Pipeline system
-
భారత్ నుంచి బంగ్లాకు పైప్‌లైన్ ద్వారా డీజిల్
న్యూఢిల్లీ: భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు డీజిల్ రవాణా కోసం రూ.377 కోట్లతో నిర్మించిన పైప్‌లైన్‌ను ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. భారత్–బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఈ లైన్ వల్ల రవాణా ఖర్చులతోపాటు కాలుష్యం కూడా తగ్గుతాయని చెప్పారు. ప్రస్తుతం డీజిల్ భారత్ నుంచి 512 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గంలో బంగ్లాదేశ్‌కు సరఫరా అవుతోంది. నూతనంగా అస్సాంలోని నుమాలిఘడ్ నుంచి బంగ్లాదేశ్‌కు 131.5 కిలోమీటర్ల మేర నిర్మించిన పైప్‌లైన్ ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల డీజిల్ రవాణాకు వీలుంటుంది. ఈ 15 ఏళ్ల ఒప్పందాన్ని దశలవారీగా విస్తరించుకునే వీలుంది. -
విశాఖకు పోలవరం
విశాఖ జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం రూపకల్పన చేసిన సరికొత్త ప్రాజెక్టు కార్యరూపం దాల్చే దిశగా సాగుతోంది. గతంలో వేసవి వచ్చిందంటే చాలు.. విశాఖ నగరం నీటి ఎద్దడితో ఇబ్బందులను ఎదుర్కొనేది. రెండేళ్లుగా పుష్కలంగా వర్షాలు కురుస్తుండటంతో నీటి సమస్య తలెత్తలేదు. భవిష్యత్తులో నగర విస్తరణ కారణంగా నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నీటి కష్టాలు ఎదురుకాకుండా బృహత్తర ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నుంచి విశాఖకు గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు భారీ పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. 220 కిలోమీటర్ల పొడవునా రూ.4,660 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ తయారీకి కార్యాచరణ సిద్ధమవుతోంది. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం మేఘాద్రిగెడ్డలో స్టోరేజ్ నీటి సరఫరా కోసం జీవీఎంసీ ఏటా రూ.120 కోట్ల వరకూ ఖర్చు చేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రూ. 50 నుంచి రూ.60 కోట్ల వరకూ జీవీఎంసీకి ఆదా అవుతుంది. దీనికి తోడు భవిష్యత్తు అవసరాల కోసం స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 24/7 నీటిని అందించేలా రూపొందిస్తున్న ఈ పైప్‌లైన్ ద్వారా వచ్చే మిగులు నీటిని.. మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో స్టోరేజ్ ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పైప్‌లైన్ ద్వారా వచ్చే నీటిలో 75 శాతం వరకూ జీవీఎంసీ అవసరాలకే వినియోగించనున్నారు. సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం నగర అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు ఏలేరు నుంచి వచ్చే నీరే ప్రధాన ఆధారం. ఏలేరు కాలువ ద్వారా తరలిస్తున్న నీటిలో సుమారు 30 శాతం వరకు గండ్లు, లీకేజీలు ఆవిరి రూపంలో పోతోంది. ఈ సమస్య ఉత్పన్నమవ్వకుండా పూర్తిస్థాయిలో నీటిని తీసుకొస్తే మరిన్ని గ్రామాలకు, పరిశ్రమలకు అందించే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం.. జీవీఎంసీ ద్వారా ఈ భారీ పైప్‌లైన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మొదట్లో ఏలేశ్వరం రిజర్వాయర్ నుంచి పైప్‌లైన్ వెయ్యాలని భావించినా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం పోలవరం నుంచి నేరుగా నరవ రిజర్వాయర్ వరకు పైప్‌లైన్ వెయ్యాలని సూచించడంతో ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేపడుతున్నారు. (‘జగత్’ కంత్రీలు.. వెలుగులోకి 'భూమా'య..) ముందుగా దీని అంచనా వ్యయం రూ.1800 కోట్లుగా నిర్ణయించగా.. ప్రాజెక్ట్ గ్రిడ్ స్వరూపం విస్తరించడంతో రూ.4,660 కోట్లకు చేరుకుంది. నీటిని అందించే గ్రామాల సంఖ్య పెరిగే కొద్దీ అంచనా వ్యయం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నుంచి 220 కిలోమీటర్ల పొడవునా పైప్‌లైన్ ఏర్పాటు చేస్తారు. భౌగోళిక పరిస్థితులను బట్టి 2.2 నుంచి 2.5 మీటర్ల వ్యాసార్థం ఉన్న పైపులు అమర్చుతారు. అవసరమైన ప్రాంతాల్లో పంప్ సెట్లు, సంపులు నిర్మిస్తారు. ప్రతి మండల కేంద్రంలో ఒక ట్యాపింగ్ పాయింట్ ఏర్పాటు చేయనున్నారు. గ్రామాలకు, పారిశ్రామిక అవసరాలకు ఎలాంటి ఆటంకం లేకుండా రోజూ నీటిని అందించేలా ప్రాజెక్టు డిజైన్ చేశారు. రోజుకు 12 టీఎంసీల నీటిని ఈ పైప్‌లైన్ ద్వారా సరఫరా చెయ్యాలని భావిస్తున్నారు. రెండు జిల్లాలు.. వెయ్యికిపైగా గ్రామాలు ఈ భారీ నీటి సరఫరా ప్రాజెక్టు ద్వారా విశాఖ జిల్లాతోపాటు తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలకూ ఈ నీటిని అందించనున్నారు. ఏలేశ్వరం నుంచి కాకినాడ సెజ్‌కు, తుని మున్సిపాలిటీకి, తూర్పుగోదావరి జిల్లాలోని శివారు గ్రామాలకు ఈ వాటర్ గ్రిడ్ ద్వారా నీటిని అందిస్తారు. విశాఖ జిల్లాలో పైప్‌లైన్ వచ్చాక.. నక్కపల్లి సెజ్‌కు, నక్కపల్లి, పాయకరావుపేట నగర పంచాయతీ, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలకు, విశాఖ రూరల్ మండలాల్లోని అన్ని గ్రామాలకు, మహా విశాఖ నగర పరిధిలోని ప్రాంతాలకు నీటిని అందించనున్నారు. ఆయా ప్రాంతాల్లో 2050 జనాభా, పరిశ్రమల పెరుగుదలను అంచనా వేసి ప్రాజెక్టు డిజైన్ చేశారు. (సీపీఎస్ ఉద్యోగులపై సమగ్ర నివేదిక) ఏలేశ్వరం జలాశయం సమగ్ర నివేదికకు కార్యాచరణ నగర ప్రజలకు తాగునీటి బెంగ తీర్చేందుకు రూపొందిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేసేందుకు వివిధ సంస్థల నుంచి జీవీఎంసీ ప్రతిపాదనలను ఆహ్వానించింది. పోలవరం నుంచి నరవ వరకూ పైప్‌లైన్‌కు అవసరమైన వివిధ శాఖల నుంచి అనుమతులూ సదరు సంస్థే తీసుకునేలా నిబంధనలు విధించింది. రిజర్వాయర్ వద్ద ఇన్‌టేక్ వెల్ నిర్మాణ గుర్తింపు, పంప్ హౌస్ నిర్మాణం, హైడ్రాలిక్ డిజైన్, వాటర్ హేమర్ స్టడీ, ఎనర్జీ ఎఫిషియన్సీ మోటర్స్ ఏర్పాటు, ఫైనాన్షియల్, ఎనకమిక్ అనాలసిస్, భూ సేకరణ, ప్రాజెక్టు అంచనాలు మొదలైనవన్నీ రూపొందించేందుకు అనుభవం ఉన్న సంస్థల నుంచి డీపీఆర్ తయారు చేసేందుకు ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ టెండర్లు దాఖలు చేసింది. టెండర్ దక్కించుకున్న సంస్థ 90 రోజుల్లో డ్రాఫ్ట్ డీపీఆర్, 105 రోజుల్లో ఫైనల్ డీపీఆర్ తయారు చెయ్యాల్సి ఉంటుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా... విశాఖ మహా నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో 2050 నాటికి జనాభా ఎంత ఉంటుందనే దానిపై అంచనా వేస్తూ అప్పటి అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నాం. సీఎం సూచనల మేరకు ఏలేశ్వరం నుంచి కాకుండా నేరుగా పోలవరం ప్రాజెక్టు నుంచే గోదావరి జలాలు తీసుకురానున్నాం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని కమిషనర్ సూచించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏలేరు కాలువ నుంచి వచ్చే నీటిని పూర్తిగా రైతుల అవసరాలకు వినియోగించాలని భావిస్తున్నాం. డీపీఆర్ తయారు చేసేందుకు వివిధ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. నిధుల సమీకరణపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. మెయిన్ లైన్లో 5 నుంచి 6 వరకూ ట్యాపింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నాం. – ఎం.వెంకటేశ్వరరావు, జీవీఎంసీ చీఫ్ ఇంజినీర్ -
పైప్‌లైన్ ద్వారానే అదనపు టీఎంసీ
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో మూడో టీఎంసీ నీటి తరలింపునకు గాను ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సొరంగ మార్గాల ద్వారా కాకుండా పూర్తిగా పైప్‌లైన్ వ్యవస్థ ద్వారానే నీటిని తరలించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పైప్‌లైన్ వ్యవస్థకు అయ్యే వ్యయ అంచనాలతో మళ్లీ పరిపాలనా అనుమతులు మంజూరు చేసి పనులు మొదలు పెట్టాలని సూచించారు. తక్కువ సమయం..అధిక వ్యయం.. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగంగా ప్రస్తుతం రెండు టీఎంసీల నీటిని తరలించేలా పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నీటితో ప్రాజెక్టు కింద నిర్ణ యించిన సాగు అవసరాలు తీరే అవకాశం లేకపోవడంతో అదనంగా మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసే లా సీఎం కేసీఆర్ నిర్ణయించి, అందుకు అనుగుణం గా ప్రణాళిక వేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఇందుకు గాను ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో అదనపు మోటార్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయి. ఎల్లంపల్లి దిగువన మిడ్‌మానేరు వరకు కొత్తగా అప్రోచ్‌ఛానల్, గ్రావిటీ కాల్వ ద్వారా రూ. 10,500కోట్లతో నీటిని తరలించే ప్రత్యామ్నాయం సిద్ధమైంది. ఇక మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు ఒక టీఎంసీ నీటిని గ్రావిటీ కాల్వలు, సొరంగాల ద్వారా తరలించాలని నిర్ణయించారు. మొత్తం గా 11 కి.మీల మేర గ్రావిటీ కాల్వ, మరో 24 కి.మీ. ల సొరంగాలు తవ్వాల్సి ఉంటుందని, 3 పంప్‌హౌస్ ల నిర్మాణం చేయాల్సి ఉంటుందని లెక్కగట్టారు. వీటికోసం రూ.12,594 కోట్లు అంచనా వేశారు. దీనికి సంబంధించి జీవోలు సైతం ఇచ్చారు. వాటిని ఎన్నికల కోడ్ దృష్ట్యా ప్రభుత్వ వెబ్సైట్లో పెట్ట లేదు. మంగళవారం సమీక్షలో దీనిపై చర్చించారు. సొరంగాల నిర్మాణానికి భూసేకరణ అవసరమని, ఇప్పటికే మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిధిలో సేకరణ సమస్యను అధిగమించలేక, కోర్టు ల చుట్టూ తిరగాల్సి వస్తోందన్న అభిప్రాయం ప్రభు త్వ పెద్దల నుంచి వ్యక్తమయింది. దీనికి తోడు సొరంగాల నిర్మా ణానికి రెండేళ్లకు మించి సమయం పట్టే అవకాశాల దృష్ట్యా, దాన్ని పక్కన పెట్టాలని సీఎం సూచించారు. పైప్‌లైన్ ద్వారా అయితే భూసేకరణ అవసరాలు తగ్గుతాయని, నిర్మాణాన్ని సైతం ఏడాది నుంచి ఏడాదిన్నరలో పూర్తి చేసే అవకాశం ఉంటుందని అన్నట్లుగా అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ నిర్మా ణాలకు అదనంగా సొరంగాల నిర్మాణానికి అయ్యే ఖర్చుకన్నా అదనంగా రూ. 1,400 కోట్ల నుంచి రూ.1,600 కోట్లు అవుతుందని అంచనా. అంటే పైప్‌లైన్ వ్యవస్థ నిర్మాణ వ్యయం రూ.14 వేల కోట్లను దాటే అవకాశం ఉంది. దీనిపై ప్రణాళిక సిద్ధం చేశాక కొత్త అంచనాలతో అనుమతులు ఇవ్వనున్నారు. -
ఔటర్ చుట్టూ.. వాటర్ వండర్!
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ చేపట్టనున్న జలహారం(వాటర్‌గ్రిడ్) పనుల్లో అద్భుతం ఆవిష్కృతం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో ఔటర్ చుట్టూ 18 ప్రదేశాల్లో భూమి పైభాగం నుంచి సుమారు3–4 మీటర్ల లోతున సొరంగమార్గాలు తవ్వి వాటిల్లో రేడియల్ మెయిన్ భారీ తాగునీటి పైపులైన్లను ఏర్పాటు చేయనున్నారు. సొరంగాలతో ఆయా ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లు, రహదారులు, గ్రామాలు దెబ్బతినకుండా చూడవచ్చు. మహానగర దాహార్తిని దూరం చేసేందుకు రూ.4,765 కోట్ల అంచనా వ్యయంతో భారీ రింగ్ మెయిన్ పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు, జలమండలి మార్గదర్శకాల మేరకు టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికలో ప్రతి అంశం సాంకేతికంగా ఎన్నో అద్భుతాలకు మూలం కానుండటం విశేషం. ఈ ప్రాజెక్టులో భాగంగా ఔటర్ చుట్టూ 120 మిలియన్ లీటర్ల నీటినిల్వ సామర్థ్యంతో 12 భారీ స్టోరేజి రిజర్వాయర్లను నిర్మించనున్నారు. ఈ రింగ్‌మెయిన్ ప్రాజెక్టుతో కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు జలాలను నగరం నలుమూలలకూ కొరత లేకుండా సరఫరా చేయవచ్చు. దేశంలో ఇప్పటివరకు ఏ నగరంలో లేని తరహాలో ఈ రింగ్ మెయిన్ ప్రాజెక్టు డిజైన్లు సిద్ధం చేయడం విశేషం. నవంబర్ నాటికి ఔటర్ గ్రామాల దాహార్తి దూరం ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న 183 పంచాయతీలు, 7 నగరపాలక సంస్థల పరిధిలో నివసిస్తున్న సుమారు పది లక్షల మంది దాహార్తిని ఈ ఏడాది నవంబర్ నాటికి సమూలంగా దూరం చేస్తామని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ తాగునీటి పథకంలో ఇప్పటికే 70 గ్రామాల దాహార్తిని దూరం చేసేందుకు 60 స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. 615 కి.మీ. మార్గంలో నీటి పంపిణీ పైపులైన్లు ఏర్పాటు చేయడం ద్వారా సుమారు మూడు లక్షల మంది దాహార్తిని దూరం చేశామన్నారు. గురువారం ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఈ పథకానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఔటర్ గ్రామాల్లో ఇప్పటికే ఇబ్రహీంపట్నం మండలంలో ఒకటి, మహేశ్వరం మూడు, శంషాబాద్ 5, సరూర్‌నగర్ మూడు, రాజేంద్రనగర్ ఏడు, హయత్‌నగర్ తొమ్మిది, పటాన్చెరు 10, ఘట్కేసర్ 9, కుత్బుల్లాపూర్ ఐదు, కీసర 4, శామీర్‌పేట్ 4 రిజర్వాయర్లను నిర్మించామన్నారు. మిగిలిన 112 రిజర్వాయర్ల పనులు పురోగతిలో ఉన్నాయని, వీటిలో అక్టోబర్‌లో 20, మిగిలిన వాటిని నవంబర్‌లో పూర్తి చేస్తామని చెప్పారు. ఓఆర్ఆర్ రింగ్ మెయిన్ ప్రాజెక్టు ఇదీ.. రూ. 3,965 కోట్లు - ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 158 కి.మీ. మార్గంలో 3000 ఎంఎం వ్యాసార్థంలో భారీ పైపులైన్ నిర్మాణానికి వ్యయం రూ. 550 కోట్లు - ఔటర్ రింగ్ రోడ్డు లోపల 18 చోట్ల 98 కి.మీ. మార్గంలో రేడియల్ మెయిన్ పైపులైన్ల ఏర్పాటుకు.. రూ. 250 కోట్లు - ఔటర్ చుట్టూ 12 చోట్ల భారీ గ్రౌండ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్ల(జీఎల్ఎస్ఆర్) నిర్మాణానికి.. రూ. 4,765 కోట్లు - మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం... -
పైప్‌లైన్ వ్యవస్థకు సర్కార్ నో!
⇒ కాళేశ్వరంలోని ప్యాకేజీ–21 కింద అమలులోకి రాని ప్రతిపాదన ⇒ వ్యయం పెరుగుతుందనే వెనక్కి! సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేయాలన్న యోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది. కాల్వల ద్వారా జరిగే నీటి సరఫరాతో పోలిస్తే పైప్‌లైన్ వ్యవస్థ ఖర్చు తక్కువగా ఉంటుందని, ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే అవకాశాలుం టాయని మొదట సర్కార్ భావించింది. ఈ నేపథ్యంలో పైలట్ ప్రాజెక్టు కింద కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 21లో ఈ విధానం అమల్లోకి తేవాలనుకుంది. పెట్టుబడి వ్యయం అధికంగా ఉంటుందన్న సాకుతో తాజాగా దాన్ని పక్కనపెట్టింది. వాస్తవానికి సాగునీటి ప్రాజెక్టుల్లో కాల్వల నిర్మాణానికి ఖర్చు ఎకరాకు రూ.25వేల వరకు ఉంటే, పైప్‌లైన్ ద్వారా రూ.23,500లే ఉంటుంది.కాల్వల ద్వారా టీఎంసీలకి 10వేల ఎకరాలకు మాత్రమే నీరిచ్చే అవకాశం ఉండగా, పైప్‌లైన్ వ్యవస్థలో 20వేల ఎకరాలకు నీరు అందించవచ్చు. పైప్‌లైన్ నిర్మాణాలకు భూసేకరణ అవస రాలు తక్కువగా ఉండి, అన్ని ప్రాంతాలకు సమాన నీటిని పంపిణీ చేసే అవకాశముంటుంది. నిర్వహణ ఖర్చు భారీగా తగ్గుతుంది. ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉన్న మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఓంకారేశ్వర డ్యామ్‌ను రాష్ట్ర మంత్రులతోపాటు ఇంజనీర్ల బృందం పరిశీలించింది. రాష్ట్రంలో చేపడుతున్న పాలమూరు, డిండి, కాళేశ్వరంలో ఈ విధానం ప్రవేశపెట్టాలని సూచించింది. ఈ మూడు ప్రాజెక్టుల్లో 30లక్షల ఎకరాలకు నీరివ్వాలంటే పిల్ల కాల్వల నిర్మాణానికి 1.5 లక్షల ఎకరాల భూమి అవసరం ఉంటుంది. దీనికి రూ.7,500 కోట్ల మేర ఖర్చవుతుంది. అదే పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా అయితే రూ.6వేల కోట్లు మాత్రమే ఖర్చవుతుందని గుర్తించింది. ఈ ప్రయోజనాల దృష్ట్యానే పైప్‌లైన్ వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి కాళేశ్వరం ప్యాకేజీ 21లో అమలు చేయాలని నిర్ణయించింది. రూ.1143 కోట్ల విలువైన ఈ ప్యాకేజీలో 1.70లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది. ఇందులో లక్ష ఎకరాలకు నీరివ్వాలంటే 4 వేల ఎకరాల భూసేకరణ అవసరమవుతుంది. ప్రస్తుతం ప్యాకేజీ 21 కింద నష్టపోతున్న భూమి ధర ఎకరాకు రూ.7 నుంచి రూ.8 లక్షల మధ్య పలుకుతోంది. ఈ లెక్కన భూ సేకరణ కే రూ.320కోట్లు అవసరం. అదే పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా అయితే భూసేకరణ అవసరం ఉండదు. అయితే దీనిపై సమీక్షించిన ప్రభుత్వం ఈ తరహా నిర్మాణంతో భారీగా పెట్టుబడి వ్యయం అవుతుందని భావించింది. -
గెయిల్ పైపులైన్లలో నాణ్యతెంత ?