30 నుంచి పీహెచ్డీ తరగతులు
జేఎన్టీయూ : జేఎన్టీయూ అనంతపురంలో ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 2వతేదీ వరకు పీహెచ్డీ విద్యార్థులకు తరగతులు నిర్వహించనున్నారు. 2015–16 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు తప్పనిసరిగా తరగతులకు హాజరుకావాలని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య సత్యనారాయణ పేర్కొన్నారు.