విద్యుత్ భవన్
పైరవీకారులకు ఇష్టమైన స్థానానికి బదిలీ చేయడం.. అదీ నచ్చలేదంటే వారు కోరుకున్న చోటుకు పంపండం విద్యుత్ శాఖకే చెల్లింది. నిషేధ సమయంలో ఏడుగురు ఏఈలకు స్థానచలనం కల్పించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఓ డీఈకి కోరుకున్న చోట పోస్టింగ్ ఇవ్వడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. అయినా బదిలీ విషయంలో తగ్గకపోగా తాత్కాలిక పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్వర్వులు జారీ చేయడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఏది ఏమైనా విద్యుత్ శాఖకు రెగ్యులర్ అధికారి లేకపోవడంతో పాలన పట్టు తప్పుతోంది.
కర్నూలు(రాజ్‌విహార్): సాధారణ బదిలీల కు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుంది. దీనికి అనుగుణంగా ట్రాన్స్‌కో ఆఫీస్ ఆర్డర్ పేరుతో టీఓఓ విడుదల చేస్తుంది. వీటి ప్రకారమే విద్యుత్ పంపిణీ సంస్థలు బదిలీలు చేపడతాయి. అయితే ఏపీ ఎస్‌పీడీసీఎల్ కర్నూలు సర్కిల్‌లో అందుకు విరుద్ధంగా బదిలీలు చేపడుతున్నారు.
అధికారిని మెప్పిస్తే చాలు..
అధికారి మొప్పు పొందితే చాలు..కోరుకున్న స్థానానికి బదిలీ చేస్తున్నారు. ఒక వేళ ఆ స్థానం నచ్చలేదని అడిగితే.. రాత్రికి రా త్రి వారికి ఇష్టమైన స్థానంలో నియమిస్తున్నారు. కార్మిక, ఉద్యోగ సంఘాల ప్రతి నిధుల ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీ చేశామని చెప్పొకొస్తున్నారు.
ఏడుగురికి బదిలీలు..
♦ 15 రోజుల క్రితం ఏఈ నాగేంద్ర ప్రసాద్‌ను నంద్యాల ప్రొటెక్షన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయన అక్కడ విధుల్లో చేరలేదు. ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించడంతో పాత ఆర్డర్స్‌ను పక్కన పడేసి కర్నూలు ఎల్‌టీ మీటర్స్ విభాగానికి బదిలీ చేశారు.
♦ గతంలో పత్తికొండ సెక్షన్‌లో ఏఈగా పనిచేసిన నారాయణ స్వామి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఏడాది క్రితం మంత్రాలయానికి బదిలీ చేశారు. అంతలోనే ఇప్పుడు ఆయన్ను తిరిగి పత్తికొండకు బదిలీ చేశారు.
♦ వెల్దుర్తిలో పనిచేస్తున్న శ్రావణ్‌కుమార్‌రెడ్డి మూడునెలల క్రితం తెలంగాణకు బదిలీ అ య్యారు. అయితే కోర్టు ఆయను తిరిగి కర్నూలులోనే నియమించాలని ఉత్తర్వులు ఇవ్వగా కర్నూలు క్యాంప్స్ సెక్షన్‌కు బదిలీ చేశారు.
♦ కర్నూలు క్యాంప్స్ సెక్షన్‌లో పనిచేస్తున్న ఏఈ భానుచందర్‌ను అనతికాలంలోనే నంద్యాల పట్టణంలోని ప్రొటెక్షన్స్ విభాగానికి బదిలీ చేశారు.
♦ ఆదోని డివిజన్‌లోని హొళగుంద ఏఈగా పనిచేస్తున్న నాగభూషణంను ఆరు నెలల వ్యవధిలోనే తిరిగి ఆదోని పట్టణంలోని డిస్ట్రిబ్యూషన్–1కు బదిలీ చేశారు.
♦ ఆలూరు ఏఈగా పనిచేస్తున్న సంతోష్‌ను బదిలీ మార్గదర్శకాలు రాకముందే ఆదోని పట్ణణంలోని డిస్ట్రిబ్యూషన్–3కి, ఇక్కడ పనిచేస్తున్న నరసన్నను ఆలూరుకు బదిలీ చేశారు.
♦ కర్నూలులో పనిచేస్తున్న శిలింగయ్యను నంద్యాలకు, నంద్యాలలో పనిచేస్తున్న దావిద్‌ను కర్నూలుకు బదిలీ చేశారు.
♦ కర్నూలు కస్టమర్ సర్వీస్ సెంటర్‌లో పనిచేస్తున్న జాన్ బెర్నాడ్‌ను గూడూరుకు, ఇక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిని కర్నూలు సిటీ మీ టర్స్‌కు,ఆత్మకూరు రూరల్ ఏఈ రాజేంద్రబా బును కర్నూలువిద్యత్ భవన్‌కు బదిలీ చేశారు.
♦ విద్యుత్ భవన్‌లో పనిచేస్తున్న ఓ డీఈని ఆపరేషన్స్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వగా ఫిర్యాదులు వెళ్లడంతో వెనక్కి తగ్గి ఉత్తర్వులు తొలగించారు.
♦ కర్నూలు సర్కిల్ కార్యాలయంలో నాన్‌పోక ల్ పోస్టులో నెలన్నర కిత్రం బాధ్యతలు చేపట్టి న డీఈని ఆపరేషన్స్ డివిజన్‌కు బదిలీ చేశారు.
మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి...
గైడ్‌లైన్స్ ప్రకారం ఒకే హోదా ఉండి.. ఒకే పోస్టులో మూడేళ్లు పూర్తి చేసుకున్న వారిని ఒక సబ్ డివిజన్ నుంచి మరో సబ్‌డివిజన్‌కు బదిలీ చేయాలి. ఒకే హోదాలో వివిధ పోస్టుల్లో పనిచేసినా ఒకే పట్టణం (స్టేషన్)లో ఐదేళ్లు పూర్తయితే ఒక డివిజన్ నుంచి మరో డివిజన్‌కు బదిలీ చేయాలి. అయితే బదిలీలకు అర్హులైన వారి సంఖ్యలో 20శాతంలోపు వారికి మాత్రమే స్థాన చలనం కల్పించాలి. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది, లైన్ ఇన్స్‌పెక్టర్లు, లైన్‌మెన్లు, జూనియర్ లైన్‌మెన్లు, జూనియర్ అసిస్టెంట్లు (ఎల్‌డీసీ), సీనియర్ అసిస్టెంట్లు (యూడీసీ) తదితర విభాగాలకు చెందిన సిబ్బందిని అర్హతలను బట్టి బదిలీ చేయాలి. మెడికల్ గ్రౌండ్స్ కింద మినహాయింపు లేదా కోరుకున్న స్థానంలో నియమించాల్సి ఉంది.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఏఈల ను బదిలీలు చేశాం. ఏదైనా మ్యూచువల్, మెడికల్ గ్రౌండ్స్ కింద ఎవరైనా రిక్వెస్టు చేసి ఉండవచ్చు. బదిలీల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోలేదు. – ఓబుల కొండారెడ్డి, ఇన్‌చార్జ్
Comments
Please login to add a commentAdd a comment