కోవిడ్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిత్రీకరణలకు వీలు కుదరకపోవడంతో చాలామంది తమ సినిమా షూటింగ్‌ను గోవాకు షిఫ్ట్ చేశారు. అక్కడి లొకేషన్స్‌లో షూటింగ్ ఆరంభించారు. అయితే దర్శక–నిర్మాతలకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కోవిడ్ సెకండ్ వేవ్ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఇకపై గోవాలో సినిమాలు, సీరియల్స్ చిత్రీకరణలకు అనుమతులు ఇచ్చేది లేదని ఈఎస్‌జీ (ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా) స్పష్టం చేసింది. ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్‌కి మేం ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నాం. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు, సీరియల్స్‌ల చిత్రయూనిట్స్‌కు వీలైనంత త్వరగా షెడ్యూల్ ప్యాకప్ చెప్పాలని ఆదేశాలు జారీ చేశాం. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు షూటింగ్‌లు రద్దు నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు కోవిడ్ పరిస్థితులను సమీక్షిస్తూనే ఉంటాం’’ అని ఈఎస్‌జీ ప్రతినిధులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment