
నేడు, రేపు నీళ్లు బంద్
సిటీబ్యూరో: కృష్ణా ఫేజ్-1 పైపులైన్‌కు అత్యవసర మరమ్మతుల కారణంగా మంగళ, బుధవారాల్లో వివిధ ప్రాంతాలకు 30 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది. మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిచిపోనుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఆజంపురా, సుల్తాన్ షాహీ, మొఘల్‌పురా, దారుల్‌షిఫా, ఫలక్‌నుమా, బహదూర్‌పురా, జహానుమా, చార్మినార్, పత్తర్‌ఘట్టి, మిశ్రీగంజ్, అన్సారీ రోడ్, వట్టేపల్లి, ఇంజిన్ బౌలి, ఆశా మహల్, మహబూబ్ మాన్షన్, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, ఆస్మాన్‌ఘడ్, మూసారాంభాగ్, మలక్‌పేట్, అలియాబాద్, మైసారం, గౌలిపురా, తలాబ్‌కట్ట, మాదన్నపేట్, యాకుత్‌పుర, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్, జియాగూడ, అడిక్‌మెట్, రామంతాపూర్, గోల్నాక, డీడీకాలనీ, నల్లకుంట,విద్యానగర్, ముషీరాబాద్, అజామాబాద్, నారాయణగూడ, భోలక్‌పూర్, భాగ్‌లింగంపల్లి, వైశాలి నగర్, దిల్‌సుఖ్‌నగర్ పార్ట్ ప్రాంతాలకు సరఫరా ఉండదని తెలిపారు. మరమ్మతులు పూర్తయిన తరవాత సరఫరా పునరుద్ధరిస్తామని వెల్లడించారు.
గ్రామీణ నీటి సరఫరా విభాగానికి కూడా... : కృష్ణా ఫేజ్-1 కింద గ్రామీణ నీటి సరఫరా విభాగానికి అందిస్తున్న నీటినీ నిలిపివేయనున్నారు. దీంతో నల్లగొండ, నాసర్లపల్లి, గోడకొండ్ల, ఇబ్రహీంపట్నం, గున్‌గల్ ప్రాంతాలకు కూడా 30 గంటల పాటు సరఫరా నిలిచిపోనుంది.