pg ecet
-
ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల
-
AP PGCET: ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: ఏపీ పీజీసెట్ ఫలితాలను విద్యాశాఖమంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ రామ్మోహనరావు, యోగివేమన యూనివర్శిటీ వీసీ సూర్యకళావతి హాజరయ్యారు. తొలిసారి అన్ని యూనివర్శిటీలలో ప్రవేశానికి ఉన్నత విద్యామండలి ఒకే పీజీ సెట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పీజీ ప్రవేశాలకి ఒకే సెట్ మొదటిసారిగా నిర్వహించాం. ఆన్లైన్ లో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలని రెండు వారాలలో ప్రకటించాము. పీజీ ప్రవేశాలకి 39,856 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్షకి 35,573 మంది హాజరుకాగా 24,164 మంది అర్హత సాధించారు. పీజీ సెట్లో 87.62 శాతం మంది అర్హత సాధించారు. చదవండి: (KTR: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు) గతంలో అన్ని యూనివర్సిటీలకి ఒకే ప్రవేశ పరీక్ష ఉండకపోవడం వల్ల విద్యార్ధులకి అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ ప్రవేశ పరీక్ష వల్ల అర్హత సాధించిన విద్యార్ధులు తమకు ఇష్ణమైన కోర్సులలో నచ్చిన యూనివర్సిటీలో చేరవచ్చు. ఉన్నత విద్యలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు చేపట్టారు. ప్రవేశపరీక్షలలో ఎటువంటి అవకతవకలకి ఆస్కారం లేకుండా కట్డుదిట్టంగా విజయవంతంగా నిర్వహించాం అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. (ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీ పీజీ ఈసెట్ 2020 ఫలితాలు విడుదల
సాక్షి, విశాఖపట్నం : ఏపీ పీజీ ఈసెట్ 2020 ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఏయూ ఉప కులపతి ఆచార్య పీవీ జీడీ ప్రసాద్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏపీ పీజీ ఈ సెట్ 2020 నిర్వహించే అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉంది. ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలకు 28,868మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. 22,911 మంది హాజరయ్యారు. 20,157 మంది అర్హులయ్యారు. 42 సెంటర్లలో ఈ టెస్ట్ నిర్వహించాం. మొత్తం 87.98 శాతం మంది అర్హులయ్యారు. ఎంటెక్కు 17,150 మంది హాజరు కాగా, 14,775 మంది అర్హత సాధించారు. ఫార్మసీ పరీక్షలకు 5,761 మంది హాజరు కాగా 5,382 మంది అర్హత సాధించారు. ఎంఫార్మసీ అడ్మిషన్స్ కూడా ఆన్ లైన్లో నిర్వహిస్తాం. ఆంధ్ర యూనివర్సిటీ ఈ అడ్మిషన్ ప్రక్రియ నిర్వహిస్తోంది. కోవిడ్ వల్ల ఈ పరీక్షలకు హజరు కాలేని వారికి మరో సారి పరీక్ష నిర్వహిస్తున్నాము. కోవిడ్ కారణంగా దూరంగా ఉన్న విద్యార్థుల కోసం రెండవ సారి ఎంట్రన్స్ నిర్వహించమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించార’’ని తెలిపారు. -
25 నుంచి పీజీ ఈసెట్ రెండో విడత కౌన్సెలింగ్
బాలాజీచెరువు (కాకినాడ): ఏపీ పీజీ ఈసెట్-2015 రెండో దశ కౌన్సెలింగ్ ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ జీవీఆర్ ప్రసాద్‌రాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఎంటెక్, ఎం.ఫార్మసీ విభాగాల్లో 25,304 సీట్లుండగా మొదటిదశ కౌన్సెలింగ్‌లో 17,790 మంది ఆప్షన్లు ఇవ్వగా, వారిలో 14,035 మందికి సీట్లు కేటాయించినట్లు చెప్పారు. సీట్లు పొందినవారు ఈ నెల 14లోగా ఆయా కళాశాలల్లో రిపోర్టు చేసి అడ్మిషన్ తీసుకోవాలన్నారు. -
విద్యార్థులు లేకున్నా కౌన్సెలింగ్!
• 26 నుంచి పీజీఈసెట్ వెబ్ ఆప్షన్లు • ఫీజులు ఇవ్వని ప్రభుత్వం... •సర్టిఫికెట్లను నిరాకరించిన కాలేజీలు •గందరగోళంగా విద్యార్థుల పరిస్థితి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా వేల మంది విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇంజనీరింగ్ పూర్తిచేసి ఎంటెక్‌లో చేరేందుకు పీజీఈసెట్ రాసిన విద్యార్థుల్లో అనేకమంది ఇప్పటికీ... బీటెక్ సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని, లేదంటే డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని కాలేజీల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఈనెల 26 నుంచి ఎంటెక్ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రవేశాల కమిటీ సిద్ధమైంది. దీంతో సర్టిఫికెట్లు తీసుకోలేని వారంతా విద్యా సంవత్సరం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పు చేసో, మరెలాగో కాలేజీలకు ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తెచ్చుకున్నవారు మాత్రం ఈనెల 14వరకు నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వారు మాత్రమే ఇప్పుడు వెబ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అర్హులు. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడి చదువుకొని, డబ్బు చెల్లించలేక సర్టిఫికెట్లను తెచ్చుకోలేని వారి గురించి మాత్రం ఎవరికీ పట్టడం లేదు. ఎంటెక్‌లో చేరేందుకు పీజీఈసెట్ రాసిన 43,776 మందిలో 38,882 మంది అర్హత సాధించారు. వారిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న వారు 16 వేల మంది మాత్రమే. మిగతా వారిలో చాలా మంది కాలేజీలకు ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు తెచ్చుకోలేక.. వెరిఫికేషన్‌కు హాజరుకాలేకపోయారు. దీనికితోడు ఈనెల 14వ తేదీ తరువాత సర్టిఫికెట్లు తెచ్చుకున్న వారికి వెరిఫికేషన్ అవకాశం లేకపోవడంతో.. వారంతా ఆందోళన చెందుతున్నారు. సర్కారు ‘ఫీజు’ ఇవ్వని కారణంగా వేల మంది విద్యార్థులు విలువైన ఒక ఏడాది సమయాన్ని కోల్పోవాల్సి వస్తోంది.