కీలక అంశాలపై పంకజ్‌ జైన్‌తో ఏపీ సీఎస్‌ చర‍్చలు | Secretary for Petroleum And Natural Gas Pankaj Jain Meets AP CS Jawahar Reddy | Sakshi
Sakshi News home page

కీలక అంశాలపై పంకజ్‌ జైన్‌తో ఏపీ సీఎస్‌ చర‍్చలు

Published Fri, Apr 14 2023 5:48 PM | Last Updated on Fri, Apr 14 2023 5:51 PM

Secretary for Petroleum And Natural Gas Pankaj Jain Meets AP CS Jawahar Reddy - Sakshi

విజయవాడ: కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలియం చమురు మరియు సహజ వాయువు రంగానికి సంబంధించి లైసెన్సులు, క్లియరెన్స్‌ల కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో  పెట్రోకెమికల్ ప్రాజెక్టుల స్థాపనకు సంబంధించిన ఫీజులు, వాటి నిర్వహణ వంటి కీలక అంశాలపై ఈసమావేశంలో ఇరువురు ప్రధానంగా చర్చించారు.

అదే విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ దశల్లో  పెండింగ్‌లో ఉన్న పెట్రోలియం మైనింగ్ లీజులు (PMLs) మరియు అన్వేషణ,ఉత్పత్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అవసరమైన వేగవంతమైన అనుమతులు మంజూరుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

అంతేగాక  చమురు మరియు గ్యాస్ మరియు మైనింగ్ ప్రాజెక్ట్‌ల ఆపరేషన్ కోసం సమ్మతి మరియు ఇటీవల పెరిగిన ఎస్టాబ్లిష్‌మెంట్ ఫీజులు, రుసుములు ముఖ్యంగా ఉత్పత్తితో అనుసంధానించబడిన వేరియబుల్ కాంటినెంట్ ఆంశం గురించి కూడా చర్చించారు‌‌.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో కెమికల్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడంపై కూడా వారు చర్చించారు.ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించబడి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని సిఎస్ జవహర్ రెడ్డి,కేంద్ర కార్యదర్శి పంకజ్ జైన్ లు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చమురు, సహజవాయువు రంగాల్లో చేపట్టే ప్రాజెక్టుల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ  అన్ని విధాలా కట్టుబడి ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ స్పష్టం చేశారు.రాష్ట్రానికి సంబంధించి ఈ రంగంలో నెలకొన్న ముఖ్యమైన సమస్యల సత్వర పరిష్కారానికి కలిసి పని చేద్దామని పంకజ్ జైన్ సిఎస్ డా.జవహర్ రెడ్డికి సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement