Permissions Cancel
-
లాలూ యాదవ్ కుమారుడి విచిత్రమైన అభ్యర్థన... తిరస్కరించిన పోలీసులు
పాట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ తన తండ్రి ఆరోగం కోసం ప్రార్థించేందుకు మధురకు వచ్చారు. ఐతే అతని విచిత్రమైన అభ్యర్థనను పోలీసులు తిరస్కరించారు. మధురలోని గిరిరాజ్ మహరాజ్ ఆలయంలో దేవాలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేయడానికి లేదా దర్శనం చేసుకువాడానికి భక్తులను కాలినడకనే అనుమతిస్తారు. అదీగాక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తడంతో వాహానాల ప్రవేశాన్ని నిషేధించారు. ఐతే తేజ్ ప్రతాప్ తాను పరిక్రమ(ప్రదక్షిణ) చేయడానికి కారుతో దేవాలయ ప్రాంగణంలోకి వెళ్తానంటూ విచిత్రంగా అభ్యర్థించాడు. పూర్ణిమ సందర్భంగా విచ్చేసిన భక్తుల రద్దీ దృష్ణ్యా అధికారులు తేజ్ప్రతాపప్కి అనుమతి నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తుడైన తేజ్‌ప్రతాప్ దేవాలంయంలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత తన కారుతో సహా దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించేలా అధికారిక అనుమతి కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు కూడా. ఐతే అక్కడ కూడా తేజ్ ప్రతాప్‌కి అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయమై పోలీస్ అధికారి మాట్లాడుతూ...ముదియ పూర్ణిమ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చినందున, ప్రార్థనలు చేసేందుకైనా లేదా ప్రదక్షిణలు చేయడానికైన భక్తులను కాలినడకనే ఆలయాన్ని సందర్శించేందుకు అనుమతిస్తాం. కానీ వాహనంతో సహా లోపలకి తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. అదీగాక ఆలయ ప్రధాన ద్వారం వద్ద పరిక్రమ(ప్రదక్షిణ) నిర్వహించడం ఇక్కడ ఒక ప్రామాణిక ఆచారం, శ్రీకృష్ణుని భక్తులు దీన్ని పవిత్రంగా భావిస్తారు అని చెప్పారు. (చదవండి: నిలకడగా లాలూ ఆరోగ్యం.. పరామర్శించిన నితీశ్, ఫోన్లో ప్రధాని మోదీ ఆరా) -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మరో 6 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స రద్దు
సాక్షి, హైదరాబాద్: కొవిడ్ చికిత్సకు సంబంధించి ప్రైవేటు ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 105 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో 16 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది. వీటిలో 6 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలు ప్రముఖ ఆస్పత్రులు ఉన్నాయి. నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలోని పద్మజా హాస్పిటల్, ఉప్పల్‌లోని టీఎక్స్ ఆస్పత్రి, అల్వాల్‌లోని లైఫ్‌లైన్ ఆస్పత్రి, వరంగల్‌లోని మ్యాక్స్‌క్యూర్, లలిత ఆస్పత్రులు, సంగారెడ్డిలోని సాయిశ్రీరామ్ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సను రద్దు చేశారు. -
ఇక షూటింగ్‌కి అనుమతి లేదు
కోవిడ్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిత్రీకరణలకు వీలు కుదరకపోవడంతో చాలామంది తమ సినిమా షూటింగ్‌ను గోవాకు షిఫ్ట్ చేశారు. అక్కడి లొకేషన్స్‌లో షూటింగ్ ఆరంభించారు. అయితే దర్శక–నిర్మాతలకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కోవిడ్ సెకండ్ వేవ్ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఇకపై గోవాలో సినిమాలు, సీరియల్స్ చిత్రీకరణలకు అనుమతులు ఇచ్చేది లేదని ఈఎస్జీ (ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా) స్పష్టం చేసింది. ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్‌కి మేం ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నాం. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు, సీరియల్స్ల చిత్రయూనిట్స్కు వీలైనంత త్వరగా షెడ్యూల్ ప్యాకప్ చెప్పాలని ఆదేశాలు జారీ చేశాం. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు షూటింగ్‌లు రద్దు నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు కోవిడ్ పరిస్థితులను సమీక్షిస్తూనే ఉంటాం’’ అని ఈఎస్జీ ప్రతినిధులు పేర్కొన్నారు. -
అడ్మిషన్ వద్దనుకుంటే ఫీజు వెనక్కివ్వాలి
న్యూఢిల్లీ: విద్యార్థులు తమ అడ్మిషన్‌ను రద్దు చేసుకున్నప్పుడు వారు కట్టిన ఫీజులు, ఒరిజినల్ సర్టిఫికెట్లను ఉన్నత విద్యా కళాశాలలు తిరిగి వెనక్కు ఇవ్వాల్సిందేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారి ఒకరు స్పష్టం చేశారు. లేకపోతే కళాశాలల గుర్తింపు, అనుమతులను రద్దు చేయడం సహా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై ఇప్పటికే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)లకు సూచనలు చేశామనీ, విద్యార్థులను వేధించే కళాశాలలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని అధికారి వెల్లడించారు. ఈ నిబంధనలు డీమ్డ్ వర్సిటీలుసహా ఏఐసీటీఈ, యూజీసీ నియంత్రణలో ఉండే అన్ని కళాశాలలకు వర్తిస్తాయన్నారు. -
‘థర్మల్’ అనుమతులు రద్దు చేయండి
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రజాభిప్రాయానికి, నిబంధనలకు వ్యతిరేకంగా చేపట్టిన కాకరాపల్లి థర్మల్ ప్లాంట్ పనులను వెంటనే నిలుపుదల చేయాలని, ప్లాంట్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, కాకరాపల్లి థర్మల్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ నేతలు తమ్మినేని సీతారాం, దువ్వాడ శ్రీనివాస్, సీపీఎం నేత చౌదరి తేజేశ్వరరావు, సీపీఐ ప్రతినిధు లు గురుగుబెల్లి అప్పలనాయుడు, తాండ్ర ప్రకాశ్, నంబారి వెంకటరావు, నీలంరాజు, థర్మల్ పోరాట కమిటీ నేత అనంత హన్నూరావు తదితరులు శనివారం కలెక్టర్ సౌరభ్ గౌర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ ప్లాంట్ ఆవరణలో నిర్మాణ పనులను అక్రమంగా, వేగంగా చేస్తున్నారని, వెంటనే వాటిని నిలుపుదల చేయాలని కోరారు. ప్లాంట్ వద్దని స్థానికులు పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. ప్లాంట్ ప్రహరీని ఎత్తుగా నిర్మించటంతో ఈ ఏడాది సుమారు 23 వేల ఎకరాల్లోని పంట నెల రోజులపాటు నీటిలో ఉండిపోయిందని చెప్పారు. ప్రజల డిమాండ్ మేరకు సోంపేట ప్లాంట్ అనుమతులను రద్దు చేసిన ప్రభత్వం, కాకరాపల్లి ప్లాంట్ విషయంలో ద్వంద్వ వైఖరి ఎందుకు ప్రదర్శిస్తోందని., ఎవరి ప్రయోజనాల కోసం ఇలా చేస్తోందని ప్రశ్నించారు. ప్లాంట్ వల్ల మత్స్యకారులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. ప్లాంట్ యాజమాన్యానికి పోలీసులు వత్తాసు పలుకుతుండటంతో ప్రజ లు నిరంతరం భయంతో గడుపుతున్నారన్నారు. కాకరాపల్లి పరిసర ప్రాంతాల్లోని గడ్డిని నాశనం చేసేం దుకు ప్లాంట్ యాజమాన్యం మం దులు, విషపూరిత ద్రవాలు జల్లుతోందని.. వీటి వల్ల చెరువుల్లోని చేపలు, ఇతర జీవాలు చనిపోతున్నాయని వివరించారు. అంతేకాకుండా తేలినీలాపురంలోని విదేశీ పక్షులను సైతం ప్లాంట్ వారు కాల్చి చంపేస్తూ ఆ పక్షుల విడిది కేంద్రాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.