
సాక్షి, విశాఖపట్నం : ఏపీ పీజీ ఈసెట్ 2020 ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఏయూ ఉప కులపతి ఆచార్య పీవీ జీడీ ప్రసాద్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏపీ పీజీ ఈ సెట్ 2020 నిర్వహించే అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉంది. ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలకు 28,868మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. 22,911 మంది హాజరయ్యారు. 20,157 మంది అర్హులయ్యారు. 42 సెంటర్లలో ఈ టెస్ట్ నిర్వహించాం. మొత్తం 87.98 శాతం మంది అర్హులయ్యారు. ఎంటెక్‌కు 17,150 మంది హాజరు కాగా, 14,775 మంది అర్హత సాధించారు.
ఫార్మసీ పరీక్షలకు 5,761 మంది హాజరు కాగా 5,382 మంది అర్హత సాధించారు. ఎంఫార్మసీ అడ్మిషన్స్ కూడా ఆన్ లైన్‌లో నిర్వహిస్తాం. ఆంధ్ర యూనివర్సిటీ ఈ అడ్మిషన్ ప్రక్రియ నిర్వహిస్తోంది. కోవిడ్ వల్ల ఈ పరీక్షలకు హజరు కాలేని వారికి మరో సారి పరీక్ష నిర్వహిస్తున్నాము. కోవిడ్ కారణంగా దూరంగా ఉన్న విద్యార్థుల కోసం రెండవ సారి ఎంట్రన్స్ నిర్వహించమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించార’’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment