Pharmasistu
-
భయంతో కరోనా వ్యాక్సిన్‌ను ఖతం చేశాడు!
వాషింగ్టన్: ఓ వైపు కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ వచ్చిందని సంతోషిస్తుండగా.. మరోపక్క టీకా సామార్థ్యం మీద జనాల్లో రోజురోజుకు అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ ఫార్మసిస్ట్ మోడర్నా వ్యాక్సిన్ 500 డోసులను పనికి రాకుండా చేశాడు. దాంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇక విచారణలో సదరు ఫార్మసిస్ట్ మోడర్నా వ్యాక్సిన్ వల్ల డీఎన్ఏలో మార్పులు వస్తాయని తెలిసి.. వాటిని నేలపాలు చేశానని వెల్లడించాడు. వివరాలు.. స్టీవెన్ బ్రాండెన్‌బర్గ్‌గా గుర్తించబడిన ఫార్మసిస్ట్ విస్కాన్సిన్లోని గ్రాఫ్టన్‌లోని అరోరా మెడికల్ సెంటర్లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆ మెడికల్ సెంటర్లో మోడర్నా వ్యాక్సిన్‌ని భద్రపరిచారు. ఈ క్రమంలో స్టీవెన్ మోడర్నా వ్యాక్సిన్ తీసుకుంటే డీఎన్ఏలో మార్పులు చోటు చేసుకుంటాయని విన్నాడు. ఆ భయంతో ఫ్రిజ్‌లో ఉన్న వ్యాక్సిన్ డోసులను బయటపెట్టి.. వాటిని పనికి రాకుండా చేశాడు. (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నర్స్ మృతి) విషయం తెలుసుకున్న పోలీసులు బ్రాండెన్‌బర్గ్‌ని అరెస్ట్ చేశారు. తొలుత అతడు కేవలం 57 వ్యాక్సిన్ డోసులను మాత్రమే పనికి రాకుండా చేశాడని భావించినప్పటికి తర్వాత ఆ సంఖ్య 500కు చేరింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు, డిటెక్టివ్లు బ్రాండెన్‌బర్గ్ అపనమ్మకంతోనే కావాలనే వ్యాక్సిన్ డోసులను నాశనం చేశాడని వెల్లడించారు. మరో ముఖ్యమైన అంశం ఎంటంటే బ్రాండెన్‌బర్గ్ ఫ్రిజ్ నుంచి తీసి బయటపడేసిన వ్యాక్సిన్ డోసుల్లో నుంచి 60 డోసులను వైద్యులు ప్రజలకు పంపిణీ చేశారు. ఆ తర్వాత విషయం తెలియడంతో మిగతా వాటిని వదిలేశారు. (చదవండి: మూఢ నమ్మకాలు.. కరోనా వ్యాక్సిన్ వద్దు) ఇదిలా ఉండగా కరోనాను కట్టడి చేయడానికి మోడర్నా వ్యాక్సిన్ హాఫ్ డోస్ సరిపోతుందా లేదా అనే దాని గురించి తెలుసుకునేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మోడర్నా ఇంక్స్ శాస్త్రవేత్తలు టెస్ట్‌లు జరుపుతున్నారు. మరో రెండు నెలల్లో ఈ ఫలితాలు వెలువడతాయి. దాన్ని బట్టి వ్యాక్పిన్ డోసులను సగానికి తగ్గించాలా లేక రెట్టింపు చేయాలా అనే నిర్ణయం తీసుకోన్నుట్లు తెలిపారు. ఇక అమెరికాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. -
మందులు తీస్కో..రశీదు అడక్కు!
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): సుప్రీం కోర్టు చెప్పినా, ఎంఐసీ ఆదేశించినా అధిక శాతం డాక్టర్లు వారికి వచ్చిన లిపిలోనే మందులు రాస్తారు. ఆ లిపి అర్థమయ్యే దుకాణంలోనే మందులు కొనాలి. ఇతర దుకాణంలో నిపుణులైన ఫార్మాసిస్టులు మందులు ఇస్తే ఫరవాలేదు. ఫార్మాసిస్టులు కాని వారు విక్రయిస్తేనే ఇబ్బంది. డ్రగ్ రియాక్షన్ వచ్చి ఒక్కోసారి రోగి ప్రాణానికే ముప్పు ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో మందుల కొనుగోలుకు సంబంధించి రశీదు ఉపయోగపడుతుంది. ఇతర మందులు మింగకుండా నియంత్రిస్తుంది. కానీ ఈ రెండు అంశాలు జిల్లాలోని అనేక ఔషధ దుకాణాల్లో జరగడం లేదు. మందులు తీస్కో..రశీదు మాత్రం అడక్కు అనే రీతిలో మందుల విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలో హోల్‌సేల్ మందుల దుకాణాలు, ఏజెన్సీలు 400 దాకా ఉన్నాయి. రిటైల్ మెడికల్ అండ్ జనరల్ షాప్‌లు 2వేలకు పైగా ఏర్పాటు చేశారు. ఇవి కర్నూలు, నంద్యాల, ఆదోని వంటి నగరం, పట్టణాల్లోనే గాక ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు, మంత్రాలయం, ఆలూరు, డోన్, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, శ్రీశైలం, గూడూరు, మహానంది, ఆలూరు, ఆస్పరి, కౌతాళం, కోసిగి, పాణ్యం, నందికొట్కూరు, పాములపాడు, బనగానపల్లె వంటి మండల, నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి రోజూ రూ.90లక్షలకు పైగా, నెలా రూ.28కోట్ల వరకు వ్యాపారం జరుగుతోందని అంచనా. మందులు కొన్నా రశీదు ఇవ్వరు సాధారణంగా ఏదైనా వస్తువు కొంటే రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని వాణిజ్యపన్నుల శాఖ అధికారులు చెబుతారు. కొనుగోలు చేసిన ఆ వస్తువు ఎక్కడ కొనుగోలు చేశామో చెప్పడానికి, ఆ వస్తువు నకిలీ, నాణ్యమైనది కాకపోతే పోరాటం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే జిల్లాలోని మెడికల్షాపులో 80 శాతం దుకాణాల్లో రశీదులు ఇవ్వడం లేదు. పెద్ద, కార్పొరేట్ దుకాణాలు మాత్రం తప్పనిసరిగా మందుల రశీదును మందుల వివరాలు, ధరతో కలిపి ఇస్తుంటారు. దీనివల్ల నాణ్యమైన మందులు తీసుకునేందుకు వీలవుతుంది. జిల్లాలోని 70 శాతానికి పైగా మెడికల్‌షాపుల్లో ఫార్మాసిస్టులు ఉండటం లేదు. బి. ఫార్మసి, డి.ఫార్మసి చేసిన వారు వేరే ఉద్యోగం చేస్తూ సర్టిఫికెట్లు మాత్రం మెడికల్‌షాపుల్లో ఉంచుతున్నారు. మందుల దుకాణాల్లో అక్రమా ల గురించి ఔషధ నియంత్రణ అధికారులకు తెలిసినా తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి నామమాత్రపు కేసులు నమోదు చేసి మమ అనిపిస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి వినియోగదారులు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. బిల్లు ఇవ్వని వారిపై ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. ఫార్మాసిస్టుల పర్యవేక్షణలోనే మెడికల్‌షాపుల్లో మందులు విక్రయించాలి. లైసెన్స్ ఇచ్చే ముందు ఫార్మాసిస్టులను సైతం ఒక యజమానిగా చేస్తున్నాం. స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి, ఫార్మాసిస్టులు లేకపోతే మూడుసార్లు నోటీసులు ఇస్తాం. అయినా మారకపోతే ఆంధ్రప్రదేశ్ ఫార్మసి కౌన్సిల్ వారికి వారి సర్టిఫికెట్లు రద్దుకు సిఫారసు చేస్తాం. –ఎం. చంద్రశేఖర్‌రావు, అడిషనల్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ శాఖ -
డమ్మీ నోటిఫికేషన్?
► వైద్యశాఖలో కాంట్రాక్ట్ ఏఎన్ఎం పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ► నిరుద్యోగులకు రూ.10 లక్షల ఖర్చు కొలువుల పేరిట దందా ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది జిల్లా వైద్యశాఖ పనితీరు. ఆర్థిక శాఖ అనుమతి లేదు. ప్రభుత్వ జీఓ అసలే లేదు. అయినా జిల్లాలో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం, ఫార్మాసిస్టుల పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీచేస్తామంటూ వైద్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను స్వీకరించింది. వీరిని ఉద్యోగాల్లో నియమించినప్పటికీ జీతాలు వచ్చే పరిస్థితే లేదు. మరోవైపు వైద్యశాఖలోని కొంతమంది ఉద్యోగులు రూ.లక్ష ఇస్తే ఏఎన్ఎం పోస్టు ఇప్పిస్తామంటూ బేరసారాలు సాగిస్తూ కొలువుల పేరిట దందా సాగిస్తున్నారు.. నెల్లూరు(అర్బన్): జిల్లాలోని వైద్యశాఖలో కొన్నేళ్లుగా 145 ఏఎన్ఎం, 22 ఫార్మాసిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పీహెచ్‌సీల్లో పని భా రం పెరిగింది. ఖాళీలను భర్తీ చేస్తామంటూ గత నెలాఖరున వైద్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసి ఈ నెల 10వతేదీ నాటికి దరఖాస్తులను స్వీకరించేసింది. రూ. 10 లక్షల ఖర్చు ఈ పోస్టులకు రెండు వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.100 వంతు డీడీ రూపంలో మొత్తం రూ.2 లక్షలను వైద్యశాఖ వసూలు చేసింది. అంతేకాక విద్యార్హతలు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, వాటి జెరాక్సులు కోసం మరో రూ.200 వం తున ఒక్కో అభ్యర్థి ఖర్చు చేశారు. ఇది చాలదన్నట్టు ఒక రోజు పని మానుకుని జిల్లా నలుమూలల నుంచి నిరుద్యోగ అభ్యర్థులు నెల్లూరుకు వచ్చారు. రాను, పోను చార్జీలు, ఖర్చులు కలిపి మరో రూ.200 అయింది. తక్కువలో తక్కువ వేసుకున్నా అన్ని రకాల ఖర్చులు కలిపి ఒక్కో అభ్యర్థి కనీసం రూ.500 వంతున ఖర్చు చేశారు. అంటే రెండు వేల దరఖాస్తుదారులు కనీసం రూ. 10 లక్షల వరకు ఖర్చు చేశారు. జిల్లాకే పరిమితమైన నోటిఫికేషన్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వైద్యశాఖలో ఖాళీలున్నా యి. అయినప్పటికీ నెల్లూ రు జిల్లాలో మా త్రమే పో స్టులను భర్తీ చేస్తామంటూ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వీటిని ఎప్పటి లోగా భర్తీ చేస్తారో అధికారులు స్పష్టంగా చెప్పలేదు. నిబంధనలు బేఖాతర్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసేటప్పుడే నిబంధనలు రూపొం దిస్తారు. అభ్యంతరాలకు గడు వు, మెరిట్ లిస్టు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ విధా నం ప్రకటిస్తారు. భర్తీ చేసే గడువును ప్రకటిస్తారు. ఇక్కడ మాత్రం ఇవేమీ ప్రకటించలేదు. కనీసం ఏ ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేపడతారో కూడా తెలుపలేదు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో నోటీసు బోర్డులో సైతం వివరాలు ప్రక టించలేదు. వీటిని గురించి ప్రశ్నిస్తే అధికారుల నుంచి మౌనమే సమాధానంగా వస్తుంది. రెండో ఏఎన్ఎంల ఆందోళన ఎనిమిదేళ్ల క్రితం జిల్లాలో ఎన్‌ఆర్‌హెచ్ ఎం పథకం కింద రెండో ఏఎన్ఎం పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిపై భర్తీ చేశారు. అప్పట్లో మెరిట్, రిజర్వేషన్ ప్రకారం నియామకాలు చేపట్టి భవిష్యత్తులో రెగ్యులర్ (పర్మినెంట్) చేస్తామని చెప్పారు.తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎన్నికల్లో వీరిని రెగ్యులర్ చేస్తామని ప్రకటించింది. వీరు రూ.4 వేల జీతంతో చేరి ఇప్పుడు రూ.11వేల నెల జీతం పొందుతున్నారు. తాజా నోటిఫికేషన్లో కాంట్రాక్ట్ పద్ధతిన కొత్త గా భర్తీ చేసేవారికి నెల జీతం రూ.17 వేలు, ఇతర అలవెన్సులు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఖాళీపోస్టుల్లో కొత్తవారిని కాం ట్రాక్టు పద్ధతిన నియమిస్తే ఇక జీవితంలో తాము రెగ్యులర్ అయ్యే ప్రసక్తే లేదని రెండో ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎని మిది, తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్న తమకు రూ.11వేలు జీతం, కొత్త గా చేరే కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు రూ.17వేల జీతం ఏంటని వారు ఆందోళన బాట పట్టారు. ధర్నా లు చేశారు. కలెక్టరేట్ వద్ద రిలే నిరాహారదీక్షలు చేశారు. రూ.లక్ష నుంచి బేరసారాలు మరో వైపు ఎన్ఎంపోస్టులు భర్తీ అవుతున్నాయని, భవిష్యత్తులో రె గ్యులర్ చేస్తారంటూ వైద్యశాఖలోని కొంతమంది ఉద్యోగులు ప్రచారం మొదలు పెట్టారు, రూ.లక్ష నుంచి ఒకటిన్నర లక్షల రూపాయలు ఇస్తే ఉద్యోగం మీదేనంటూ ఎరవేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. జీతాలెలా వస్తాయి..? ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేని ఈ పోస్టుల భర్తీ చెల్లదు. ఒకవేళ భర్తీ చేసినా జీతాలు ఎవరిస్తారు?. ట్రెజరీ కొర్రీ వేస్తుంది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడటం దారుణం. అన్ని అనుమతులు తెచ్చుకుని భర్తీ చేయాలి. అలా భర్తీ చేసేటప్పుడు కూడా రెండో ఏఎన్ఎంలను ముందుగా ఖాళీల్లో భర్తీ చేసి తరువాత మిగిలిన ఖాళీలను కొత్తవారితో భర్తీ చేయాలి. - ఎన్.సతీష్, యునెటైడ్ మెడికల్ హెల్త్,ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు 3 కలెక్టర్ చెప్పడంతో నోటిఫికేషన్ ఇచ్చా ప్రభుత్వం నుంచి జీవో, అనుమతులు లేని విషయం వాస్తవమే. కలెక్టర్ చెప్పడంతో నోటిఫికేషన్ ఇచ్చాను. ప్రభుత్వం అనుమతి వస్తుందని భావిస్తున్నాం. - డాక్టర్ వరసుందరం, డీఎంహెచ్ఓ