సరిహద్దుల్లేని సేవ
వన్‌టౌన్ :
సేవకు సరిహద్దులుండవు. వారికి కూడా కృష్ణా పుష్కరాలున్నా.. ఇక్కడ బందోబస్తు కోసం వచ్చారు. çకృష్ణా పుష్కరాలకు కర్ణాటక పోలీసులు బందోబస్తు సేవలందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు కర్ణాటక సర్కారు వారిని పంపించింది. సుమారు 41 మంది పోలీసుల బృందం పది రోజులుగా నగరంలో పుష్కరాలకు వస్తున్న భక్తులకు సేవలందిస్తున్నారు. ఒక డీసీపీ, ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్ఐ స్థాయి అధికారులతో పాటుగా 32 మంది పోలీసులు నగరానికి వచ్చారు. వారిలో కొంతమంది దుర్గాఘాట్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. అలాగే మరికొంతమంది కనకదుర్గా నగర్ సమీపంలోని దుర్గగుడి అన్నదాన వితరణ కేంద్రం వద్ద సేవలందిస్తున్నారు. వారు సాక్షితో మాట్లాడుతూ పుష్కరాలకు సేవలందించటం ఆనందంగా ఉందన్నారు.