Pipe Line
-
తాగునీటి సమస్యకు చెక్
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ 2.0 పథకానికి జడ్చర్ల మున్సిపాలిటీని ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.47కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో మరో 20ఏళ్ల వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా పనులు చేపట్టనున్నారు. మున్సిపాలిటీలోని కావేరమ్మపేట, జడ్చర్ల, బూరెడ్డిపల్లి, నాగసాల, నక్కలబండతండ, శంకరాయపల్లి తండాలు విలీనమయ్యాయి. విలీన గ్రామాల్లో కొంత నీటి సమస్య ఉంది. అమృత్ 2.0 పథకంలో మంజూరైన రూ.47కోట్ల ద్వారా అన్ని గ్రామాల్లోనూ సమస్యలు పరిష్కారం కానున్నాయి. మున్సిపాలిటీలో లక్షా 10వేలకుపైగా జనాభా ఉండగా, 17వేలకుపైగా ఇళ్లున్నాయి. ప్రస్తుతం 9వేలకుపైగా నల్లా కనెక్షన్లు ఉన్నాయి. పట్టణంలో ప్రస్తుతం 20ట్యాంకులు ఉండగా, 200 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. సామాజిక కార్యకర్తకు సమాచారం.. పట్టణంలోని సామాజిక కార్యకర్త కంచుకోట ఆనంద్ పలు సమస్యలపై ఉన్నతాధికారులకు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ లేఖలు రాయటం పరిపాటిగా మారింది. ఆ లేఖల్లో నీటి ప్రాజెక్టు అమృత్ 2.0 ఒకటి. అయితే ప్రాజెక్టుకు ఎంపిక చేసినట్లుగా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ సెక్రెటరి పి.ఏ.లతిక సామాజిక కార్యకర్తకు లేఖను పంపించటం గమనార్హం. రియల్ వెంచర్లతో పెరుగుతున్న సమస్య మున్సిపాలిటీ పరిధిలో కొంతకాలంగా వెలుస్తున్న రియల్ వెంచర్ల వల్ల నీటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వాస్తవానికి వెంచరు దారులే ప్రతి ఇంటికి నీటి సౌకర్యం వసతి కల్పించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగులు వేయకపోవటంతో మున్సిపాలిటీపై భారం పడుతుంది. కొత్తకాలనీలకు నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి వల్లే మిషన్ భగీరథ పథకం అమలు చేస్తున్నప్పటికీ సమస్యలు వస్తూనే ఉన్నాయి. అమృత్ 2.0లోఇవీ ప్రతిపాదనలు.. అమృత్ 2.0 పథకం ద్వారా మంజూరైన నిధులతో మున్సిపాలిటీలో కింది పనులు చేపట్టనున్నారు. నూతనంగా 53 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం గల 6 ఓవర్‌హెడ్ ట్యాంకులు, 30వేల లీటర్ల సామర్థ్యం కల 1స్లంప్ నిర్మించనున్నారు. 2.5కి.మీటర్ల మేర ఫీడర్ పైప్‌లైన్ వేయనున్నారు. ఇంటింటికీ నీటిని సరఫరా చేసేందుకు గానూ 62.5 కి.మీటర్ల మేర పైప్‌లైన్ వేయనున్నారు. అదేవిధంగా 7,954 నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయటంతోపాటు టెండర్లు పిలిచారు. టెండరు ప్రక్రియ పూర్తికాగానే పనులు మొదలు పెట్టనున్నారు. -
ఏడాదిలో 2 లక్షల ఎకరాలకు నీరు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించి చేపట్టిన ప్యాకేజీ–21లోని పైప్‌లైన్ వ్యవస్థ నిర్మాణ పనుల వేగిరంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రాజెక్టులోని కీలక పనులన్నీ ముగింపు దశకు వస్తుండటం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి లభ్యత పెంచిన నేపథ్యం లో ఈ పైప్‌లైన్ పనులను వేగిరం చేసి ఏడాదిలో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది. కనీసం 2 లక్షల ఎకరాల మేర సాగునీరు వృద్ధిలోకి వచ్చే అవకాశాలుండటంతో పనులను సత్వరమే పూర్తి చేసే లక్ష్యంగా ఇంజనీర్లను మార్గదర్శనం చేసేందుకు సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ సోమ వారం ప్యాకేజీ–21 పరిధిలో పర్యటించనున్నారు. భూగర్భంలో పైపులైన్లు ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఫోర్‌షోర్ నుంచి నీటిని తీసుకుంటూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు కోరుట్ల ప్రాంతాలకు నీరిచ్చేలా కాళేశ్వరంలో ప్యాకేజీ–20, 21, 21(ఎ) పనులు చేపట్టా రు. ప్యాకేజీ–20లో ఎస్సారెస్పీ ఫోర్ షోర్ నుంచి అప్రోచ్ చానల్, 17.81 కి.మీ. టన్నెల్, 30 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న 3 మోటార్లతో పంప్‌హౌస్ నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. రూ. 892 కోట్ల తో చేపట్టిన ఈ పనులు 80% వరకు పూర్తయ్యా యి. ఇక్కడి నుంచి మాసాని చెరువులోకి నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి 2 పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోసి, పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా పనులు చేపట్టారు. సాధారణంగా కాల్వల నిర్మాణం చేపడితే భూసేకరణ 7 వేల నుంచి 8 వేల ఎకరాలు చేయాల్సి ఉంటుంది. అదే పైప్‌లైన్ వ్యవస్థ అయితే భూమిలో ఒకటిన్నర మీటర్ల కింద భూగర్భాన పైప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తారు. ప్యాకేజీ–21 పనులను రూ.610 కోట్లతో చేపట్టగా, 30 శాతం పూర్తయింది. టన్నెళ్ల నిర్మాణం, కాల్వల పనులు పూర్తి చేయాలి. ప్యాకేజీ–21(ఎ) కీలకం కాగా దీన్ని రూ. 2,623 కోట్లతో చేపట్టారు. దీనిలో 3.5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలి. ఈ పనులు ఇప్పుడిప్పుడే పుంజుకున్నాయి. భూసేకరణ సమస్య వల్ల ఆటంకం ఎదురవుతోం ది. రెండు పంప్‌హౌస్‌ల నిర్మాణం, 10 నుంచి 8 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్ల ఏర్పాటు చేయాలి. ఈ పనులు వేగంగా చేయాల్సి ఉండగా, భూగర్భ పైప్‌లైన్ పనులు కొనసాగుతున్నాయి. 90 కి.మీ. మేర పైప్‌లైన్ పూర్తి చేయాల్సి ఉండగా, ఇందులో కొంత పని పూర్తయింది. వీటిని వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. చిన్నచిన్న అవాంతరాలు, భూసేకరణ సమస్యలుండటంతో వాటి పరిష్కారానికి స్మితా సబర్వాల్ సోమవారం ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్నారు. పనుల వేగిరానికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శనం చేయనున్నారు. కన్నెపల్లిలో ‘స్పైరల్’ పనులు ముమ్మరం కాళేశ్వరం ప్రాజెక్టుకు రానున్న ఆరు మోటార్లు కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌లో సీఎం కేసీఆర్ ఆదేశాలతో నీటి లభ్యతను బట్టి మరో టీఎంసీని అదనంగా ఎత్తిపోయడానికి సరిపడా మోటార్లు బిగించడానికి ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. పనులు త్వరగా పూర్తి చేయడానికి ఇంజనీర్లు కృషి చేస్తున్నారు. ఇప్పటికే రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించడానికి కన్నెపల్లి పంపుహౌస్‌లో 11 మోటార్లు బిగించి వెట్, డ్రై రన్లు పూర్తి చేశారు. ప్రస్తుతం నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీలో 85 గేట్లు మూసివేసి బ్యాక్‌వాటర్‌ను అక్కడి మోటార్లతో ఎత్తిపోస్తూ గ్రావిటీ కాల్వద్వారా అన్నారంలోని సరస్వతీ బ్యారేజీని నింపుతున్నారు. మరో టీఎంసీని తరలించడానికి అదనంగా 6 మోటార్లు బిగించడానికి పనులు సాగుతున్నా యి. ఇందులో స్పైరల్ కేసింగ్ పనులు 3 మోటార్లకు పూర్తికాగా, మరో 3 మోటార్ల పనులు జరుగుతున్నాయి. మొత్తం 6 మోటార్లకు 12 కి.మీ. వరకు పైపులైన్ నిర్మించాల్సి ఉండగా.. 9 కిలోమీటర్ల మేర పైపులైన్ పూర్తయింది. అదనపు టీఎంసీ తరలింపునకు ఆస్ట్రియా, ఫిన్లాండ్ దేశా ల నుంచి 6 మోటార్లను తెస్తున్నారు. ఇవి సకాలంలో వస్తే మార్చి చివ రికి 3 టీఎంసీల నీటిని తరలించవచ్చని అధికారులు చెబుతున్నారు. -
నిర్మల్ జిల్లా మోడల్ కాలనీలో లీకైన పైప్ లైన్
-
సాగు నీరివ్వాలని పైపును పగులగొట్టారు
పాలకుర్తి (రామగుండం): సాగునీరు ఇవ్వడంలేదని ఆవేదన చెందిన రైతులు ఏకంగా పైప్‌లైన్ జాయింట్‌ను తొలగించారు. దీంతో నీరు 50 మీటర్ల ఎత్తులో ఎగిసిపడింది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ధర్మారం మండలం నందిమేడారం చెరువుకు వెళ్లే ప్రధాన పైపులైన్ వాల్వ్‌ను పాలకుర్తి మండల పరిధిలోని మారేడుపల్లి గ్రామ శివారులో పగులగొట్టారు. వాల్వ్‌కవర్ బోల్టులను తీసివేయడంతో నీరు 60 ఎంహెచ్పీ వేగంతో దాదాపు 50 మీటర్ల ఎత్తులో ఎగిసిపడింది. సోమవారం వరకు నీటి ఉధృతి కొనసాగింది. విషయం తెలుసుకున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎస్ఈ విజయభాస్కర్‌రావు, ఇతర ఇరిగేషన్ అధికారులు మోటార్ల సరఫరా నిలిపివేసి మరమ్మతు చర్యలు చేపట్టారు. అక్కడకు చేరుకున్న రైతులు.. నీరు లేక తమ పంటలు ఎండిపోతున్నాయని, సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. స్థానిక గ్రామాలకు నీరిచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని తరలించాలని డిమాండ్ చేశారు. -
పైప్‌లైన్ లీక్ ,భారీగా నీరు వృథా
-
ప్రజలు సహకరిస్తేనే అభివృద్ధి
కలెక్టర్ యోగితా రాణా మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణ పనుల ప్రారంభం ఆర్మూర్అర్బన్ : ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు ప్రజలు సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ యోగితా రాణా అన్నారు. ఆర్మూర్ మండలంలోని కోమన్‌పల్లిలో మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందించే పైపులైను నిర్మాణాన్ని కలెక్టర్ యోగితా రాణా, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో కోమన్‌పల్లి నుంచి పైప్‌లైన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఎస్సారెస్పీ నుంచి గోదావరి జలాలను శుద్ధి చేసి తాగునీటిని ప్రతి ఇంటికి అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో మిషన్ భగీరథకు ప్రభుత్వం రూ. 2,650 కోట్లు వ్యయం చేస్తోందన్నారు. తొలి విడతగా 121 గ్రామాలను ఎంపిక చేసి అందులో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ఉన్న 47 గ్రామాలకు ముందుగా శుద్ధిజలాలను సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎంపిక చేసిన గ్రామాల్లో రూ. 150 కోట్లతో అంతర్గత పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. కోమన్‌పల్లిలో పైప్‌లైన్ నిర్మాణ పనులు పూర్తి చేసి వారం రోజుల్లో ఇంటింటికి తాగునీటి సరఫరా చేస్తామని పేర్కొన్నారు. అలాగే మిగతా గ్రామాల్లో ఈనెల 31 లోగా నీటి సరఫరా చేయనున్నామని చెప్పారు. రూ. 15 లక్షలు మంజూరు చేస్తా : ఎమ్మెల్యే గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, హరితహారంలో మొక్కల నాటాడాన్ని 100 శాతం పూర్తి చేసుకుంటే తన నిధుల నుంచి అదనంగా రూ. 15 లక్షలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోమన్‌పల్లి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఆర్మూర్ పట్టణానికి 100 పడకల ఆస్పత్రిని తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కంటే ముందుగా ఆర్మూర్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ పూర్తి చేసుకోవడానికి ప్రజలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ రమేశ్, ఆర్డీవో యాదిరెడ్డి, మండల ప్రత్యేకాధికారి రామారావ్ నాయక్ పాల్గొన్నారు. -
నేడు, రేపు నీళ్లు బంద్
సిటీబ్యూరో: కృష్ణా ఫేజ్-1 పైపులైన్‌కు అత్యవసర మరమ్మతుల కారణంగా మంగళ, బుధవారాల్లో వివిధ ప్రాంతాలకు 30 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది. మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిచిపోనుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఆజంపురా, సుల్తాన్ షాహీ, మొఘల్‌పురా, దారుల్షిఫా, ఫలక్‌నుమా, బహదూర్‌పురా, జహానుమా, చార్మినార్, పత్తర్‌ఘట్టి, మిశ్రీగంజ్, అన్సారీ రోడ్, వట్టేపల్లి, ఇంజిన్ బౌలి, ఆశా మహల్, మహబూబ్ మాన్షన్, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, ఆస్మాన్‌ఘడ్, మూసారాంభాగ్, మలక్‌పేట్, అలియాబాద్, మైసారం, గౌలిపురా, తలాబ్‌కట్ట, మాదన్నపేట్, యాకుత్‌పుర, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్, జియాగూడ, అడిక్‌మెట్, రామంతాపూర్, గోల్నాక, డీడీకాలనీ, నల్లకుంట,విద్యానగర్, ముషీరాబాద్, అజామాబాద్, నారాయణగూడ, భోలక్‌పూర్, భాగ్‌లింగంపల్లి, వైశాలి నగర్, దిల్సుఖ్నగర్ పార్ట్ ప్రాంతాలకు సరఫరా ఉండదని తెలిపారు. మరమ్మతులు పూర్తయిన తరవాత సరఫరా పునరుద్ధరిస్తామని వెల్లడించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగానికి కూడా... : కృష్ణా ఫేజ్-1 కింద గ్రామీణ నీటి సరఫరా విభాగానికి అందిస్తున్న నీటినీ నిలిపివేయనున్నారు. దీంతో నల్లగొండ, నాసర్లపల్లి, గోడకొండ్ల, ఇబ్రహీంపట్నం, గున్గల్ ప్రాంతాలకు కూడా 30 గంటల పాటు సరఫరా నిలిచిపోనుంది. -
పైపులైను లీకేజి..ఎకరాల్లో పంటనష్టం
-
ముక్తీశ్వరా...
కాళేశ్వర ముక్తీశ్వర ఎత్తిపోతల పథకం ఐదేళ్ల నుంచి అడుగులో అడుగు వేస్తోంది. పనులు మొదలెట్టి ఐదేళ్లయినా ఇప్పటికీ భూసేకరణే పూర్తి కాలేదు. 2012లోనే పూర్తి కావాల్సిన పనుల గడువును ఇప్పటికే రెండు సార్లు పెంచగా మరో వారంలో తుదిగడువు కూడా పూర్తి కానుంది. అయినా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. - మంథని మంథని : మంథని డివిజన్లోని మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్, కాటారం మండలాల్లోని 65 గ్రామాలకు మేలు చేకూర్చేలా 45 వేల ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చేలా కాళేశ్వర, ముక్తీశ్వర ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. 2008 సెప్టెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మహదేవపూర్ మండలం బీరసాగర్‌లో శంకుస్థాపన చేయగా 2009లో పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు పూర్తయ్యేందుకు రూ.499 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. నీటి తరలింపు ఇలా... గోదావరి ఒడ్డు నుంచి మహదేవపూర్ మండ లం కన్నెపల్లిలోని ఇంటేక్‌వెల్‌కు నీటిని తరలిస్తారు. అక్కడినుంచి పైప్‌లైన్ ద్వారా మహదేవపూర్ మండల చెరువు, ఊర చెరువుల్లో నీరు నింపుతారు. ఇది మొదటి దశ(స్టేజ్-1) పను లు. ఇక్కడ నుంచి రోడ్డు మార్గంలో కాటారం మండలం గారెపల్లి కొత్తచెరువులోకి తరలిస్తారు. దీన్ని రిజర్వాయర్‌గా(స్టేజ్-2) మా ర్చుతారు. ఇక్కడినుంచి రెండువైపులా పైప్‌లైన్ ఉంటుంది. కాటారం, ఆదివారంపేట, కొత్తపల్లి, సుందర్రాజ్పల్లి నుంచి మల్హర్ మండలం రుద్రారం వరకు పైప్‌లైన్ ద్వారా నీరు తరలిస్తారు. ఇది ఒకవైపు కాగా, రెండోవైపు గారెపల్లి నుంచి పోలారం, మహాముత్తారం వరకు నీటిని తరలిస్తారు. ఈ చెరువుల ద్వారా రైతుల భూములకు సాగునీరందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఏదీ పురోగతి ప్రాజెక్టు నిర్మాణానికి 3625 ఎకరాల భూమి అవసరం కాగా, ఇందులో 2981 ఎకరాలు రెవెన్యూ భూమి. మిగతా 644 ఎకరాలు భూమి అటవీభూమి. ఇప్పటివరకు 900 ఎకరాల రెవెన్యూ భూమి మాత్రమే సేకరించారు. కానీ, నిర్వాసితులకు రూపాయి కూడా చెల్లించలేదు. భూసేకరణ, అటవీశాఖ అడ్డంకులు, వర్షాకాల సీజన్ సాకులు చూపుతూ కాంట్రాక్టర్ పనులు జాప్యం చేయగా అధికారులు కూడా పట్టించుకోలేదు. దీంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయాయి. 2012 సెప్టెంబర్ వరకు పనులు పూర్తి కావాల్సి ఉండగా 2013కు ఓసారి గడువు పొడిగించారు. కాంట్రాక్టర్ విజ్ఞప్తి మేరకు గడువు 2014 డిసెంబర్ వరకు పొడిగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకున్నారు. మరో వారం రోజుల్లో ఈ గడువు కూడా పూర్తి కానుండగా పనుల్లో మాత్రం పురోగతి లేదు. ఇప్పటివరకు పూర్తయిన పనులకు రూ.270 కోట్లు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. 50 శాతానికిపైగా నిధులు కాంట్రాక్టర్‌కు చెల్లించినప్పటికీ పనులు మాత్రం అత్తెసరుగానే జరిగాయి. మిగతా పనులన్నీ పూర్తి కాకుండానే పంపింగ్ కోసం మోటార్లు తీసుకురావడంతో అవన్నీ వృథాగా ఉంటున్నాయి. చెల్లింపుల్లో అక్రమాలు జరిగినట్లు అధికారుల విచారణలో తేలడంతో పలువురు అధికారులపై గత ఫిబ్రవరిలో సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం ఇంటేక్వెల్ పనులు కొనసాగుతున్నాయి. పనుల్లో జాప్యంతో అంచనాలు రూ.637 కోట్లకు చేరినట్లు సమాచారం. 644 ఎకరాల అటవీ భూమిలో పైప్‌లైన్ నిర్మాణానికి కేంద్ర అటవీపర్యావరణ అనుమతి ఇటీవలే వచ్చినట్లు సమాచారం. మిగతా భూములు త్వరగా సేకరించి, పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇంటేక్వెల్ నిర్మాణం త్వరగా పూర్తి చేసి పైప్‌లైన్ వేసి నీరందించాలని పేర్కొంటున్నారు. -
దేవాదుల పైపులైన్ లీకేజీ
నీట మునిగిన పొలాలు ఆందోళనలో రైతులు హసన్‌పర్తి : దేవాదుల పైపులైన్ ముచ్చర్ల-పెంబర్తి గ్రామాల మధ్య శుక్రవారం సాయంత్రం లీక్ అయింది. దీంతో నీరంతా ఎగసిపడుతోంది. గేట్‌వాల్వ్ ఒక్కసారిగా ఎగిరిపడడం వల్ల నీరు పైకి చిమ్ముతున్నట్లు రైతులు గుర్తించారు. అయితే గేట్‌వాల్వ్‌కు ఇరవై మీటర్ల దూరంలోనే పైపులైన్ లీకేజీ అయినట్లు తెలిపారు. తొలుత ఇరవై మీటర్ల ఎత్తు నుంచి అరవై మీటర్ల ఎత్తు వరకు నీరు ఎగసిపడింది. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోలేదు. కాగా, లీక్ అయిన నీటి ప్రవాహానికి సమీపంలోని పంట పొలాలు నీట మునిగాయి. చుట్టుపక్కల సుమారు పది ఎకరాల మేరకు పొలాల్లోకి నీరు చేరింది. దీంతో దేవాదుల వద్ద మోటార్ ఆఫ్ చేయాలని రైతులు మొరపెట్టుకున్నారు. అర్ధరాత్రి వరకు కూడా నీటి ప్రవాహం ఆగకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. నాసిరకం పనులు.. నాలుగేళ్లకే లీకేజీలు దేవాదుల పైపులైన్ నిర్మాణ పనుల్లో భారీ కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. ముచ్చర్లలో పైపులైన్ లీకేజీయే ఇందుకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. అయితే పైపులైన్లు లీకేజీ కావడం ఇది రెండోసారి. రెండేళ్ల క్రితం సి ద్ధాపురం సమీపంలో పైపులైన్ లీకేజీ అయింది. నిర్మాణ సమయంలో అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల లీకేజీలు ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు దే వాదుల ప్రాజెక్టు మొదటి దశకు సుమారు రూ.1800 కోట్లు, రెండో దశకు రూ.1500కోట్లు ఇప్పటికే ఖర్చు చేశారు. దేవాదుల నుంచి ధర్మసాగర్ వరకు సుమారు 4లక్షల పైపులు ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు పే ర్కొన్నాయి. ఒక్కో పైపు కోసం రకాలవారీగా రూ.80 వేల నుంచి రూ.1.30లక్షల వరకు ఖర్చు చేశారు. హైడ్రాలిక్ పరీక్షలపై అనుమానాలు పైపులైన్లు అతికే సమయంలో హైడ్రాలిక్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల లీకేజీలు ఏర్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిష్ణాతుడైన ఇంజనీర్ సమక్షంలో ఈ పరీక్ష నిర్వహించాలి. పరీక్ష చేయడానికి ఒక్కో పైపుకు కనీసం రూ.40వేల నుంచి రూ.50వేల వరకు ఖ ర్చవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనినిబట్టి హైడ్రాలిక్ పరీక్షలు ఎక్కడా నిర్వహించలేదని స్పష్టమవుతోంది. అయితే హైడ్రాలిక్ పరీక్షలు నిర్వహించకుండానే.. చేసినట్లు బిల్లులు స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా, క్వాలిటీ కంట్రోల్ అధికారులు సైతం తప్పుడు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకసారి హైడ్రాలిక్ పరీక్షలు నిర్వహించి మరమ్మతులు చేస్తే శాశ్వతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
కో‘దడ’
సాక్షిప్రతినిధి, నల్లగొండ :కోదాడ మున్సిపాలిటీలో బహిరంగంగానే వ్యాపారం జరుగుతుందనే ఆరోపణలు వినవస్తున్నాయి. పట్టణంలోని వివిధ వార్డుల్లో రూ.3.50కోట్ల అంచనావ్య యంతో సీసీ రోడ్లు, కల్వర్టులు, సైడ్‌డ్రెయిన్లు, పైప్‌లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. సార్వత్రిక ఎన్నికల ముందే, పబ్లిక్ హెల్త్ ఈఈ, మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ (సూర్యాపేట ఆర్డీఓ) అనుమతి మేరకు ఈ ఏడాది జనవరి 27వ తేదీన టెండర్ నోటీసు ఇచ్చారు. ఫిబ్రవరి 11వ తేదీన టెండర్లు జరిగాయి. మే 20వ తేదీన టెండర్లను ఆమోదించి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకుని పనులు అప్పగించారు. అయితే, ఆ సమయంలో ఎన్నికలకోడ్ అమలులో ఉండడంతో పనులు మొదలుపెట్టలేదు. బీఆర్జీఎఫ్, ఎస్ఎఫ్సీ, 13వ ప్రణాళిక సంఘం నిధులతో పూర్తి కావాల్సిన రూ.3.50కోట్ల పనులపై కొందరు కాంగ్రెస్ కౌన్సిలర్ల కన్ను పడింది. తాజా కథ.. తమ మున్సిపాలిటీలో ఏకంగా రూ 3.50కోట్లతో పనులు జరుగుతున్న విషయాన్ని గమనించిన కౌన్సిలర్లు, పాలకవర్గం కొలువు దీరేదాకా పనులు మొదలు పెట్టొద్దని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి బ్రేక్ వేయించారు. రకరకాల మలుపులు తిరిగిన రాజకీయంతో పాలకవర్గం పగ్గాలు పుచ్చుకున్న కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఈ పనులు తక్షణ ఆదాయవనరుగా కనిపించాయి. తమ వార్డుల్లో చేపట్టే పనుల్లో కచ్చితంగా తమకు పర్సెంటేజీ ఇవ్వాల్సిందేనని కౌన్సిలర్లు అడ్డం పడడం మొదలుపెట్టారు. అంచనా వ్యయంపై 10శాతం కౌన్సిలర్లు, 3శాతం చైర్మన్, 10శాతం ఆఫీసు ఖర్చులు, 1శాతం వైస్‌చైర్మన్‌కు ఇలా.. పర్సెంటేజీలు ముట్టజెప్పాలని గొడవ జరుగుతోందని కోదాడ మున్సిపాలిటీలో జోరుగాప్రచారం జరుగుతోంది. పర్సెంటేజీలు ఇవ్వకుంటే పనులు రద్దు చేసుకుని వెళ్లిపోవాలని, తామే మళ్లీ టెం డర్లు వేసి పనులు చేయించుకుంటామని బెది రింపులకు దిగుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నారు. తమ డిమాండ్లకు తలొగ్గని కాంట్రాక్టర్లు చేపడుతున్న పనుల వద్దకు వెళ్లి, నాణ్యత ప్రమాణాల్లేవు అంటూ నానా హడావిడి చేసి పత్రికలకు ఎక్కుతున్నారని, వాస్తవానికి పనులు పూర్తయ్యాక ‘క్వాలిటీ కంట్రోల్’ చెకింగ్ జరిగి, అప్రూవల్ వస్తేనే ఫైనల్ బిల్లు చెల్లిస్తారని, కానీ, కావాలనే కొందరు కౌన్సిలర్లు నాణ్యత తనిఖీల పేర హడావిడి చేస్తున్నారన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఈ పనులు జనరల్ ఫండ్‌తో చేపట్టినవి కాదు. ఈ పనులపై కౌన్సిలర్లకు ఎలాంటి అజమాయిషీ ఉండదు. ఇక, పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేది లేదని, నయాపైస ఇవ్వడానికి కూడా చెక్‌పవర్ లేని పాలకవర్గ పెద్దలు కొత్తకొత్త కండీషన్లు పెడుతున్నట్లు సమాచారం. ఎన్నికల ఖర్చు రాబట్టుకునే పనిలో.. ‘‘కోదాడ మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా గెలిచేందుకు కనీసం పాతిక లక్షల రూపాయలైనా ఖర్చు పెట్టి ఉంటాం. మా ఖర్చులు మేం రాబట్టుకోవద్దా’’ అన్న తరహాలో కొందరు కాంగ్రెస్ కౌన్సిలర్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక, కోదాడలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోను మెజారిటీ కాం గ్రెస్‌కు రాలేదు. ఈ మున్సిపాలిటీని దక్కించుకోవడానికి కాంగ్రెస్ పెద్దలు పెద్ద కసరత్తే చేశారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలోనూ డబ్బు చేతులు మారిందనే ఆరోపణలు ఉన్నా యి. ఈ ఖర్చులన్నీ రాబట్టుకునేందుకు గృహనిర్మాణ అనుమతులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల వంటి వాటి దాకా ఏదీ తమకు తెలియకుండా పనిచేయొద్దని అధికారులకు పాలకవర్గ పెద్దలు హుకుం జారీ చేశారని చెబుతున్నారు. మరోవైపు ఇటీవల మున్సిపాలిటీల్లో బీఆర్జీఎఫ్ నిధుల కింద ప్రదొవార్డుకు బడ్జెట్ కేటాయించారు. ఈ నిధులతో అన్ని వార్డులకు సమంగా బడ్జెట్ కేటాయించారని, కానీ, కాం గ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మాత్రం తమ వార్డులకు ఎక్కువ నిధులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఎక్కువ నిధులతో పనులు చేపడితే, ఎక్కువ పర్సెంటేజీలు వస్తాయన్న కారణంతోనే పేచీ పెడుతున్నారని విపక్ష కౌన్సిలర్లు విమర్శలకు దిగుతున్నారు. ఇదీ.. ఉదాహరణ ! కోదాడ మున్సిపాలిటీలో చేపడుతున్న ఈ పనుల్లో కొన్నింటికి ఓ కాంట్రాక్టర్ 16శాతం తక్కువ కోట్ (లెస్ టెండర్) చేసి దక్కించుకున్నారు. అంటే లక్ష రూపాయల విలువైన పనిని రూ.84వేలకే పూర్తి చేస్తానని ముందుకొచ్చినట్టు లెక్క. ప్రచారం జరుగుతున్న పర్సెంటేజీల ప్రకా రం ఇందులో రూ.24వేలు కూడా తీసివేస్తే, ఇక మిగిలేది రూ.60వేలు. అంచనా వ్యయంపై సీఎస్టీ, జీఎస్టీ, ఈఎండీ వంటి ఖర్చులన్నీ వెళ్లాలి. ఇందులోనే కాంట్రాక్టర్ తన లాభం కూడా చూసుకోవాలి. ఇక, మిగిలే సొమ్మెంత..? ఆ సొమ్ముతో చేపట్టే పనిలో నాణ్యత ఎంత..? -
హెల్త్‌సిటీగా విజయవాడ
జగ్గయ్యపేట నుంచి తిరువూరు వరకు పైప్‌లైన్‌తో కృష్ణా జలాలు పారిశ్రామిక ప్రగతిని పరుగులు తీయిస్తా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం ఉపాధి అవకాశాలు పెంపొందిస్తా వైఎస్సార్ సీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కోనేరు వెల్లడి ‘నాకు విజయవాడపై పూర్తి విజన్ ఉంది. కాళేశ్వరరావు మార్కెట్లోని సమస్యల దగ్గర్నుంచి బెంజిసర్కిల్‌లో ట్రాఫిక్ కష్టాల వరకు సమగ్ర అవగాహన ఉంది. జగ్గయ్యపేటలో సాగు, తాగునీటి సమస్య.. తిరువూరు ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య ఉన్నాయని తెలుసు. జిల్లా ప్రజల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి, వ్యవసాయదారుల ఇబ్బందులు... ఇలా అన్నింటిపై ఉన్న అవగాహనతో విజన్ విజయవాడను రూపొందించుకున్నా. దీనికి అనుగుణంగానే ప్రజలకు సేవ చేయడానికి వారధిగా నిలిచే రాజకీయాలను ఎంచుకుని మీ ముందుకొచ్చా..’ అంటున్నారు వైఎస్సార్ సీపీ విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్. సాక్షి, విజయవాడ : ప్రజలకు, సమాజానికి సేవచేయాలనే తలంపుతో వైఎస్సార్ సీపీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసిన కోనేరు రాజేంద్రప్రసాద్ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి పార్టీలకంటే ప్రచారపర్వంలో దూసుకెళుతున్న ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యంగా అభివృద్ధికోసం తాను రూపొందించుకున్న ప్రణాళికలు.. విజయవాడ లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాలవారీగా ప్రధాన సమస్యలు.. వాటికి తాను సూచించే ఆచరణాత్మక పరిష్కార మార్గాలు.. ఇలా పలు అంశాలను వెల్లడించారు. అవన్నీ ఆయన మాటల్లోనే... జన్మభూమి రుణం తీర్చుకోవడానికి వచ్చాను. ఇతర రాజకీయ పార్టీ నేతలను విమర్శించను. నన్ను విమర్శించేవారిని సైతం విమర్శించను. పాజిటివ్ రాజకీయాలతోనే ముందుకు సాగుతా. నన్ను గెలిపిస్తే ఏం చేస్తానో.. వైఎస్సార్ సీపీని అధికారంలోకి తెస్తే ప్రజలకు ఏం చేస్తానో చెప్పి మరీ ప్రజలను ఓట్లడుగుతున్నాను. వైద్యపరంగా ఉపాధి.. ముఖ్యంగా వైద్యపరంగా విజయవాడ నగరానికి మంచి పేరుంది. అనేక కార్పొరేట్ ఆస్పత్రులు, ప్రభుత్వాస్పత్రి, నిపుణులైన వైద్యులు ఎందరో ఉన్నారు. విజయవాడను హెల్త్ సిటీగా తీర్చిదిద్దితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 15 వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కళాళాల, వైద్యానికి సంబంధించి అన్ని విభాగాలు, కోర్సులతో కలిపి యూనివర్సిటీ, స్కూల్‌ను ఏర్పాటుచేయడం నా లక్ష్యం. తద్వారా సుమారు 1.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, సుమారు ఐదు వేల మందికి సొంతప్రాంతంలోనే నాణ్యమైన విద్య లభిస్తాయి. హెల్త్ సిటీకి అనుసంధానంగా ఫార్మా కంపెనీలు, ల్యాబ్‌లు ఇలా అనేకం ఏర్పాటుచేస్తాం. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల నుంచి వచ్చే రోగులకు ఉచిత వైద్యం హెల్త్ సిటీలో అందితే వాణిజ్యపరంగానూ నగరం పురోగతి సాధిస్తుంది. జిల్లా అభివృద్ధి కోసం ‘విజన్ విజయవాడ’ను రూపొందించుకున్నా. దీనికోసం పంచ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాను. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తా.. విజయవాడ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మూడు ప్రధాన నీటి కాల్వల్లోకి 126 మురుగునీటి కాల్వలను అనుసంధానం చేశారు. ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి డ్రైనేజీ కాల్వలను దారిమళ్లించాలి. నీటి కాల్వల్లో చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెత్తను, నీటిని వేరుచేసేలా ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. వేస్ట్ మేనేజ్మెంట్ ప్రకియ ద్వారా చెత్తను వినియోగిస్తే ఆదాయం కూడా పెరుగుతుంది. అప్పుడు స్వీయ నిధులతో నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రజల గుండెల్లో వైఎస్సార్.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. వైఎస్సార్ సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఇక్కడి ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. ఆయన పార్టీ ద్వారా ప్రజల మధ్యలోకి వెళ్లినప్పుడు మమ్మల్ని కూడా అదే అభిమానం, ఆప్యాయతలతో ఆదరిస్తున్నారు.. స్వాగతిస్తున్నారు. పార్లమెంట్ పరిథిలోని అన్ని ప్రాంతాల్లో ప్రచారం పూర్తిచేశాను. అక్కడి ప్రధాన సమస్యలను ప్రత్యక్షంగా చూశాను. నాకు కమిట్మెంట్ ఉంది. నా సేవల్ని మరింత విస్తరించాలని నిర్ణయించకున్నా. రాజకీయాలతో నిమిత్తం లేకుండా రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాను. కోనేరు ట్రస్టుద్వారా నీరు.. శ్రీకాకుళం జిల్లాలో కోనేరు ట్రస్టుద్వారా వంశధార నుంచి 15 కిలోమీటర్ల పైప్‌లైన్ ఏర్పాటుచేసి వేలాది ఎకరాలకు సాగునీరందిస్తున్నాను. అవసరమైతే ఇక్కడా ప్రణాళిక రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నాను. కృష్ణానది పక్కనే ఉన్న జగ్గయ్యపేట మొదలుకొని తిరువూరు వరకు నీటి సమస్య ఉంది. దీని పరిష్కారం కోసం పైప్లైన్లు ఏర్పాటు చేస్తే అటు తాగునీరు, ఇటు సాగునీటి అవసరాలు తీరతాయి. ఫ్లైవోవర్ల ఏర్పాటు.. మౌలిక వసతుల్లో భాగంగా దుర్గగుడి వద్ద, బెంజిసర్కిల్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తక్షణం ఫ్లైవోవర్లు నిర్మించాలి. మా పార్టీ అధికారంలోకి రాగానే తొలి్ర పాధాన్యతాంశంగా దీన్నే తీసుకుంటాం. రానున్న రోజుల్లో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి అనుగుణంగా మాస్టర్‌ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేయాలి. బీఆర్టీఎస్ రోడ్డు వల్ల నగరానికి పెద్దగా ఉపయోగం చేకూరలేదనేది నా అభిప్రాయం. దానికి ఖర్చుచేసిన రూ. 152 కోట్ల నిధులతో 15 ఫ్లైవోవర్లు నిర్మించి ఉంటే ట్రాఫిక్ సమస్య సమసిపోయేది. బుడమేరుకు శాశ్వత పరిష్కారం.. నగరంలో మరో ప్రధాన సమస్య బుడమేరు ముంపు. దీనికి శాశ్వత పరిష్కారం చూసేలా అన్ని చర్యలు తీసుకుంటాం. అవుటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం, పులిచింతల ప్రాజెక్టు నుంచి జిల్లా సాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటి విడుదల, పోలంపల్లి రాజీవ్ మున్నేరు డ్యామ్ నిర్మాణం పూర్తి చేయిస్తాం. పారిశ్రామికాభివృద్ధి.. విజయవాడ ఆటోనగర్‌ను కేంద్రంగా చేసి విడిభాగాల తయారీ సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తాం. రవాణాయేతర రంగాల్ని ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. దీంతోపాటు వృత్తివిద్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చే సంస్థల్ని అవసరమైతే నా సొంత నిధులతో ఏర్పాటుచేసి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. -
నీరొచ్చే దారేది?
=విశాఖ, తూ.గో. సరిహద్దు ప్రజలకు నీటి సరఫరాపై అయోమయం =చురుగ్గా తుని, పాయకరావుపేట ప్రాజెక్టు పనులు =ఏలేరు నుంచే నీరంటున్న ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు =ఆమోదం లేదంటున్న ఏలేరు రిజర్వాయర్ అధికారులు =మరోసారి తెరపైకి తాండవ ప్రతిపాదన తాగునీటి సరఫరాపై ఎడతెగని సందిగ్ధం. నీరు ఎక్కడ నుంచి ఇవ్వాలన్నదానిపై అంతులేని అయోమయం.. ఇది తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దు నియోజకవర్గాల్లోని తీర ప్రాంత గ్రామాల తాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన అంశం. ఈ గ్రామాలకు అందించే తాగునీటిని ఏలేరు నుంచి తీసుకుంటారా? లేక తాండవ నుంచే సరఫరా చేస్తారా? అన్నది ఖరారు కాక అలముకున్న గందరగోళం... ఇదీ జిల్లాలోని ఓ ప్రాంతంలో నీటి సరఫరాకు సంబంధించి నెలకొన్న వాతావ‘రణం’! నర్సీపట్నం, న్యూస్‌లైన్: తూర్పు గోదావరి జిల్లాలోని తుని, విశాఖ జిల్లాలోని పాయకరావుపేట నియోజక వర్గాల్లో సుమారు 150 తీర ప్రాంత గ్రామాలకు తాగునీటిని అందించే విషయం ఇప్పుడు ఓ చిక్కుముడిలా మారుతోంది. నీటి సరఫరా కోసం ప్రభుత్వం రూ. 56 కోట్లు మంజూరు చేసినా నీటి సరఫరా ఎక్కడి నుంచి చెయ్యాలోనన్నది ఎడతెగని చర్చకు దారితీస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి వద్ద ప్రస్తుతం స్టోరేజీ ట్యాంకు నిర్మితమవుతోంది. దీనికి నీటి సరఫరా కోసం అప్పుడే పైప్ లైన్ పనులు మొదలయ్యాయి. అయితే నీరెక్కడి నుంచి సరఫరా చేయాలన్నది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. అల్లిపూడి ట్యాంకుకు తాండవ నుంచి నీటిని అందించడానికి గతంలో ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. దీనిపై అప్పట్లో స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ఆందోళనలు వెల్లువెత్తాయి. దాంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. అయితే నీటి సరఫరా ఎక్కడి నుంచన్నది మళ్లీ మొదటికొచ్చింది. తాండవకు ప్రత్యామ్నాయంగా ఏలేరు కాలువ నుంచి నీటిని తీసుకుని ఈ గ్రామాలకు తాగునీటి సరఫరా చేయాలని అధికారులు ప్రతిపాదించారు. దాంతో ప్రస్తుతం తుని వైపు కాలువ పనులు పూర్తయ్యాయి. పాయకరావుపేట పైపులైను పనులు ప్రారంభమయ్యాయి. ఏలేరుపై చూపులు తాండవకు ప్రత్యామ్నాయంగా ఏలేరు కాలువ నుంచి నీటిని తీసుకునేందుకు నీటిపారుదల శాఖ ఆమోదం తెలిపిందని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు అంటున్నారు. నాతవరం మండలం గొలుగొండపేట వద్ద విస్తరించి ఉన్న ఏలేరు కాలువ నుంచి రెండు నియోజకవర్గాలకు 0.015 టీఎంసీల వంతున నీటిని తీసుకుని పైపులైను ద్వారా గ్రామాలకు సరఫరా చేస్తామని వివరిస్తున్నారు. కానీ నీటిపారుదల, ఏలేరు అధికారులు దీనిని తిరస్కరిస్తున్నారు. ఏలేరు నుంచి తాగునీటిని అందించే ప్రతిపాదన వచ్చినా, దీనిని ఆమోదించలేదని ఏలేరు రిజర్వాయరు అధికారి సుధాకర్ చెబుతున్నారు. పైగా ఏలేరు కాలువ ప్రస్తుతం జీవీఎంసీ ఆధీనంలో ఉంది. విశాఖ నగరం ప్రజల దాహం తీర్చడానికి, పరిశ్రమలకు నీటిని సరఫరా చేయడానికి మాత్రమే ఏలేరు కాలువ నీరు వినియోగపడుతోంది. తుని, పాయకరావుపేట ప్రాంతాలకు నీటిని సరఫరా చేయాలని కలెక్టర్ ద్వారా ఇప్పటికే ప్రతిపాదన అందగా, దీనిని విశాఖ పరిశ్రమలు, తాగునీటి అవసరాల కమిటీ (విస్కో) తిరస్కరించింది. ప్రస్తుతం స్టోరేజీ ట్యాంకుతో పాటు దిగువన ఉన్న పైపులైను పనులు మాత్రమే చేస్తున్నారు. అధికారులు బయటకు ఏలేరు నుంచే నీరును తీసుకుంటున్నట్టు చెబుతున్నా ఆ కాలువ సమీపంలో ఎటువంటి పనులు చేపట్టకపోవడంతో తాండవ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైకి ఏలేరు కాలువ నుంచే నీరని చెబుతూ, తాండవ నీటి సరఫరా ప్రతిపాదనను మరోసారి ప్రభుత్వం ముందుంచినట్టు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కోటనందూరులో జరిగిన తాండవ రైతుల సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు రాగా, సమస్యను సమైక్యంగా ఎదుర్కోవాలని తీర్మానించారు.