కేంద్ర మాజీ మంత్రి మురళీదేవ్‌రా కన్నుమూత
న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత , కేంద్ర మాజీ మంత్రి మురళీదేవరా (77)అనారోగ్యంతో కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజూమున 3.25 గంటలకు ఆయన ముంబయిలో మరణించారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. ముంబయిలో జన్మించిన దేవరా.. రాజస్థాన్ కుటుంబానికి చెందిన వారు.
పారిశ్రామిక కుటుంబానికి చెందిన మురళీదేవరా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ముంబయి కాంగ్రెస్ అధ్యక్షుడుగా 22 ఏళ్లపాటు పని చేశారు. 2006 మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఏ హయాంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా మురళీదేవరా బాధ్యతలు చేపట్టారు. అయితే పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు.