Pickled meat
-
‘నాటు’ టేస్టు.. విదేశాల్లో హిట్టు.. నోరూరించే పచ్చడి.. కేరాఫ్ జగిత్యాల రైతు
జగిత్యాల అగ్రికల్చర్: ఎంత బ్రాయిలర్ కాలమైనా నాటు కోడి రుచే వేరు. అందుకే ఓ రైతు రొటీన్‌కు భిన్నంగా ఆలోచించారు.. అందరిలా కాకుండా నాటుకోళ్లు పెంచుతూ వాటి మాంసంతో పచ్చళ్లు తయారు చేస్తున్నారు. కమ్మని రుచితో అందరి మనసు దోచుకుంటున్నారు. ఆయన చేతి పచ్చళ్లు రుచి చూసిన గ్రేటర్ హైదరాబాద్ వాసులే కాదు.. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఉండే మనవారు కూడా ఇక్కడ ఉండే తమ బంధువుల ద్వారా ఆర్డర్లపై ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. మామిడితోటలో నాటుకోళ్ల ఫారం జగిత్యాల జిల్లా రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఎడ్మల మల్లారెడ్డికి గ్రామ శివారులో ఐదెకరాల మామిడితోట ఉంది. అందులో రెండు షెడ్లు నిర్మించారు. ఒక్కో బ్యాచ్‌లో 500 నాటుకోళ్ల పెంపకం చేపట్టారు. ఒక్కోటి 1.5 కేజీల నుంచి 2 కేజీల బరువు అయ్యే వరకూ దాణా అందిస్తున్నారు. పెట్టని కేజీకి రూ.400 చొప్పున వినియోగదారులకు నేరుగా విక్రయిస్తున్నారు. పుంజు మాంసంతో చికెన్ పకోడి వంటి ఆహార పదార్థాలు తయారు చేస్తూ వాటినీ నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నారు. ఆర్డర్‌రాగానే.. మల్లారెడ్డి నాటుకోడి మాంసంతో తయారు చేసే ఆహార పదార్థాల్లో పచ్చడి అతి ప్రధానమైంది. కస్టమర్ల నుంచి ఆర్డర్ రాగానే పచ్చడి తయారీ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ముగ్గురు కూలీల సాయం తీసుకుంటున్నారు. పచ్చడి కోసం కోడి పుంజును వినియోగిస్తున్నారు. గ్యాస్ వాడకుండా కట్టెల మీద కాల్చడం మరో విశేషం. బోన్‌లెస్ ముక్కలను ఉడికించి, నూనెలో వేపడం ద్వారా ప్రత్యేకంగా తయారు చేసుకున్న మసాలాలతో పచ్చడి తయారు చేస్తున్నారు. పెరిగిన ఆర్డర్లు.. నాటుకోడి పచ్చడి రుచిచూసిన కస్టమర్లు.. తమ బంధువులు, స్నేహితుల కోసం ఆర్డర్లు ఇస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాలతోపాటు విదేశాల్లోని తమవారికీ పంపిస్తున్నారు. ఆర్డర్లు భారీగా వస్తుండటంతో మల్లారెడ్డి ఇతర రైతుల నుంచి కూడా కోడిపుంజులను హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తున్నారు. ఏదైనా కొత్తగా ఉంటేనే ఆదరణ ఏదైనా వినూత్నంగా ఆలోచించి వినియోగదారులను ఆకర్షించగలగాలి. అదే ఉద్దేశంతో నేను నాటు కోడి పచ్చడి తయారీ ప్రారంభించా. కోళ్లను నేరుగా విక్రయించే బదులు పచ్చడి తయారుచేసి అమ్మడం లాభదాయకం. ఇందులో శ్రమ ఉంటుంది, ఖర్చూ ఉంటుంది. అలాగే లాభమూ వస్తుంది. –ఎడ్మల మల్లారెడ్డి బంధువులే తొలి కస్టమర్లు.. ఈ పచ్చడిని అరకిలో, కిలో చొప్పున ప్యాక్ చేస్తున్నారు. ఆరు నెలలుగా ‘ఏఎంఆర్ ఇంటిగ్రేటెడ్ ఫామ్’బ్రాండ్ పేరిట అర్ధకిలో రూ.700, కిలో రూ.1,400 చొప్పున విక్రయిస్తున్నారు. తొలుత బంధువులు, పరిచయస్తుల్లో ప్రాచుర్యం పొందింది. క్రమంగా వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. కావాలనుకున్న వారు ఆన్లైన్లో చెల్లింపులు చేశాక ఒక్కరోజులోనే పచ్చడి తయారు చేసి అందజేస్తున్నారు. -
పేదోడి ఇంట పచ్చడి మెతుకులూ కష్టమే
ఖమ్మం (మధిర) : గ్యాస్, నిత్యావసరాలతో పాటు కూరగాయల ధరలు పెరుగుతుండగా... పచ్చడితోనైనా కడుపు నింపుకుందామని భావించే పేదలకు అది కూడా భారంగా మారుతోంది. దిగుబడి తగ్గడంతో పెరిగిన మామిడి కాయల ధరలకు తోడు, పచ్చడి తయారీకి ఉపయోగించే ఇతర దినుసుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్న తరుణాన ఈ ఏడాది పలువురు పచ్చడిపైనే ఆశలు వదిలేసుకున్నారు. దీంతో పేదలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఏటా పెట్టే మామిడికాయ పచ్చడి సువాసన ఈసారి అక్కడక్కడే వస్తోంది. వేసవి వచ్చిందంటే... వేసవికాలం వస్తుందంటే అన్ని వర్గాల ప్రజలు మొదటగా మామిడికాయ పచ్చడిపైనే దృష్టి సారి స్తారు. ఇందుకోసం మేలు రకాల కాయలను ఎంచుకుని పచ్చడి పెట్టడం ఆనవాయితీ. ఇళ్లలో ఉపయోగానికే కాకుండా దూరప్రాంతాల్లో ఉంటున్న బంధువులు, కుటుంబీకులకు పంపించేందుకు గాను అవసరమైన పచ్చడి కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ఈసారి మామిడి పూత పెద్దగా రాకపోగా, వచ్చిన పూత కూడా తెగుళ్ల బెడదతో నిలవలేదు. దీంతో మామిడికాయల ధరలు అమాంతకం పైకి వెళ్లాయి. ఫలితంగా పచ్చడి కోసం కాయల కొనుగోలుకు వస్తున్న వారు ధరలు చూసి నిరాశగా వెనుతిరుగుతున్నారు. మటన్ ముక్కలే... చాలా మంది ఇళ్లలో మామిడికాయ పచ్చడి ఇష్టంగా తింటారు. దీనికి తోడు ఉదయం ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం వెళ్లే వారి క్యారేజీల్లో పచ్చడి తప్పక కనిపిస్తుంది. కానీ ఈసారి కాయల కొరత, పెరిగిన ధరలతో పచ్చడి పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించకపోగా, కొందరు పెడుతున్నా యాభై కాయలకు బదులు పది, ఇరవై కాయలతో సరిపుచ్చుకుంటున్నారు. దీంతో బంధువులకు పంపించడం మాటేమో కానీ ఇంట్లో పెట్టిన పచ్చడిని జాగ్రత్తగా కాపాడుకుంటూ తినాల్సిందేనని చెబుతున్నారు. ఏపీ నుంచి దిగుమతి సాధారణంగా పచ్చడి తయారీకి చిన్నరసాలు, పెద్దరసాలు, జలాలు, తెల్లగులాబీ, నాటు తదితర రకాలను వినియోగిస్తారు. అయితే, జిల్లాలో 2018 – 19లో 1.20లక్షల ఎకరాలు, 2019 – 20లో 70వేలు, 2020 – 21లో 31,994, 2021 – 22లో 33,861 ఎకరాల్లో మామిడిసాగు విస్తీర్ణం ఉంది. చీడపీడలు ఆశించడం, అధిక వర్షాలు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలతో చాలా మంది రైతులు తోటలను తొలగించారు. అలాగే, ఉన్న తోటల్లోనూ ఈసారి పెద్దగా దిగుబడి లేదు. దీంతో ఆంధ్రా సరిహద్దులో ఉన్న తిరువూరు, నూజివీడు, విస్సన్నపేట, ఎ కొండూరు, చింతలపూడి తదితర ప్రాంతాలనుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా మామిడికాయలకు ధర పెరిగిందని చెబుతున్నారు. ఆ జోలికే వెళ్లలేదు... ప్రతిరోజూ పనులకు వెళ్తుంటాం. ఉదయం వంట చేసుకోలేనందున ఎండాకాలంలో మామిడి కాయ పచ్చడి పెట్టి ఏడాదంతా వాడుకుంటాం. కానీ ఈసారి మామిడికాయలే కాదు నూనె ధర కూడా పెరిగింది. దీంతో ఈ ఏడాది పచ్చడి జోలికే వెళ్లలేదు. యాభై కాయలకు బదులు పది కాయలతో పచ్చడి పెట్టాలన్నా ధైర్యం చేయలేకపోయాం. – ఆదిలక్ష్మి, లడకబజార్, మధిర ఖర్చు ఇలా... మామిడి పచ్చడికి ఎక్కువగా ఉపయోగించే జలాల రకం కాయ ఒక్కొక్కటి రూ.40, చిన్నరసం రూ.30చొప్పున విక్రయిస్తున్నారు. దీనికి తోడు మిర్చి రకానికి అనుగుణంగా కేజీకి 250కు పైగా పలుకుతుండగా నూనె కేజీ ధర రూ.190 వరకు ఉంది. అలాగే, మామిడికాయ ముక్కలు కొట్టించడం, కారం పట్టించే ఖర్చు... ఎల్లిపాయలు, మెంతులు, ఉప్పు ఇలా దినుసుల ధరలు కూడా పెరి గాయి. ఫలితంగా ఈసారి పచ్చడి పెట్టడం భారంగా మారిందని సామాన్యులు వాపోతున్నారు. -
స్పెషల్ డిష్
జూబ్లీహిల్స్‌లోని సింప్లీసౌత్ రెస్టారెంట్లో ఊరగాయ మాంసం ఫేమస్ అని తెలుసు. కానీ... ఆ ఫేమస్ కర్రీని పరోటా కాంబినేషన్లో కలిపి ఆస్వాదిస్తే ఎలా ఉంటుందో తెలుసా! తెలంగాణ కోడి రోస్ట్ని టేస్ట్ చేశారా! తమ ఐకానిక్ డిష్ అంటూ వయామిలానో రెస్టారెంట్ ప్రకటించిన చికెన్ స్కాలపినీ విత్ మష్రూమ్ సాస్, ఈట్ ఇండియా కంపెనీ రెస్టారెంట్ అందించే 32 పొరల పరోటా ప్లస్ బ్రొకలీ కస్టమర్లకు మహా క్రేజీ. ఇక కౌజుపిట్ట ఫ్రై స్పైసీ వెన్యూకి హైలైట్ డిష్. ఫోర్‌సీజన్స్, ఐ గ్రిల్, లిటిల్ ఇటలీ... ఇలా సిటీలోని మొత్తం 16 రెస్టారెంట్లు తమకు మాత్రమే ప్రత్యేకమైన వంటకాలతో ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ‘రెలిష్ హైదరాబాద్’ ఈవెంట్ వినూత్న శైలి అనుభవాన్ని అందిస్తోంది. విశాలమైన ప్రాంగణంలో వెరైటీ హట్స్తో ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న ఈ ఈవెంట్ శుక్రవారం ప్రారంభమైంది. ఆదివారంతో ముగుస్తుంది. ఈ ఈవెంట్లో భాగంగా ఒకవైపు సెలబ్రిటీ చెఫ్‌లు అప్పటికప్పుడు తయారు చేసి అందించే స్పెషల్ డిష్‌లను టేస్ట్ చేసే అవకాశాన్ని విజిటర్స్‌కు కల్పించారు. అలాగే తొలిరోజు కలినరీ ఆర్ట్స్ కాంటెస్ట్‌లు, లైవ్ మ్యూజిక్ వంటివి ఉత్సాహంగా సాగాయి. పంజాబీ టేస్ట్ నగరవాసులకు పంజాబీ రుచులు అందిస్తోంది బేగంపేట్ హోటల్ తాజ్ వివంతా. నోరూరించే వెరైటీలతో ఏర్పాటు చేసిన ‘సింధి- పంజాబీ ఫుడ్ ఫెస్టివల్’ శుక్రవారం ప్రారంభమైంది. సింధి చాపా, లాల్ మిర్చీ కా పనీర్ టిక్కా, అమృత్సారి ఫిష్ టిక్కా, భున్నే లాసన్ దే ముర్గ్ టిక్కే, సాయ్ భాజీ, సింధి కోకి, సాత్ సాగి, పంజాబీ సాగ్ పనీర్, రస్మిసె ఆలూ వడియన్, పంజాబీ బటర్ చికెన్ వంటి వెరైటీలెన్నో ఇక్కడ వేడివేడిగా వండి వారుస్తున్నారు. వీటితో పాటు ట్రెడిషనల్ బ్రెడ్స్ కూడా టేస్ట్ చేయవచ్చు. ఈ నెల 9 వరకు ఈ విందు కొనసాగుతుంది.