Omicron COVID Variant-First Picture of Omicron: ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందనుకుంటన్న కరోనా వైరస్ మరో కొత్త రూపం దాల్చి ప్రజల ముందుకొచ్చింది. దక్షిణాఫ్రికాలో కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా ప్రకటించింది. ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి అత్యంతవేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
తాజాగా రోమ్‌లోని ప్రతిష్టాత్మకమైన బాంబినో గెసో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒమిక్రాన్ మొదటి ఫోటోను విడుదల చేసింది. ఈ చిత్రం ఒక మ్యాప్‌లా కనిపిస్తోంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌లో ఎక్కువ మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కరోనా వైరస్‌లో వచ్చిన వేరియంట్లలో అన్నిటికన్నా ఎక్కువగా జన్యు ఉత్పరివర్తనలు జరిగిన వేరియంట్ ఒమిక్రాన్ అని వెల్లడించింది. ఒమిక్రాన్ ఉత్పరివర్తనలు మరింత ప్రమాదకరమైనవని రోమ్ పరిశోధకుల బృందం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే భవిష్యత్తులో సోకే కొత్త వేరియంట్లకు కారణమవుతాయని పేర్కొంది.
చదవండి: Omicron Variant: ‘ఒమిక్రాన్’ వేరియెంట్ కథాకమామిషూ
అయితే ఒమిక్రాన్‌తో వ్యాప్తి ప్రభావం పెరుగుతుందా లేదా వ్యాక్సిన్ల ప్రభావం తగ్గుతుందా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమని పరిశోధకులు పేర్కొన్నారు. కాగా డెల్టాతో సహా ఇతర వేరియంట్‌లతో పోల్చితే ఓమిక్రాన్ మరింతగా వ్యాపించగలదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. ఒమిక్రాన్.. ఇతర కోవిడ్ వేరియంట్‌ల కంటే భిన్న లక్షణాలు ఉన్నాయడానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలిపింది.
చదవండి: ఒమిక్రాన్ గుబులు.. దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు 185 మంది
The first photo of the #OmicronVariant (B.1.1.529), SARS-CoV-2 Variant of Concern, at the Bambino Gesù Children’s Hospital in Rome pic.twitter.com/tCuujpeqsY
— Dimitrios Varvaras MD, PhD (@MdVarvaras) November 28, 2021
Comments
Please login to add a commentAdd a comment