్న బెంగతో నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో వేర్వేరుగా నలుగురు మృతి చెందారు.
సాక్షి నెట్‌వర్క్: పింఛన్ మంజూరు కాలేదన్న బెంగతో నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో వేర్వేరుగా నలుగురు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన వికలాంగుడు ఉప్పరి మురళి(40)కి తాజా జాబితాలో పింఛన్ రాలేదు. దీంతో మనోవేదనకు గురై ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పి అంటూ కుప్పుకూలాడు. ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. ఇదే జిల్లా బీర్కూర్‌కు చెందిన సాయవ్వ(70)కు గతంలో పింఛన్ వచ్చేది.
తాజా పింఛన్ జాబితాలో పేరు లేకపోవడంతో దిగులు చెంది సోమవారం మృతి చెందింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన లక్ష్మమ్మ(60) కొత్త పింఛన్ కోసం మూడు నెలలుగా మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో అనారోగ్యానికి గురై సోమవారం చనిపోయింది. కరీంనగర్ జిల్లా వెల్గటూర్‌కు చెందిన వికలాంగుడు మూగల ఆశాలు(65)కు కళ్లు కనిపించవు. అయితే, సదరం సర్టిఫికెట్ లేదన్న కారణంగా పింఛన్ మంజూరు కాలేదు. దీంతో మనోవేదనకు గురై సోమవారం గుండెపోటుతో మరణించాడు.