piravies
-
అక్కడికి పంపండి.. కాదు..కాదు.. ఇక్కడికి!
పైరవీకారులకు ఇష్టమైన స్థానానికి బదిలీ చేయడం.. అదీ నచ్చలేదంటే వారు కోరుకున్న చోటుకు పంపండం విద్యుత్ శాఖకే చెల్లింది. నిషేధ సమయంలో ఏడుగురు ఏఈలకు స్థానచలనం కల్పించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఓ డీఈకి కోరుకున్న చోట పోస్టింగ్ ఇవ్వడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. అయినా బదిలీ విషయంలో తగ్గకపోగా తాత్కాలిక పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్వర్వులు జారీ చేయడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఏది ఏమైనా విద్యుత్ శాఖకు రెగ్యులర్ అధికారి లేకపోవడంతో పాలన పట్టు తప్పుతోంది. కర్నూలు(రాజ్‌విహార్): సాధారణ బదిలీల కు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుంది. దీనికి అనుగుణంగా ట్రాన్స్‌కో ఆఫీస్ ఆర్డర్ పేరుతో టీఓఓ విడుదల చేస్తుంది. వీటి ప్రకారమే విద్యుత్ పంపిణీ సంస్థలు బదిలీలు చేపడతాయి. అయితే ఏపీ ఎస్పీడీసీఎల్ కర్నూలు సర్కిల్లో అందుకు విరుద్ధంగా బదిలీలు చేపడుతున్నారు. అధికారిని మెప్పిస్తే చాలు.. అధికారి మొప్పు పొందితే చాలు..కోరుకున్న స్థానానికి బదిలీ చేస్తున్నారు. ఒక వేళ ఆ స్థానం నచ్చలేదని అడిగితే.. రాత్రికి రా త్రి వారికి ఇష్టమైన స్థానంలో నియమిస్తున్నారు. కార్మిక, ఉద్యోగ సంఘాల ప్రతి నిధుల ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీ చేశామని చెప్పొకొస్తున్నారు. ఏడుగురికి బదిలీలు.. ♦ 15 రోజుల క్రితం ఏఈ నాగేంద్ర ప్రసాద్‌ను నంద్యాల ప్రొటెక్షన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయన అక్కడ విధుల్లో చేరలేదు. ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించడంతో పాత ఆర్డర్స్‌ను పక్కన పడేసి కర్నూలు ఎల్టీ మీటర్స్ విభాగానికి బదిలీ చేశారు. ♦ గతంలో పత్తికొండ సెక్షన్లో ఏఈగా పనిచేసిన నారాయణ స్వామి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఏడాది క్రితం మంత్రాలయానికి బదిలీ చేశారు. అంతలోనే ఇప్పుడు ఆయన్ను తిరిగి పత్తికొండకు బదిలీ చేశారు. ♦ వెల్దుర్తిలో పనిచేస్తున్న శ్రావణ్‌కుమార్‌రెడ్డి మూడునెలల క్రితం తెలంగాణకు బదిలీ అ య్యారు. అయితే కోర్టు ఆయను తిరిగి కర్నూలులోనే నియమించాలని ఉత్తర్వులు ఇవ్వగా కర్నూలు క్యాంప్స్ సెక్షన్‌కు బదిలీ చేశారు. ♦ కర్నూలు క్యాంప్స్ సెక్షన్లో పనిచేస్తున్న ఏఈ భానుచందర్‌ను అనతికాలంలోనే నంద్యాల పట్టణంలోని ప్రొటెక్షన్స్ విభాగానికి బదిలీ చేశారు. ♦ ఆదోని డివిజన్లోని హొళగుంద ఏఈగా పనిచేస్తున్న నాగభూషణంను ఆరు నెలల వ్యవధిలోనే తిరిగి ఆదోని పట్టణంలోని డిస్ట్రిబ్యూషన్–1కు బదిలీ చేశారు. ♦ ఆలూరు ఏఈగా పనిచేస్తున్న సంతోష్‌ను బదిలీ మార్గదర్శకాలు రాకముందే ఆదోని పట్ణణంలోని డిస్ట్రిబ్యూషన్–3కి, ఇక్కడ పనిచేస్తున్న నరసన్నను ఆలూరుకు బదిలీ చేశారు. ♦ కర్నూలులో పనిచేస్తున్న శిలింగయ్యను నంద్యాలకు, నంద్యాలలో పనిచేస్తున్న దావిద్‌ను కర్నూలుకు బదిలీ చేశారు. ♦ కర్నూలు కస్టమర్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్న జాన్ బెర్నాడ్ను గూడూరుకు, ఇక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిని కర్నూలు సిటీ మీ టర్స్కు,ఆత్మకూరు రూరల్ ఏఈ రాజేంద్రబా బును కర్నూలువిద్యత్ భవన్‌కు బదిలీ చేశారు. ♦ విద్యుత్ భవన్లో పనిచేస్తున్న ఓ డీఈని ఆపరేషన్స్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వగా ఫిర్యాదులు వెళ్లడంతో వెనక్కి తగ్గి ఉత్తర్వులు తొలగించారు. ♦ కర్నూలు సర్కిల్ కార్యాలయంలో నాన్పోక ల్ పోస్టులో నెలన్నర కిత్రం బాధ్యతలు చేపట్టి న డీఈని ఆపరేషన్స్ డివిజన్‌కు బదిలీ చేశారు. మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి... గైడ్‌లైన్స్ ప్రకారం ఒకే హోదా ఉండి.. ఒకే పోస్టులో మూడేళ్లు పూర్తి చేసుకున్న వారిని ఒక సబ్ డివిజన్ నుంచి మరో సబ్‌డివిజన్‌కు బదిలీ చేయాలి. ఒకే హోదాలో వివిధ పోస్టుల్లో పనిచేసినా ఒకే పట్టణం (స్టేషన్)లో ఐదేళ్లు పూర్తయితే ఒక డివిజన్ నుంచి మరో డివిజన్‌కు బదిలీ చేయాలి. అయితే బదిలీలకు అర్హులైన వారి సంఖ్యలో 20శాతంలోపు వారికి మాత్రమే స్థాన చలనం కల్పించాలి. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు, జూనియర్ అసిస్టెంట్లు (ఎల్డీసీ), సీనియర్ అసిస్టెంట్లు (యూడీసీ) తదితర విభాగాలకు చెందిన సిబ్బందిని అర్హతలను బట్టి బదిలీ చేయాలి. మెడికల్ గ్రౌండ్స్ కింద మినహాయింపు లేదా కోరుకున్న స్థానంలో నియమించాల్సి ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఏఈల ను బదిలీలు చేశాం. ఏదైనా మ్యూచువల్, మెడికల్ గ్రౌండ్స్ కింద ఎవరైనా రిక్వెస్టు చేసి ఉండవచ్చు. బదిలీల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోలేదు. – ఓబుల కొండారెడ్డి, ఇన్చార్జ్ -
సంక్షేమ డిప్యుటేషన్లకు.. సవా‘లక్ష’ మార్గాలు..!
సాక్షి, హైదరాబాద్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగుల డిప్యుటేషన్లపై పైరవీలు జోరందుకున్నాయి.సీడీపీఓ(శిశు అభివృద్ధి ప్రాజెక్టు) కార్యాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ , జూనియర్ అసిస్టెంట్లతో పాటు టైపిస్టులు దాదాపు 110 మందికి గతేడాది డిసెంబర్లో డిప్యుటేషన్లు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణను జిల్లా కేంద్రంగా నిర్వహించాలని నిర్ణయించడంతో సీడీపీఓ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్య కుదించారు. నిర్దేశించిన సంఖ్యకు మించి ఉన్న సిబ్బందిని సంబంధిత జిల్లా సంక్షేమాధికారి(డీడబ్ల్యూఓ) కార్యాలయాలకు డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి పనిచేయిస్తున్నారు. ఇలా వచ్చిన వారి సమ్మతి ఆధారంగా స్థాన మార్పిడి చేసేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తాజాగా నిర్ణయించింది.అనారోగ్య సమస్యలు, స్పౌజ్ వంటి కారణాలతో పాటు సిబ్బంది ఆవశ్యకత ఆధారంగా డిప్యుటేషన్లు ఇవ్వాలని భావిస్తోంది.ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులను ఆదేశించింది. దీంతో హైదరాబాద్, వరంగల్ ఆర్జేడీ పరిధిలో ఈమేరకు దరఖాస్తుల స్వీకరణకు నిర్ణయించారు. ఇదే అదనుగా కొందరు పైరవీకారులు తమవారికి కోరిన చోట పోస్టింగ్ ఇప్పించేందుకు రంగంలోకి దిగారు.తన అనుయాయులకు అనువైన చోట పోస్టింగ్ ఇప్పించేందుకు వారు నడుంకట్టారు. ‘లక్ష’ణమైన డిప్యుటేషన్...! సీడీపీఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో పాటు టైపిస్టుల్లో ఇప్పటివరకు 110 మంది జిల్లా కార్యాలయాలకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. వారంతా డీడబ్ల్యూఓలో విధుల్లో చేరారు. తాజాగా వీరి పరిస్థితి ఆధారంగా మార్పులు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో కుటుంబ అవసరాలు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలు తదితర అంశాల ఆధారంగా ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు వినతులు సమర్పిస్తున్నారు. వాటికి సంబంధిత సీడీపీఓ లేదా డీడబ్ల్యూఓ అంగీకారం ఉండాలనే నిబంధన ఉంది. దీంతో కొందరు కోరిన చోట పోస్టింగ్ కోసం సీడీపీఓలు, డీడబ్ల్యూఓలపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ ఆర్జేడీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తనకు సన్నిహితుడైన ఉద్యోగికి అనువైన చోట పోస్టింగ్‌కు పైరవీ ముమ్మరంగా చేస్తున్నారు. దీనికోసం కొందరు రూ.లక్ష వరకు ముట్టజెపుతున్నట్లు ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఒకరిద్దరు అధికారులకు ఫిర్యాదులు సైతం చేసినట్లు తెలుస్తోంది. -
జీ హుజూర్..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పోలీసుశాఖలో కోరుకున్న చోట పోస్టింగ్ పొందడం చాలా సులువు. ఆర్థికంగా శక్తివంతులైన అధికారులుప్రజాప్రతినిధులు, వారి అనుచరులైన పైరవీకారుల అండతో కోరుకున్న పోస్టులను కొట్టేయడం సహజమే. ఎస్సై నుంచి ఏసీపీ స్థాయి వరకు పోలీస్ అధికారులు తమకు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో ముందుగానే చెప్పుకునే పరిస్థితి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉంది. స్థానిక ప్రజాప్రతినిధుల అండ, పైరవీకారుల శక్తిని బట్టి పోలీసుశాఖలో పోస్టింగ్ వచ్చే తీరు ఆధారపడి ఉంటుంది. ఏ సీట్ ఎప్పుడు ఖాళీ అ వుతుందో.. అందులో ఎవరు కూర్చుంటారో... సదరు అధికారి పేరు పోలీస్ శాఖతోపాటు ప్ర జలకు సైతం ముందుగానే తెలిసిపోతోంది. జి ల్లాలోని కొన్ని పోస్టింగులయితే అంగట్లో సరుకుల్లాగా మారుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ ప్రతినిధి, ఒక వేళ ఆయన కాదంటే ఆయన అనుచర గణాన్ని ప్రసన్నం చే సుకొని లోలోన డీల్ కుదుర్చుకుంటే పోస్టింగ్ గ్యారంటీగా దక్కుతోంది. డిమాండ్ ఉన్న “మంచి’ పోస్టింగ్‌కి పిండి కొద్ది రొట్టె అన్నట్లుగా అదే స్థాయిలో ఒప్పందాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. కొన్ని పోస్టింగ్‌లకు డిమాండ్ అధికంగా ఉండడంతో డీల్ విషయంలో కొందరు అధికారులు వెనుకడుగు వేస్తుంటే.. ఆర్థికంగా బలంగా ఉన్న వారు మాత్రం ముందుకొస్తున్నారు. “జీ హుజూర్’గా ఉంటా రని భావించే అధికారులకు కొందరు ప్రజాప్రతినిధులు లెటర్లు ఇచ్చేస్తుంటే.. కొన్ని నియోజ కవర్గాల్లో స్టేషన్‌ను బట్టి పోస్టింగ్‌కు రేట్ పలుకుతుందనేది బహిరంగ రహస్యం. ఈ రెండు మార్గాల్లో పోస్టింగులు ఫైనల్ అవుతున్నాయి. జిల్లాలో కొన్ని వర్గాలదే హల్చల్... జిల్లా పోలీసుశాఖలో ఒకటి, రెండు సామాజిక వర్గాలు మాత్రమే హల్చల్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కోరిన చోట పోస్టింగ్‌లను దక్కించుకోవడంలో ఆయా సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ముందుండడంపై ప్రజల్లో చర్చ సాగుతోంది. ఇందులో టు, త్రీ స్టార్ అధికారులు ఎక్కువగా ఉన్నారు. కాసులకు రుచిమరిగిన పోలీసు అధికారులు ఆదాయవనరులు అధికంగా ఉన్న చోట పోస్టింగ్‌లను దక్కించుకునేందుకు ఎంతకైనా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అప్‌గ్రేడ్ కాని పోలీస్ స్టేషన్లలో డిమాండ్ ఉన్న స్టేషన్లకు ఎస్ఐలు పైరవీలు చేసుకుంటున్నారు. ఇటీవల కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఓ కీలకమైన పోస్టు ఖాళీకాగా... అన్ని హంగులు ఉన్న ఓ అధికారి పట్టుపట్టి పోస్టింగ్ తెచ్చుకున్నాడు. ఇక్కడ సామాజికవర్గంతో పనిలేకుండా గతంలో నగరంలో పనిచేసిన సంబంధాలు ఉపయోగపడ్డట్టు తెలుస్తోంది. సదరు అధికారి ఆ పోస్టులోకి వస్తున్నట్లు పది రోజుల క్రితమే ఉమ్మడి జిల్లా పోలీస్ సర్కిళ్లలో తెలిసిపోయింది. ఎల్ఎండీ స్టేషన్‌కు భలేగిరాకీ... జిల్లాలోని అప్‌గ్రేడ్ కాకుండా డిమాండ్ ఉన్న పోస్టుల్లో ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్ ఒకటి. తిమ్మాపూర్ సర్కిల్ పరిధిలోని ఇక్కడ పోస్టింగ్ కోసం గతంలో పనిచేసిన ఎస్ఐ రెండోసారి అరుదెంచే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు. గతంలో ఇక్కడ పనిచేసి పలు ఆరోపణల నేపథ్యంలో.. జిల్లాలోనే మరోచోట కోరుకున్న పోస్టింగ్‌ని దక్కించుకున్నాడు. మానకొండూర్ నియోజకవర్గం పరిధిలోని పక్క జిల్లా మండలంలో పోస్టింగ్‌కి వెళ్లిన సదరు ఎస్ఐ మళ్లీ ఎల్ఎండీ కోసం పెద్ద ఎత్తున పైరవీ చేస్తున్నాడు. ఎల్ఎండీపై ప్రేమతో మరోసారి కర్చీఫ్ వేసుకొని సిద్ధంగా ఉన్నాడు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి అనుచురులైన సొంత సామాజికవర్గంతో వారితో డీల్ కుదుర్చుకొని లెటర్ని ఉన్నతాధికారులకు పంపించుకున్నట్లు తెలిసింది. çఅదే సమయంలో పక్క జిల్లాలోని ఓ మండలానికి ఇక్కడి అధికారి వెళ్లడానికి కూడా డీల్ కుదురినట్లు సమాచారం. ఎల్ఎండీలో పనిచేసిన సమయంలో విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు, బంధువులతో రియల్ దందా చేయించినట్లు కూడా ఆరోపణలున్నాయి. అదే స్టేషన్‌కు రెండోసారి ఎస్సైగా వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను బట్టి ఇక్కడున్న వనరులెంతో తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఎస్ఐ ఎస్‌హెచ్‌ఓలుగా ఉన్న కొన్ని పోలీస్స్టేషన్లలో పోస్టింగ్‌ల కోసం పలువురు ఆసక్తి చూపుతున్నారు. డీఎస్పీలుగా వెళ్లే ఆరుగురి స్థానంలో ఇప్పటికే పైరవీలు 1995 బ్యాచ్‌కు చెందిన ఎస్ఐలకు పదోన్నతుల్లో అన్యాయం జరిగిందనే విషయం తెలిసిందే కదా. తాజాగా అందిన సమాచారం ప్రకారం జూన్ నెలలో ఈ బ్యాచ్‌లోని సీఐలకు వారి మె రిట్, డీమెరిట్‌ల ఆధారంగా పోస్టింగ్‌లు ఇచ్చేందుకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి ఆరు సీఐ పోస్టులు ఖాళీ అవుతాయి. టూటౌన్లో వి« దులు నిర్వర్తించిన దేవారెడ్డి ఇటీవలే తప్పని సరి పరిస్థితుల్లో డీఐజీకి అటాచ్ కాగా ఆయన స్థానంలో లక్ష్మీబాబుకు బుధవారమే పోస్టింగ్ ఇ చ్చారు. లక్ష్మీబాబు స్థానంలో ధర్మపురికి సీ సీఎస్ సీఐగా ఆరునెలల క్రితం విధుల్లో చేరిన రాంచందర్‌రావు అవకాశం తెచ్చుకున్నారు. రూరల్ సీఐ, తిమ్మాపూర్ పీఎస్‌ల ఇన్స్పెక్టర్లు పదోన్నతిపై వెళితే ఈ రెండు పోస్టులకు ఎక్కడలేని డిమాండ్. కాగా వారు వెళితే ఎవరు వ స్తారు అనే విషయంలో ఇప్పటికే పోలీస్ సర్కిళ్లలో పేర్లు ప్రచారంలో ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్, రామగుండం పోస్టులకు కూడా డిమాండ్ అ ధికంగా ఉంది. ఒకరిద్దరు అధికారులు ఇప్పటికే కర్చీఫ్‌లు పరిచినట్లు ప్రచారం జరుగుతోంది. రామగుండం సీసీఎస్‌కు మాత్రం పెద్దగా డి మాండ్ లేదు. అలాగే మూడేళ్లుగా ఒకేదగ్గర ప నిచేస్తున్న సీఐ పోస్టులకు కూడా డిమాండ్ ఉంది. జమ్మికుంట, చొప్పదండి, హుజూరాబాద్, సుల్తానాబాద్ వంటి స్టేషన్లకు కూడా ఇప్పటి నుంచే పైరవీలు సాగుతున్నాయి. -
పోలీసుల సర్టిఫికేట్; గ్లెన్బ్రిగ్స్తో చెట్టాపట్టాల్
విందులు.. వినోదాలు.. నజరానాలు.. ఆతిథ్యాలు.. పైరవీలు.. పోలీసులతో ఓ నకిలీ సర్టిఫికెట్ల దొంగ నెరిపిన సత్సంబంధాలు కోకొల్లలు. ఒంటిపై 70 తులాల బంగారం.. తిరుపతిలో విలాసవంతమైన భవనం.. చేతిలో పోలీసులు.. చెలరేగిపోయాడీ ఆంగ్లో ఇండియన్. దొంగలతో చేయి కలిపితే జైలుకెళ్లడం తప్పితే ఏముంటుందని.. ఏకంగా పోలీసులనే తన బుట్టలో వేసుకున్నాడు. వాళ్ల అవసరాలు తీరుస్తూ.. తన వ్యవహారాలను చక్కబెట్టుకున్న తీరుకు పోలీసు ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు. చిన్నాచితక స్థాయిలో కాకుండా ఏకంగా డీఎస్పీ స్థాయి అధికారులు కూడా ఈ కేటుగాని మాయలో పడటం గమనార్హం. సాక్షి ప్రతినిధి, అనంతపురం : నకిలీ సర్టిఫికెట్ల తయారీలో ఆరితేరిన గ్లెన్ బ్రిగ్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తుండగా.. ఇందులో పోలీసులకు కూడా భాగస్వామ్యం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. జిల్లాలోని నలుగురు డీఎస్పీలు ఈయనతో సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తోంది. విందులు, వినోదాల్లో పాల్గొనడంతో పాటు నజరానాలు కూడా అందుకున్నట్టు సమాచారం. జిల్లా కేంద్రంలోని ఓ విభాగంలో పనిచేసే డీఎస్పీతో పాటు మూడు సబ్ డివిజన్లకు చెందిన ముగ్గురు డీఎస్పీలు గ్లెన్ బ్రిగ్స్‌తో కలిసి విందులు చేసుకుని.. పోస్టింగుల కోసం పైరవీలు చేయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. సదరు నేరస్తుడి నుంచి బైకులు, ల్యాప్‌టాప్‌లను కూడా కొంతమంది పోలీసులు నజరానాగా పొందినట్టు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. గుంతకల్లు నియోజకవర్గంలోని ఒక ఎస్ఐకి ల్యాప్‌టాప్ నజరానాగా అందించి కావాల్సిన పనులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ సర్టిఫికెట్ల తయారీలో తనదైన శైలిని గ్లెన్ కనబరిచారని.. తరగతుల వారీగానే కాకుండా యూనివర్సిటీల వారీగా ప్రత్యేక ఫైళ్లను తయారు చేసుకుని ఇంట్లో భద్రపరచుకున్నట్టు తెలుస్తోంది. ఎక్కడా అనుమానం రాకుండా సదరు బోర్డు లేదా యూనివర్సిటీ ఇచ్చే ఒరిజినల్ సరి్టఫికెట్లలాగై తయారు చేయడమే కాకుండా సరి్టఫికెట్‌కు ఇచ్చే సిరీస్‌ను కూడా అదే క్రమంలో ఉంచి అనుమానం రాకుండా తయారు చేశారని విచారణలో తేలింది. మరోవైపు గుంతకల్లులోని అప్పటి అధికార పార్టీ నేత ద్వారా పైరవీ చేసి ఓ డీఎస్పీతో పాటు పలువురు పోలీసులకు పోస్టింగ్‌లు ఇప్పించినట్టు కూడా తెలుస్తోంది. బెయిల్ ఇప్పిస్తామంటూ.. కేవలం నకిలీ సరి్టఫికెట్ల తయారీతో ఆగిపోకుండా ఏకంగా కోర్టులో బెయిల్ ఇప్పిస్తానని కూడా గ్లెన్ డబ్బు వసూలు చేసినట్టు తెలుస్తోంది. జిల్లాలో ఒక హత్య కేసులో నిందితునికి ఈ విధంగానే బెయిల్ వచ్చేలా మధ్యవర్తిగా ఉండి రూ.30 లక్షలు ఇప్పించి పని కానిచ్చారని సమాచారం. ఈ వ్యవహారంలో కూడా పోలీసులు కొన్ని వివరాలు సేకరించి.. నివేదికను తయారుచేసి కోర్టు ముందు ఉంచనున్నట్టు సమాచారం. తిరుపతి కేంద్రంగా.. తిరుపతిలోని తన ఇల్లు కేంద్రంగా గ్లెన్ పోలీసులతో సత్సంబంధాలు నెరిపినట్లు తెలుస్తోంది. అక్కడికి ఏదైనా డ్యూటీకి వెళ్లిన పోలీసులకు తన ఇంట్లోనే ఆతిథ్యం ఇవ్వడంతో పాటు భారీగా విందులు, వినోదాలు ఏర్పాటు చేసేవాడు. తద్వారా జిల్లాలోని నలుగురు డీఎస్పీలతో పాటు సుమారు 10 మంది సీఐల వరకు తన గుప్పిట్లో పెట్టుకుని కావాల్సిన వ్యవహారాలు నడిపినట్టు తెలుస్తోంది. లోతుగా విచారణ పవర్ బ్రోకర్‌గా వ్యవహరించి పోలీసులకు నజరానాలు ఇస్తూ తన పనులు కానిచ్చుకోవడం ద్వారా గ్లెన్ భారీగా ఆర్జించినట్టు తెలుస్తోంది. ఏకంగా తన ఒంటిపై 70 తులాల బంగారం ధరించడమే కాకుండా తిరుపతిలో భారీగా పొలాలు కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేయనుండటంతో ఎవరెవరి జాతకాలు బయటకొస్తాయోననే అంశంపై పోలీసుశాఖలో ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో గ్లెన్‌కు సంబంధించి నకిలీ సరి్టఫికెట్ల తయారీలోనూ పోలీసులకు సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. అంతేకాకుండా సదరు పోలీసులతో జరిపిన వాట్సాప్ చాట్ వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్లెన్ ఇంట్లో కానిస్టేబుల్ ఫొటో వాస్తవానికి ఆంగ్లో ఇండియన్ అయిన గ్లెన్ బ్రిగ్స్ వ్యవహారశైలిపై అనేక అనుమానాలు ఉన్నాయి. అసహజ లైంగిక వాంఛలను తీర్చుకునేందుకు ఇష్టపడే వాడని తెలుస్తోంది. ఇందులో భాగంగా గుంతకల్లులోని ఒక పోలీసు కానిస్టేబుల్‌తో అసహజ లైంగిక సంబంధాలు నెరిపినట్టు సమాచారం. అంతేకాకుండా సదరు కానిస్టేబుల్ ఫొటోను ఏకంగా తిరుపతిలోని తన ఇంట్లో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. సదరు కానిస్టేబుల్‌కు అవసరమైనవన్నీ ఈయనే సర్దుబాటు చేసేవారని కూడా విచారణలో తేలినట్టు సమాచారం. మరో కానిస్టేబుల్‌కు కూడా బైకు ఇవ్వడమే కాకుండా నిరంతరం అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఇన్నోవా కారును కొద్ది మంది పోలీసులకు ప్రొటోకాల్ వాహనంగా కూడా వినియోగించారని.. ఇందులో భాగంగా వాహనంపై పోలీసు వెహికల్ బోర్డు కూడా పెట్టుకుని చక్కర్లు కొట్టినట్టు తేలింది. -
కింగ్..ట్రాఫిక్ వింగ్
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ విభాగంలో పోస్టింగ్ అంటే ఒకప్పుడు పనిష్మెంట్గా భావించేవాళ్లు. ఉన్నతాధికారులు సైతం ఆరోపణలు వచ్చిన, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులను ఈ వింగ్కే పంపేవాళ్లు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సిటీ ట్రాఫిక్ విభాగంలో పోస్టింగ్స్ కోసం దరఖాస్తులు పెట్టుకునే, పైరవీలు చేయించుకునే పరిస్థితి వచ్చింది. ఈ మార్పునకు కారణం ఏమిటన్నది? ఉన్నతాధికారులకు అంతు చిక్కలేదు. పైకి కనిపించని ‘మర్మం’ ఏదైనా ఉందా? అని అనుమానించారు. దీంతో ఏకంగా ఈ వ్యవహారాన్ని నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్‌కు అప్పగించారు. లోతుగా విచారణ చేపట్టిన స్పెషల్ బ్రాంచ్ లా అండ్ ఆర్డర్లో పని ఒత్తిడి ఉండడం, ట్రాఫిక్ విభాగంలో ప్రోత్సాహకాలు ఇస్తుండడంతోనే సిబ్బంది ఇటువైపు మొగ్గు చూపుతున్నారని తేల్చింది. అప్పుడలా... హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల విభాగం పోలీస్స్టేషన్లు 60 ఉండగా, ట్రాఫిక్ ఠాణాలు 25 ఉన్నాయి. ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ పీఎస్‌లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) పని చేయడానికి భారీ డిమాండ్ ఉండేది. ఎ–గ్రేడ్ ఠాణాల్లో పోస్టింగ్స్ కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచే పైరవీలు నడుస్తుండేవి. ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో పోస్టింగ్స్ అంశం దీనికి విరుద్ధంగా ఉండేది. అత్యంత అరుదైన సందర్భాల్లో మినహా ట్రాఫిక్ స్టేషన్‌కు ఎస్హెచ్ఓగా వెళ్లడానికి ఎవరూ సుముఖత చూపేవారు కాదు. ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా మార్చాలంటూ అధికారుల చుట్టూ తిరిగేవారు. దీంతో ప్రతిసారి బదిలీల సందర్భంలో ఉన్నతాధికారులు ఇన్స్పెక్టర్లకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సి వచ్చేది. కొన్నాళ్లు ట్రాఫిక్‌లో పని చేయాలని, ఆపై మంచి పోస్టింగ్ ఇస్తామని చెప్పి బాధ్యతలు చేపట్టేలా చేసేవారు. ఇప్పుడిలా... గడిచిన కొన్నాళ్లుగా ట్రాఫిక్ విభాగానికీ కొద్దికొద్దిగా ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది. కౌంటర్ ఇంటెలిజెన్స్(సీఐ) సెల్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) తదితర విభాగాల్లో ఇస్తున్నట్లు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రారంభమైంది. రాష్ట్ర నేర పరిశోధన విభాగంతో (సీఐడీ) పాటు ట్రాఫిక్ వింగ్‌కు ప్రోత్సాహకంగా జీతానికి 30శాతం అదనం ప్రకటించారు. దీంతో ఈ విభాగంలోకి వెళ్లడానికి అధికారులు ఉత్సాహం చూపారు. అయితే ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ట్రాఫిక్ విభాగానికి డిమాండ్ ఏర్పడింది. ఇటీవల ఎస్సై నుంచి ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందినవారు, ఇతర విభాగాలు/యూనిట్స్ నుంచి వచ్చి రిపోర్ట్ చేసిన ఇన్స్పెక్టర్లు తమకు ట్రాఫిక్ వింగ్లోనే పోస్టింగ్ కావాలని కోరుతున్నారు. ఈ రకంగా ఉన్నతాధికారులకు ఒకేసారి 25 దరఖాస్తులు వచ్చాయి. దీంతో అసలు ట్రాఫిక్ విభాగం మీద ఇంత ‘ప్రేమ’ ఎందుకు పుట్టుకొచ్చింది? పైకి కనిపించని ‘ప్రత్యేక కారణాలు’ ఏమైనా ఉన్నాయా? అనేది తేల్చాల్సిందిగా ఉన్నతాధికారులు ఎస్బీని రంగంలోకి దింపారు. డిమాండే కానీ... అనూహ్యంగా వచ్చిన డిమాండ్‌కు కారణాలు గుర్తించడానికి ఎస్బీ సిబ్బంది విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో నిశితంగా పరిశీలించిన నేపథ్యంలో ‘ప్రత్యేక కారణాలు’ లేవని తేల్చారు. కేవలం లా అండ్ ఆర్డర్ వింగ్‌లో పని ఒత్తిడి, ఇతర అంశాలను అధికారులు తట్టుకోలేకపోతున్నారని.. దీనికి తోడు ట్రాఫిక్ వింగ్‌లో 30 శాతం అదనంగా రావడం వీరిని ఆకర్షిస్తోందంటూ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ అదనపు ప్రోత్సాహకం కేవలం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి వరకే వర్తిస్తోంది. దీంతో ఆ కేడర్ వరకే డిమాండ్ ఉంటోందని అధికారులు చెబుతున్నారు. ఏసీపీ ఆపై స్థాయి అధికారులు ఈ ప్రోత్సాహకం పరిధిలోకి రాకపోవడంతో అక్కడ కథ షరామామూలే అని తెలిపారు. కేవలం హైదరాబాద్‌లోనే పోస్టింగ్ కావాలనుకున్నోళ్లు, తాత్కాలిక ప్రాతిపదికనో మాత్రమే ఈ స్థాయిల్లో ట్రాఫిక్ వింగ్‌పై ఆసక్తి చూపుతున్నారని తేలింది. -
ట్రాక్టర్ల పంపిణీలో.. పైరవీలు
సాక్షి, వికారాబాద్ : వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ప్రభుత్వం రైతులకు పనిముట్లతో పాటు ఆధునిక యంత్రాలను రాయితీపై అందజేస్తోంది. ఇందులో భాగంగా అర్హులైన వారికి సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేసే కార్యక్రమం చేపట్టింది. దీనికోసం ఏటా బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. బడ్జెట్ సకాలంలో విడుదల కాని పక్షంలో ట్రాక్టర్ షోరూంలతో ఒప్పందం చేసుకుని ముందస్తుగానే వీటిని రైతులకు అందజేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2017– 18 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో జిల్లాకు 166 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. వీటి పంపిణీకి అధికారులు రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్ఎస్పీ (స్టేట్ నార్మల్ ప్లాన్) కింద 116, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్కేవీవై పథకం కింద 50 ట్రాక్టర్లు అందజేయనుంది. ఈ నెల 15వ తేదీ వరకు అర్హులైన వారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారులు ప్రకటించారు. నిబంధనలు... ఎస్సీ, ఎస్టీ రైతులకు 95 శాతం సబ్సిడీపై, బీసీ, ఇతర రైతులకు 50 శాతం రాయితీపై ట్రాక్టర్లు ఇవ్వనున్నారు. ఉదాహరణకు రూ.7 లక్షల విలువచేసే ట్రాక్టర్‌కు బీసీ, ఇతర రైతులు తమ వాటాగా మూడున్నర లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీపై ట్రాక్టర్ పొందాలనుకునే రైతు తనకు కనీసం రెండున్నర ఎకరాల భూమి ఉన్నట్లు పాస్‌బుక్ (ధ్రువీకరణపత్రం), రుణం ఇచ్చేందుకు బ్యాంకు అంగీకారపత్రం, తహసీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయాధికారుల నుంచి తీర్మానపత్రం పొందాలి. దరఖాస్తులన్నీ పరిశీలించిన తర్వాత అధికారులు అర్హత ఉన్నవారికే ట్రాక్టర్లు అందజేయాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఆయా మండలాలకు చెందిన ఏఓలకు దరఖాస్తులు అందజేయాలి. సిఫారసులకు ప్రాధాన్యత ఇవ్వొద్దు... గతేడాది జిల్లాలో పంపిణీ చేసిన 68 ట్రాక్టర్లలో అధిక శాతం అనర్హులకే దక్కినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఏడాది కూడా ప్రజాప్రతినిధులు, నాయకుల నుంచి సిఫారసు లెటర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. అస్మదీయులకు వాహనాలు ఇప్పించడానికి కొంతమంది నేతలు అధికారులకు ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సారి రైతులను మోసం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఓ పార్టీకి చెందిన నాయకుడు హెచ్చరించారు. అర్హులకే అందజేస్తాం సబ్సిడీ ట్రాక్టర్ల కోసం అర్హులైన రైతులు ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాకు ఎన్ఎస్పీ కింద 116, ఆర్‌కేబీవై కింద 50 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. బడ్జెట్ ఇంకా విడుదల కాకపోయినా నిబంధనల ప్రకారం గతంలో మాదిరిగానే కంపెనీలతో ముందస్తు ఒప్పందంతో అర్హులకు అందిస్తాం. సిఫారసులు, ఫోన్లు వస్తున్నాయనే ఆరోపణల్లో నిజం లేదు. ఎవరి ఒత్తిడికీ తలొగ్గే ప్రసక్తేలేదు. నిబంధనల ప్రకారం అర్హులైన వారికే ట్రాక్టర్లు అందజేస్తాం. – గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి -
మెచ్చిన వారికి.. నచ్చిన చోట
డీసీ నియామకంపై పైరవీలు రూ. కోట్లలో పలుకుతున్న పీఠం అధికార నేతల హస్తలాఘవం నిబంధనలన్నీ బుట్టదాఖలు ప్రజలంటే భయం లేదు. ఎందుకంటే ఓట్ల సమయంలో నోట్లు ఇచ్చి కొనుక్కోవచ్చుననే ధీమా. మళ్లీ ఎలాగోలా అధికారంలోకి వస్తామనే ధైర్యం. పోనీ దేవుడంటే భక్తి ఉందా అంటే... ఆ భగవంతుడికి భక్తితో భక్తులు ఇచ్చే కానుకల్లోనే వాటాలు పంచుకునే నీచ సంస్కృతి జిల్లాలో నడుస్తోంది. ఇదే అవకాశంగా నిబంధనలు బుట్టదాఖలు చేస్తూ పైరవీలకు పెద్దపీట వేసి పీఠాలను కొంతమంది చేజిక్కించుకుంటున్నారు.. సాక్షి ప్రతినిధి, కాకినాడ : అమాత్యుల అండదండలుంటే సీనియార్టీతో పనేముంది. ఉన్నతాధికారుల ఆశీస్సులుంటే కోరుకున్న పోస్టు కోరుకున్నచోటే వచ్చేస్తుంది. నిబంధనలకు పాతరేసి నచ్చిన వారికి మెచ్చిన పోస్టులు కట్టబెట్టడం పలు శాఖల్లో కొత్తేమీ కాదు. అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికేసిన అమలాపురం డీఎల్పీఓ శర్మను జిల్లా పంచాయతీ అధికారిగా నియమించి ప్రజాప్రతినిధులు చేతులు కాల్చుకున్నారు. ఏసీబీ కోర్టులో అతనిపై కేసు పెండింగ్‌లో ఉన్నా ముడుపులు మెక్కేసిన నేతలు అడ్డగోలుగా పోస్టింగ్ ఇప్పించేశారు. చివరకు అతని పనితీరు సక్రమంగా లేక కలెక్టర్ ఆగ్రహానికి గురై డీఎల్పీఓగా తిప్పి పంపించేశారు. అప్పుడు డీఎల్పీఓ శర్మ విషయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు తప్పుచేస్తే ఇప్పుడు కూడా అదే తప్పు దేవాదాయశాఖ డీసీ నియామకం విషయంలో చేశారంటున్నారు. కోట్ల ఆదాయం... అందకే... కాకినాడ కేంద్రంగా డిప్యుటీ కమిషనర్ పోస్టుకు దేవాదాయ శాఖలో ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుంది. వెయ్యికి పైబడి దేవాలయాలతో పాటు కోట్లాది రూపాయలు విలువైన సత్రాలు ఈ డీసీ పరిధిలో ఉన్నాయి. ఈ పోస్టు కోసం గతంలో జిల్లాలోనే కోటి రూపాయలు చేతులు మారిన సందర్భాలు కూడా లేకపోలేదు. అటువంటి డీసీ పోస్టు రెండు నెలల క్రితం చందు హనుమంతురావు పదవీ విరమణతో ఖాళీ అయింది. ఈ పోస్టులో డీసీని నియమించాలంటే ఆ క్యాడర్ ఉన్న ఆలయాలు జిల్లాలో లేవు. అలాగని డీసీ పోస్టును ఖాళీగా ఉంచడం కూడా కుదరదు. అందుకేనేమో రాజమహేంద్రవరం అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న రమేష్‌బాబును డీసీగా పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్ఎసీ) నియమించారు. సీనియర్లున్నా... డీసీ పరిధిలో ఉన్న ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సీనియర్లయిన అసిస్టెంట్ కమిషనర్లు డజనకు పైబడే ఉన్నారు. వీరిలో ఎవరి పేరును పరిగణనలోకి తీసుకోకుండా సంబంధిత శాఖా మంత్రి, ఉన్నతాధికారుల అండదండలుండటంతోనే రమేష్‌బాబును అడ్డగోలుగా నియమించేశారనే విమర్శలున్నాయి. ఉదాహరణకు జిల్లాలో ఉన్న అసిస్టెంట్ కమిషనర్లను పరిశీలిస్తే...పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి ఆలయ ఈఓ ఆర్.పుష్పనాధం, మందపల్లి శనీశ్వరాలయ ఘో దేవుళ్లు, రాజమహేంద్రవరం హితకారిణి సమాజం ఈఓ పి.సుబ్రహ్మణ్యం, తలుపులమ్మ లోవ దేవస్థానం ఈఓ చంద్రశేఖర్...వీరు నలుగురు రమేష్‌బాబు కంటే సీనియర్లుగా ఉన్నారని దేవాదాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన రెండు జిల్లాలను కూడా చూసుకుంటే మరో పాతిక మందివరకు సీనియర్లున్నారు.అటువంటప్పుడు సీనియర్లను పక్కనపెట్టేసి రమేష్‌బాబును నియమించడంలో ఔచిత్యమేమిటో అర్థం కాక సంబంధిత శాఖలో తలలుపట్టుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 339 ప్రకారం చూసుకుంటే అసిస్టెంట్ కమిషనర్ నుంచి డిప్యుటీ కమిషనర్‌గా పదోన్నతి ఇవ్వాలంటే 13 జిల్లాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ల సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలి. నిబంధనలూ బుట్టదాఖలే... సీనియారిటీ పక్కనబెట్టేయడం మాట అటుంచి గెజిటెడ్ పోస్టుల భర్తీలో సొంత జిల్లాల వారిని నియమించకూడదనే నిబంధనను కూడా బుట్టదాఖలు చేశారు. ఆమాత్యుని అండదండలుంటే చాలు నిబంధనలు వర్తించవా అని ఆ శాఖ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇదే డిప్యుటీ కమిషనర్ పోస్టు కోసం కోటి రూపాయలకుపైనే డీల్ కుదిరి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచనలమైంది. అప్పట్లో లోవ దేవస్థానం ఈఓ గాది సూరిబాబు రాజు ఈ పోస్టింగ్ కోసం ఒక మంత్రి సోదరుడు ద్వారా కోటికి బేరం కుదుర్చుకుని అరకోటి అడ్వాన్సుగా సమర్పించుకున్నాడు. అడ్వాన్సు తీసుకున్న ఆ అమాత్యుని ’తమ్ముడు’ ప్రయత్నించినా చివరకు విశాఖ కనక మహాలక్ష్మి ఈఓగా పనిచేస్తున్న భ్రమరాంబ (ప్రస్తుతం శ్రీకాళహస్తి ఈఓ)కు సీనియార్టీ ప్రాతిపదికన నియమించారు. అనంతరం ఆ తెలుగు తమ్ముడు తీసుకున్న అరకోటి అడ్వాన్సు తిరిగి ఇవ్వకపోవడం, అనారోగ్యం, మానసిక ఆందోళనతో ఈఓ సూరిబాబు రాజు మృతి చెందారు. అంతటి డిమాండ్ ఉన్న ఈ పోస్టుకు నిబంధనలు తుంగలోకి తొక్కి ఎఫ్ఏసీగా నియమించారంటే అసలు ఏమి జరగకుండా ఉండి ఉంటుందా అని ఆ శాఖలోనే పలువురు ప్రశ్నిస్తున్నారు. అమాత్యుడి ఆశీర్వాదం... ఈ పోస్టు భర్తీ చేసేటప్పుడు ఆ శాఖలో ఏసీలుగా పనిచేస్తున్న వారిలో సీనియర్లను పరిగణనలోకి తీసుకోవాలనేది నిబంధన. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా దేవాదాయశాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అండదండలు దండిగా ఉండటంతో సీనియార్టీని బుట్టదాఖలుచేసి రమేష్‌బాబును అడ్డగోలుగా అందలమెక్కించారనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇది జరిగి నెల రోజులు దాటిపోయింది. ఇన్ని రోజులుగా ఆ శాఖలో పెద్దగా చర్చకు రాని డీసీ నియామకంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దేవాలయాల హుండీల్లో పెద్ద నోట్ల మార్పిడి వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఈ అంశం కూడా తెర మీదకు వచ్చింది.