Pisces
-
మీనం: ఫాస్ట్‌ఫుడ్ సహా ఈ వ్యాపారాలు బెటర్! స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.. ఇంకా
మీన రాశి - (ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2) మీనరాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లగ్న ద్వితీయ స్థానాలలో గురు రాహువుల సంచారం, సప్తమ అష్టమస్థానాలలో కేతుగ్రహ సంచారం, వ్యయస్థానంలో శనిగ్రహ సంచారం, రవి చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. అనేకమందితో నూతనమైన వ్యవహారాలు వ్యాపారాలు లాభిస్తాయి. ఆశపెట్టుకున్న వ్యక్తులు మిమ్మల్ని ఆదుకుంటారు. ఎంతోమందికి మీరు అభయహస్తం ఇస్తారు. కొంతమంది విద్యాభ్యాసం కోసం స్వార్జితాన్ని విరాళంగా అందజేస్తారు. వ్యాపార వ్యవహారాలు ఊహకు మించి పెరుగుతాయి. ప్రతి పనికి అధిక కష్టం చేయాల్సిన పరిస్థితులున్నాయి. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. మానసిక ఒత్తిడిని కలిగి ఉంటారు. లాటరీలు, క్రికెట్ బెట్టింగ్‌లు పనికిరావు. దొంగ స్వామీజీల వల్ల, నకిలీ వస్తువుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఈ వ్యాపారాలు బెటర్ ఫర్నిచర్ వ్యాపారం, ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం, బేకరీలు, హాస్టల్ మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి బాగుంటుంది. సంతాన పురోగతి బాగుంటుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, సేవాసంస్థలు, అనాథాశ్రమాలకు మంచిపేరు వస్తుంది. నూతన పదవీప్రాప్తి వుంది. గృహయోగం, వాహనయోగం కలుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. అత్యున్నత సాంకేతిక విద్యకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశాలలో ఉద్యోగప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. స్త్రీలతో ఏర్పడిన విభేదాలు వ్యతిరేక ప్రభావం చూపిస్తాయి. స్టేషనరీ, రవాణా, ఆహార, అలంకార సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. లాయర్లకు, పోలీసు అధికారులకు వృత్తిపరంగా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వ్యాపారంలో భాగస్వాములు మోసం చేస్తారు. సంతానం లేనివారికి సంతానప్రాప్తి, పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సర్పదోషాలు, గ్రహబాధలు తొలగిపోవడానికి సర్పదోషనివారణ చూర్ణంతో సర్వరక్షాచూర్ణం కలిపి స్నానం చేయండి (తలస్నానం చేయరాదు). మీతో వైరం పెట్టుకుంటే శత్రువర్గం మీపై దుష్ప్రచారం కొనసాగిస్తారు. విమర్శలను పట్టించుకోకుండా నడుచుకుంటారు. మీతో వైరం పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాళ్ళందరికీ తెలిసివస్తుంది. లోహపు వ్యాపారులకు, ఆహారధాన్యాల వ్యాపారులకు, వస్త్ర వ్యాపారులకు కాలం కలిసివస్తుంది. సంవత్సర ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధం బాగుంటుంది. పన్నుల అధికారుల వల్ల ఇబ్బందిపడే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు విసుగు పుట్టిస్తాయి. దైవానుగ్రహం వల్ల మీ ప్రమేయం లేకుండానే ఆకస్మికంగా పెళ్ళి సంబంధం కుదురుతుంది. గడప గౌరమ్మ వాడేటప్పుడు ఇందులో సుమంగళీ పసుపు కలిపి ఉపయోగించండి. ఆకస్మికంగా ఇంట్లో ఓ శుభకార్యాన్ని నిర్వహిస్తారు. వ్యక్తిగత పరపతి పెరగడంతో పాటు శత్రువులు కూడా పెరుగుతారు. ఉద్యోగపరంగా మీపై కక్ష సాధించాలనుకునే మీ పైఅధికారికి స్థానచలనం కలగడంతో ఊపిరి పీల్చుకుంటారు. ఇతరుల బరువు, బాధ్యతలను మీపై వేసుకోవడానికి ప్రయత్నించవద్దు. బంధువులకు సహాయం చేయడం వల్ల గృహంలో చికాకులు ఎదురవుతాయి. సంతానం చదువుల నిమిత్తం అధిక ధనం వెచ్చించవలసిన పరిస్థితి రావచ్చు. ప్రతిరోజూ హనుమాన్ సింధూర్ నుదుటన ధరించండి. వాహనాన్ని మారుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వ్యాపారంలో అధునాతనమైన పద్ధతులను అవలంబించి అభివృద్ధి సాధిస్తారు. చార్టర్డ్ అకౌంటెంట్స్‌కు ఈ సంవత్సరము బాగుంది. ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్తలు అవసరం. పార్శ్వపు నొప్పి, ఈఎన్టీ సమస్యలు రావచ్చు. గతంలో పాల్గొన్న క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అప్పటి పరిచయాలు, సర్టిఫికెట్స్ ఇప్పుడు మీకు బాగా ఉపయోగపడతాయి. కొంతమంది సన్నిహితులు దూరం అవుతారు. మరి కొంతమంది సన్నిహితులు అవుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అఘోరపాశుపత హోమం చేయాలి, కార్యాలయంలో రాజకీయాలు అధికం అవుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధం బాగుంటుంది. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొంతవరకు అనుకూలంగా వుంటుంది. ప్రముఖ వ్యక్తుల చేతుల మీదుగా అవార్డులు స్వీకరిస్తారు. అవివాహితులైన స్త్రీలకు మంచి సంబంధం కుదురుతుంది. క్రీడారంగంలో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. స్నేహితులు ప్రక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తారు. దైవానుగ్రహం వల్ల నష్టపోకుండా బయటపడతారు. రహస్య సమాలోచనలు, రహస్య ప్రయాణాలు లాభిస్తాయి. మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆకర్షితులు అవుతారు. మొండికి పడిన శుభకార్యాలు ఓ దారికి వస్తాయి. బాధ్యతలు నెరవేర్చడానికి అధిక ప్రాధాన్యమిస్తారు. దీపారాధన చేసే కుందిలో రెండు చుక్కలు పరిమళగంధం వేసి దీపారాధన చేయండి. ఆత్మీయులతో విడిపోవడం కన్నా, కలిసి వుండటం మంచిదని గ్రహించండి. వ్యాపారం మీ అంచనాలను మించి ఎదుగుతుంది. లాభాలు బాగుంటాయి. విద్యాసంబంధమైన విషయాలు, విదేశీయాన యత్నాలు సానుకూలపడతాయి. ఐఐటీ, మెడిసిన్, సాంకేతిక రంగం, సివిల్ సర్వీస్‌లు, గ్రూప్ సర్వీస్‌లు మొదలైనవి మీకు అనుకూలిస్తాయి. ప్రతి విషయంలోను బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. సెల్ఫ్‌డ్రైవింగ్, స్విమ్మింగ్, జ్యోతిషం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మానసిక సంతృప్తి ఉండదు. సంతాన పురోగతి సంతృప్తికరంగా వుంటుంది. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. గైనిక్ సమస్యలు ఇబ్బంది పెడతాయి. చిట్టీల వల్ల, ఫైనాన్స్ వ్యాపారాల వల్ల నష్టపోతారు. కళా, సాహిత్య రంగాలలో రాణిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన చదువులు చదువుకోవడానికి ఎంపికవుతారు. స్వయం సంపాదన ప్రారంభమవుతుంది. గతాన్ని మరచి మాట్లాడడం వలన విమర్శలకు గురవుతారు. భార్యాభర్తల మధ్య స్నేహపూరిత వాతావరణం ఉంటుంది (ఇది కొంతమంది విషయంలో మాత్రమే). ఆర్థిక విషయాలు చాలా బాగున్నాయి. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా లభించిన పదవి సంతోషం కలిగించదు. పిల్లల చదువుల కోసం అధికంగా ఖర్చుచేస్తారు. యోగా, మెడిటేషన్, ప్రకృతి వైద్యాల వల్ల అనుకున్న ఫలితాలు వస్తాయి. అలంకార వ్యాపారాలు, పరిశోధనలు లాభిస్తాయి. మరో గృహయోగం ఏర్పడుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగం మారాలని నిర్ణయించుకుంటారు. మీ అభిప్రాయానికి విలువలేని చోట పనిచేయడం అనవసరమని భావిస్తారు. ఐశ్వర్యనాగినిని ఉపయోగించడం వలన లక్ష్మీ దేవి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎగ్జిక్యూటిల్ పోస్టుల్లో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్ పోస్టులో ఉన్నవారికి, జ్యూడిషియల్ ఆఫీసర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. కుటుంబ విషయాలు అంతగా పట్టించుకోలేరు. ఆత్మీయుల ముసుగులో ఉన్న వ్యక్తుల నిజస్వరూపం ఆలస్యంగా తెలుసుకుంటారు. మీపై వచ్చిన నిందారోపణలు నిజం కాదని నిరూపించుకో గలుగుతారు. దొంగ స్వామీజీలను నమ్మి మోసపోతారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబానికి బరువు కాకూడదని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. సంతాన పురోగతి గురించి ఆందోళన చెందవలసి వస్తుంది. తల్లిదండ్రులు, బంధువుల పెద్దలతో విభేదాలు వచ్చే పరిస్థితులు సంభవం. ఆకస్మికంగా శుభకార్యాలు నిశ్చయమవుతాయి. స్వీయ సంపాదనతో స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కండరాలు, ఎముకలకు సంబంధించిన అనారోగ్యం బాధిస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంటుంది. -
Yearly Horoscope: ఈ ఏడాది రాశి ఫలాలు.. పూర్తి వివరాలు
రాశి ఫలాలు- 2023.. పూర్తి వివరాలు మేషరాశి ఈ రాశిలో జన్మించి స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంది. సులువుగా అవుతాయనుకున్న వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వైరాగ్యం, వేదాంతం చోటు చేసుకుంటాయి. సంతానం వల్ల ప్రఖ్యాతి లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. వాహనం మార్పు చేయాలన్ని ఆలోచనలు బలపడతాయి. సఖ్యతలేని వ్యక్తుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలతో విసిగి పోతారు. ఆదాయ, వ్యయాలు ప్రధానాంశాలవుతాయి. కొన్ని విషయాలలో మొండిగా ప్రవర్తిస్తారు. వస్త్రాలను సౌందర్య సాధక సామాగ్రిని కొనుగోలు చేస్తారు. మీకు మేలు చేకూర్చే ఉత్తర్వులలో జాప్యం చోటు చేసుకుంటుంది. అష్టమూలికా తైలంతో లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయండి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇబ్బందులను అధిగమించి, విద్యారంగంలో అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. శత్రువర్గంపైన విజయం సాధిస్తారు. విదేశీయాన సంబంధమైన విషయాలు, శుభకార్యాలు ముడిపడతాయి. జీవితశాయాన్ని నెరవేర్చుకో గలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజాసంబంధాలు, రాజకీయ విషయాలు బాగుండవు. డబ్బులతో అన్నీ సాధించలేమని గుర్తిస్తారు. మీ వ్యూహానికి ప్రత్యర్థులు అంతకంటే గొప్ప వ్యూహాన్నే రచించి అమలు చేస్తారు. పోటీపరీక్షలన్నింటిలో అనుకూల ఫలితాలు వస్తాయి. మధ్యవర్తిత్వం అంగీకరించరు. ఇందువల్ల ఇరువర్గాలకు దూరమవుతారు. అదే సమయంలో ఇంట్లోవాళ్ళు సన్నిహితమవుతారు. ప్రతిరోజూ హనుమాన్ సింధూర్ నుదుటన ధరించండి. రాజకీయాలలో రాణిస్తారు. నూతన వ్యాపారం లాభిస్తుంది. స్పెక్యులేషన్ ఎగుమతి, దిగుమతికి సంబంధించిన వ్యవహారాలలో కొంత మెలకువ అవసరం. క్రెడిట్ కార్డులు, బ్యాంకు వ్యవహారాలూ, పొదుపు డిపాజిట్లు తదితర వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎటువంటి బెట్టింగ్‌లలో పాల్గొనవద్దు, నష్టపోతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ద అవసరం. ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 1 వృషభ రాశి ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు చాలా బాగుంది. ఆర్థికంగా కొంత పురోభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి గాను ముందు చూపుతో వ్యవహరిస్తారు. జమాఖర్చులు, పద్దులు రొటీన్ సంతకాల విషయంలో మెలకువగా వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల పరంగా సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రత్యర్థి వర్గంలోని కొందరు మీతో స్నేహ బంధాలను పెంచుకుంటారు. ఈ పరిణామం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలలో మీ మాటను అందరూ గౌరవిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకుంటారు. మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంటారు, మంచి ఫలితాలు సాధిస్తారు. పూజలలో, శుభకార్యాలలో సుగంధసిద్ధగంధాక్షింతలను ఉపయోగించండి. విలువైన స్థిరాస్థులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. శుభకార్యాలు ముడిపడతాయి, మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరమైన విషయంలో కొంత ఇబ్బంది వున్నా, ద్వితీయార్ధంలో సంతానం పరిస్థితి బాగుంటుంది. విద్యారంగంలో పిల్లలు మంచి విజయాలు సాధిస్తారు. వాహనాల విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రజల అభిమానంతో ముడిపడిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. ఆర్థికక్రమశిక్షణ బాగా పాటిస్తారు. పూజలలో హరిచందనం ఉపయోగించండి. కళా, సాహిత్య, రాజకీయరంగాలలో రాణిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. మీ జీవితాశయం నెరవేర్చుకుంటారు. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టగలుగుతారు. అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఋణాలు ఇవ్వడం తీసుకోవడం తగ్గించండి. ఇటువంటి లావాదేవీలు మీకు అనుకూలించవు. ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 6; అవమానం 1 మిధున రాశి ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వివాదాస్పద అంశాలు సానుకూల పడతాయి. సంస్థలను విస్తరింప చేసుకునే యత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లేక అనుకూలమైన బదిలీ సూచనలు గోచరిస్తున్నాయి. అయితే మితిమీరిన ఆత్మ విశ్వాసం వల్లచిక్కులు రాకుండా జాగ్రత్తలు వహించండి. వ్యక్తిగత గౌరవానికి విశేష ప్రాముఖ్యతనిస్తారు. మీరు అడక్కుండానే తమకు తాముగా సలహాలు, సూచనలు ఇచ్చే వారు అధికమవుతారు. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పూజించండి. పాతఋణాలను చాలా వరకు తీర్చి వేస్తారు. ఏమాత్రం పరిచయం లేని వారి వలన లాభపడగలగడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయ, సినీ, కళారంగాలలోని వారికి కాలం అనుకూంగా ఉంది. విద్యాసంబంధమైన విషయాలు, సాంకేతికవిద్యకు సంబంధించిన అంశాలు, గణిత విద్యకు సంబంధించిన అంశాలు బాగున్నాయి. మెడిసిన్ సీటు లభిస్తుంది. సినిమావ్యాపారం కలిసి వస్తుంది. ఫ్యాక్టరీ, దాల్‌మిల్స్, రైస్‌మిల్స్, షుగర్ ఫ్యాక్టరీల వ్యాపార విషయాలు బాగున్నాయి. అక్వారంగంలో, పౌల్ట్రీరంగంలో కలిసిరాదు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. విద్య, ఉద్యోగ అవకాశాలు దూరప్రాంతంలో మీరు కోరుకున్న విధంగా లభిస్తాయి. పోటీపరీక్షలోలలో విజయం సాధిస్తారు. కళాసాంస్కృతిక రంగాలలో ఉన్నవారికి కీర్తిప్రతిష్ఠలు, అవార్డులు వస్తాయి. పూజలలో, అభిషేకాలలో జువ్వాదిని ఉపయోగించండి. పలుకుబడి ఉపయోగించి ఈ అవార్డులు సంపాదించారని మీపై దుష్ప్రచారం జరుగుతుంది. స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమతో విలువైన బహుమతులను కొనిస్తారు. ఆహారం విషయంలో నియమాలు పాటించండి. మీ సిద్ధాంతాలకు, అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ప్రయోజనాల పరిరక్షణ కోసం కొన్ని అమలు చేయమని మీ ఆత్మీయవర్గం ఒత్తిడి చేస్తారు. ప్రయోజనాలను వదులుకుంటారు కానీ మనస్సాక్షికి విరుద్ధంగా ఏ పనీ చేయరు. పనిలో పనిగా మీ వైరీవర్గానికి బెదిరింపు సంకేతాలు పంపిస్తారు. మీరంటే భయం, గౌరవం ఏర్పడే విధంగా పరిస్థితులను మార్చుకుంటారు. ఆదాయం 2; వ్యయం 11; రాజపూజ్యం 2; అవమానం 4 కర్కాటక రాశి ఆదాయం 11; వ్యయం 8; రాజపూజ్యం 5; అవమానం 4 కర్కాటకరాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంటుంది. కార్యా లయాలలో స్వయంకృతాపరాధాలు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుకోదగిన ఒడిదుడుకులేవీ ఏర్పడవు. ఆదాయ, వ్యయాలలో సమతుల్యత లోపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. పొదుపుపైన దృష్టిని సారిస్తారు. సంతాన పురోభివృద్ధి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. శుభవార్తాశ్రవణం చేస్తారు. అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మానసిక సంఘర్షణ చోటు చేసుకుంటుంది. సామాజిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులలోని ఒక వర్గంతో సత్సంబధాలను మరింత బలపరచుకుంటారు. మీ సహాయసహకారాలతో ఉన్నతపదవిని అలంకరించిన వారు కీలక సమయంలో కొద్దిపాటి సహాయం మాత్రమే చేస్తారు. మీకు కోపం, ఆశ్చర్యం రెండూ కలుగుతాయి. ఏరు దాటి తెప్పను తగలేసే వ్యక్తులు ఈ సంవత్సరం ఇబ్బంది పెడతారు. మీ మనోవేదనకు కారణం అవుతారు. ఎవరిని నమ్మాలన్న భయం కలుగుతుంది. మెడిసిన్ సీటు వస్తుంది. భగవంతునిపై భారం వేసి చాలా కార్యక్రమాలు చేస్తారు. సర్పదోషనివారణా చూర్ణములో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్ననం చేయండి (తలస్నానం చేయరాదు). పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగం చేసే చోట వాతావరణం కలుషితం అవుతుంది. కుల, మత, వర్గ, ప్రాంతీయ రాగద్వేషాలు చోటు చేసుకుంటాయి. జీవితంలోకి ఆహ్వానిద్దాం అన్న వ్యక్తి కొన్ని కారణాల వల్ల ఆహ్వానించలేడు. కొత్తకొత్త రంగాలలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకుంటారు. వైద్యవిద్య, సాంకేతిక విద్య, చార్టెడ్ అకౌంటెంట్ ఇలాంటివన్నీ కూడా కలిసొస్తాయి. విదేశీయాన సంబంధిత విషయాలు లాభిస్తాయి. విదేశాలలో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది. అవివాహితులైన వారికి వివాహప్రాప్తి. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. గైనిక్ ప్రాబ్లవ్సును అధిగమిస్తారు. సంతానం క్రమశిక్షణ తప్పడం కొద్దికాలం ఆందోళనకు కారణం అవుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆర్థికపరిస్థితులు మెరుగుపడతాయి. చాలా శ్రమించి ఎన్నోబాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వస్తారు. సింహ రాశి ఆదాయం 14; వ్యయం 2; రాజపూజ్యం 1; అవమానం 7 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ పరంగా అధికంగా శ్రమించినప్పటికీ అంతంతమాత్రపు ఫలితాలతో సరిపుచ్చుకోవలసి ఉంటుంది. అడ్వాన్స్ ఇచ్చి రిజిష్ట్రేషన్ చేయించుకున్న ఓ ఆస్తి వల్ల పరోక్షంగా లాభపడతారు. కోర్టు కేసులు వాయిదాలలో ఉంటాయి. కొంత ఆత్మనూన్యతాభావానికి లోనవుతారు. ఒక సందర్భంలో స్వయం కృతాపరాధాల వలన తాత్కాలిక ఇబ్బందులను ఎదుర్కొన వలసి వస్తుంది. శుభవార్తలను వింటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ సలహాలు, సూచనలు అందరి మన్ననలు అందుకుంటాయి. ప్రతిరోజూ నుదుటన నాగసింధూరం ధరించండి. పనులలో చురుకుదనం లోపిస్తుంది. ఆధ్యాత్మిక గ్రంధాలను కొనుగోలు చేస్తారు. రాజకీయరంగ ప్రవేశం చేయాలనే ఆలోచనలు బలపడతాయి. కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీరు అనుకున్న పనులు కాస్త అటు–ఇటుగా పూర్తవుతాయి. సాంకేతికవిద్యలో రాణిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలో సీటు డొనేషన్ ప్రాతిపదికన లభిస్తుంది. ఆర్థికసంస్థలలో పనిచేస్తున్న వారు ప్రతివిషయంలోనూ జాగ్రత్త వహించాలి.ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. బదిలీ వేటు తప్పకపోవచ్చు. ఏ దేవుడికైనా, దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి. గతంలో చేసినటువంటి పొదుపు పథకాలు ఎంతగానో అక్కరకు వస్తాయి. ప్రభుత్వపరంగా, ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు. నిర్మాణ సంబంధమైన పనులు చురుకుగా సాగటం వల్ల ఆర్థికపరిస్థితి ఓ దారిన పడుతుంది. లైసెన్సులు, లీజులు పొడిగింపబడతాయి. ఉన్నతాధికారులు, ఉన్నతస్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల మేలును పొందగలుగుతారు. కుటుంబంలోని వారి ఆరోగ్యవిషయమై ప్రత్యేక శ్రద్ధ, ఖర్చులు సూచిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితం కొన్ని సందర్భాలలో లభిస్తుంది. కీర్తిప్రతిష్టలు కూడా దక్కుతాయి. మీకు లభించిన స్థానానికి సంతోషించలేని పరిస్థితిగా పరిణమిస్తుంది. పలురంగాలలో మీరు చేసిన కృషికి, చేస్తున్న కృషికి తగిన గుర్తింపు గౌరవం లభిస్తాయి. ఈ సంవత్సరం మీ జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారపరంగా భాగస్వాములతో అప్రమత్తంగా మెలగండి. కన్యా రాశి ఆదాయం 2; వ్యయం 11; రాజపూజ్యం 4; అవమానం 7 ఈ రాశిలో జన్మించిన పురుషులకు స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడానికి గాను ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఇందుకు గాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సానుకూల ఫలితాలను కూడా సాధించగలుగుతారు. అయితే ప్రతివిషయం కొంత నిదానంగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైన భేదాభిప్రాయాలను గ్రహస్థితి సూచిస్తోంది, జాగ్రత్తలు వహించండి. వృత్తి, ఉద్యోగాలపరంగా బరువుబాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను, శుభకార్యాలను నిర్నిఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. క్రయవిక్రయాలు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మీరు ఇతరులకు ఇచ్చిన వాగ్ధానాలను సకాలంలో నిలబెట్టుకోగలుగుతారు. ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించండి. రాజకీయంగా కలిసివస్తుంది. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. వృత్తి–ఉద్యోగాలలో మంచి పురోగతి కలిగి ఉంటారు. సాంకేతిక, న్యాయసంబంధిత, యంత్ర సంబంధిత ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. గనుల వ్యాపారం, నూనెల వ్యాపారం లాభిస్తాయి. ప్రింటింగ్, చిట్‌ఫండ్స్ వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. పాడిపరిశ్రమలో నూతన ప్రయోగాలు లాభిస్తాయి. ఎందరికో ఉపాధి కల్పిస్తారు. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంతవరకూ బైట అన్ని విషయాలను విజయపథంలో నడిపించగలరు. పోటీపరీక్షలలో మీరుపడ్డ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మీవల్ల కాదని అందరూ అనుకున్న సీటు మీకు లభిస్తుంది. అదే కోణంలో మీవల్ల కాదని అందరూ భావించిన కొన్ని కార్యక్రమాలని మీరు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. పూజలలో మరియు ఇంట్లో నాగబంధం అనే కుంకుమను ఉపయోగించండి. లీజులు, లైసెన్స్‌లు, రెన్యువల్స్ మీకు అనుకూలంగా మారుతాయి. జ్యేష్ఠ సంతాన విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచవలసి వస్తుంది. మొండివాళ్ళను సరైన దారిలో పెట్టవలసిన బాధ్యత మీపై పడుతుంది. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలుగుతుంది. స్వంత ఇంటి కల నెరవేరుతుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్ లభిస్తుంది. తులారాశి ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 7; అవమానం 7 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. ఆర్థికాభివృద్ధిని సాధించడానికి గాను వినూత్నమైన ఆలోచనలు సాగిస్తారు. కార్యరూపంలో కూడా అమలు పరుస్తారు. సమర్ధవంతమైన పనివారిని సమకూర్చుకోవడం వలన వ్యాపారస్తులు లాభపడగలుగుతారు. స్త్రీలతో ఏర్పడ్డ విభేదాలు తొలగి పోవడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. పాత శత్రువులే నూతన కోణంలో తారసపడతారు, వారిని ఎదుర్కొవలసిన పరిస్థితి ఉంటుంది శత్రువర్గానికి బలమైన అండదండలు ఉండవు, ఇది మీకు లాభించే అంశం. స్త్రీలతో వైరానికి ముందుకు దూకవద్దు. సాధ్యమైనంత వరకు చర్చలు వాయిదా వేయడం, తప్పుకోవడం మంచిది. వివాదస్పద విషయాలన్ని మధ్యవర్తుల సహాయసహకారాలతో, రాజకీయ పరపతితో పరిష్కారం అవుతాయి. మహోన్నతమైన ఆశయాలను అమలు చేసి మంచి ఫలితాలను సాధించడానికి ఉన్నతస్థాయి వ్యక్తులే కాక, సామాన్య జనం వల్ల కూడా సాధించవచ్చు అని నిరూపిస్తారు. సంతాన క్రమశిక్షణ విషయంలో సంవత్సర ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు ఏర్పడుతాయి. మీ తెలివితేటలతో, నైపుణ్యంతో వాటిని సరిదిద్దగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, మీ వ్యాపారాలు విస్తరణ చెందుతాయి. ఆరావళి కుంకుమ, లక్ష్మీచందనంతో మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మంచి మార్కులు వస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధించినా, ఇంటర్వ్యూలలో మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఎట్టకేలకు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. స్వయం శక్తితో కష్టించి ఉద్యోగం సాధిస్తారు. స్వయంశక్తితో స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన విషయాలలో ఆశాభంగం కలుగుతుంది. క్రీడా సాహిత్య సాంస్కృతిక రంగాలలో మంచి రాణింపు ఉంటుంది. ఖచ్చితమైన ఆదాయమార్గం దొరుకుతుంది. వృశ్చిక రాశి ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 3 ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. శ్రమకు తగిన ప్రతిఫం ప్రతిపనిలోనూ ఎంతోకొంత అంది వస్తుంది. మంచి వ్యక్తిగా ముద్రవేసుకోవడానికి అన్ని రకాలుగా కృషి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులను కలుపుకుని నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. నాగసింధూరం ప్రతిరోజూ నుదుటన ధరించడం వలన నరదిష్టి, నరఘోష తొలగిపోతుంది. జీవిత భాగస్వామి సలహాలను, సంప్రదింపులను పాటిస్తారు. సమాజంలో మీ ప్రతిష్ఠ పెంచే విధంగా ఓ మంచి అవకాశం వస్తుంది. ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి. సంతానపరంగా చిక్కులు ఏర్పడినా వాటిని అధిరోహించగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఇందుకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతంది. అడిగి అడగకుండానే ఋణాలు లభిస్తాయి. ఏ దేవుడికైనా, దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి. పేరుప్రఖ్యాతులు, దూరప్రాంతం నుండి ఆర్థిక సహాయం లభిస్తాయి. వీలైనంత వరకు వివాదాలకు, వివాదస్పద చర్చలకు దూరంగా ఉండండి. అనువంశిక ఆస్తుల విషయమైన డాక్యుమెంట్స్‌లో ఉన్న విషయాలు అస్పష్టంగా ఉండడంతో విభేదాలకు, వివాదాలకు దారితీస్తుంది. డాక్యుమెంట్స్‌లో స్పష్టత ఉండదు, ఇదీ సమస్య. చెవి, ముక్కు, గొంతు సంబంధమైన అనారోగ్యాలు బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో అయినవాళ్ళను, బంధువులను దూరంగా ఉంచి లాభపడతారు. ఆర్థిక ప్రయోజనాలను బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు. సాంకేతికపరమైన విద్యారంగంలో రాణిస్తారు. అత్యున్నత సాంకేతిక విద్యను అభ్యసించడానికి అవకాశాలు కలిసివస్తాయి. సినీ,కళా, పరిశ్రమలో ఉన్నవారికి పరిస్థితులు అంత అనుకూలంగా ఉన్నాయి. ధనుస్సు రాశి ఆదాయం 8; వ్యయం 11; రాజపూజ్యం 6; అవమానం 3 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలక ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో ఐకమత్యత బాగున్నప్పటికీ కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలలో స్వల్పమైన ఒడిదుడుకులేర్పడతాయి. సమస్యలు పరిష్కారానికి గాను చేసే చర్చలు చర్చలుగానే మిగులుతాయి. నిర్మాణాత్మక వ్యవహారాలలో స్వల్పమైన పురోభివృద్ధి కనబడుతుంది. సంతాన విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబరచవలసి వస్తుంది. జీవితశాయం నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రతిప్రయత్నం సఫలీకృతమవుతుంది. స్వగృహ యోగం ఏర్పర్చుకోగలుగుతారు. నూతన వ్యాపారం మొదలుపెట్టడం కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచిఫలితాలను ఇస్తాయి. వ్యాపారాభివృద్ధి కోసం మీరు ప్రయత్నాలు, ప్రయాణాలు సఫలీకృతమవుతాయి. నూతనమైన అగ్రిమెంట్స్‌ను చేసుకుంటారు. కాంట్రాక్టులు, బిల్స్, క్లైవ్సు మొదలయినవి మొత్తం చేతికందివస్తాయి. స్త్రీలతో విభేదాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది. దూరప్రాంతయత్నాలు, విదేశాలలో ఉద్యోగ, విద్య యత్నాల కొరకు మీరు చేసే ప్రయత్నాలు రెండవ ప్రయత్నంలో ఫలిస్తాయి. విలువైన వస్తువుల భద్రత గురించి జాగ్రత్త వహించండి. ఇన్సూరెన్స్ సేవలను ఉపయోగించుకోండి. రాజకీయంగా, ఉన్నతస్థానాలలో ఉన్నవారు, ముఖ్యమైన అధికారులు మిమ్ములను ఆదరిస్తారు. వైరివర్గానికి చెందిన రహస్య సమాచారం మీకు తెలుస్తుంది. తద్వారా లాభపడతారు. ప్రింట్ మీడియా వల్ల ఎలక్ట్రానిక్ మీడియా వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి. నానారకాలు అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు, బాధలు నశించడానికి త్రిశూల్‌ని ఉపయోగించండి. ఇది అత్యంత శక్తివంతమైనది. ఆరోగ్యపరమైన విషయాలలో స్వల్ప జాగ్రత్తలు అవసరము. తల్లిదండ్రులతో, పెద్దలతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ప్రజాసంబంధాలు పెంచుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. నిష్కారణమైన ఈర్షాద్వేషాలు, విమర్శలు ఎదురవుతాయి. అనవసరమైన విషయాలను పట్టించుకోవడం మానేస్తారు. అవసరమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. మకర రాశి ఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 2; అవమానం 6 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలు లభిస్తాయి. సమాజం పోకడ మీద నమ్మకం పోతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం అత్యంత కష్టమైన పని అవుతుంది. ఆప్యాయతలు, అనుబంధాలు, స్నేహాలు, బంధుత్వాలు ఇవన్నీ డబ్బుల ముందు ఎందుకూ కొరగానివని తెలుసుకుంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. సంతాన విద్యా విషయమై శక్తికి మించి ఖర్చు చేస్తారు. కాంట్రాక్టులు, లీజులు మీకు లాభిస్తాయి. విద్యార్థినీవిద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతీ తిలకాన్ని నుదుటన ధరించడం, మేధాదక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. కృషికి తగిన విధంగా ఫలితాలు వస్తాయి. వృత్తి,ఉద్యోగాలపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. రావాల్సిన ధనం వసూలు అవుతుంది. అన్యభాషలను నేర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతవిద్యను అభ్యసిస్తారు. కొన్ని సందర్భాలలో చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. ఈ రాశికి చెందిన భార్యాభర్తల మధ్య ఓర్పు, సహనం చాలా అవసరం. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరస్పరం అర్థం చేసుకునే పరిస్థితి నెలకొల్పుకోవాలి. ఐ.ఐ.టి, మెడిసిన్, సాంకేతికరంగం, సివిల్ సర్వీస్‌లు, గ్రూప్ సర్వీస్‌లు మొదలైనవి మీకు అనుకూలిస్తాయి. ప్రతివిషయంలోను బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. సెల్ఫ్‌డ్రైవింగ్, స్విమ్మింగ్, జ్యోతిష్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. నేర్చుకునే ప్రయత్నాలు చేస్తారు. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు వస్తాయి. ఉద్యోగం చేస్తారు. అయితే మానసిక సంతృప్తి ఉండదు. మీరు నిర్ణయం తీసుకుని సంతకం చేసేటప్పుడు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి సంతకం చేయండి. ఫర్నిచర్ వ్యాపారం, ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం, బేకరీలు, హాస్టల్ మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. మ్యారేజ్ బ్యూరోలు నడిపే వారికి కాలం అనుకూలంగా వుంది. చిట్టీల వల్ల, ఫైనాన్స్ వ్యాపారాల వల్ల నష్టపోతారు. కుంభ రాశి ఆదాయం 11; వ్యయం 2; రాజపూజ్యం 5; అవమానం 6 ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. సమాజంలోని ఉన్నత స్థాయి వారితోటి స్నేహసంబంధాలను బలపరచుకుంటారు. ఒకానొక అనుకూలమైన అధికార పత్రం ద్వారా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ లాభపడతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూల పడతాయి. మీ మాటకు వక్రభాష్యాలు చెప్పేవారు అధికమవుతారు. దూరప్రాంత ప్రయాణాలు ఒకే సమయంలో అనేక పనులను సానుకూల పరచుకోవలసి రావడం వంటి అంశాలు వత్తిడికి గురి చేస్తాయి. దైవం మీద భారం వేసి మీ శక్తికి మించి పెట్టుబడులను పెడతారు. సంతాన పురోగతిపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఏర్పడుతుంది. స్త్రీలతో విభేదాలు సంవత్సర ద్వితీయార్థంలో సమసిపోతాయి. పూజలలో, అభిషేకాలలో హరిచందనం ఉపయోగించండి. బంధువర్గంలో, సమాజంలో ప్రతిష్ఠ కాపాడుకోవడానికి చాలా శ్రమిస్తారు. భాగస్వాములు, సన్నిహిత సహచరులు మీ విజయంలో, అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు దగ్గరవుతారు. వైరివర్గం వల్ల వృత్తి,ఉద్యోగాల పరంగా చికాకులు సంభవిస్తాయి. శుభకార్యాల నిర్వహణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. ఇందుకు సంబంధించి, అంతిమ నిర్ణయాలు చేసే అవకాశం లభించదు. మీ వాదనలను, అభిప్రాయాలను ఆత్మీయులు తిరస్కరిస్తారు. రాజకీయ పదవులకు నామినేట్ అవడం రాజకీయ అధికారగణానికి దగ్గరవ్వడం సంభవం. సౌకర్యవంతమైన వస్తువులను, అధునాతన సామాగ్రిని కొనుగోలు చేస్తారు. ప్రభుత్వపరంగా ప్రైవేట్ పరంగా రావాల్సిన పెండింగ్ బిల్స్ ఓ దారికి వస్తాయి. విలువైన వస్తువులను, గృహాన్ని ఏర్పర్చుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా నైరాశ్యం, నిరాశ, కోపం కలుగుతాయి. వీటిని అదుపులో ఉంచండి. తప్పక దైవానుగ్రహం లభిస్తుంది. విదేశాలలో ఉన్నవారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. ప్రత్యక్షంగా లేక పరోక్షంగా కుటుంబానికి సహాయపడతారు. మీ సంపాదనలో కొంత భాగం దుబారాగా ఖర్చు అవుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు బాధిస్తాయి. మీన రాశి ఆదాయం 8; వ్యయం 11; రాజపూజ్యం 1; అవమానం 2 ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. గృహ, నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో చర్చలు ఫలిస్తాయి. జీవిత స్థిరత్వం ఏర్పడుతుంది. సంతానంనాకు నూతన అవకాశాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. పారిశ్రామిక, కళా రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. హనుమాన్ వత్తులును అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వలన సమస్యలు కొంత వరకు తీరుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది. కళా, సాహిత్య రంగాలలో మంచిగా రాణిస్తారు. అవార్డులు, రివార్డులు వస్తాయి. విలువైన బహుమతులు లభిస్తాయి. అనుకూలమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. పూజలలో ప్రథమతాంబూలాన్ని వాడండి. పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. జ్యేష్ఠ కుమార్తె విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ జ్ఞాపకశక్తి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనస్సు కష్టపడటానికి ఈ జ్ఞాపకశక్తే కారణమవుతుంది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు కలిసివస్తాయి. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని మీ సౌఖ్యాన్ని, సౌకర్యాలని తగ్గించుకుంటారు. అధికారంలో ఉన్న స్త్రీలకు మంచి అడ్మినిస్ట్రేటర్‌గా పేరు వస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా మందికి ఉద్యోగపరంగా ప్రయోజనం కలుగుతుంది. రాజకీయరంగంలో రాణిస్తారు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది. ఆర్థికభారం తేలికవుతుంది. ప్రభుత్వపరంగా, ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు. అధికారులతో మంతనాలు, రాజకీయ పైరవీలు లాభిస్తాయి. కోర్టుతీర్పులు అనుకూలంగా వస్తాయి. -పంచాంగకర్త: శ్రీమతి ములుగు శివజ్యోతి (కీ.శే. శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాదు సిద్ధాంతి గారి కుమార్తె) సంగ్రహణ: సాక్షి క్యాలెండర్ 2023. -
మీన రాశి ఫలాలు 2022-23
పూర్వాభాద్ర 4 వ పాదము (ది) ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా) రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి) ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (వ్యయం)లోను తదుపరి మీనం (జన్మం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (లాభం)లోను మిగిలినకాలం అంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (తృతీయం) కేతువు వృశ్చికం (భాగ్యం)లోను తదుపరి రాహువు మేషం (ద్వితీయం) కేతువు తుల (అష్టమం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (తృతీయం)లో స్తంభన. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా అధికకాలం శని సంచారం అనుకూలత దృష్ట్యా మంచి ఫలితాలు ఉంటాయి. అలంకరణ వస్తువులు కొనుగోలుకు బాగా ధనవ్యయం చేస్తారు. ఆదాయం బాగా ఉండి, అది అన్ని విధాలా సద్వినియోగపడడం వలన చాలా సుఖంగా కాలక్షేపం జరుగుతుంది. కొత్త ఋణాలు అనుకూలంగా అందుతాయి. పుణ్యక్షేత్ర సందర్శన, విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో ప్రత్యేక దృష్టితో పాల్గొనడం జరుగుతుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు బాగా అందుకుంటారు. ప్రమోషన్లు, అనుకున్న రీతిగా ట్రాన్స్ఫర్లు మీకు సంతృప్తికర ఫలితాలు ఇస్తాయి. శుభకార్య ప్రయత్నాలు తేలికగా పూర్తవుతాయి. చిరకాల సమస్యలకు ఈ సంవత్సరం నివారణ మార్గాలు దొరుకుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి మంచి సలహాలు సూచనలు అంది, సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రయాణం చేస్తారు. అన్ని రంగాల్లోనూ ఈ సంవత్సరం ఈ రాశివారికి శుభ ఫలితాలు అందుతాయి. మంచి జీవనం సాగుతుంది. మొండిబాకీలు వసూలు చేయడంలో స్నేహితులు బాగా సహకరిస్తారు. సరైన ప్రణాళికలను అమలు చేసినట్లయితే, అన్ని రకాలుగా వ్యాపార సమస్యలు తీరగలవు. వ్యాపారులకు సంవత్సరం అంతా లాభసాటిగానే ఉంటుంది. ఉద్యోగులకు అనుకోని లాభాలు చేకూరే అవకాశం ఉంది. పనులు తేలికగా పూర్తి చేస్తారు. తోటివారు సహకరిస్తారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. పాత ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటిస్తారు. వైద్యం పెద్దగా అవసరం లేకుండానే ఈ సంవత్సరం అనారోగ్యవంతులు కూడా సుఖపడే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలులో తెలివిగా ప్రవర్తిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి అన్ని పనులు వేగంగా పూర్తవుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికమైనా, పనులు సానుకూలంగా ఉంటాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు గురువు మీనంలో ఉన్న కాలం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఏప్రిల్ నుంచి అనుకూలంగా సాగుతుంది. అన్ని రంగాల్లోనూ సానుకూల ఫలితాలుంటాయి. రైతులకు కావలసిన సౌకర్యాలు బాగా అందుతాయి. శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. గర్భిణీ స్త్రీలు సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. పూర్వాభాద్ర నక్షత్రం వారు సంబంధం లేని అంశాల్లో ఇబ్బందులకు గురవుతారు. కొన్ని సందర్భాలలో మీకు ఎదురులేని రీతిగా గ్రహచారం అనుకూలిస్తుంది. కొన్నిసార్లు ఎంత శ్రమ చేసినా ఫలితం లేని తీరు వుంటుంది. ధన, కుటుంబ వ్యవహారాల్లో అనుకూల స్థితి ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు నగలు, వాహనాలు, భవంతుల కొనుగోలు విషయాలపై ఆసక్తి చూపుతారు. ప్రతి చిన్న విషయంలోనూ విపరీతమైన మానసిక ఒత్తిడి పొందుతారు. ప్రతిపనిలోనూ కలహతత్వం ప్రదర్శిస్తారు. రేవతీ నక్షత్రం వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగిపోతుంది. అనవసర విషయాల్లో భయాందోళనలు చెందుతారు. ఇతరులకు సహకారం చేయాలి అనుకున్నా మీకు అవమానకరమైన పరిస్థితులు ఎదురయ్యే సూచనలున్నాయి. శాంతి: ప్రత్యేకమైన శాంతి కార్యములు అవసరం లేదు. రోజూ విష్ణూ సహస్ర పారాయణ చేయుట. లక్ష్మీనారాయణ పూజ, గోపూజ చేసుకోవడం శుభప్రదం. పంచముఖ రుద్రాక్షధారణ శుభప్రదం. ఏప్రిల్: శ్రమ చేసినా ఫలితాలు సంతృప్తికరంగా ఉండవు. శనికి శాంతి అవసరం. ఏలినాటి శని ఈ నెల నుంచి ప్రారంభమవుతుంది. మీ జాతక పరిశీలన చేయించుకోండి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరం కాగలవు. ఉద్యోగ, వ్యాపారాలు భారంగా నడుస్తాయి. సానుకూలత తక్కువ ఉన్న కాలం. మే: గురు శుక్రుల అనుకూలత, శని కుజుల ప్రతికూలత దృష్ట్యా విచిత్రమై చికాకులు వెంబడిస్తాయి. ఆదాయం బాగున్నా, ఖర్చులు నియంత్రించలేరు. ఉద్యోగంలో అనుకోని చికాకులు రాగలవు. మితభాషణ అవసరం. మీ పనులు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. జూన్: ఉద్యోగం వ్యాపారాల్లో అధికారులతోను, పనివారితోను చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం. మితభాషణ, ఓర్పు చాలా అవసరం. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. జూలై: మంచి కాలం. అన్ని అంశాలూ అనుకూలిస్తాయి. డబ్బు వెసులుబాటు బాగుంటుంది. ధైర్యంగా, స్వయంగా పనులు చేసుకుంటూ విజయం సాధిస్తారు. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. కుటుంబ సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. ఋణ సమస్యలు తీరే కాలం. ఆగస్టు: అన్ని అంశాల్లోనూ మంచి ఫలితాలు ఉంటాయి. అనుకున్న ప్రతిపనినీ సకాలంలో పూర్తి చేస్తారు. సందర్భానుసారం ప్రవర్తించడం, అందరితో స్నేహంగా ఉండడం, ఆర్థిక వెసులుబాటు, ఆరోగ్యం సహకరించడం వంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నెల చాలా మంచికాలం. సెప్టెంబర్: చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అన్ని విషయాల్లోనూ మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా వృత్తి విషయాల్లో సుఖంగా కాలక్షేపం జరుగుతుంది. మితభాషణ చేస్తారు. అవసరం అయిన చోట ధైర్యం తెలివి ప్రదర్శిస్తారు. కుటుంబ సౌఖ్యం తక్కువనే చెప్పాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. అక్టోబర్: ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. వృత్తి వ్యవహారాల్లో అనుకూల స్థితి ఉంటుంది. ఈ నెలలో ఇతరుల నుంచి సహాయ సహకారాలు తక్కువనే చెప్పాలి. ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అయినా తెలివిగా ఖర్చులను నియంత్రించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలుంటాయి. నవంబర్: చాలా మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయి. మీ పాత సమస్యల పరిష్కారం గురించి భవిష్యత్ ప్రణాళికలు గురించి చక్కటి పరిశ్రమ చేయండి. రోజురోజుకు మంచి ఫలితాలు వస్తాయి. ఋణ విషయాలు ఆర్థిక సమస్యలు ఈ నెల 15వ తేదీ తరువాత క్రమంగా సానుకూలం అవుతాయి. మంచి జీవనకాలం ప్రారంభమైంది. డిసెంబర్: గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా ప్రవర్తిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికం అవుతాయి. రోజువారీ పనులు మాత్రమే చేస్తారు. కొత్త ప్రయోగాలు చేయరు. పుణ్యకార్య ఆకాంక్ష ఎక్కువ అవుతుంది. చాలావరకు మంచి ఫలితాలు ఉంటాయి. డబ్బు విషయంలో ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. శుభ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. జనవరి: అద్భుతమైన కాలం. 22వ తేదీతో వ్యయంలో శుక్రుడి సంచారం ప్రారంభమైన తరువాత కొంత ప్రయాణ చికాకులు ఉంటాయి. ఈ నెల వృత్తి విషయంలో అంతా సుఖంగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. చక్కగా ఖర్చు చేయగలుగుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఫిబ్రవరి: 15 వరకు రవి, 15 నుంచి శుక్రుడు అనుకూలిస్తారు. తద్వారా ఏలినాటి శని ఫలితాలను దాటవేస్తారు. అతి జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాలలో మీ నడవడి తోటివారికి ఇబ్బంది కలిగిస్తుంది. కొత్త పనులు చేపట్టవద్దు. రోజువారీ పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. మార్చి: ఒక విచిత్రమైన కాలం. రోజువారీ పనులు కూడా శ్రమతో నడుస్తాయి. ఏ పనిలోనూ నష్టాలు ఉండవు. ఆదాయం అందడం ఆలస్యంగానూ, ఖర్చులు వేగంగానూ వస్తుంటాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభకార్య పుణ్యకార్య ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 – 23: మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి.. -
శార్వరి నామ సంవత్సర (మీన రాశి ) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం భూమి సంబంధమైన వ్యాపారాలలో లాభాలు పొందుతారు. అమ్మకాలు, కొనుగోలు వల్ల లాభపడతారు. విశేషంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణిస్తారు. సంతాన పురోభివృద్ధికి కొంత సమయాన్ని కేటాయిస్తారు. సంతాన పురోగతి మందగించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సోదరసోదరీ వర్గం ప్రేమ వివాహాలు చికాకు కలిగిస్తాయి. ఇలాంటి వ్యవహారాలకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకుంటారు. ఓ విధంగా మీరు బాధ్యతల నుండి తప్పుకుంటారు. స్త్రీల సహాయసహకారాలు లభిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం నెలకొంటుంది. ఇందువల్ల మీరు బయట కార్యక్రమాలను సులువుగా, ఉత్సాహంగా చేయగలుగుతారు. స్నేహితులతో కలిసి మీరు పార్ట్‌టైం వ్యాపారం చేస్తారు, అది లాభిస్తుంది. సంపాదించడానికి పడ్డ కష్టం పొదుపు చేయడానికి కూడా పడతారు. నూనె వ్యాపారాలు చేసే వ్యాపారస్తులకు అనుకూల కాలం. భవిష్యత్తు కార్యక్రమం గురించి స్పష్టమైన ప్రణాళిక ఉండదు. ఎప్పటికప్పుడు ఉపాయంతో బయటపడే విషయంపైనా దృష్టి కేంద్రీకరిస్తారు. లీజులు పొడగింపబడతాయి. ఉద్యోగపరంగా ఒక నెలరోజులు ఇబ్బంది పడవలసి వస్తుంది. మీకు సహాయపడే వాళ్ళకు మీ వృత్తి ఉద్యోగాలలో ప్రత్యక్ష సంబంధాలు లేకుండా పోవుట వలన మీకు ఈ ఇబ్బంది కలుగుతుంది. బంధువర్గంలోని వారికి మీరు ఎంతమేలు చేసినా చివరికి విరోధమే మిగులుతుంది. నైతిక ధర్మమే మిమ్మల్ని అడుగడుగునా రక్షిస్తుంది. నిజనిజాలు మీ దృష్టికి రాకుండా మీ సన్నిహితులు, ఆత్మీయులు చేసే ప్రయత్నాలు మీ దృష్టికి వస్తాయి. విందులు, వినోదాలు అందరూ కలిసే పెళ్ళిళ్ళ సంబరాలలో తగిన స్థానం లభించకపోవచ్చు. దీనిని అవమానంగా భావించి, బాధపడి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయాలలో కొంత జాప్యం జరుగుతుంది. ఇది మీకు లాభించే అంశమే. సంస్థాపరంగా అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాలు వివాదస్పదం అవుతాయి. విమర్శలు ఎదుర్కొనవలసిన బాధ్యత మాత్రం మీ ఒక్కరిపైనే పడుతుంది. మీ ప్రతిపాదనలు విదేశాలలో ఆమోదింపబడతాయి. గతంలో వివాదస్పదమైన డాక్యుమెంట్స్ తిరగదోడడం వల్ల మీకు లాభం ఉంటుంది. అగ్రిమెంట్లు, లైసెన్సులు కూడా మీకు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనం చేతికి రావడం వల్ల కొన్ని మొండి బాకీలు తీర్చగలుగుతారు. పొదుపు పథకాలలో ధనాన్ని పెట్టుబడిగా పెట్టి కొంతమేర లాభపడతారు. సరైన సమయంలో మీకు న్యాయం జరగకపోవచ్చు కాస్త ఆలస్యంగా మీకు మరింత మంచి జరుగుతుంది. అధికారులతో, పెద్దలతో ముఖ్యమైన వాళ్ళతో ఆచితూచి మాట్లాడడం, సంబంధబాంధవ్యాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. చలనచిత్ర పరిశ్రమకు చెందిన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. మీ అభిప్రాయాలను వాయిదా వేయడానికి వీలులేని పరిస్థితులలో నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు తెలియజేయవలసి వస్తుంది. ప్రత్యర్థులు, పోటీదారుల నుండి ఊహించలేని విధంగా పోటీలు ఎదురవుతాయి. అయితే మీరు తీసుకున్న ముందుజాగ్రత్త చర్యల వల్ల చెప్పుకోదగిన నష్టమేమీ కలుగదు. ఆహార సంబంధమైన నియమాలు పాటిస్తారు. మీరు ఊహించని విధంగా సొంత మనుషులు, ఆత్మీయులు అని భావించిన వారి వల్ల ఇబ్బంది కలుగుతుంది. కొంత నష్టం కూడా కలుగుతుంది. పెద్దగా తెలివితేటలు లేని వారు మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు సాధించిన గొప్ప విజయాలు ఇతరులు గుర్తించకపోయినా స్వజనులు గుర్తిస్తారు. వ్యాపార విస్తరణలో అనుచరగణం ప్రముఖ పాత్ర వహిస్తారు. రొటేషన్ మనీ కొరకు స్వల్ప ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఋణాలు తీసుకుంటారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు, పరపతి, అనుబంధాలు వృద్ధిచెందినా తక్షణ ఆర్థిక సహకారానికి ఆ పరిచయాలు ఉపయోగపడవు. ప్రకృతి బీభత్సాల వల్ల పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ నష్టం సంభవించవచ్చు. కాంట్రాక్టుల కన్నా సబ్‌కాంట్రాక్టులు లాభిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అమ్మే వ్యాపార వర్గాల వారికి చెప్పుకోదగిన లాభాలు వస్తాయి. ఆత్మీయవర్గం చేసే పొరపాటు వల్ల పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగవలసి రావచ్చు. ఒక ఉన్నత పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. రాజకీయ పదవి లభిస్తుంది. ఎంతో ఆత్మీయులనుకోని మీరు భావించిన వారు విదేశాలలో స్థిరపడి మిమ్మల్ని మరిచిపోయినా మిత్రవర్గం అండగా నిలుస్తారు. ముఖ్యమైన వాటిని ఇన్సురెన్స్ చేయండి. మేలు జరుగుతుంది. నడమంత్రపు రాజకీయ అధికారంతో మీ మీద జులుం చూపించాలని ప్రయత్నించేవారు ఆపదలో పడతారు. మీ పరిస్థితి సురక్షితంగానే ఉంటుంది. బలవంతులు, మేధావులు మీ సేవలను వినియోగించుకుంటారు. ఇతర భాషలు నేర్చుకోవలన్న ఆసక్తి కలుగుతుంది. ఆచరణలో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగం లేనివారికి ఉద్యోగప్రాప్తి, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అవివాహితులైన వారికి వివాహప్రాప్తి. కొందరికి పునర్వివాహ ప్రాప్తి కూడా సంభవం. స్త్రీల వల్ల కొన్ని ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో, మానవీయ కోణంలో సహాయం చేస్తున్న ఓ స్త్రీ విషయంలో అసభ్యకరమైన అసత్య ప్రచారం మీ మీద కొనసాగుతుంది. స్నేహానికి అర్థం తెలుసుకోలేని మూర్ఖులు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని భావిస్తారు. స్త్రీ పురుషుల మధ్య ఉన్న స్నేహాన్ని వక్రీకరించే ఈ సమాజం పట్ల విరక్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు పెద్దగా ఆకర్షించవు. ఏదో లోపం ఉన్నట్లుగా తోస్తుంది. దీక్షా కార్యక్రమాలు స్వయంగా నియమనిష్ఠలతో నిర్వహిస్తారు. సామాజిక కార్యక్రమాలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వ్యాపారంలో లాభాలు వచ్చినా మరెందులోనైనా లాభాలు వచ్చినా ధనం ఏదో ఒక రూపేణా జారిపోతుంది. పొదుపు చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తారు. అందులో విజయం సాధిస్తారు. ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నుల గురించి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. కోర్టుతీర్పులు అనుకూల ప్రభావం చూపిస్తాయి. కొన్ని దురలవాట్లను వదిలించుకుంటారు. అందువల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. మీకు రావలసిన ధనం మూడు వంతులు మీ చేతికి అందుతుంది. అధిక మొత్తంలో ధనం సంతానం కొరకు వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాకతాళీయంగా మీరు పరిచయం చేసిన వ్యక్తులు మీ పలుకుబడిని, పేరుని అడ్డం పెట్టుకుని అడ్డదారిలో ధనం సంపాదిస్తారు. ఈ విషయం ఆలస్యంగా మీ దృష్టికి వస్తుంది. మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఇది ఇబ్బందికరంగా మారుతుంది. మీ ప్రత్యర్థులు దీనిని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. కుటుంబ వ్యవహారాలలో, వ్యాపారంలో మంచి అభివృద్ధి లభిస్తుంది. దీర్ఘకాలపు సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు జరిగిన నమ్మకద్రోహానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటారు. ఉన్నతస్థానాన్ని అధిరోహించడానికిక మీ శత్రువులు చేసే ప్రయత్నాలకు గండికొడతారు. వైరివర్గాన్ని బలహీనపరుస్తారు. ఎదుగుదలకు అవకాశం లేకుండా చేస్తారు. ఆర్థికసంస్థలలో పనిచేస్తున్న వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మీ ప్రాధాన్యత తగ్గించడానికి కొంతమంది ప్రయత్నాలు చేసినా అవి తాత్కాలికమే. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. మళ్ళీ మీరు అనుకున్న స్థానానికి రాగలుగుతారు. వాస్తవాలకు అతీతంగా ఊహాలోకంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. ఏకపక్ష నిర్ణయాలు కలిసిరావు. నలుగురితో కలిసి చర్చించి నిపుణుల సలహాలు తీసుకుని మీ ఆలోచనలను అమలు చేయండి. ఉద్యోగపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలను క్రిందిస్థాయి ఉద్యోగులు వ్యతిరేకిస్తారు. చెప్పుడు మాటలు మోస్తారు. రాజకీయాలలో రాణిస్తారు. తాత్కాలిక వేతనాల మీద ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. యూనియన్లకు, సంఘాలకు సంబంధించిన విషయాలకు మీ నాయకత్వంలో సలహాలు సత్ఫలితాలను సాధిస్తాయి. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. బరువుబాధ్యతలను దించుకోగలిగామన్న సంతప్తి కలుగుతుంది. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ మార్పులు వస్తాయి. క్రీడారంగంలోని వారికి ప్రోత్సహకాలు, అవార్డులు లభిస్తాయి. నూతన ప్రాడక్టులు విజయవంతమవుతాయి. వ్యాపారం బాగుంటుంది. సినీరంగంలోని వారికి మిశ్రమ ఫలితాలు, టీవీ రంగంలోని వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. దేవాలయాలలో అవినీతి మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గుడి, గుడిలో లింగాన్ని మింగే వాళ్ళకు ఎలాంటి శిక్ష పడుతుందోనని రకరకాలుగా ఆలోచిస్తారు. దేవుడి సొమ్ము తినడానికి వాళ్ళకి చేతులు ఎలా వస్తున్నాయో అర్థం కాక అయోమయంలో పడతారు. కార్యాలయంలో గ్రూపు తగాదాలు పరాకాష్టకు చేరుకుంటాయి. జలసంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. మీరు కొనుగోలు చేసిన ఆస్తుల విలువ పెరుగుతుంది. -
వికారినామ సంవత్సర (మీన రాశి ) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం బాగుంటుంది. దశమంలో శని కేతువుల సంచారం, చతుర్థంలో రాహు గ్రహ సంచారం, దశమ, ఏకాదశాలలో గురు గ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. శ్రమానంతరం ఫలితాలు దక్కించుకుంటారు. మీ నిజాయితీని నిరూపించుకోవడానికి శ్రమిస్తారు. విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి. మీ ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో సాధ్యం కావడం కష్టం అని గ్రహించండి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉంటే జీవితంలో మరింత అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. సబ్–కాంట్రాక్టులలో మీ వాటా మీకు కొన్ని అవాంతరాలు దాటుకుని వస్తాయి. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేసి మానసిక సంతోషాన్ని పొందుతారు. చాలాకాలం తరువాత బంధాలు తెగిన వ్యక్తులతో తిరిగి సంబంధాలు ఏర్పడతాయి. ఉన్నతస్థితిని సాధించినా సుఖం లేకుండా శ్రమజీవితాన్ని గడుపుతారు. వైద్య, సాంకేతిక, వ్యాపార రంగాలలో రాణిస్తారు. రాజకీయరంగంలో ప్రారంభం నుండి స్థితి బాగుంటుంది. వీలునామాలు, లిటిగేషన్స్ వ్యవహారాలు లాభిస్తాయి. చెస్, క్రికెట్ మొదలైన క్రీడారంగాలలో బాగా రాణిస్తారు. బలమైన అభిమాన వర్గం ఉంటుంది. హాస్య సంబంధమైన రచనలు వెలుగులోకి వస్తాయి. వ్యాపార విస్తరణ సంతృప్తికరంగా ఉంటుంది. బాగాలేని సంస్థ రూపురేఖల్ని మార్చి మంచి దారిలో పెట్టగలరు. భూములు, పెద్దలు ఇచ్చిన ఆస్తుల వంటివి అభివృద్ధి చెందుతాయి. కొన్ని వివాదాలు స్థిరాస్థులపరంగా తప్పకపోవచ్చు. మధ్యవర్తిత్వ సంతకాలు మొదలైనవి కలిసిరావు. విధానాలను మార్చుకొని నూతన పంథాలో పాత విషయాలను అందరూ మరిచిపోయేలా చేస్తారు. కొన్ని విషయాలు మరుగున పడితేగానీ కొత్త విషయాలు లాభించవని గ్రహిస్తారు. తెలివిగా ఎత్తువేస్తారు. వీలైనంతవరకు నూతన పరిచయాలకు ప్రాధాన్యతనిస్తారు. పాత మిత్రులను దూరంగా ఉంచడం సంభవం. ఉద్యోగంలో ప్రయోజనం లేని అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. ఇన్సూరెన్సు విషయంలో అశ్రద్ధ పనికిరాదు. అడ్రస్సు పొరపాటు వల్ల మీకు అందవలసిన సమాచారం ఆలస్యం అవుతుంది. పెరిగిన కుటుంబ ఖర్చులకు అనుగుణంగా ఆదాయ మార్గాలు లభిస్తాయి. శుభకార్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరి అభిప్రాయాలు తీసుకొని చేస్తారు. మోసపూరిత మనస్తత్వం కలిగిన వారి మాటలు నమ్మి నష్టపోతారు. విందులు, వినోదాలలో అపశ్రుతులు ప్రతిష్ఠను దెబ్బతీస్తాయి. అన్ని విధాలుగా మంచి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఏమీ లేదని ప్రతిసారీ మీ మీదపడి ఏడుస్తుంటారు. అలాంటి వాళ్ళ వల్ల ముప్పు పొంచి వుంది. ముందుగా ఎవ్వరికీ మీ వ్యూహం చెప్పవద్దు. విద్యాసంబంధమైన విషయాలలో కొన్ని మార్పులు, అదనపు అర్హతలు అవసరమవుతాయి. కొన్ని సందర్భాలలో అర్హత ఎక్కువ కావడం వల్ల అవకాశాలు జారిపోవడం జరుగుతుంది. కొన్ని అవకాశాలకు మీ అర్హతలు తక్కువ అవుతాయి. ఇది కొద్ది కాలం మాత్రమే ఇబ్బంది పెడుతుంది. మీ మనసుకు సంతృప్తి కలిగే పని, ఉద్యోగం ఎట్టకేలకు లభిస్తాయి. ఒక స్త్రీ మనస్తత్వం, ఆతిథ్యం మీకు అర్థంకాక ఆలోచనకు దారితీస్తుంది. సభ్యతలేని వ్యక్తుల వల్ల మీరు ఇబ్బంది పడతారు. నడమంత్రపుసిరి మనుషుల్లో ఇంత మార్పు తెస్తుందా అని ఆశ్చర్యపోతారు. కాకతాళీయంగా మీరు పరిచయం చేసిన వ్యక్తులు మీ పలుకుబడిని అడ్డం పెట్టుకుని అడ్డదారిలో ధనం సంపాదిస్తారు. ఈ విషయం ఆలస్యంగా మీ దృష్టికి వస్తుంది. మీ నిజాయితీ నిరూపించుకోవలసిన పరిస్థితి రావచ్చు. మీ ప్రత్యర్థులు దీనిని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందే ప్రయత్నాలు విఫలం అవుతాయి. గృహ సంబంధిత ఖర్చులు, రిపేరు ఖర్చులు అధికం అవుతాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటించడానికి చర్యలు తీసుకుంటారు. సంవత్సర ద్వితీయార్ధంలో పట్టుబట్టి కొన్ని ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. రవాణా సంబంధమైన, ప్రింటింగ్, డాక్యుమెంట్స్, అప్లికేషన్స్, ఇంటర్వ్యూ కార్డులు మొదలైన విషయాలలో జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగాలి. అతికష్టం మీద ముఖ్యమైన విషయాలలో మీ తప్పులేదని రుజువవుతుంది. మీ స్వయంకృతాపరాధాలు, మీ వల్ల జరిగిన తప్పిదాలు పెద్దగా ప్రాధాన్యతను సంతరించుకోవు. మీ ప్రత్యర్థుల రాజకీయ పలుకుబడి మీ విషయంలో పనిచేయదు. అయితే కృత్రిమంగా ప్రభుత్వపరంగా ఇబ్బందులు రావచ్చు. వాతావరణంలో వచ్చిన మార్పులు ఆరోగ్యం మీద, వృత్తి ఉద్యోగాల మీద ప్రభావం చూపుతాయి. సంవత్సర ద్వితీయార్ధంలో స్త్రీలకు సంబంధించిన వివాదాలలోకి మీ పేరు లాగబడే అవకాశం ఉంది. మీకు లభించవలసిన ప్రయోజనాలకు ఓ మహిళ వలన ఆటంకాలు ఏర్పడతాయి. ఎంత జాగ్రత్త వహించినా అనుచరవర్గం, సహోదరవర్గం వల్ల చికాకులు తప్పకపోవచ్చు. ఎవరిని నమ్మాలో, ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడమే కష్టతరమవుతుంది. దీక్షా కార్యక్రమాలు స్వయంగా నియమనిష్ఠలతో నిర్వహిస్తారు. ఉద్యోగంలేని వారికి ఉద్యోగప్రాప్తి, సంతానంలేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అవివాహితులైన వారికి వివాహప్రాప్తి. పిక్నిక్లు, విందులు, వినోదాలు, విహారయాత్రలు వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. స్వల్పకాల పరిచితుల వల్ల అపరిమితమైన సహాయ సహకారాలు, సేవలు అందుతాయి. ఉద్యోగపరంగా స్థాన చలనానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొంటారు. లోహ, ఖనిజ సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి, చేతివృత్తి పనివారికి, చిన్న వ్యాపారులకు, హోటల్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విజయవంతమైన ఫలితాలు, లాభాలు సంభవం. కొన్ని ఇబ్బందులు ఎదురైనా విద్యారంగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఐఐటీ, ఐఏఎస్, ఐపీఎస్ వంటి వాటికి ఎంపికవుతారు. పోటీపరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. స్నేహితులు, బంధువులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, సేవాసంస్థలు, అనాథాశ్రమాలు పురోగమనంలో ఉంటాయి. విద్యార్థినీ విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. చెవి, ముక్కు, గొంతు సంబంధమైన అనారోగ్యాలు బాధిస్తాయి. మధ్య మధ్యలో వైరల్ జ్వరాలు ఇబ్బంది పెడతాయి. విద్యాసంబంధ విషయాలకు అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. వ్యాపారంలో చేసిన మార్పుల వలన మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలపైన కొంతమంది దుష్ప్రచారం చేస్తారు. అపనిందలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. సంతానాన్ని చదువుల కోసం విదేశాలకు పంపించే ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు ఋణాలు లభిస్తాయి. ప్రతిష్ఠాత్మకమైన సంస్థలలో పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. ప్రతిరంగంలోనూ గట్టిపోటీ ఎదుర్కొనవలసి వస్తుంది. సహనంతో అందరితో కలిసి పనిచేసే ధోరణి అవలంబిస్తారు. ప్రజాసంబంధాలు పెంచుకుంటారు. విలువైన డాక్యుమెంట్స్ మొదలైన వాటి భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అవసరమైన సమాచారం కోసం ఎక్కువ ధనాన్ని, పరిచయాలను ఉపయోగిస్తారు. గృహ, ఆస్తి విషయాలను సక్రమంగా నిర్వహిస్తారు. వాయిదా పడుతున్న ఒక ముఖ్య విషయం పరిష్కారం అవుతుంది. ఆధ్యాత్మిక విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. భార్యవైపు బంధువులను చేసి ఆదుకుంటారు. ముఖ్యమైన బాధ్యతల నుండి పాతవాళ్లను తప్పించి కొత్తవాళ్ళకు అప్పజెప్తారు. అస్తవ్యస్తంగా ఉన్న వ్యవహారాలను నైపుణ్యంతో చక్కబెడతారు. రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్, లైసెన్స్‌లు పునరుద్ధరణ వంటివి సజావుగా సాగిపోతాయి. స్థాయికి దిగజారిన సంఘటనలు ఎదురవుతాయి. ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచన చేసి పరిష్కార మార్గాలు కనుగొంటారు. ఇందుకు అవసరమైన మనోధైర్యం కలిగి ఉంటారు. గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం గ్రీన్‌కార్డు తప్పక లభిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ శక్తికొలది ఇతరులకు సహాయపడతారు. మీ ప్రతిభాపాటవాలతో పాటు మీ పూజలు, పునస్కారాలు, దానధర్మాల ఫలితం అక్కరకు వస్తుంది. కుటుంబ పురోగతి బాగుంటుంది. సంతానం చదువులో రాణిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలకు నూటికి తొంబై శాతం కాలం బాగుంది. అయినప్పటికీ సామాజిక పరిస్థితుల వల్ల, వాతావరణ పరిస్థితుల వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. స్వగృహాన్ని ఏర్పరచుకోగలుగుతారు. రాత్రిపూట చేసే ఆలోచనలు కలిసివస్తాయి. చాలామంది జీవితాలు మీ ఆలోచనా విధానాల మీద, మీ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటాయి. పగ, ప్రతీకారం, ముక్కు మీద కోపం, వ్యసనాలు మొదలైన వాటికి దూరంగా ఉంటారు. ఇతర భాషలు నేర్చుకోవాలనే విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారు. స్నేహితుల ఒత్తిడి మేరకు యూనియన్ కార్యక్రమాలలో పాల్గొనవలసి వస్తుంది. యూనియన్ కార్యక్రమాలను పకడ్బందీగా, జాగ్రత్తగా నడిపి మీడియా దృష్టిని ఆకర్షిస్తారు. పసుపు, మిర్చి, కాటన్, కూరగాయలు, బియ్యం, కందిపప్పు, మినపపప్పు వ్యాపారులకు మంచి లాభాలు దక్కుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా నడుస్తాయి. నిర్మాణ సంబంధమైన పనులకు సంబంధించి మంచి లాభాలు లభిస్తాయి. ఎదుటివాళ్ళను అంచనా వేయడంలో దాదాపుగా పొరపాటుపడరు. మీ అంచనాలు, వ్యూహాలు, పలుకుబడి సమయస్ఫూర్తి భాగస్వాములకు, సంస్థలకు కొండంత అండగా నిలుస్తాయి. మీ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలిగినవారు నిజంగా ఎవరని తెలుసుకోగలుగుతారు. స్వల్ప కారణాలు పెరిగి పెద్దవై, భేదాభిప్రాయాలు ఎక్కువై ముఖ్యమైన వారితో చట్టపరంగా విడిపోతారు. దీర్ఘకాలిక ఋణాలను గడువుకు ముందే తీర్చివేస్తారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ మిమ్మల్ని విసిగిస్తున్న ఓ ముఖ్యమైన పని పరిష్కారమవుతుంది. తెలివిగా ప్రవర్తించి అన్ని విధాలా ఆలోచన చేసి శుభకార్యాల విషయాన్ని ఓ కొలిక్కి తెస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. విదేశాలలోని మిత్రుల నుండి కొద్దిపాటి ఆర్థిక సాయం లభిస్తుంది. లాభం చేకూర్చే ప్రయాణాలు వ్యూహ, ప్రతివ్యూహాలు ఆర్థికపరమైన రహస్య లావాదేవీలు మొదలైనవి చోటు చేసుకుంటాయి. గతంలో వద్దు అనుకున్న వ్యవహారాలను తిరిగి ప్రారంభిస్తారు. పురోభివృద్ధికి ఉపకరించే ఏ అంశాన్నీ నిర్లక్ష్యం చేయరు. మీ ప్రవర్తనలో ఉన్న లోపాలను ఇతరులు విమర్శించక ముందే మార్పులు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలపరంగా చికాకులు ఏర్పడతాయి. మీతో జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బతింటామని తెలుసుకుని సహోద్యోగులు జాగ్రత్తగా మసలుకుంటారు. ఆర్థిక, ఆరోగ్య స్థితులు మెరుగుపడతాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దైవానుగ్రహం వలన ఏ పని చేపట్టినా సమర్థించేవారు, సపోర్టు చేసేవారు ఉంటారు. కుటుంబ శ్రేయస్సు కోసం సంతానానికి మంచి బోధనలు చేస్తారు. విద్యాపరంగా సంతాన పురోగతి బాగున్నప్పటికీ మార్కులు తగ్గుతాయి. సంతానం ప్రక్కదోవ పట్టకుండా వేయికళ్ళతో జాగ్రత్తగా గమనిస్తారు. ప్రేమ వివాహాలు చేసుకోవాలకున్న వారికి కాస్త ఆలస్యంగా చేదు అనుభవాలు ఎదురవుతాయి. కుటుంబ ప్రతిష్ఠను, తల్లిదండ్రుల ప్రేమను మరిచిపోయి క్షణికావేశంలో ప్రేమవివాహం చేసుకున్నందుకు విచారిస్తారు. నిర్లక్ష్యానికి గురి అవుతున్న స్థిరచరాస్తులను రక్షించుకోవడానికి శ్రమిస్తారు. మేధావులను, ఘటికులను అవలీలగా ఎదుర్కొన్న మీరు ఒక అనామకుడి చేతిలో మోసపోతారు. పోటీపరీక్షలలో అనుకూల ఫలితాలు వస్తాయి. విదేశీయాన సంబంధమైన ప్రయత్నాలు రెండో యత్నంలో సఫలీకృతమవుతాయి. విదేశాలలో చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి మంచి అవకాశాలు వస్తాయి. పాస్‌పోర్ట్, వీసా, గ్రీన్‌కార్డు వంటివి చేతికి అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. అన్నదాన విరాళాలకు ప్రాముఖ్యతనిస్తారు. సంతానం లేనివారికి సంతానప్రాప్తి కలుగుతుంది. సంతాన సాఫల్య కేంద్రాల వల్ల ప్రయోజనం శూన్యం అని తెలుసుకుంటారు. ఏది ఏమైనా మీకు బయట నుండి వచ్చే సమస్యల కన్నా ఆత్మీయులు, ఇంట్లో వారి వలన చిక్కులు ఏర్పడతాయి. బ్యాంకు వ్యవహారాలు, క్రెడిట్ కార్డులు, పొదుపు వ్యవహారాలు మొదలైన విషయాలలో సాంకేతికపరమైన చిక్కులు ఏర్పడవచ్చు. వాయిదా పద్ధతిలో మీకు ఇష్టమైన కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. చేతివృత్తి పనివారికి అనుకూల కాలం. విద్యా, సాంస్కృతిక రంగాలలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. క్రీడారంగంలోని వారికి అవార్డులు లభిస్తాయి. సంవత్సర ద్వితీయార్ధంలో పార్శ్వపు నొప్పి, వెన్ను నొప్పి, కీళ్ళనొప్పులు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు వస్తాయి. ఉద్యోగంలో నైపుణ్యం, అంకితభావం మీకు గౌరవాన్ని, స్థిరత్వాన్ని తెచ్చిపెడతాయి. కలలుగన్న స్వగృహాన్ని ఏర్పరచుకోగలుగుతారు. అవివాహితులైన వారికి ఆకస్మికంగా మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి అనుకూలమైన సంబంధం కుదురుతుంది. మీకు ఇష్టం లేకపోయినా రాజకీయరంగంలోకి ప్రవేశిస్తారు. తాత్కాలిక వ్యాపారాల మీద పెట్టుబడి పెట్టి లాభం పొందుతారు. వస్త్రవ్యాపారం, కూరగాయల వ్యాపారం, ఫ్యాన్సీ, హోమియోపతి, అల్లోపతి వ్యాపారాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్స్, విద్యాసంస్థల నిర్వాహకులు, పాల వ్యాపారులు విశేషంగా ధనం అర్జిస్తారు. బంగారం, వెండి కొనుగోలు చేసే యోగం ఉంది. మీ పేరుమీద ఇతరులు చేసే వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యా, వైజ్ఞానిక రంగాలలో అనుకున్నది సాధిస్తారు. ఆహార క్రమశిక్షణ చాలా అవసరం. మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించడం జరుగుతుంది. కొన్ని వాస్తవాలు బయటపడటంతో ఆ వ్యక్తిని దూరంగా ఉంచుతారు. అతని వల్ల ప్రమాదం సంభవిస్తుందేమోనన్న భయం కూడా మీ మనస్సుని కలవరపరుస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. -
మీనం.. ఇక్కడ స్వల్పం...!
కొర్రమేను పెంపకంలో జిల్లా వెనుకబాటు అవసరంలో 20 శాతమే ఉత్పత్తి ఏపీ నుంచి రోజుకు 600 కిలోల మేర దిగుమతి రాష్ట్ర చేపగా ప్రకటించడంతో మత్స్యకారుల్లో ఆశలు పోచమ్మమైదాన్ : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రాష్ట్ర చేపగా కొర్ర మేనును ప్రకటించింది. చేపల్లో రారాజుగా వెలుగొందే ఈ చేప తెలంగాణలో అత్యధికంగా లభిస్తుంది. ఈ చేపలతో వండే ఆహార పదార్థాలు రుచికరంగా ఉండడంతో వీటిపై ప్రజలకు మక్కువ. అదే తరహాలో ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే, మన జిల్లాలో కొర్ర మేను పెంపకం తక్కువేనని చెప్పాలి. కానీ ప్రస్తుతం రాష్ట్ర చేపగా ప్రకటించిన నేపథ్యంలో వీటి పెంపకానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని.. తద్వారా తమకు ఆదాయం పెరుగుతుందని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోనే.. కొర్ర మేను చేపలను రాష్ట్ర చేపగా ప్రకటించడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వీటి పెంపకం తక్కువే అయినా అభిమానులు మాత్రం ఎక్కువే. కావాల్సినంత మేర ‡పిల్లలు లభించకపోవడం, ధర కూడా ఎక్కువ కావడం.. ఇది మిగతా చేపలతో పోలిస్తే బరువు తక్కువగా పెరిగేది కావడంతో మత్స్యకారులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని సబ్సిడీపై పిల్లలు అందజేస్తే పెంపకానికి సిద్ధమేనని వారు చెబుతున్నారు. జిల్లాలోని రామప్ప, లక్నవరం, చలివాగు, ములుగు ఘన్పూర్, ధర్మసాగర్, మైలారం, అశ్వరావుపల్లి, ఘన్పూర్(స్టేషన్), రాజవరం, మల్లన్నగండి, ఏడునూతన బయ్యన్నవాగు, ఐనాపూర్ ప్రాంతాల్లోని చెరువుల్లో కొర్రమేను ఎక్కువగా పెంచుతున్నారు. ఆయా ప్రాంతాల్లో జిల్లా అవసరాలకు సంబంధించి 20 శాతం మేర మాత్రమే పెంపకం జరుగుతోంది. దీంతో అమ్మకందారులు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు తదితర ప్రాంతాల నుంచి రోజుకు 600 కిలోల వరకు దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా కొర్ర మేను ధర కిలో రూ.350 వరకు ఉంటుంది. చాలా మంచి పరిణామం కొర్రమేను చేపను రాష్ట్ర చేపగా ప్రకటించడం చాలా మంచి పరిణామం. ఈ చేప ప్రస్తుతం మన రాష్ట్రంలో అంతరించి పోయే దశలో ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో దీనిని కాపాడుకునేందుకు నిధులు విడుదల చేయడంతో పాటు కొన్ని చెరువులను ఈ చేపల పెంపకానికే కేటాయించే అవకాశముంది. – నరేష్ కుమార్ నాయుడు, ఎఫ్డీఓ వరంగల్ పశ్చిమబెంగాల్ మాదిరిగా చర్యలు తీసుకోవాలి.. పశ్చిమబెంగాల్లో ‘బెన్’ పేరిట అక్కడి ప్రభుత్వమే చేపల మార్కెటింగ్ చేస్తుంది. అలాంటి చర్యలు ఇక్కడ చేపడితే మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. ఆలస్యంగానే ప్రభుత్వం కొర్రమేనును రాష్ట్ర చేపగా ప్రకటించడం అభినందనీయం. ఇటీవల జమ్మికుంటలో జాతీయ ఫిష్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కొర్ర మేను పెంపకంపై సదస్సు ఏర్పాటుచేశారు. – డాక్టర్ బండా ప్రకాష్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకుడు ఇప్పుడు ఇంకా డిమాండ్ పెరుగుతుంది... రాష్ట్ర ప్రభుత్వం కొర్రమేను రాష్ట్ర చేపగా ప్రకటించిన నేపథ్యంలో ఇంకా ఈ చేపకు డిమాండ్ పెరుగుతుంది. మన దగ్గర ప్రజలు ఈ చేపలను ఇష్టంగా తింటారు. అయితే, ప్రభుత్వం ఈ చేపల పెంపకానికి సీడ్ సబ్సిడీపై ఇవ్వడంతో పాటు కొన్ని ప్రత్యేక చెరువులను ఎంపిక చేస్తే బాగుంటుంది. – తత్తరి లక్ష్మణ్, గంగపుత్ర(బెస్త) గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు -
వీళ్లు ఎంతో సుకుమారులు...
ఆస్ట్రోఫన్డా: మీన రాశి రాశిచక్రంలో చివరి రాశి మీనం. ఇది సరి రాశి. జలతత్వం, బ్రాహ్మణ జాతి, సౌమ్య రాశి, ఉజ్వల వర్ణం. శరీరంలో కాళ్లను, పాదాలను సూచిస్తుంది. ఇది ద్విస్వభావ రాశి, స్త్రీ రాశి, దిశ ఉత్తరం. ఇందులో పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరా భాద్ర, రేవతి నక్షత్రాలు పూర్తిగా ఉంటాయి. ఈ రాశి అధిపతి గురువు. ఈ రాశి వైఢూర్యాలు, ముత్యాలు, వజ్రాలు, గోరోజనం, చేపలు, మద్యం మొదలైన ద్రవ్యాలను సూచిస్తుంది. ఇది రష్యా, ఈజిప్టు పరిసర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది. మీనరాశిలో పుట్టినవారు కాస్త సుకుమారులు. కాస్త బద్ధకస్తులు కూడా. కఠిన శ్రమను తట్టుకోలేరు. అయితే, అద్భుతమైన సృజనాత్మకత వీరి సొంతం. సుఖలాలస ఎక్కువ. కల్లా కపటం తెలియని వీరు, ఎదుటి వారిని ఇట్టే నమ్మే స్తారు. కొన్ని సందర్భాల్లో పిరికిగా వ్యవహ రించినా, అవసరమైన సందర్భాల్లో ధైర్య సాహసాలనూ ప్రదర్శించగలరు. సరళ స్వభావం కారణంగా తేలికగా ఆకట్టు కుంటారు. నిష్పాక్షికత, సహనం, అపారమైన ఊహాశక్తి, వాక్చాతుర్యం, కార్యనిర్వహణ నైపుణ్యాల ఫలితంగా ఏ రంగంలోనైనా రాణించగలరు. రచయితలు, సినీ దర్శకులు, నటులు, వైద్యులు, రసాయన నిపుణులు, సాంకేతిక నిపుణులు, బోధకులు, సామాజిక కార్యకర్తలుగా బాగా రాణిస్తారు. ఆహార పానీయాలు, రవాణా, ముద్రణ, ప్రచురణ వంటి రంగాల్లో సొంత వ్యాపారాలు కూడా వీరికి అనుకూలం. రక్షణ, విద్య, జల వనరులు, షిప్పింగ్, రైల్వే, బ్యాంకింగ్, బీమా రంగాలలోని ఉద్యోగాల్లో కూడా రాణిస్తారు. గ్రహగతులు అనుకూలించకుంటే, స్థిరపడాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా తిరుగుతారు. నిజాయితీ లేని పనులతో నిందల పాలవుతారు. మోసాలకు గురై నష్ట పోతూ ఉంటారు. బద్ధకంతో అవకాశాలను చేజార్చుకుంటారు. వ్యసనాల ద్వారా సాంత్వన పొందేందుకు ప్రయత్నిస్తారు. వీరు ఎక్కువగా జీర్ణకోశ వ్యాధులు, వాత సంబంధ సమస్యలు, చర్మవ్యాధులతో బాధపడతారు. - పన్యాల జగన్నాథ దాసు మీనరాశిలో పుట్టిన గాయని శ్రేయాఘోషల్ -
ఈ గ్రహంపై 80 వేల ఏళ్లకు ఒక ఏడాది..!
భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి మన కాలమానం ప్రకారం ఏడాది పడుతుంది. కానీ మీనరాశిలో ఉన్న ఈ గ్రహానికి ఎన్నేళ్లు పడుతుందో తెలుసా? 80 వేల ఏళ్లు! అవును.. భూమికి, సూర్యుడికి మధ్య దూరంతో పోలిస్తే ఇది తన నక్షత్రానికి రెండు వేల రె ట్ల దూరంలోని కక్ష్యలో తిరుగుతోందట. మనకు 155 కాంతి సంవత్సరాల దూరంలో.. మీనరాశిలోని జీయూ పీఎస్సీ అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఈ అధిగ్రహం పేరు జీయూ పీఎస్సీ బీ. గురుగ్రహం కన్నా పది రెట్లు పెద్దగా, వాయువులతో నిండి ఉన్న ఈ గ్రహాన్ని యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియెల్ పీహెచ్డీ విద్యార్థి మారీ-ఈవ్ నాడ్ నేతృత్వంలోని బృందం కనుగొంది. వివిధ దేశాల్లోని వేధశాలల ద్వారా పరిశోధించిన వీరు మీనరాశిలో మొత్తం 90 యువ నక్షత్రాలను పరిశీలించగా.. ఈ ఒక్క గ్రహమే దొరికిందట. నక్షత్రానికి చాలా దూరంలో తిరుగుతున్నందున దీనిపై రకరకాల పరిశోధనలకు వీలు కానుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.