photo release
-
ఒమిక్రాన్ వేరియంట్ తొలి ఫోటో విడుదల
Omicron COVID Variant-First Picture of Omicron: ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందనుకుంటన్న కరోనా వైరస్ మరో కొత్త రూపం దాల్చి ప్రజల ముందుకొచ్చింది. దక్షిణాఫ్రికాలో కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా ప్రకటించింది. ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి అత్యంతవేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాజాగా రోమ్‌లోని ప్రతిష్టాత్మకమైన బాంబినో గెసో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒమిక్రాన్ మొదటి ఫోటోను విడుదల చేసింది. ఈ చిత్రం ఒక మ్యాప్‌లా కనిపిస్తోంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌లో ఎక్కువ మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కరోనా వైరస్‌లో వచ్చిన వేరియంట్లలో అన్నిటికన్నా ఎక్కువగా జన్యు ఉత్పరివర్తనలు జరిగిన వేరియంట్ ఒమిక్రాన్ అని వెల్లడించింది. ఒమిక్రాన్ ఉత్పరివర్తనలు మరింత ప్రమాదకరమైనవని రోమ్ పరిశోధకుల బృందం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే భవిష్యత్తులో సోకే కొత్త వేరియంట్లకు కారణమవుతాయని పేర్కొంది. చదవండి: Omicron Variant: ‘ఒమిక్రాన్’ వేరియెంట్ కథాకమామిషూ అయితే ఒమిక్రాన్‌తో వ్యాప్తి ప్రభావం పెరుగుతుందా లేదా వ్యాక్సిన్ల ప్రభావం తగ్గుతుందా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమని పరిశోధకులు పేర్కొన్నారు. కాగా డెల్టాతో సహా ఇతర వేరియంట్లతో పోల్చితే ఓమిక్రాన్ మరింతగా వ్యాపించగలదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఒమిక్రాన్.. ఇతర కోవిడ్ వేరియంట్ల కంటే భిన్న లక్షణాలు ఉన్నాయడానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. చదవండి: ఒమిక్రాన్ గుబులు.. దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు 185 మంది The first photo of the #OmicronVariant (B.1.1.529), SARS-CoV-2 Variant of Concern, at the Bambino Gesù Children’s Hospital in Rome pic.twitter.com/tCuujpeqsY — Dimitrios Varvaras MD, PhD (@MdVarvaras) November 28, 2021 -
రాకేశ్వర్ ఫోటో ను విడుదల చేసిన మావోయిస్టులు
-
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: రాకేశ్వర్ క్షేమం, ఫొటో విడుదల
చత్తీస్‌గఢ్: మావోయిస్టులు బందీగా తీసుకెళ్లిన సీఆరీ్పఎఫ్ కోబ్రా జవాన్ రాకేశ్వర్‌సింగ్ క్షేమంగానే ఉన్నారు. ఈ మేరకు ఆయన క్షేమ సమాచారాన్ని తెలియజేస్తూ మావోయిస్టులు రాకేశ్వర్ ఫొటోను మీడియాకు విడుదల చేశారు. ఫొటోలో ఆయన సాధారణంగానే ఉన్నారు. ఎలాంటి భయం, దిగులు లేకుండా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని తెర్రెం పోలీస్‌స్టేషన్ పరిధి జొన్నగూడెం అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది జవాన్లు మృతి చెందగా.. ఒక జవాన్‌ను మావోయిస్టులు బందీగా తీసుకెళ్లిన విషయం విదితమే. అనంతరం ఆయన తమవద్ద క్షేమంగా ఉన్నారని.. ఎలాంటి హానీ తలపెట్టబోమని మావోయిస్టులు ప్రకటించారు. ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు చెబితే జవాన్‌ను అప్పగిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ మంగళవారం లేఖ విడుదల చేశారు. అయితే, ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో జవాన్ విడుదలపై ఉత్కంఠ నెలకొంది. ఆ బాధ్యత మీదే: రాకేశ్వర్ భార్య మీనూ జవాన్ ఒక్కరోజు ఆలస్యంగా డ్యూటీకి వెళితే యాక్షన్ తీసుకునే ఆర్మీ.. అదే జవాను విధుల్లో అదృశ్యమైతే ఏం యాక్షన్ తీసుకుంటోందని రాకేశ్వర్‌సింగ్ భార్య మీనూ కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాకేశ్వర్‌సింగ్ విడుదలకు చర్యలు చేపట్టాలని కోరారు. రాకేశ్వర్ ఓ తల్లికి కొడుకు, తన భర్త అనే విషయాలు పక్కనబెట్టాలని.. మీ జవాన్‌ను సురక్షితంగా తీసుకురావాల్సిన బాధ్యత మీదే అని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. కాగా, పాక్‌కు బందీగా చిక్కిన పైలెట్ అభినందన్‌ను విడిపించినట్టే.. రాకేశ్వర్‌ను విడుదల చేయించాలని అతని సోదరుడు విజ్ఞప్తి చేశారు. రాకేశ్వర్‌ని విడుదల చేయాలి: ప్రొ.హరగోపాల్ మావోయిస్టుల ఆధీనంలో ఉన్న రాకేశ్వర్‌సింగ్‌ను వెంటనే విడుదల చేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక విజ్ఞప్తి చేసింది. ఆయన్ను విడుదల చేస్తామన్న మావోయిస్టులు తమ మాట నిలబెట్టుకోవాలని కోరింది. ఈ విష యంలో ప్రభుత్వాలు ముందడుగు వేయాలని వేదిక తరఫున ప్రొ.జి.హరగోపాల్, కనీ్వనర్, కోకనీ్వనర్లు ప్రొ.జి.లక్ష్మణ్, ఎం.రాఘవాచారి, కె.రవిచందర్ ఓ ప్రకటనలో కోరారు. చదవండి: మావోయిస్టుల కీలక ప్రకటన: రాకేశ్వర్‌ను విడిచిపెడతాం -
విజయ్ వర్మ .. ఆన్ మిషన్
నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’. అహిషోర్ సోల్మన్ దర్శకత్వంలో ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. దియా మిర్జా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్ఐఏ ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఆఫీసర్ విజయ్ వర్మ తన టీమ్‌తో ఏదో మిషన్ మీద ఉన్నట్లు కనిపిస్తున్న ఒక ఫొటోను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం మనాలీలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. 20 రోజుల షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. అక్కడి రోహ్తంగ్ పాస్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ షెడ్యూల్ ఆరంభమై ఇప్పటికి వారం అవుతోంది. -
ఫొటో 1 తరాలు 4
లండన్: కొత్త దశాబ్దం ప్రారంభం సందర్భంగా బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ శనివారం తన వారసులతో కలసి దిగిన ఫొటోను విడుదల చేశారు. అందులో రాణి సహా నాలుగు తరాల రాజరికం ఉంది. గతంలో 2016లో ఆమె 90వ పుట్టిన రోజు సందర్భంగా ముగ్గురు వారసులతో కలసి ఫొటో దిగగా, ఇప్పుడు విడుదల చేసింది రెండో ఫొటో కావడం గమనార్హం. ఇప్పటి ఫొటోలో కూడా రాణి కుమారుడు ప్రిన్స్ చార్లెస్, మనవడు ప్రిన్స్ విలియం, ముని మనవడు ప్రిన్స్ జార్జ్‌లు ఉన్నారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో క్రిస్మస్ పండుగకు వారంముందు ఈ ఫొటోను తీశారు. ఇందులో రాణి తెలుపు గౌన్ ధరించారు. ఆమెకు ఇరు వైపులా రాజకుమారులు ఉన్నారు. -
బిహార్‌లో ‘ఫొటో’ రాజకీయాలు
పట్నా: బిహార్‌లో నిందా రాజకీయాలు మొదలయ్యాయి. మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఓ యువతితో కలసి పార్టీలో పాల్గొన్న పాత ఫొటోను అధికార జేడీయూ శుక్రవారం విడుదల చేసింది. దీనిపై తేజస్వి స్పందిస్తూ...జేడీయూ పాలనలో అవినీతి, అక్రమంగా సాగుతున్న మద్యం అమ్మకాలు వెలుగులోకి రావడంతో సీఎం నితీశ్ ప్రతిష్ట దెబ్బతింటోందని దానికి బదులుగానే తన పాత ఫొటోను తాజాగా తెరపైకి తెచ్చారని ఆరోపించారు. గుర్తు తెలియని యువతితో తేజస్వి ఉండగా వారి వెనక బీర్ సీసా ఉన్నట్లు చూపుతున్న ఆ ఫొటోను జేడీయూ నేతలు విడుదలచేశారు. కాగా, తేజస్వి స్పందిస్తూ.. ‘ఆ ఫొటో నేను రాజకీయాల్లోకి రాకముందుది. ఐపీఎల్ టోర్నమెంట్ సమయంలో తీసిఉండొచ్చు. ఆమెతో నాకు పరిచయం లేదు. అయినా ఆ ఫొటోలో అభ్యంతరకరంగా ఏం ఉంది?’ అని వ్యాఖ్యానించారు. -
‘పోస్టర్’ గాలింపు..అదో తంతు..
సాక్షి, సిటీబ్యూరో: మనకు బాగా పరిచయమైన వ్యక్తినే కొన్నేళ్ల తర్వాత చూస్తే గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో అతనెవరో గుర్తించడం కూడా కష్టమే. అలాంటిది ఓ వ్యక్తికి సంబంధించిన కొన్నేళ్ల క్రితం నాటి ఫొటో ఆధారంగా ఇప్పుడు అతడిని పట్టుకోవడం సాధ్యమేనా..? కచ్చితంగా కాదనే సమాధానం వస్తుంది. ఇదే విషయాన్ని నయీం ఉదంతమూ స్పష్టం చేసింది. వీటి ఆధారంగా వీవీఐపీల పర్యటన సమయంలో నేరస్తులను గుర్తించేందుకు పోలీసులు వేసే ‘పోస్టర్లు’ చెప్పుకోవడానికే గాని పట్టుకోవడానికి కాదని తేలిపోతోంది. ప్రధాని వచ్చినప్పుడూ అదే తంతు.. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 7న రాష్ట్రానికి వచ్చారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అత్యంత ముప్పు పొంచి ఉన్న వీవీఐపీగా పరిగణించే ప్రధాని పర్యటనకు పోలీసులు పటిష్ట బం దోబస్తు ఏర్పాటు చేశారు. సభ/సమావేశ ప్రాంగణంలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అడుగడుగూ జల్లెడ పట్టారు. దీనికి తోడు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులు, మావోయిస్టుల ఫొటోలతో అందరినీ పోల్చిచూసే ప్రయత్నం చేస్తారు. ఒక్క ఎల్బీ స్టేడియం వద్దే కాదు.. దేశ వ్యాప్తంగా ఎక్కడ మోడీ టూర్ జరిగినా ఇదో తంతుగా మారిపోయింది. ఫొటోలను ఇలా సేకరించి.. ‘వాంటెడ్’ జాబితాలో ఉన్న వ్యక్తుల ఫొటోలు సేకరిం చేందుకు పోలీసులు అనేక మార్గాలు అన్వేషిస్తుంటారు. ఆయా వ్యక్తులు గతంలో ఏదైనా కేసులో అరెస్టయి ఉంటే ఇబ్బంది లేదు. పోలీసు రికార్డుల నుంచి వాటిని తేలిగ్గా తీసుకోవచ్చు. అలా కానప్పడు వారి బంధువులు, పరిచయస్తుల ద్వారా సేకరిస్తారు. ఇది సాధ్యం కాకపోతే ప్రభుత్వ రికార్డులు, అనేక సందర్భాల్లో వారు విద్యనభ్యసించిన స్కూలు రికార్డులూ ఆధారమవుతాయి. ఇవన్నీ సదరు నేరగాడు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడానికి కొన్నేళ్ల క్రితం నాటివే అవుతాయి. అయినప్పటికీ వీటి ఆధారంగానే పోలీసులు వాంటెడ్ నోటీసులు జారీ చేయడంతో పాటు రివార్డులు ప్రకటించి గాలింపు చేపడుతుంటారు. ఇలా ఏ మార్గంలోనూ ఫొటో లభించని పక్షంలో ‘స్కెచ్’ల ద్వారా కథ నడుపుతారు. అసాధ్యమని చెప్పిన ‘నయీమ్’ ఉదంతం.. పాత ఫొటోల ఆధారంగా చేపట్టే ‘గాలింపు’తో ఫలితాలు ఉండవని గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఉదంతం స్పష్టం చేసింది. ఇతడు ఎన్కౌంటర్ అయ్యే నాటికి దాదాపు 13 ఏళ్ల క్రితం నాటి అతడి ఫొటోనే పోలీసుల వద్ద ఉంది. అప్పట్లో పోలీసుల ఎదుట లొంగిపోయినప్పుడు సేకరించి రికార్డుల్లో భద్రపరిచారు. దీని ఆధారంగానే ఇన్నాళ్ల పాటు అతడి కోసం పోలీసులు ‘వేటాడారు’. ఎన్కౌంటర్ తర్వాత ఫొటో, అతడి డెన్స్‌లో దొరికిన ఫొటోలను పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు. పాత ఫొటో ఆధారంగా ఎంత గాలించినా నయీమ్ వేషం మార్చుకోకున్నా పట్టుకోవడం అసాధ్యమని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇలాంటి చర్యలు పోలీసు స్ట్రాటజీలో భాగమని, సదరు పోస్టర్లతో తనిఖీలు జరుగుతున్నట్లు తెలిస్తే ఆయా ముష్కరులు వెనుకడుగు వేసే ఆస్కారం ఉందని పేర్కొంటున్నారు. ‘మామూలు వాళ్లనూ’ గుర్తించలేం.. ప్రధాని మోడీ సభ నేపథ్యంలో పోలీసులు ముద్రించిన పోస్టర్లను పరిశీలిస్తే.. ఆ సైజులో ఉండే ఫొటోలతో అజ్ఞాతంలో ఉన్న వాంటెడ్ వారి విషయం అటుంచితే.. నిత్యం కళ్ల ముందు సంచరించే వారినీ గుర్తించలేమని కొందరు పోలీసులు అంటున్నారు. బందోబస్తు ఏర్పాట్లలో భాగంగా పోలీసులు చేతుల్లో ఇమిడేలా, రెండు రకాల పోస్టర్లను ముద్రించారు. ఒక దానిపై 37 మంది వాంటెడ్ ఉగ్రవాదులు, మరో దానిపై 12 మంది వాంటెడ్ మావోయిస్టుల ఫొటోలు ముద్రించారు. ఈ సైజులో ఫొటోలు స్పష్టంగా ఉన్నప్పటికీ కదులుతున్న వారితో పోల్చడం సాధ్యం కాదని తెలుస్తోంది పోలీసులు విడుదల చేసిన పోస్టరు