కాపీయే కాదు... హిట్టూ కొట్టారు!
సీరియల్ అనుకోండి... కథ, కథనాలు కాపీ కొడతారు. గేమ్ షోలు అనుకోండి... కాన్సెప్ట్ కాపీ కొడతారు. కానీ మరీ టైటిల్ కూడా కాపీ కొట్టాలా? క్యాప్షన్‌ని కూడా కాపీ కొట్టాలా? ఇలాగే అడగాలనిపిస్తుంది... ‘13’ షో నిర్వాహకుల్ని. ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోంకే ఖిలాడీ లాంటి కార్యక్రమాల కాన్సెప్ట్ మనకు తెలిసిందే. పార్టిసిపెంట్స్‌తో రకరకాల సాహసాలు చేయిస్తుంటారు. తద్వారా మనల్ని ఎంటర్టైన్ చేయాలని చూస్తుంటారు. ‘13’ అనే షో కూడా అలాంటిదే. ‘ఫియర్ ఈజ్ రియల్... రిస్క్ ఈజ్ థ్రిల్’ అనే క్యాప్షన్‌తో ప్రసారమవుతోన్న ఈ షో అందరినీ బాగానే ఆకట్టుకుంటోంది.
అయితే దీన్ని ఓ ఇంగ్లిష్ షో నుంచి తీసుకున్నారు. కాన్సెప్ట్ కొట్టేస్తే ఫర్వాలేదు. కానీ అక్కడున్న టైటిలే పెట్టారు ‘13’ అని. అక్కడున్న క్యాప్షనే వాడుకున్నారు... ‘ఫియర్ ఈజ్ రియల్’ అని. అయితే కాపీ కొట్టినా హిట్టు కూడా కొట్టడం గురించి మాత్రం మనం చెప్పుకుని తీరాలి. ఆద్యంతం ఆసక్తికరంగా ఉండేలా షోను తీర్చిదిద్దుతోన్న తీరును మెచ్చుకోవాలి కూడా. ముఖ్యంగా యాంకర్ ఆ షోకి ప్లస్. సీరియస్ లుక్స్‌తో, పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్‌తో అతడు తనదైన స్టైల్లో షోని విజయం వైపుగా పరిగెత్తి స్తున్నాడు!