తెలంగాణ రాష్ర్ట్రంలో దళితుడే ముఖ్యమంత్రి
మిర్యాలగూడ టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దళితుడినే కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందని ఆ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెరిక వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు ఇరుగు మధు అన్నారు. ఆదివారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 28న జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి హాజరవుతున్నారని చెప్పారు.
జనవరి 30న నల్లగొండలో 10వేల మందితో జిల్లా స్థాయి ఎస్సీ సెల్ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయి సమావేశానికి ఎస్సీ ప్రతినిధులు, సర్పంచ్‌లు విధిగా హాజరుకావాలని కోరారు. 2014లో జరగనున్న ఎన్నికల్లో జిల్లాలో రెండు అసెంబ్లీ సీట్లను దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్సీ సెల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు దైద నాగయ్య, జిల్లా కన్వీనర్ సీహెచ్ గోపాల్, పెన్‌పహాడ్ మండల సెల్ అధ్యక్షుడు వెంకన్న, నాయకులు నామ అరుణ్, కొడిరెక్క ఇళయరాజ, వివిధ సంఘాల నాయకులు మందుల కిరణ్, జానీ, తులసి, సతీష్, శివప్రసాద్, అంజి, అశోక్ పాల్గొన్నారు.
సమావేశాన్ని జయప్రదం చేయాలి
హుజూర్నగర్ : ఈనెల 28న నల్లగొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగే జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని పెరక వెం కటేశ్వర్లు కోరారు. ఆదివారం స్థానిక ఇం దిరాభవన్లో జరిగిన నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో నియోజకవర్గ అధ్యక్షుడు కస్తాల శ్రావణ్‌కుమార్, నాయకులు గల్లా వెంకటేశ్వర్లు, కొండయ్య, విజయభాస్కర్, జయరాజు, మట్టేష్, సత్యం, గోపాల్, రమేష్, వెంకటేశ్, వీరబాబు, రామకృష్ణ పాల్గొన్నారు.