personal abuse
-
ఏపీ సీఐడీ అధికారులపై రఘురామకృష్ణరాజు చిందులు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు బుధవారం నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులపై రఘురామకృష్ణరాజు చిందులు తొక్కారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీస్ అధికారులపై నోరు పారేసుకున్నారు. సీఐడీ చీప్ సునీల్‌కుమార్ ఉన్మాది అంటూ వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అధికారులపై దూషణలకు దిగారు. చదవండి: రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ నోటీసులు -
మాట తూలుతోంది జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార, విపక్షాల నేతలు పరస్పరం వ్యక్తిగత ఆరోపణలకు దిగడం, దుర్భాషలాడుకోవడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. నేతలు అసభ్యంగా, వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సంఘం చట్టాలతోపాటు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. వ్యక్తిగత దూషణలపై గత ఐదు రోజులుగా అధికార, విపక్షాల నేతలు ఫిర్యాదు చేయడం పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దుర్భాషల వల్ల పార్టీలకు కలిగే అదనపు ప్రయోజనమేమీ లేదని హితవు పలికారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావుపై టీడీపీ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి చేసిన వ్యక్తిగత ఆరోపణలతోపాటు ఒంటేరుపై హరీశ్‌రావు వాఖ్యలపైనా ఫిర్యాదులు అందడంతో ఇరువురికీ నోటీసులు జారీ చేశామన్నారు. భాషకు సంబంధించి 8 ఫిర్యాదులొచ్చాయని, అందరికీ నోటీసులు జారీ చేశామన్నారు. మేనిఫెస్టోతోపాటు అఫిడవిట్ సమర్పించాలి.. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోను ప్రకటించిన మూడు రోజుల్లోగా ఆంగ్ల/హిందీ భాషల్లో అనువదించి తమ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుందని రజత్‌కుమార్ తెలిపారు. మేనిఫెస్టోతోపాటు అందులో పేర్కొన్న హామీలకు నిధులెలా సమీకరిస్తారన్న అంశంపై అఫిడవిట్ రూపంలో డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ మేనిఫెస్టో అమల్లో ఏదైనా పార్టీ విఫలమైతే అఫిడవిట్ ఆధారంగా ప్రజలు కోర్టులను ఆశ్రయించడానికి వీలుంటుందన్నారు. నేర స్వభావం కూడా తెలపాలి... ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే వారు క్రిమినల్ కేసుల నంబర్లు, సెక్షన్లను మాత్రమే ప్రకటిస్తే సరిపోదని, నేర స్వభావాన్ని తెలిపే వివరాలతో పత్రికలు, వార్తా చానళ్లలో మూడు రోజులు ప్రకటనలు జారీ చేయాల్సి ఉంటుందని రజత్‌కుమార్ వివరించారు. నామినేషన్ దాఖలు సమయంలోనూ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందన్నారు. నేరచరిత్ర ప్రకటనల జారీ ఖర్చు అభ్యర్థుల వ్యయం కిందకు వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చిందన్నారు. అభ్యర్థుల నేర చరిత్రను ప్రజలకు తెలిపే కొత్త సంప్రదాయం అమల్లోకి రావడంతో భవిష్యత్తు రాజకీయాల్లో నేర చరిత్రగల నేతల ప్రాతినిధ్యం తగ్గిపోనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గులాబీ ఓటరు చిట్టీలకు నో... గులాబీ రంగుకు బదులు తెలుపు రంగు ఓటరు స్లిప్పులను ఓటర్లకు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం సూచించిందని రజత్‌కుమార్ తెలిపారు. గులాబీ రంగు ఓటరు స్లిప్పులు, బ్యాలెట్ల వినియోగంపై విపక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందన్నారు. డిసెంబర్ 1 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. ఓటరు స్లిప్ ముందు భాగంలో ఓటరు వివరాలతో పాటు వెనక భాగంలో పోలింగ్ స్టేషన్ రూట్ మ్యాప్ ఉంటుందన్నారు. భద్రత కట్టుదిట్టం... రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పట్ల రజత్‌కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు జరపాలని డీజీపీకి లేఖ రాసినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.64.36 కోట్ల మేర లెక్కలు చూపని నగదు, రూ. 5.16 కోట్ల విలువ చేసే 2.18 లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకునట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 78,384 మందిని బైండోవర్ చేశామని, 14,730 మందిపై సీఆర్పీసీ కేసులు నమోదు చేశామని, 7,367 మందికి నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేశామని రజత్‌కుమార్ వివరించారు. ఎన్నికల అక్రమాలపై సీ–విజిల్ యాప్‌కు ఇప్పటివరకు 1,849 ఫిర్యాదులురాగా వాటిలో 1,012 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. ఎన్నికల ర్యాలీలకు సువిధ పోర్టల్ ద్వారా 4,462 అనుమతులు జారీ చేశామన్నారు. -
‘టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుపై వ్యక్తిగత ఆరోపణలు, దూషణలకు పాల్పడిన టీడీపీ నేతలు వంటేరు ప్రతాప్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్ కుమార్‌కు గురువారం టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉండటంతో సీఈఓకు ఫిర్యాదుచేశామని టీఆర్ఎస్ నేతలు గట్టు రాంచంద్రారావు, ఉపేందర్ ఈ సందర్భంగా తెలిపారు. ఒక వేళ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడితే హరీశ్ సీఎం అవుతారని రేవూరి ప్రకాశ్‌రెడ్డి, తాగుబోతు ముఖ్యమంత్రి నుంచి విముక్తి కల్పించాలని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. కేసీఆర్‌ను ఓడించాలని హరీశ్‌రావు తనకు ఫోన్ చేసినట్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి నిరాధారంగా ఆరోపణలు చేశారని తప్పుబట్టారు. నర్సాపూర్ ప్రచారంలో రేవంత్ రెడ్డి సీఎం పదవిని గౌరవించకుండా మీడియాలో ప్రచురించలేని బూతులు మాట్లాడారని ఆరోపించారు. -
భయంతోనే వ్యక్తిగత దాడి
ఔరాద్ (కర్ణాటక): ప్రధాని మోదీకి భయం పట్టుకున్న ప్రతీసారి తనపై వ్యక్తిగత దాడికి దిగుతారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. తాము లేవనెత్తిన యుద్ధ విమానాల ఒప్పందం, బ్యాంకులకు రూ. వేల కోట్లు కుచ్చుటోపి పెట్టిన నీరవ్ మోదీ తదితర అంశాలపై బదులివ్వలేకే వ్యక్తిగత దాడికి దిగుతున్నారని విమర్శించారు. గురువారం రాహుల్ కర్ణాటకలోని బీదర్ జిల్లా ఔరాద్లో జరిగిన ర్యాలీ మాట్లాడారు. ‘నా గురించి ఆయన (మోదీ) ఏదైనా మాట్లాడనివ్వండి. అది తప్ప యినా, ఒప్పయినా పెద్ద విషయం కాదు. ఆయన దేశానికి ప్రధాని. అందువల్ల ఆయనపై నేను వ్యక్తిగత విమర్శలు చేయను’ అని అన్నా రు. తనపై మోదీ చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగ్గవి కావని రాహుల్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గబ్బర్ సింగ్ గ్యాంగ్ మోదీ.. గాలి జనార్దన్‌రెడ్డి సోదరులకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడాన్ని రాహుల్ తప్పుపట్టారు. ‘షోలే సినిమాలో గబ్బర్ సింగ్ ఉన్నాడు. మీరు ఇప్పటికే గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీకి వ్యంగ్య వ్యాఖ్య) తెచ్చారు. కానీ ఈసారి ఇంకా ముందుకెళ్లిపోయారు. కర్ణాటక ఎన్నికల్లో మొత్తం గబ్బర్‌సింగ్ గ్యాంగ్‌ను దించేశారు. గబ్బర్ సింగ్లా యడ్యూరప్ప, గాలి జనార్దన్ రెడ్డి సోదరులు తయారయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పే మీరు.. జైలుకు వెళ్లి వచ్చిన రెడ్డి సోదరులను అసెంబ్లీకి పంపాలని ప్రయత్నిస్తున్నారు’అని ఎద్దేవా చేశారు. మోదీకి ‘ఎఫ్’ గ్రేడ్ మోదీపై రాహుల్ ట్వీట్ల దాడికి దిగారు. కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలోని వ్యవసాయరంగానికి ఇచ్చిన ప్రాముఖ్యం విషయంలో మోదీ ప్రోగ్రెస్ కార్డుకు తాను ‘ఎఫ్’గ్రేడ్ ఇస్తానంటూ ట్వీట్ చేశారు. దీంతోపాటు మద్దతు ధరకు సంబంధించిన చార్ట్‌ను కూడా పోస్ట్ చేశారు. దేవేగౌడను అవమానించలేదు రాహుల్ జేడీ(ఎస్) అధినేత హెచ్డీ దేవెగౌడను అవమానించలేదని, అది కాంగ్రెస్ సంస్కృతి కాదని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ చెప్పారు. రాహుల్ దేవెగౌడను అవమానించారని మోదీ వ్యాఖ్యానించిన నేప థ్యంలో శర్మ ఈ మేరకు వివరణ ఇచ్చారు. -
వాస్తవాలు వెలుగుచూస్తాయనే భయంతోనే వ్యక్తిగత దూషణలు
వినుకొండ : రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ సమావేశాల్లో దుర్భాషలాడిన అధికార పార్టీ శాసనసభ్యుడుపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో శాసనసభ స్పీకర్ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు. శాసన సభాధిపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నార న్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడుతో కలిసి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ సభ్యులు సభలో మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయన్న భయంతోనే కుట్రపూరితంగా అధికారపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాన ప్రతి పక్షనాయకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలో మాట్లాడుతుంటే ప్రసంగం పూర్తికాకుండానే బొండా ఉమామహేశ్వరరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు తదితరులను మధ్యలో మాట్లాడేందుకు స్పీకర్ ఎలా అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు. జగన్‌ను దూషించడం తప్ప వారు మాట్లాడిన మాటల వలన రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనం చేకూరిందా? అని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను సభలో ఆవిధంగా మాట్లాడించింది ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు తప్పులను గ్రహించి సభ సంప్రదాయాలను కాపాడాలని ఆయన హితవు పలికారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. బ్మహ్మనాయుడు మాట్లాడుతూ ప్రజల సమస్యలు విస్మరించిన స్థానిక నాయకులు జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పట్టణ ప్రజలు ఏళ్ల తరబడి తాగునీటి సమస్య పరిష్కారానికి నోచుకోక పోవడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. మున్సిపల్ కమిషనర్ టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మూలె వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శి చింతలచెర్వు వెంకిరెడ్డి, అమ్మిరెడ్డి అంజిరెడ్డి, పట్టణ కన్వీనర్ ఎన్ శ్రీను, శావల్యాపురం మండల కన్వీనర్ చుండూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.