స్పెషల్ డిష్
జూబ్లీహిల్స్‌లోని సింప్లీసౌత్ రెస్టారెంట్‌లో ఊరగాయ మాంసం ఫేమస్ అని తెలుసు. కానీ... ఆ ఫేమస్ కర్రీని పరోటా కాంబినేషన్‌లో కలిపి ఆస్వాదిస్తే ఎలా ఉంటుందో తెలుసా! తెలంగాణ కోడి రోస్ట్‌ని టేస్ట్ చేశారా! తమ ఐకానిక్ డిష్ అంటూ వయామిలానో రెస్టారెంట్ ప్రకటించిన చికెన్ స్కాలపినీ విత్ మష్రూమ్ సాస్, ఈట్ ఇండియా కంపెనీ రెస్టారెంట్ అందించే 32 పొరల పరోటా ప్లస్ బ్రొకలీ కస్టమర్లకు మహా క్రేజీ.
ఇక కౌజుపిట్ట ఫ్రై స్పైసీ వెన్యూకి హైలైట్ డిష్. ఫోర్‌సీజన్స్, ఐ గ్రిల్, లిటిల్ ఇటలీ... ఇలా సిటీలోని మొత్తం 16 రెస్టారెంట్లు తమకు మాత్రమే ప్రత్యేకమైన వంటకాలతో ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ‘రెలిష్ హైదరాబాద్’ ఈవెంట్ వినూత్న శైలి అనుభవాన్ని అందిస్తోంది. విశాలమైన ప్రాంగణంలో వెరైటీ హట్స్‌తో ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న ఈ ఈవెంట్ శుక్రవారం ప్రారంభమైంది. ఆదివారంతో ముగుస్తుంది. ఈ ఈవెంట్‌లో భాగంగా ఒకవైపు సెలబ్రిటీ చెఫ్‌లు అప్పటికప్పుడు తయారు చేసి అందించే స్పెషల్ డిష్‌లను టేస్ట్ చేసే అవకాశాన్ని విజిటర్స్‌కు కల్పించారు. అలాగే తొలిరోజు కలినరీ ఆర్ట్స్ కాంటెస్ట్‌లు, లైవ్ మ్యూజిక్ వంటివి ఉత్సాహంగా సాగాయి.
పంజాబీ టేస్ట్
నగరవాసులకు పంజాబీ రుచులు అందిస్తోంది బేగంపేట్ హోటల్ తాజ్ వివంతా. నోరూరించే వెరైటీలతో ఏర్పాటు చేసిన ‘సింధి- పంజాబీ ఫుడ్ ఫెస్టివల్’ శుక్రవారం ప్రారంభమైంది. సింధి చాపా, లాల్ మిర్చీ కా పనీర్ టిక్కా, అమృత్‌సారి ఫిష్ టిక్కా, భున్నే లాసన్ దే ముర్గ్ టిక్కే, సాయ్ భాజీ, సింధి కోకి, సాత్ సాగి, పంజాబీ సాగ్ పనీర్, రస్మిసె ఆలూ వడియన్, పంజాబీ బటర్ చికెన్ వంటి వెరైటీలెన్నో ఇక్కడ వేడివేడిగా వండి వారుస్తున్నారు. వీటితో పాటు ట్రెడిషనల్ బ్రెడ్స్ కూడా టేస్ట్ చేయవచ్చు. ఈ నెల 9 వరకు ఈ విందు కొనసాగుతుంది.