physiotherapist
-
దక్షిణ ధ్రువంలో పోలార్ ప్రీత్ విజయ యాత్ర
లండన్: అంటార్కిటికా అన్వేషణలతో పోలార్ ప్రీత్‌గా పేరు తెచ్చుకున్న బ్రిటిష్ సిక్కు ఆర్మీ అధికారి, ఫిజియోథెరపిస్ట్ కెప్టెన్ హర్‌ప్రీత్ చాంది(33) మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దక్షిణ ధ్రువంపై ఒంటరిగా వేగవంతంగా అన్వేషణ పూర్తి చేసుకున్న మహిళగా తాజాగా చరిత్ర సృష్టించారు. రోన్నె ఐస్ షెల్ఫ్ నుంచి నవంబర్ 26న ప్రారంభించిన యాత్ర దక్షిణ ధ్రువానికి చేరుకోవడంతో గురువారంతో ముగిసినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. రోజుకు 12 ,13 గంటల చొప్పున ముందుకు సాగుతూ మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మొత్తం 1,130 కిలోమీటర్ల దూరాన్ని ఎవరి సాయం లేకుండానే 31 రోజుల 13 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేశానన్నారు. ఈ ఫీట్‌ను గురించి గిన్నిస్ వరల్డ్ బుక్ నిర్వాహకులకు వివరాలందించానని, ధ్రువీకరణ కోసం వేచి చూస్తున్నానని చెప్పారు. అంటార్కిటికా అన్వేషణలకు సంబంధించి కెప్టెన్ హర్‌ప్రీత్ చాంది పేరిట ఇప్పటికే రెండు వేర్వేరు రికార్డులు నమోదై ఉన్నాయి. -
పెళ్లాన్ని వదిలేసి.. స్వాతిరెడ్డితో వివాహం.. కట్ చేస్తే ఇంట్లో విగతజీవిగా
గుంటూరు ఈస్ట్: ఇంట్లో ఒంటరిగా ఉన్న ఫిజియోథెరపిస్టు హత్యకు గురైన ఘటనపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పల్నాడు జిల్లా బెల్లంకొండకు చెందిన సత్తెనపల్లి సీతారామాంజనేయులు (36) గుంటూరులోని ఓ ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నాడు. సీతారామాంజనేయులు గతంలో తన సోదరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అయితే భార్యను బెల్లంకొండలోనే వదిలేసి గుంటూరులోని గుంటూరువారితోట 5వ లైనులో నివాసం ఉంటున్నాడు. తాను పనిచేసే ఆస్పత్రిలోనే ఫార్మాసిస్టు అయిన స్వాతిరెడ్డిని రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే వీరి వివాహం స్వాతిరెడ్డి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. స్వాతిరెడ్డి సంవత్సరన్నర క్రితం యూఎస్‌లో ఎం ఫార్మసీ చేసేందుకు వెళ్లింది. సీతారామాంజనేయులు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రోజూ విధులకు వెళ్లి వస్తుంటాడు. నవంబరు 1న స్వాతిరెడ్డి యూఎస్ఏ నుంచి గుంటూరు రానుంది. స్వాతిరెడ్డి తండ్రి పి.శ్రీనివాసరెడ్డి ఆర్టీసీ ఉద్యోగి. శ్రీనివాసరెడ్డి ఆదివారం రాత్రి సీతారామాంజనేయులు ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్లినట్లు సమాచారం. సోమవారం ఉదయం సీతారామాంజనేయులు అసిస్టెంట్ వచ్చేటప్పటికి అతను విగత జీవుడై రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దీంతో అసిస్టెంట్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీతారామాంజనేయులు తలకు బలమైన గాయమైంది. ఈస్ట్ అడిషనల్ ఎస్పీ నచికేత్ షల్కి, కొత్తపేట ఎస్హెచ్ఓ షేక్ అన్వర్‌బాషా ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. -
పరారీలో ఫిజియోథెరపిస్ట్.. ఆ వ్యాపారం ఏమైందో తెలీదు కానీ!
సాక్షి, అనంతపురం: అప్పులు చేసి.. తిరిగి ఇవ్వకుండా ఫిజియోథెరపిస్ట్ పరారైన ఘటన అనంతపురంలో వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాసనగర్‌లో ఫిజియోథెరపిస్ట్ రఘువీరప్రసాద్ ఫిజియోథెరపీ సెంటర్ నిర్వహిస్తున్నాడు. తనవద్దకు ఫిజియో థెరపీ కోసం వచ్చే వారితో పాటు స్నేహితులు, సన్నిహితుల నుంచి అప్పులు తీసుకున్నాడు. మంచివాడని, ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో తమ డబ్బు ఎక్కడికి పోతుందిలే అన్న ధైర్యంతో అందరూ ధర్మ వడ్డీకి ఇచ్చారు. అలా రూ.3 కోట్ల వరకు అప్పులు చేసిన రఘువీర ప్రసాద్ రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. ఆ వ్యాపారం ఏమైందో తెలీదు కానీ తనవద్ద డబ్బులు లేవని, అప్పు చెల్లించే పరిస్థితిలో లేనని ఐపీ నోటీసులు పంపాడు. ఫిజియో థెరపిస్ట్ ఇంటికి తాళం వేసి భార్య, పిల్లలు, తల్లితో కలిసి పరారయ్యాడు. ధర్మ వడ్డీ పేరుతో తమ వద్ద డబ్బు తీసుకుని ఇప్పుడు నోటీసులు పంపితే ఎలా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని ఎగ్గొట్టే చర్యలకు పాల్పడుతున్న ఇతనిపై కఠిన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. చదవండి: (అందం చూసి అనుమానం.. నవ వివాహితను చంపిన సైకో భర్త) -
ఐపీఎల్లో కరోనా కలకలం.. సీజన్లో తొలి కేసు నమోదు..!
ఐపీఎల్లో కరోనా కలకలం రేగింది. ప్రస్తుత సీజన్లో తొలి కరోనా కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్యాట్రిక్‌ను ఐసోలేషన్‌కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ప్యాట్రిక్ గత రెండు రోజులుగా ఢిల్లీ జట్టు సభ్యులతో కలియతిరగడంతో ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్యాట్రిక్‌కు కరోనా నిర్ధారణ అయిన విషయంపై డీసీ ఫ్రాంచైజీ వర్గాలు స్పందించాల్సి ఉంది. ప్యాట్రిక్ కరోనా బారిన పడినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో రేపు (ఏప్రిల్ 16) ఢిల్లీ, ఆర్సీబీ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్యాట్రిక్ గతంలో టీమిండియా ఫిజియోగా కూడా పనిచేశాడు. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్.. రంగంలోకి దిగిన స్టార్ ఆల్‌రౌండర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కొత్త స్టెప్ వేశారు
ఇండియన్ ఇండస్ట్రీలో స్టార్స్ అందరితో ప్రభుదేవా స్టెప్స్ వేయిస్తుంటారు. అయితే ఆయన లైఫ్‌లో ఓ కొత్త స్టెప్ వేశారని తెలిసింది. రెండోసారి పెళ్లి చేసుకున్నారట. కొన్ని రోజులుగా ప్రభుదేవా తన మేనకోడల్ని పెళ్లి చేసుకుంటున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. అయితే అది నిజం కాదట. ముంబైలోని ఓ ఫిజియోథెరపిస్ట్‌ను వివాహం చేసుకున్నారట ప్రభుదేవా. సెప్టెంబర్‌లో వీరి వివాహం చాలా చిన్న వేడుకగా జరిగిందట. ఈ ఇద్దరి పరిచయం కూడా విచిత్రంగా జరిగిందని టాక్. వెన్ను నొప్పి సమస్యలో భాగంగా ఈ ఫిజియోథెరపిస్ట్‌ను కలిశారట ప్రభుదేవా. అక్కడి నుంచి వీళ్ల మధ్య స్నేహం ఏర్పడి, ప్రేమగా మారి, పెళ్లి వరకూ వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ చెన్నైలో ఉంటున్నారని సమాచారం. గతంలో రమలత్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ప్రభుదేవా. రమలత్ ప్రభుదేవా జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత నయనతారతో ప్రేమలో పడటం, బ్రేకప్ విషయం తెలిసిందే. మరి.. ఫిజియోథెరపిస్ట్, ప్రభుదేవా సెవన్ స్టెప్స్ వేసారా? నిజమేంటో? -
సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా!
చెన్నై : దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుధేవా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. బిహార్‌కు చెందిన ఫిజియోథెరపిస్ట్‌తో సెప్టెంబర్‌లోనే ఏడడుగులు వేసినట్టు తెలిసింది. ముంబైలోని ప్రభుదేవా నివాసంలో అత్యంత రహస్యంగా వివాహం చేసుకున్న ఈ కొత్త జంట ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుదేవాకు అత్యంత సన్నిహితులైన ఒకరు మీడియాతో పంచుకున్నారు. అయితే ఈ విషయంపై ప్రభుదేవా మాత్రం స్పందించలేదు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వెన్నముక సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రభుదేవా పిజియోథెరపీ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు చికిత్స అందించిన డాక్టర్‌తో ప్రభుదేవా ప్రేమలో పడ్డారు. కొంతకాలం డేటింగ్ అనంతరం వీరిద్దరూ పెళ్లిబంధంతో ఒకటయ్యారు. అయితే ప్రభుదేవా రెండో పెళ్లిపై గత కొంతకాలంగా కోలీవుడ్‌లో పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తన చుట్టాలమ్మాయితో రిలేషన్ షిప్లో ఉన్నట్లు త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు షికార్లు చేయగా ప్రస్తుతం అది ఫేక్ న్యూస్ అని స్పష్టమవుతోంది. (ముక్కాల ముక్కాబులా అంటున్న వార్నర్) మొదట 1995లో రామలతను వివాహం చేసుకున్న ప్రభుదేవా 2011లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ నయనతారతో ప్రేమ చిగురించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రేమ ఎక్కువకాలం నిలవలేదు. ఇక నయనతార కూడా ముందు శింబు, ప్రభుదేవాతో ప్రేమలో పడిన ఈ భామ ప్రస్తుతం డెర్టెక్టర్ విఘ్నేష్ శివన్‌తో రిలేషన్షిప్లో ఉన్నారు. ప్రభుదేవా ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘రాధే’ సినిమా చేస్తున్నాడు. దిశా పటానీ కథానాయిక. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీటీలో విడుదల చేసేది లేదని వచ్చే ఏడాది జనవరిలో లేదా ఈద్ పండగకు థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తునట్లు ప్రభుదేవా వెల్లడించారు. (గర్ల్‌ఫ్రెండ్‌కు విఘ్నేశ్ ప్రత్యేక బర్త్‌డే విషెస్) -
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మనోజ్ అరెస్ట్
-
సైనాకు కేంద్రం రూ. 9 లక్షల సాయం
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు కేంద్రం ప్రభుత్వం 9 లక్షల రూపాయలు సాయం చేసింది. 2016 రియో ఒలింపిక్స్ సన్నాహకాల్లో భాగంగా సైనా పూర్తి స్థాయి ఫిజియోథెరపిస్ట్‌ను నియమించుకునేందుకుగాను కేంద్ర క్రీడల శాఖ ఈ మొత్తాన్ని మంజూరు చేసింది. ఈ నెల నుంచి 15 నెలల కాలానికి ఫిజియోథెరపిస్ట్‌కు నెలకు 60 వేల రూపాయల చొప్పున ఈ మొత్తాన్ని కేటాయించారు. ఫిజియోథెరపిస్ట్‌గా ఎవరు ఉండాలన్న విషయాన్ని సైనాయే నిర్ణయించుకోవచ్చని కేంద్ర క్రీడల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సైనా ప్రస్తుతం బెంగళూరులోని ప్రకాశ్ పదుకొన్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. లండన్ ఒలింపిక్స్‌లో సైనా కాంస్యం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఫిజియోథెరపీ కౌన్సెలింగ్
రెండు రోజుల క్రితం నేను మోటారు సైకిల్ కిక్ కొడుతుండగా కిక్రాడ్ వెనక్కి తన్నడంతో కాలి వెనక మడమపై భాగంలో తీవ్రంగా దెబ్బ తగిలింది. అది చాలా నొప్పిగా ఉంది. ఈ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి? - రాజు, చౌటుప్పల ఇలాంటి దెబ్బ తగలగానే అది తగిలిన చోట ఐస్ పెట్టడం వల్ల నొప్పి తగ్గుతుంది. దెబ్బ తగిలి ఇప్పటికే రెండు రోజులు అయ్యిందంటున్నారు కాబట్టి మీ కాలికి రెండు రకాల చికిత్స చేయవచ్చు. మొదటిది ఒక బకెట్లో కాస్త వేడి నీరు తీసుకొని నొప్పి ఉపశమించేలా కాలిని ముంచి పెట్టడం. ఇక రెండో పద్ధతిని కాంట్రాస్ట్ బాత్ ప్రక్రియ అంటారు. ఈ పద్ధతిలో ఒక వేడి నీళ్ల బకెట్నూ, మరో చల్లటి నీళ్ల బకెట్నూ తీసుకోవాలి. ఈ రెండు బకెట్లనూ పక్కపక్కనే పెట్టి వేడినీళ్ల బకెట్లో మూడు నిమిషాల పాటు కాలిని ఉంచి, ఆ వెంటనే తీసి చల్లటి నీళ్ల బకెట్లో ఒక నిమిషం సేపు ఉంచాలి. ఇలా (ఆల్టర్నేట్గా) బక్కెట్లను మారుస్తూ వేడినీటి బకెట్లో నాలుగుసార్లు (4 గీ 3 = 12 నిమిషాలు) చల్లటి నీళ్ల బక్కెట్లో మూడు సార్లు (3 గీ 1 = 3) మొత్తం 15 నిమిషాలు ఈ ప్రక్రియ కోసం వెచ్చిస్తే మీ నొప్పి తగ్గుతుంది. నేను వీధిలో వెళ్తుండగా గల్లీ క్రికెట్ ఆడుతున్న పిల్లలు విసిరిన బంతి భుజానికి తగిలింది. దాంతో భుజం విపరీతంగా నొప్పిగా ఉంది. ఈ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి? - యాదగిరి, హైదరాబాద్ ఇప్పుడు మార్కెట్లో హాట్ ఫర్మెంటేషన్ కోసం వేడి నీళ్లు నింపే బ్యాగ్స్ లభ్యమవుతున్నాయి. వీటిని కొని ఆ బ్యాగ్‌లో వేడి నీరు నింపి 15 నిమిషాల పాటు కాపడం పెట్టాలి. ఈ హాట్ వాటర్ ఫర్మెంటేషన్ ప్రక్రియ తర్వాత సున్నితంగా భుజాన్ని అన్నివైపులకూ తిప్పాలి. నొప్పిగా ఉంటే బలవంతంగా తిప్పకూడదు. నిద్రపోయే సమయంలో నొప్పిగా ఉన్న భుజం కింద తలగడ పెట్టుకోవాలి. ఒకవేళ దెబ్బ తగిలిన చోట ఎర్రబారడం, వాపు ఉంటే ఐస్ కాపడం పెట్టాలి. ఎన్. మేరి, ఫిజియోథెరపిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
క్రీడా వైద్యంలో మైలురాయి
నాగపూర్: గత కొన్ని సంవత్సరాలుగా నగరంలో గణనీయంగా క్రీడలు పెరుగుతున్నాయి. దానికనుగుణంగా క్రీడా వైద్యం పరిణామం చెందుతోంది. ఇప్పుడు ఎవరెనా నగరంలో క్రీడా సంబంధిత గాయాలకుసంబంధిత ఫిజియోథెరపిస్టుల నుంచి ప్రత్యేక వైద్యం అందుకోవచ్చు. గాయాల ఘటనలు పెరుగుతుండటంతో ఆయా రంగాల్లో క్రీడల శస్త్ర చికిత్స నిపుణుల అవసరం పెరుగుతున్నది. ఈ వ్యాధుల చికిత్స కోసం ఇప్పటికే నగరంలో కొన్ని సౌకర్యాలున్నా డాక్టర్ సతీష్ సోనార్ ఏర్పాటు చేసిన ద స్పోర్ట్స్ మెడ్ జాయింట్ కేర్ సెంటర్ అదనం. ఎండోస్కోపీతో కీళ్ల స్థితిని పరిశీలించడం, శరీరంలోని అన్ని కీళ్ల శస్త్రచికిత్సల కు ప్రత్యేకమైన ఆయన తుంటి కీలు శస్త్రచికిత్సలోనూ నిపుణుడు. క్రీడా సంబంధిత గాయాలన్నింటికి చికిత్సను ఒకే గూటి కిందికి తెచ్చి అధునాతన సౌకర్యాలతో ఆస్పత్రి ఏర్పాటు చేశారు. క్రీడల వల్ల అయ్యే చాలా గాయాలకు సంప్రదాయ పద్ధతులైన విశ్రాంతి, ఐస్ ముక్కలు, ఒత్తిడి, పునరుద్ధరణ వంటి థెరపీతోనే తగ్గించవచ్చునని, కొన్ని గాయాలకు మాత్రమే శస్త్ర చికిత్స అవసరమవుతుందని డాక్టర్ సతీష్ తెలిపారు. నగరంలో కొద్దిమంది నిపుణులైన స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్టులు ఉన్నా... సాధారణంగా అందరూ సాధారణ ఎముకల వైద్యుల దగ్గరికే వెళ్తున్నారు. క్రీడా వైద్యం పెంచడం ద్వారా ఒక్క క్రీడాకారులనే కాకుండా ఇతరులను కూడా క్రీడలవైపు ప్రోత్సహించడమవుతుందని గత కొన్నేళ్లుగా క్రీడా వైద్య సంస్థను నడిపిస్తున్న సీనియర్ ఆర్థోపెడీషియన్ డాక్టర్ సంజయ్ మార్వా చెబుతున్నారు. ‘అన్ని కీళ్ల గాయాలకు నేను చికిత్స చేయలేను. అందుకే అందుకోసం ప్రత్యేకించి ఒక కీ ళ్ల వ్యాధుల వైద్య కేంద్రం అవసరం నగరానికి ఎంతైనా ఉంది’ అనిఆయన అభిప్రాయపడ్డారు. ‘ప్రత్యేకించి క్రీడా వైద్యంలోనే చికిత్స అందిస్తున్న సర్జన్స్ రావడం, కేవలం క్రీడలకే కాదు, అది ఇతర వైద్యులకు శుభ సూచకం. ‘క్రీడాకారులకు ప్రత్యేకమైన చికిత్స అవసరమవుతుంది. వారు కండరాల గాయాలతోనే కాదు... కీళ్ల గాయాలతోనూ బాధపడుతుంటారు. వీటికి గనుక అంకితభావం కలిగిన, ప్రత్యేకతలున్న డాక్టర్లుంటే చికిత్స నాణ్యత పెరుగుతుంది’ అని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మరియు ఆస్పత్రి ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ సత్యజిత్ జగతప్ అన్నారు. సాధారణంగా క్రీడాకారులు చికిత్స కోసం నగరాన్ని వదిలి వెళ్లడానికి ఇష్టపడక పోవడానికి కారణం సమయం వృథా అవడంతోపాటు ఖరీదైనది కూడా కావడమే అని న గరానికి చెందిన రంజీ క్రీడాకారుడు ఫయాజ్ ఫజల్ అన్నారు. ‘ప్రతి ఒక్క క్రీడాకారుడు అత్యున్నత స్థాయికి చేరుకోకపోవచ్చు. అయితే దానర్థం అతనికి లేదా ఆమెకు సరైన చికిత్స అవసరం లేదని కాదు. నగరంలో కొత్తగా కీళ్ల సంబంధ వ్యాధుల చికిత్స కేంద్రం ఏర్పాటు చేశారని తెలిసింది. నగరంలో క్రీడా వైద్యం పెరగడం సంతోషాన్నిస్తోంది’ అని ఫజల్ అన్నారు. వీటి ఏర్పాటు వళ్ల క్రీడాకారులు ఎంతో ప్రయోజనం పొందుతారని స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ ఆశిష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఈ చికిత్సలో ఎన్నో కొత్త సాంకేతిక పద్ధతులను నగరానికి ఆయన పరిచయం చేశాడు. పూర్తి స్థాయి కీళ్లవ్యాధుల చికిత్స కేంద్రాన్ని నగరంలో ఏర్పాటు చేయడాన్ని క్రికెట్ కోచ్ ప్రవీణ్ హింగనికర్తోపాటు బ్యాడ్మింటన్ కోచ్ జి.బి.వర్గీస్ కూడా స్వాగతించారు. ‘క్రీడలు, క్రీడాకారులు పెరుగుతున్న మాట వాస్తవం. కానీ సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, క్రమశిక్షణారాహిత్యమైన సాధన వల్ల క్రీడాకారులకు గాయాలు కూడా పెరుగుతున్నాయి. ప్రత్యేకించి క్రీడా సంబంధిత వైద్యం అందించే డాక్టర్లుండటం ఆటగాళ్లకు ఓ వరం. క్రీడాకారులకు అయ్యే గాయాలకు అధునాతన చికిత్స పద్ధతులు నగరంలో అందుబాటులోకి రావడం ఆనందాన్నిస్తోంది’అని క్రికెట్ కోచ్ ప్రవీణ్ హింగనికర్ తెలిపారు. నగరంలో వీటి ఏర్పాటుతో క్రీడాకారులు చికిత్స కోసం మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని వ ర్గీస్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నగరంలో క్రీడా వైద్య సదుపాయాలు పెరుగుతుండటంతో నగర బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అరుంధతి పంట్వానే, సారంగ్ లఖానీ హర్షం వ్యక్తం చేశారు. భుజానికి గాయాల కారణంగా ప్రస్తుతం అరుంధతి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఫిజియోథెరపిస్టులు చాలా మందే ఉన్నప్పటికీ శస్త్ర చికిత్సల్లోనూ నిపుణులైన వారు ఉండటం ప్రయోజనకరమైనదని చెబుతున్నారు.