రూ.35 వేలు లంచంతో పట్టుబడ్డ ఎమ్మార్వో
చిత్తూరు : ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మార్వో సురేంద్రబాబు ఏసీబీ అధికారులకు శుక్రవారం దొరికిపోయాడు. పట్టాదారుపాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్న రైతును ఎమ్మార్వో రూ. 35 వేలు లంచం అడిగాడు. ఈ నేపథ్యంలో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో శుక్రవారం ఉదయం పీలేరు ఎమ్మార్వో కార్యాలయంలో రైతు నుంచి రూ. 35 వేల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులు పన్నీన వలలో సురేంద్రబాబు చిక్కాడు.