ఫీజులు చెల్లించకపోయినా పిటిషన్ల స్వీకారం
నోట్ల రద్దు నేపథ్యంలో హైకోర్టు కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రూ.1000, రూ.500 నోట్ల రద్దు నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పిటిషన్ల దాఖలు సమయంలో కోర్టు ఫీజులు చెల్లించకపోరుునప్పటికీ సదరు పిటిషన్ల ను స్వీకరించాలని హైకోర్టు రిజిస్ట్రీతో పాటు ఉభ య రాష్ట్రాల్లోని అన్ని కోర్టులను ఆదేశించింది. నిర్ణీత కోర్టు ఫీజు చెల్లిస్తామని అఫిడవిట్ దాఖలు చేస్తే, సూట్లు, అప్పీళ్ల వ్యాజ్యాలను స్వీకరించాలని స్పష్టం చేసింది. కాకపోతే వాటికి నంబర్ మాత్రం కేటారుుంచవద్దంది.
రూ.20వేల లోపు ఫీజులను ఈ నెల 24వ తేదీ లోపు, అంతకు మించిన మొత్తాలను డిసెంబర్ 8 లోపు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. గడువులోపు ఫీజులు చెల్లిస్తేనే నంబర్ కేటారుుంచాలని పేర్కొంది. హైకోర్టులో కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల హైకోర్టు న్యాయవాదుల సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్.మానవేంద్రనాథ్ రాయ్ ఓ ప్రకటనలో తెలిపారు.