percentage of votes
-
ECI: పోలింగ్ 65.79 శాతం
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 65.79 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. పోస్టల్ బ్యాలెట్లను ఇంకా ఇందులో కలపని కారణంగా తుది పోలింగ్ శాతంలో మార్పులు ఉంటాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించడం తెల్సిందే. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 67.40 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలనాటికి దేశవ్యాప్తంగా 91.20 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఆనాడు వారిలో 61.50 కోట్ల మంది మాత్రమే ఓటేశారు. ఇటీవల ముగిసిన 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 96.88 కోట్లకు పెరగడం విశేషం. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి విడివిడిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, మొత్తంగా ఓటింగ్ శాతాల సమగ్ర వివరాలు తమకు అందాక అందరికీ అందుబాటులోకి తెస్తామని ఈసీ గురువారం విడుదలచేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. -
84.93 శాతం పోలింగ్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ శుక్రవారం బోధన్ డివిజన్లోని ఆరు మండలాల పరిధిలో పూర్తయింది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. అనంతరం అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. ఉదయం పలుచోట్ల చిరు జల్లులు కురవడంతో ప్రారంభంలో పోలింగ్ ప్రక్రియ కాస్త మందకొడిగా సాగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఓటర్ల రాక పెరగడంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి షురువై వేగం పుంజుకుంది. రెండు గంటల్లోనే దాదాపు 40 శాతం పోలింగ్ పెరగడం గమనార్హం. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలన్నీ దాదాపు వెలవెల బోయాయి. పోలింగ్ ముగిసే సమయానికి 84.93 శాతం నమోదైంది. పోలింగ్ పరిశీలించిన కలెక్టర్ పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు పరిశీలించారు. బోధన్, ఎడపల్లి, రెంజల్ తదితర మండలా ల్లోని పలు గ్రామాల్లో జరుగుతున్న పో లింగ్ కేంద్రాలను ఆయన సందర్శించా రు. కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకు అవసరమైన ఏర్పా ట్లు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఉప సర్పంచ్ల ఎన్నిక ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. రెంజల్ మండలం కూనేపల్లి, వీరన్నగుట్ట పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య సందర్శించారు. సీపీ కార్తికేయ కూడా పలు పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తును పరిశీలించారు. తొలి విడత కంటే అధికంగా.. తొలి విడత ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లోని 141 జీపీలకు జరిగిన పోలింగ్ 78.56 శాతం కాగా, రెండో విడతలో పోలింగ్ శాతం కాస్త పెరిగింది. సుమారు 6.37 శాతం అధికంగా పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గంలో 68.23 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే బాన్సువాడ నియోజకవర్గంలో 83.66 శాతం పోలింగ్ జరిగింది. కానీ ఈ పంచాయతీ ఎన్నికల విషయాని కి వచ్చే సరికి 84.93 శాతానికి పెరగడం గమనా ర్హం. పంచాయతీల పరిధి చిన్నగా ఉండటంతో అభ్యర్థులు తమ విజయం కోసం ఓటర్లను కేంద్రాలకు రప్పించేందు కు ప్రత్యేక ఆసక్తి చూపారు. ఓటర్లందరిని భాగస్వామ్యం చేసేందుకు అధికార యం త్రాంగం చేపట్టిన చర్యలు పోలింగ్ శాతం పెరగడానికి దోహదం చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జల్లపల్లికి మూడో విడతలో.. కోటగిరి మండలం జల్లపల్లిలో పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. సర్పంచ్ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులో పొరపా ట్లు జరగడంతో అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు.సర్పంచ్‌తో పాటు, వార్డు సభ్యుల ఎన్నికలను కూడా నిలిపివేశారు. మూడో విడత నిజామాబాద్ డివిజన్లోని గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించే రోజున జల్లపల్లికి కూడా పోలింగ్ జరిపే అవకాశాలున్నాయి. -
ప్రాంతీయ పార్టీల్లో వైఎస్సార్సీపీదే హవా
ఒంటరిగా పోటీ చేసి అత్యధిక శాతం ఓట్లను సాధించిన పార్టీగా రికార్డు అన్నాడీఎంకే, బీజేడీ, తృణమూల్ కంటే అత్యధికం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనే అరుదైన గౌరవం సాధించింది. ఈ ఎన్నికల్లో దేశంలోని మొత్తం ప్రాంతీయ పార్టీల్లో సొంత రాష్ట్రంలో ఎక్కువ ఓట్ల శాతం సాధించిన పార్టీగా వైఎస్సార్సీపీ రికార్డు సృష్టించింది. పొత్తులేవీ లేకుండా ఒంటరిగా పోటీ చేసిన రాజకీయ పార్టీల్లో అత్యధిక శాతం ఓట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించింది. లోక్‌సభలో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకున్న అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ వంటి పార్టీలు వారి సొంత రాష్ట్రంలో తెచ్చుకున్న ఓట్ల శాతం కంటే వైఎస్సార్ కాంగ్రెస్ సీమాంధ్ర ప్రాంతంలో సాధించిన ఓట్ల శాతం ఎక్కువ. ఈ ఎన్నికల్లో లోక్‌సభలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న మొదటి పది పార్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా స్థానం దక్కింది. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ప్రాంతీయ పార్టీల్లో ఏఐడీఎంకే 37 స్థానాలతో మూడో స్థానం, 34 సీట్లతో తృణమూల్ కాంగ్రెస్ నాలుగో స్థానంలో నిలిచాయి. ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్‌కు 20, మహారాష్ట్రకు చెందిన శివసేనకు 18, టీడీపీ 16, టీఆర్ఎస్ 11 సీట్లు వచ్చాయి. తొమ్మిది సీట్లతో జాతీయ పార్టీ సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. రెండూ సమానంగా నిలిచాయి. ఓట్ల శాతం విషయానికొస్తే.. ప్రాంతీయ పార్టీల్లో అన్నాడీఎంకే తమిళనాడులో సాధించిన ఓట్ల కన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో 0.1 శాతం అదనంగా ఓట్లు తెచ్చుకోగలిగింది. అన్నాడీఎంకేకు తమిళనాడులో 44. 3% ఓట్లు రాగా, బిజూ జనతాదళ్‌కు ఒడిశా రాష్ట్రంలో 44.1% ఓట్లు, తృణమూల్‌కు పశ్చిమబెంగాల్లో 39.3% ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో 44.4% ఓట్లను సాధించి రికార్డు సృష్టించింది. తెలంగాణలో విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ సైతం తెలంగాణ ప్రాంతంలో పోలైన మొత్తం ఓట్లలో కేవలం 34.75% ఓట్లనే సాధించగలిగింది. చివరకు సీమాంధ్రలో అధిక స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీకి కూడా.. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లకన్నా దాదాపు 4% తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే బీజేపీ- టీడీపీ కూటమిగా పోటీ చేయడం ద్వారా ఆ రెండు పార్టీలు కలిసి వైఎస్సార్ కాంగ్రెస్‌కన్నా 2% అదనంగా ఓట్లను తెచ్చుకోగలిగాయి. ఉత్తరప్రదేశ్‌లో బలీయంగా ఉన్న ప్రాంతీయ పార్టీలైన బీఎస్పీ, ఎస్పీలు ఈ ఎన్నికల్లో వరుసగా 19.6%, 22.3% ఓట్లు మాత్రమే సాధించగలిగాయి.