పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలి
రాంనగర్: భాషా పండిట్, పీఈటీ పోస్టులను వెంటనే అప్‌గ్రేడ్ చేయాలని టీఎస్ యూటీఎఫ్, టీపీటీఎఫ్, డీటీఎఫ్ నాయకులు సీహె చ్. రాములు, పి. గోపాల్‌రెడ్డి, ఎం. సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడ్ విషయంలో నిర్లక్షంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, ఎడ్ల సైదులు, రవికుమార్, విద్యాసాగర్‌రెడ్డి, సుందరయ్య, వెంకులు, వెంకటేశ్వర్లు, రామనర్సయ్య, దశరథరామారావు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.