నువ్వా... నేనా!
హామిల్టన్‌కు ‘పోల్ పొజిషన్’
నేడు అబుదాబి గ్రాండ్‌ప్రి
అబుదాబి: ఫార్ములాన్-2016 సీజన్ అంతిమ దశకు చేరుకుంది. సీజన్‌లోని చివరిదైన రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో ఓవరాల్ విజేత ఎవరో తేలనుంది. శనివారం జరిగిన క్వాలిఫరుుంగ్ సెషన్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూరుుస్ హామిల్టన్ (మెర్సిడెస్) అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 38.755 సెకన్లలో ముగించి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. హామిల్టన్ సహచరుడు నికో రోస్‌బర్గ్ ఒక నిమిషం 39.058 సెకన్లలో ల్యాప్‌ను ముగించి రెండో స్థానంలో నిలిచాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి, రోస్‌బర్గ్ రెండో స్థానం నుంచి మొదలుపెడతారు.
డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో రోస్‌బర్గ్ (367 పారుుంట్లు), హామిల్టన్ (355 పారుుంట్లు) మధ్య 12 పారుుంట్ల తేడా ఉంది. ఆదివారం జరిగే రేసులో రోస్‌బర్గ్ టాప్-3లో నిలిస్తే చాంపియన్‌గా అవతరిస్తాడు. హామిల్టన్‌కు టైటిల్ దక్కాలంటే అతను గెలవడంతోపాటు రోస్‌బర్గ్ టాప్-3లో ఉండకూడదు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, సెర్గియో పెరెజ్ 7, 8 స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు.