Petroleum and Natural Gas
-
కీలక అంశాలపై పంకజ్ జైన్‌తో ఏపీ సీఎస్ చర్చలు
విజయవాడ: కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలియం చమురు మరియు సహజ వాయువు రంగానికి సంబంధించి లైసెన్సులు, క్లియరెన్స్‌ల కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోకెమికల్ ప్రాజెక్టుల స్థాపనకు సంబంధించిన ఫీజులు, వాటి నిర్వహణ వంటి కీలక అంశాలపై ఈసమావేశంలో ఇరువురు ప్రధానంగా చర్చించారు. అదే విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న పెట్రోలియం మైనింగ్ లీజులు (PMLs) మరియు అన్వేషణ,ఉత్పత్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అవసరమైన వేగవంతమైన అనుమతులు మంజూరుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అంతేగాక చమురు మరియు గ్యాస్ మరియు మైనింగ్ ప్రాజెక్ట్‌ల ఆపరేషన్ కోసం సమ్మతి మరియు ఇటీవల పెరిగిన ఎస్టాబ్లిష్మెంట్ ఫీజులు, రుసుములు ముఖ్యంగా ఉత్పత్తితో అనుసంధానించబడిన వేరియబుల్ కాంటినెంట్ ఆంశం గురించి కూడా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో కెమికల్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడంపై కూడా వారు చర్చించారు.ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించబడి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని సిఎస్ జవహర్ రెడ్డి,కేంద్ర కార్యదర్శి పంకజ్ జైన్ లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చమురు, సహజవాయువు రంగాల్లో చేపట్టే ప్రాజెక్టుల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ అన్ని విధాలా కట్టుబడి ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ స్పష్టం చేశారు.రాష్ట్రానికి సంబంధించి ఈ రంగంలో నెలకొన్న ముఖ్యమైన సమస్యల సత్వర పరిష్కారానికి కలిసి పని చేద్దామని పంకజ్ జైన్ సిఎస్ డా.జవహర్ రెడ్డికి సూచించారు. -
కేంద్రం సంచలన నిర్ణయం, గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త. సిలిండర్ వెయిటేజీ నుంచి డెలివరీ వరకు ఇలా అన్నీ రకాల విభాగాల సమాచారం వినియోగదారులకు అందనుంది. ఇందుకోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్ వ్యవస్థను అమలు చేయనుంది. ఇటీవల కాలంలో గ్యాస్ కంపెనీలపై వినియోగదారులు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. గ్యాస్ సంస్థలు ప్రకటించినట్లుగా కాకుండా తమకు 1 నుంచి 2 కేజీల గ్యాస్ తగ్గుతుందని, భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, బుక్ చేసిన గ్యాస్ సిలిండర్ డెలివరీ టైంకు రావడం లేదనే’ ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. అయితే ఈ ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. కేంద్ర చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇకపై ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్లను క్యూఆర్‌కోడ్‌తో మెటల్ స్టిక్కర్‌ను అందించనున్నట్లు తెలిపారు. తద్వారా స్మార్ట్‌ఫోన్‌తో గ్యాస్ సిలిండర్‌కున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మీ గ్యాస్ ఏ ఏజెన్సీ నుండి డెలివరీ అవుతుంది. సిలిండర్‌లో గ్యాస్‌ను ఎక్కడ ఫిల్ చేశారు. గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్‌కు భద్రతా ప్రమాణాలు పాటించారా? లేదా?. సిలిండర్‌లో ఎన్ని కేజీల గ్యాస్ ఉంది. ఎప్పుడు, ఏ తేదీన డెలివరీ అవుతుందనే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇలా క్యూఆర్‌కోడ్‌ను సిలిండర్లకు అమర్చడం ద్వారా..దొంగిలిస్తున్న గ్యాస్‌తో పాటు సిలిండర్ భద్రత, ఇతర గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ వంటి విషయాల సమాచారం వినియోగదారులకు అందించ వచ్చని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఈ ప్రాజెక్టు మూడు నెలల్లో పూర్తి కానుంది. క్యూఆర్ కోడ్ ప్రస్తుతం ఉన్న సిలిండర్లతో పాటు కొత్త సిలిండర్లకు క్యూఆర్ కోడ్ మెటల్ స్టిక్కర్‌ను అమర్చనున్నట్లు వెల్లడించారు. Fueling Traceability! A remarkable innovation - this QR Code will be pasted on existing cylinders & welded on new ones - when activated it has the potential to resolve several existing issues of pilferage, tracking & tracing & better inventory management of gas cylinders. pic.twitter.com/7y4Ymsk39K — Hardeep Singh Puri (@HardeepSPuri) November 16, 2022 -
కేంద్ర మాజీ మంత్రి మురళీదేవ్‌రా కన్నుమూత
న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత , కేంద్ర మాజీ మంత్రి మురళీదేవరా (77)అనారోగ్యంతో కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజూమున 3.25 గంటలకు ఆయన ముంబయిలో మరణించారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ముంబయిలో జన్మించిన దేవరా.. రాజస్థాన్ కుటుంబానికి చెందిన వారు. పారిశ్రామిక కుటుంబానికి చెందిన మురళీదేవరా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ముంబయి కాంగ్రెస్ అధ్యక్షుడుగా 22 ఏళ్లపాటు పని చేశారు. 2006 మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఏ హయాంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా మురళీదేవరా బాధ్యతలు చేపట్టారు. అయితే పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు.