murli deora
-
రాజ్యసభ బరిలో మిలింద్ దేవరా?
సాక్షి, ముంబై: కేంద్ర పెట్రోలియం శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మురళీ దేవరా మృతితో ఖాళీ అయిన రాజ్యసభ స్ధానాన్ని ఆయన కుమారుడు మిలింద్ దేవరాకు కట్టబెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. దేవరా కుటుంబానికి అన్ని పార్టీలతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో ఎన్సీపీ, శివసేన మద్దతు కూడగట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మరోపక్క గత రెండు, మూడు నెలలుగా బీజేపీ వైఖరిపై విసిగెత్తిన శివసేనకు ప్రతీకారం తీర్చుకునేందుకు మంచి అవకాశం లభించింది. మురళీ దేవరా మృతితో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంపై త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో వాతావరణం మరోసారి వేడెక్కనుంది. ఆరు నెలల కిందటే దేవరా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవి కాలం గడువు 2020లో ముగియాల్సి ఉంది. కాని ఆయన ఇలా మృతి చెందడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడం కాంగ్రెస్కు సవాలుగా మారనుంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ ఈ స్థానాన్ని భర్తి చేయాలంటే సాధ్యమయ్యే పనికాదు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈ స్థానంపై తప్పకుండా కన్నువేసే అస్కారముంది. బీజేపీ వద్ద 130 మంది ఎమ్మెల్యేలున్నారు. అయినప్పటికీ రాజ్యసభ సీటును గెలిచేందుకు మరో 15 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరముంది. అందుకు శివసేన లేదా ఎన్సీపీ మద్దతు కూడగట్టుకోవల్సి ఉంటుంది. కాని గత రెండు, మూడు నెలలుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను బట్టి ప్రతీకారం తీర్చుకోవాలని శివసేన యోచిస్తోంది. బీజేపీ అభ్యర్ధి రాజ్యసభకు వెళ్లకుండా ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, ఎన్సీపీ సహా శివసేన కూడా ప్రయత్నాలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో మురళీ తనయుడు మిలింద్కు ఆ స్థానానికి నిలబెట్టాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేయనుంది. మురళీ దేవరా మృతికి సీడబ్ల్యూసీ సంతాపం న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా మృతికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మంగళవారం సంతాపం తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగి కమిటీ సమావేశంలో వక్తలు ఆయన సేవలను కొనియాడారు. ఇందిరాగాంధీ హయాంలో పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు మురళీ దేవరా పార్టీకి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని వారు పేర్కొన్నారు. కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన దేవరా ఎప్పుడూ పార్టీకి విధేయుడిగానే ఉన్నారని పేర్కొన్నారు. మురళీదేవరా(77) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ముంబైలో మృతిచెందిన విషయం తెలిసిందే. -
మురళీదేవరాకు సంతాపం, పార్లమెంట్ వాయిదా
న్యూఢిల్లీ : శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికీ వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ సభలో ప్రధాని మోడీ...కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు. అనంతరం అనారోగ్యంతో ఈరోజు తెల్లవారుజామున మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీదేవరాకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. అనంతరం పార్లమెంట్ మంగళవారానికి వాయిదా పడింది. -
మధ్యాహ్నం మురళీదేవరా అంత్యక్రియలు
ముంబయి : కేంద్ర మాజీమంత్రి మురళీ దేవరా అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న మురళీ దేవరా ఈరోజు తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా దేవ్రా మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేవ్రా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
కేంద్ర మాజీ మంత్రి మురళీదేవ్రా కన్నుమూత
న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత , కేంద్ర మాజీ మంత్రి మురళీదేవరా (77)అనారోగ్యంతో కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజూమున 3.25 గంటలకు ఆయన ముంబయిలో మరణించారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. ముంబయిలో జన్మించిన దేవరా.. రాజస్థాన్ కుటుంబానికి చెందిన వారు. పారిశ్రామిక కుటుంబానికి చెందిన మురళీదేవరా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ముంబయి కాంగ్రెస్ అధ్యక్షుడుగా 22 ఏళ్లపాటు పని చేశారు. 2006 మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఏ హయాంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా మురళీదేవరా బాధ్యతలు చేపట్టారు. అయితే పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. -
మొయిలీ, అంబానీలపై ఢిల్లీ సర్కారు క్రిమినల్ కేసులు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిరంతర పోరాట యోధుడిగా తన పేరును సార్థకం చేసుకుంటున్నారు. ఇప్పుడు తన పోరాటాన్ని నేరుగా కేంద్ర మంత్రులు, కార్పొరేట్ పెద్దలపైనే ఆయన ఎక్కుపెట్టారు. కేంద్ర చమురుశాఖ మంత్రి వీరప్ప మొయిలీ, ఆశాఖ మాజీ మంత్రి మురళీ దేవ్రా, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తదితరులపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించారు. అది కూడా తాను వ్యక్తిగతంగా కాకుండా ఢిల్లీ ప్రభుత్వం తరఫునే పెట్టిస్తున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సహజ వాయువు ధరలను పెంచాలన్న నిర్ణయాన్ని ఆయన తొడగొట్టి సవాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్, హైడ్రోకార్బన్స్ మాజీ డీజీ వీకే సిబల్ తదితరులపై కేసులు దాఖలు చేయాల్సిందిగా ఏసీబీకి తాను సూచించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. గ్యాస్ ధర పెంపును తాత్కాలికంగా పక్కన పెట్టాలని, ఈ అంశాన్ని తాను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి, అక్కడే తేల్చుకుంటానని కేజ్రీవాల్ చెబుతున్నారు.